janagaon
-
సైబర్ మోసం.. 11 లక్షలు పోగొట్టుకున్న RTC డ్రైవర్
-
గుండెపోటుతో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ మృతి
సాక్షి, జనగామ: జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్‌రెడ్డిని నగరంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే సంపత్‌రెడ్డి మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో సంపత్‌రెడ్డి కుమారుడు మృతి చెందాడు. ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్‌రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంపత్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన రాజవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు నివాళులర్పించనున్న కేసీఆర్.. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా జెడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం కేసీఆర్ జనగామకు వెళ్లి సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఒకే ఏడాదిలో రెండో జెడ్పీచెర్మన్.. ఇదే ఏడాది జూన్‌లో ములుగు జిల్లా జెడ్పీచైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో నడిచిన వారిలో ఒకరు. జగదీష్ మృతి చెందినపుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన నుంచి కోలుకోక ముందు తొలి నుంచి పార్టీలో ఉన్న మరో జెడ్పీచైర్మన్, జిల్లా అధ్యక్షుడిని సంపత్‌రెడ్డి రూపంలో కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీ వర్గాలను కలవర పరుస్తోంది. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
ద్రోహుల చేతిలోకి కాంగ్రెస్.. ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు: మంత్రి హరీష్
సాక్షి, జనగాం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అవినీతిపరుల పార్టీగా మారిందని విమర్శించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట అని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరితో సయోధ్య కుదిర్చారు. ఇద్దరితో కలిసి సమావేశానికి హాజరైన హరీష్ రావు.. ఓటుకు నోటు కేసులో పట్ట పగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. రూ. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవిని కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డే అంటున్నాడని మండిపడ్డారు. ఐదు కోట్లు, పదేకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌కు సగం సీట్లలో అభ్యర్థులు లేరని అన్నారు హరీష్ రావు. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరని, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుందని విమర్శించారు. కడియం శ్రీహరి, రాజయ్య నాయకత్వంలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే.. -
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పొన్నాల
సాక్షి, జనగామ: సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరారు. జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్యతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వాలి ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉండి అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు కష్టపడినా తనకుఫలితం దక్కలేదని అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ప్రాంతంలో 80 వేల పాల ఉత్పత్తి జరుగుతుందని, వారికి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీకి మూడు రోజుల క్రితం పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనగామ టికెట్ దక్కదనే బలమైన సంకేతాలతో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. బీసీ నేతగా తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 40 ఏళ్లకు పైగా తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు వెన్నంటి ఉంటూ.. కష్ట కాలంలో పెద్ద దిక్కుగా ఉన్న పొన్నాల.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదుగుతున్న బీఆర్ఎస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. డాలర్ లక్ష్మయ్యగా కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఎమ్మెల్యే, మంత్రి, జాతీయ స్థాయిలో పదవులు అధిష్టించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉన్న పొన్నాల, నేడు అదే పార్టీలో ఒంటరి కావడంతో తన రాజకీయ భవిష్యత్‌ను మరో పార్టీతో పంచుకోనున్నారు. -
జనగామ బీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలకు మంత్రి కేటీఆర్ చెక్
