మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్ ఓపెన్ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్‌తో సరిపెట్టేద్దాంలే అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్ టేబుల్‌పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్‌ను తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది.
జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని..
Comments
Please login to add a commentAdd a comment