సాక్షి, జనగామ: జనగామ జగడానికి తెరదించే పనిలో నిమగ్నమయ్యారు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో రహస్యం భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు వద్దని పార్టీ నేతలను ఆదేశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధ్య సమన్వయం సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించడంతో నిడికొండలో నిర్వహించిన మూడు మండలాల ఆత్మీయ సమ్మేళనానికి పల్లా గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు తెలంగాణలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జనగామ టికెట్ విషయంలో సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొని పల్లా గో బ్యాక్ అంటూ విమర్శలు చేశారు. రహస్య బేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు పల్లా మాత్రం బీఆర్ఎస్జిల్లా అధ్యక్షులు జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య బేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిదుల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పల్లా తీరును ముత్తిరెడ్డి తో పాటు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత 15 రోజులుగా కేటీఆర్ విదేశాల్లో ఉండడంతో తిరిగి వచ్చాక జనగామ టికెట్ పై నిర్ణయం ఉంటుందని ప్రచారం జరిగింది. కేటీఆర్ రావడంతో ఆయన దృష్టిని ఆకర్షించి టికెట్ పొందేందుకు ఎవరికి వారుగా ముగ్గురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నరోత్తమ్ నియామకం కేటీఆర్ ఫోన్ రావడంతో పల్లా ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గంలోని బచ్చన్నపేట తరిగొప్పుల నర్మెట్ట మూడు మండలాలకు చెందిన నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరగా ప్రగతి భవన్ నుంచి కేటీఆర్ ఫోన్ రావడంతో మధ్యలోనే వెనుతిరిగారు. రాజకీయంగా రకరకాలుగా చర్చలు అర్థాంతరంగా పల్లా ప్రగతి భవన్‌కు వెళ్లడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పల్లా రాకపోయినప్పటికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించి పల్లాకు అండగా ఉంటాం.. పార్టీ అందిష్టానం అతనికే టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనం జనగామ నియోజకవర్గ పరిధిలో కాకుండా స్టేషన్ ఘనపూర్ పరిధిలోని నిడికొండలో నిర్వహించడం రాజకీయంగా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎలాంటి సమావేశాలు వద్దు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి ఒత్తిడి మేరకు కేటీఆర్ పల్లా నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు, రహస్య భేటీలకు చెక్ పెట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టికెట్ విషయంలో జనగామలో పార్టీ మూడు ముక్కలుగా మారుతున్న తరుణంలో కేటీఆర్ రంగంలోకి దిగి గ్రూప్ రాజకీయాలకు టికెట్ జగడానికి తెరదించే ప్రయత్నంలో భాగంగానే ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే వరకు ముగ్గురు నేతలు సమన్వయంతో పని చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేటీఆర్ మదిలో ఏముందో, సీఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. జనగామ టికెట్ పై సస్పెన్స్ కు ఎప్పటిలోగా తెరపడుతుందోనని జనగామ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
కేసీఆర్‌కు ఇదే నా విన్నపం: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: నియోజకవర్గపు టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అంటూ ప్రచారం జరుగుతుండడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఓవైపు ముత్తిరెడ్డి అనుచరులు పల్లాకి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కి రచ్చ చేస్తున్న వేళ.. మరోవైపు ముత్తిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కంటతడి పెట్టారాయన. ‘‘బుక్కెడు బువ్వ దొరకని జనగామ నియోజక వర్గాన్ని భారత దేశానికే అన్నం పెట్టేలా తీర్చిదిద్దాను. గెలిచే నియోజకవర్గాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిస్ట్రబ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ఏడేళ్ళ లో జనగామకు ఏం చేశావో చెప్పు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి అసలేం చేశారు?. పైగా ఇప్పుడు డబ్బులు పంచి ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల ముందు డబ్బులు పంచి హుజురాబాద్‌లా జనగామను మార్చాలనుకున్నావా?.అధినేతను, పార్టీని డిస్ట్రబ్ చేయడం పల్లా మానుకోవాలి అని ముత్తిరెడ్డి హితవు పలికారు. నా బిడ్డను బజారుకు ఎక్కించావ్ ‘‘ఇంటెలిజెన్స్ అంటు నీ కాలేజీ వాళ్ళతో సర్వే చేసి పార్టీని నాశనం చేస్తున్నావు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కొడుకు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు. (కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అని చెప్పుకొచ్చారాయన). నా కుటుంబంలో కలహాలకు పల్లానే కారణం. నా బిడ్డ ను బజారుకు ఎక్కించింది పల్లానే. పల్లా జనగామ నాయకుల్ని మిస్ గైడ్ చేసి టూరిజం ప్లాజాకు తీసుకొచ్చారు. పార్టీ కి విరుద్దంగా గ్రూప్ లను ఎందుకు ప్రోత్సాహిస్తున్నావు పల్లా?. పార్టీ కి విరుద్దంగా పని చేయడం మానుకోండి. కేసిఆర్ వెంట 22ఏళ్ళు ఉన్నా, ఉద్యమంలో పల్లా నీ పాత్ర ఏంటీ? అంటూ నిలదీశారాయన. కేసీఆర్‌కు రిక్వెస్ట్ ‘‘పల్లా చేసే అధర్మ పని మానుకోవాలి. సీఎం ప్రకటించే వరకు ఎందుకు ఆగడం లేదు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంస్కారానికి నమస్కారం. ఉద్యమకారులను డిస్టర్బ్ చేస్తే కేసిఆర్ సహించరు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కేసిఆర్ ను జనగామ ప్రజలు మరువలేరు. నాటి నుంచి నేటి వరకు కేసిఆర్ కు సైనికుడిగా పని చేశాను. 2004లో సామాజిక పరంగా టిక్కెట్ లభించకపోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేసిఆర్ నినాదంతో ప్రచారంతో 60 వేల ఓట్లు తీసుకువచ్చా. 2009లో పాలకుర్తికి పోయినా కేసిఆర్ అడుగుజాడల్లో పనిచేశాను. 2014, 2018 లో కేసిఆర్ ఆశీస్సులతో జనగామ నుంచి పోటీ చేసి గెలిచి ప్రజా సేవలో నిమగ్నమయ్యాను. కేసిఆర్ సైనికుడిగా ఉంటా. ఆయన ఏ పని చెప్పినా చేస్తా.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, మొదటి లిస్ట్‌లోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినతి చేశారు. బోరున విలపించిన సర్పంచ్ ప్రెస్ మీట్ సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని వడ్లకొండ సర్పంచ్ బొల్లం శారద పట్టుకుని బోరున విలపించారు. ‘కేసీఆర్ సార్ మమ్మల్ని ఏడ్పించకండి. ఒక్కసారి ముత్తిరెడ్డి కి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే మేమొచ్చి మాట్లాడుతాం సార్. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి కేసీఆర్ సార్’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
కూతురితో వివాదం.. ముత్తిరెడ్డికి బిగ్ రిలీఫ్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్‌వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే.. తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా. -
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్‌గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్‌కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
నా కూతురుపై కేసు పెట్టలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ జిల్లా: రాజకీయ కుట్రలో తన కుమార్తె తుల్జాభవానిరెడ్డి పావుగా మారిందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మూర్ఖులు, దౌర్భాగ్యులు, అధర్ములు తన బిడ్డను రోడ్డు పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకుంటామని, చిల్లరగాళ్లకు తగిన గుణపాఠం చెబతానని తెలపారు. బంగారుతల్లి లాంటి తన కూతురుపై కేసు పెట్టలేదని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం తన ప్రజా జీవితానికి ఆటంకం కల్పిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేని వారే తన బిడ్డను తనపై ఉసిగొల్పారన్నారు. అలా చేయడం మంచిది కాదని, వారికే అరిష్టంగా మారుతుందని మండిపడ్డారు. ప్రజలు క్షమించరని, తిప్పికొడతారని పేర్కొన్నారు. తాను ప్రజాసేవకుడిని, ప్రజాసేవలో ఉంటానని.. శక్తి ఉంటే ప్రజా సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో గెలువాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ విసిరారు. కాగా అధికారిక విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారంటూ కుమార్తె తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డిలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముత్తిరెడ్డి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది. చదవండి: ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ.. -
కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. జరిగింది ఇదే!
సాక్షి, జనగామ: తనపై ఫిర్యాదు నమోదవ్వడంపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన కూతురు తుల్జాభవాని సంతకం ఫోర్జరీ చేయలేదని పేర్కొన్నారు. కూతురు పేరు మీదనున్న ఫ్లాట్ ఆమె పేరుతోనే ఉందని స్పష్టం చేశారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల ల్యాండ్ తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని, ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని తెలిపారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో తుల్జాభవాని పేరుపై 125 నుంచి 150 గజాల వరకు భూమి ఉందని, అందులోనూ ఎలాంటి ఫోర్జరీ జరగలేదన్నారు. అయితే దీనిని తన కుమారుడు నామమాత్రంగా కిరాయికి ఇచ్చారని అది కూడా తనకు తెలియకుండానే జరిగిందని తెలిపారు. అంతేగాని ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదని చెప్పారు. సదరు ఆస్తి కూతురు పేరు మీదే ఉండటం వల్ల కిరాయి కూడా ఆమెకే వెళ్తుందని తెలిపారు. ఇది కుటుంబ సమస్య అని.. ఏ కుంటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమేనని తెలిపారు. కూతురిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తనపై ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా గిట్టనివారు దీనిని వివాదంగా మార్చారని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారని, తమ అధినేత సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని పేర్కొన్నారు. వివాదలు సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! కాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జాభవని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్‌కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు అధికార పార్టీ బీఆర్ఎస్కు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డిపై సొంత కూతురే కేసు పెట్టడం కలకలం రేపుతోంది. నాచారంలో తన పేరిట ఉన్న ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించాడని కూతురు తూల్జ భవాని రెడ్డి ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పై చీటింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు కొంత కాలంగా వివాదస్పదంగా బయటకు వస్తోంది. నోటి దురుసుతనం, వ్యవహార శైలితో ఇంటా బయట విమర్శలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సొంత కూతురు తూల్జ భవాని రెడ్డి తన పేరిట నాచారంలో ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్‌కు సంబంధించి తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి కినారా గ్రాండ్‌కు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్ చేయించాడని ఉప్పల్ పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిబ్రవరి 4న ముత్తిరెడ్డి పై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డిపై ఆరోపణలు ► యశ్వంతపూర్‌లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించారని గతంలో హైకోర్టుకు వెళ్ళారు మాజీ సర్పంచ్. బతుకమ్మ కుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ సైతం జరిగింది. ► నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. ► చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చెర్యాల బంద్‌కు పిలుపునిచ్చింది. ► గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదల లేదనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె -
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె
సాక్షి, హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన కూతురు తుల్జాభవని రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్‌కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ముత్తిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయనపై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదయ్యాయి. చదవండి: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువతి మృతి -
వెంటాడుతున్న కుక్కలు.. జనగామలో ఒకేరోజు 21 మందికి గాయాలు
జనగామ: వీధి కుక్కల స్వైరవిహారంతో పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు. కుర్మవాడ(సుమారు 4 వార్డుల పరిధి), హనుమాన్ స్ట్రీట్ తదితర ప్రాంతాలకు చెందిన స్థానికులు రోడ్డుపై వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. సమీప వాసులు కర్రలు, రాళ్లతో తరిమికొట్టడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్ తీసుకుని చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట పద్మానగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు మహ్మద్ అర్స్లాన్ రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్క కరవడంతో చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇక హనుమకొండ జిల్లా కాజీపేటలో స్కూలుకు వెళ్లి వస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు ముస్త ఫాను స్థానిక శైలేందర్ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క కరిచింది. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కుక్క యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య.. -
ఆస్తి వివాదం.. తండ్రి ప్రాణం తీసిన కుమారుడు
పాలకుర్తి టౌన్: ఆస్తి వివాదంలో ఓ తనయుడు తండ్రిని కొట్టి చంపాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్నులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈరవెన్ను గ్రామానికి చెందిన చిడిమిండ్ల నర్సిరెడ్డి (57)కి రాజు, రమేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత ఏడాది ఇద్దరు కుమారులకు మూడు ఎకరాల చొప్పున పంపకాలు చేశాడు. ఎకరం 20 గుంటల భూమిని తన భాగంగా తీసుకున్నాడు. కాగా, తరచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నర్సిరెడ్డి భార్య చనిపోవడంతో అతను చిన్న కుమారుడు రమేశ్ వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా పెద్ద కుమారుడు రాజు తనకు అప్పులు పెరిగాయని, ఇంటిని అమ్మాలంటూ గొడవ పడుతుండేవాడు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇంటి పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తండ్రిని, తమ్ముడిని చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో గురువారం నర్సిరెడ్డి పొలం పనులు చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా రాజు వెళ్లి గొడవ పడ్డాడు. తండ్రిని బురదలో పడేసి తలపై కొట్టి చంపాడు. నర్సిరెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతనికోసం కుటుంబ సభ్యులు వెతకగా రాత్రి సమయంలో పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై శుక్రవారం రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ విశ్వేశ్వర్, ఎస్సైశ్రీకాంత్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు. చదవండి: బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు.. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
వారిది నిరుపేద కుటుంబం. పొలం కౌలుకు చేస్తూ.. నాలుగు గేదెలను సాకుతూ జీవనం సాగిస్తున్నారు. కొడుకును బాగా చదివించి విదేశాలకు పంపాలనేది వారి కల. అందుకోసం అప్పు తెచ్చి మరీ వరంగల్‌లో బీటెక్ చదివిస్తున్నారు. కానీ వారి కలను రోడ్డు ప్రమాదం మింగేసింది. మంగళవారం ఇంటికి వస్తానని ఫోన్ చేసిన కుమారుడు.. విగతజీవిగా వస్తున్నాడని తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. సాక్షి, మామునూరు/జనగామ: ఖమ్మం జాతీయ రహదారిపై వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బీటెక్ విద్యార్థి వినీత్‌రెడ్డి(22) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈఘటన సోమవారం రాత్రి ఖిలా వరంగల్ మండలం మామునూరు శివారు పంజాబ్ డాబా ఎదురుగా జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారు తూర్పుగడ్డకు చెందిన గాదె సునీల్‌రెడ్డి, అనురాధ దంపతుల కుమారుడు వినీత్‌రెడ్డి. సొంతభూమి లేకపోవడంతో కౌలుకు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగు గేదెలను సాకుతూ పాలు పోస్తూ ఉపాధి పొందుతున్నారు. వినీత్‌రెడ్డిని బాగా చదివించి విదేశాలకు పంపాలనేది తల్లిదండ్రుల కోరిక. వినీత్ రంగశాయిపేటలో అద్దె గదిలో ఉంటూ బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ఈ చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్లాడు. రోజువారిగానే సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లి తిరిగి రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై రూమ్‌కు బయల్దేరాడు. మామునూరు పోలీస్‌స్టేషన్ దాటిన తర్వాత పంజాబ్ నేషనల్ డాబా సమీపంలోకి రాగానే లారీని ఓవర్టేక్ చేయబోతూ ఎదురుగా వచ్చే వాటర్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎగిరిపడ్డ హెల్మెట్ వినీత్‌రెడ్డి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వస్తున్నాడు. బలంగా ఢీకొనడంతో తలకు ఉన్న హెల్మెట్ ఎగిరి దూరంలో పడింది. దీంతో అతడి తల రోడ్డుకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్ తలకు ఉంటే బతికేవాడని అనుకుంటున్నారు. ఇంటికి వస్తానన్నాడు.. ‘మంగళవారం ఇంటికి వస్తానని కాలేజీకి వెళ్లేముందు ఫోన్ చేశాడు. కానీ విగతజీవిగా వస్తాడనుకోలేదు’అంటూ తల్లిదండ్రులు సునీల్‌రెడ్డి, అనురాధలు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. -
చిన్న, చిన్న కారణాలకే.. ఉసురు తీసుకున్నారు!
కాటారం/నర్మెట/వాజేడు: తన కాళ్లపై తను నిలబడాలని తల్లిదండ్రులు మందలించడంతో చేతికి అందివచ్చిన కొడుకు ఇక ఎప్పటికీ అందనంత దూరం వెళ్లిపోయాడు. ధాన్యం విక్రయించేదాకా ఆగమని చెప్పినా వినకుండా, అడిగిన వెంటనే సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చి కానరాని లోకాలకు తరలిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని మనస్తాపంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ ముగ్గురూ ఇరవై ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు యువకులు, ఓ యువతి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మందలించారని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లికి చెందిన సింగనవేణ మధునక్క, ఓదేలు కుమారు డు శ్రీధర్(23) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 12న పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. సెల్ ఫోన్ కొనివ్వలేదని.. జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన కీర్తి ఉప్పలమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. భర్త యాదగిరి 22 ఏళ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం చేస్తూ పిల్లలను పోషించుకుంటూ పెద్ద కూతురు, కుమారుడి వివాహాలు జరిపించింది. చిన్నకూతురు మౌనిక (23) తల్లిని ఇటీవల సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగింది. ఇప్పుడు డబ్బులు లేవు.. ధాన్యం విక్రయించాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 7న గడ్డి మందుతాగింది. హైదరాబాద్ నిమ్స్‌లో పరిస్థితి విషమించి మృతి చెందింది. బైక్ రిపేర్ చేయించలేక పోయానని.. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడ్జర్లపల్లికి చెందిన అంకని నాగరాజు(20) మూడే ళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ చేశాడు. ఆ సమయంలో ఆవతలి వ్యక్తి స్కూటీ దెబ్బతింది. పెద్ద మనుషుల పంచాయితీలో స్కూటీ బాగు చేసి ఇస్తా నని నాగరాజు హామీ ఇచ్చాడు. వెంటనే స్థానిక మెకానిక్కు ఇచ్చాడు. కానీ, మెకానిక్ ఇప్పటివరకు స్కూటీని మరమ్మతు చేసి ఇవ్వలేదు. స్కూటీని తిరిగి ఇవ్వలేకపోతున్నానని మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారంరాత్రి పురుగుల మందు తాగాడు. ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. -
ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు..
స్టేషన్‌ఘన్‌పూర్: కనీసం పదో తరగతి కూడా పాస్ కాలేదు. కానీ ఏకంగా పదేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నాడొక దొంగ వైద్యుడు. ఎట్టకేలకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఈ నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్, ఘన్పూర్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాలివి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లిలో ఆకాష్‌కుమార్ బిశ్వాస్ గతంలో తన తాత (ఈయన స్థానికంగా వైద్యం చేసేవాడు) వద్ద సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత డాక్టర్‌గా చలామణి అయి డబ్బులు సంపాందించాలనే ఆశతో అదే గ్రామంలో ప్రియాంక క్లినిక్ పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశాడు. వైద్యశాలను నిర్వహిస్తూ తనవద్దకు సాధారణ రోగాలతో వచ్చేవారికి చికిత్స చేస్తూ పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో వసూలు చేసేవాడు. పైల్స్, ఫిషర్, బ్లీడింగ్ పైల్స్, పిస్టులా, బుడ్డ తదితర రోగాలకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తానని చెబుతూ పదేళ్లుగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఒకవేళ రోగుల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే హనుమకొండ, వరంగల్ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లమని సూచించేవాడు. సదరు ఆస్పత్రుల నుంచి సైతం పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకునేవాడు. నకిలీ డాక్టర్ బాగోతంపై విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం వరంగల్ టాస్‌్కఫోర్స్, స్థానిక పోలీసులు, ఘన్పూర్ పీహెచ్సీ వైద్యులు దాడి చేశారు. ఆస్పత్రిలో సోదాలు నిర్వహించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నకిలీ డాక్టర్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిని మూసివేయడంతో పాటు పరికరాలు, మందులు, రికార్డులు, నిందితుడి పేరిట ఉన్న విజిటింగ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో టాస్‌్కఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్‌రెడ్డి, నరే‹Ùకుమార్, వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ లవన్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: ఉబర్‌లో కారు బుక్ చేసుకొని వెళ్లి బ్యాంకు దోచేశాడు.. కానీ చివరకు.. -
Jangaon: గొంతులో ఆమ్లెట్ ఇరుక్కొని వ్యక్తి మృతి
మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్ ఓపెన్ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్‌తో సరిపెట్టేద్దాంలే అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్ టేబుల్‌పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్‌ను తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని.. -
జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్ హత్య.. వరసకు బావే నిందితుడు
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కొడకండ్లలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన బాలుడు షబ్బీర్(5) దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాపర్ మహబూబ్ బాలుడిని చంపి బావిలో పడేశాడు. నిందితుడు మహబూబ్‌ను సూర్యపేట జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సినిఫక్కీలో వెంబడించి తిరుమలగిరి సమీపంలో మహబూబ్‌ను అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మహబూబ్.. బాలుడి తండ్రి జమాల్‌కు వరుసకు అల్లుడుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జమీల్ కుటుంబం ఏడాది కాలంగా కొడకండ్లలో నివాసం ఉంటుంది. జమీల్ సమీపంలోని తిర్మలగిరి కర్రకోత మిషన్‌లో పనిచేస్తుండగా ఇతర కుటుంబీకులు అల్యూమినియం వస్తువులు తయారు చేస్తుంటారు. రోజూ మాదిరిగానే జమీల్ పనికి వెళ్లాడు. ఆ సమయంలో అతడి పెద్ద కుమారుడైన షాబీర్ గుడిసె బయట ఆడుకొంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి జరీనాతోపాటు మిగతా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే బాలుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. చదవండి: మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి -
విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ.. కొంగు నడుముకు చుట్టి..
చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. ఈ చరిత్రలో ఓభాగం జనగామ జిల్లా పాలకుర్తి మండంలోని విస్నూర్ గడి.శత్రు దుర్భేద్యమైన ఈ విస్నూర్ గడిలో నుంచే చుట్టూ 60 గ్రామాలకు విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన దేశ్‌ముఖ్ రాపాక వెంకటరాంచంద్రారెడ్డి పాలన సాగించాడు. ఆయన, ఆయన కుమారుడు బాబుదొర అనేక అరాచకాలు సృష్టించారు. వీరి పాలనపై కడివెండినుంచే తొలి తిరుగుబాటు మొదలైంది. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే. ఈయనతో పాటు పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహులు పల్లెపల్లెనా సంఘాలు ఏర్పాటు చేశాయి. దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసిపెంచుకుంది. దొరసాని ఆదేశంతో వారి అనుచరులు 1946 జులై 4న కాల్పులు జరపడంతో, దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్ గాయమైంది. రజాకార్లకు, విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓరకంగా ఉద్యమానికి ఊపిరులూదింది అని చెప్పవచ్చు. విస్నూర్ గడి దొర రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైద్రాబాద్ పారిపోతుండగా, జనగామ రైల్వేస్టేషన్లో కాల్చిచంపారు. ప్రజల ప్రతిఘటన 400గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. రజాకార్ల దాడులు, అరాచకాలు మరింతగా పెరిగాయి. తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. చివరకు నైజాం సర్కార్ 1948 సెప్టెంబర్ 17న కేంద్రంలో విలీనమైంది -
ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ
సాక్షి, జనగామ: ప్రేమించిన అమ్మాయితో వివాహానికి ఎకరం భూమి ఇవ్వాలని ఆమె తండ్రి డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన ప్రేమికుడు, అతని తల్లి పురుగుల మందు తాగారు. ఈ సంఘటనలో ప్రేమికుడు కన్నుమూయగా..అతని తల్లి ప్రాణాపాయం నుంచి బయట పడింది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు..జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన దండు సాయికుమార్(24), గోపిరాజుపల్లికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. గత మే 13న పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో సాయికుమార్ దంపతులు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉభయుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు.. తన ఇంటి దగ్గరే వివాహం ఘనంగా చేస్తామని చెప్పి కూతుర్ని తీసుకెళ్లారు. ఈనెల 1న అమ్మాయి భర్తకు ఫోన్‌చేసి తనను తీసుకెళ్లాలని కోరగా, 3న సాయికుమార్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించగా.. తన కూతురును సాయి పోషించలేడని, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈనెల 4న సాయికుమార్ అన్న దండు బాబు, అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తన కూతురు పేరిట ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేయాలని తండ్రి డిమాండ్ చేయగా, అందుకు సాయికుమార్, అతని అన్న బాబు అంగీకరించారు. కాగా, పెద్ద మనుషుల మాటలతో మనస్తాపానికి గురైన సాయి తల్లి అక్కమ్మ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగు మందు తాగింది. దాంతో వేదనకు గురైన సాయి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా సాయికుమార్ చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లి ప్రాణా పాయం నుంచి బయటపడింది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. సాయికుమార్ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు పోలీసులు పెద్దపహాడ్ గ్రామంలోనే ఉన్నారు. -
అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్
సాక్షి, జనగామ: రెండేళ్ల క్రితం పంపిన ఓ మెసేజ్.. యువకుడి హత్యకు దారి తీసింది. అన్నతో కాళ్లు మొక్కించారని కోపం పెంచుకున్న తమ్ముడు.. చివరకు కత్తిగాట్లకు బలయ్యాడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పక్కాప్లాన్‌తో మద్యం తాగేందుకు రప్పించి.. అదును చూసి కీచైన్ కత్తితో దారుణంగా చంపేశారు. ఈనెల 16న అర్ధరాత్రి జరిగిన ఈఘటన ‘ఇండస్ట్రియల్ ఏరియాలో హత్య’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈహత్యకు సంబంధించి సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ మూలబావికి చెందిన పకీరు రమేశ్ ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ వివాహిత ఫోన్‌కు రెండేళ్ల క్రితం అసభ్యకర మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె భర్త ఇండస్ట్రియల్ ఏరియాలోని దీప్తి ఇంజనీరింగ్ వర్క్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న పగడాల సందీప్ రమేశ్‌ను మందలించాడు. కాళ్లు మొక్కి తప్పు ఒప్పుకోవడంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది. తన అన్నతో కాళ్లు మొక్కించారనే కోపంతో రమేశ్ తమ్ముడు పకీరు సురేశ్ సందీప్‌కు ఫోన్‌కు చేసి నిలదీశాడు. దీంతో పాటు మెసేజ్ గురించి తెలిసిన వారందరికీ చెప్పాడు. అనంతరం రమేశ్ తన తమ్ముడు సురేశ్, సందీప్ ఇద్దరినీ పిలిచి కాంప్రమైజ్ చేశాడు. అక్కడితో గొడవ ముగియగా.. మూడ్రోజుల క్రితం సురేశ్ మరోసారి సందీప్‌కు ఫోన్ చేసి అదే విషయం గురించి మాట్లాడాడు. తన అన్నతో కాళ్లు మొక్కించుకుంటారా అని పగ పెంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి సందీప్, సురేశ్, మరో స్నేహితుడు విజయ్ ముగ్గురు కలిసి మద్యం తాగారు. ఇక్కడే ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. తాగిన మైకంలో సందీప్ తన వద్ద ఉన్న కీచైన్ కత్తితో సురేశ్‌ను ఇష్టం వచ్చినట్లుగా పొడిచి, మెడకోసి చంపేశాడు. ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని విచారణ సాగించారు. సందీప్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సురేశ్ తండ్రి పకీరు చంద్రయ్యను విట్నెస్గా చూపించి, సందీప్‌ను రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం -
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. రాళ్లు విసిరిన కార్యకర్తలు
సాక్షి, జనగామ: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర సందర్భంగా దేవరుప్పుల టీఆర్ఎస్ నాయకులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం.. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు నేతలు తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్.. విధుల్లో ఉన్న సీపీ ఏం చేస్తున్నాడంటూ సీరియస్ అయ్యారు. ఇది కూడా చదవండి: ఎందరో వీరుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం: సీఎం కేసీఆర్ -
‘కేసీఆర్ ఫాంహౌస్ దాటితే విపక్ష నేతల అరెస్టా?’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫాం హౌస్ దాటితే ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ‘సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా, కల్వ కుంట్ల రాజ్యాంగంలో జీ హుజూర్.. అంటూ వంగిదండాలు పెట్టాలా’అని ఒక ప్రకటనలో నిలదీశారు. శుక్రవారం కేసీఆర్ జనగామ పర్యటన నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ కార్య కర్తలు, నేతలను అరెస్టు చేయడం నీచాతి నీచం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా?’అని ప్రశ్నించారు. ‘‘ప్రధాని మోదీ దిష్టి బొమ్మలు తగలటెట్టిన టీఆర్ఎస్ నేతలపై కేసులుండవు. కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడితే కేసులు పెట్టి అరెస్టు చేస్తారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలి’ అన్నారు. -
జనగామ కలెక్టర్ వాహనంపై రూ.22 వేల చలాన్లు
జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్ 27ఏ 0001) పై యూజర్ చార్జీలు కలుపుకుని చలాన్ల కింద రూ.22,905 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కలెక్టర్ వాహనం 23 సార్లు ఓవర్ స్పీడ్‌తో వెళ్లినందుకుగాను సంబంధిత పోలీసులు ఈ జరిమానా విధించారు. ఈ చలాన్లు ఏడాదికాలంగా నమోదయ్యాయి. (చదవండి: భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?) -
3 నెలలుగా పింఛన్ లేదు.. బతికుండగానే చంపేశారు!
సాక్షి. జనగామ: అతనో దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 3,016 పింఛన్ తీసుకుంటున్నాడు. అయితే గత ఏప్రిల్ నుంచి ఆయనకు పింఛన్ రావడం లేదు. దీంతో ఈనెల 4న మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మెప్మా పీడీ హర్షవర్ధన్‌ను నిలదీశాడు. తన పేరును చనిపోయిన జాబితాలో చేర్చారని అధికారి చెప్పడంతో హతాశుడయ్యాడు. జనగామ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు కృష్ణాకళామందిర్ ఏరియాకు చెందిన దివ్యాంగుడు కానుగ బాల్‌నర్సయ్య సర్వే సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో, మెప్మా సిబ్బంది డోర్‌లాక్ అని రాసుకుని, ఆ తరువాత విచారణ చేపట్టకుండానే ఆయన పేరును చనిపోయిన జాబితాలోకి ఎక్కించారు. కాగా, ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దని బాల్‌నర్సయ్యను పీడీ హర్షవర్ధన్ కోరినట్టు తెలిసింది.దీనిపై పీడీ హర్షవర్ధన్‌ను వివరణ కోరగా, ఇంటింటి సర్వేలో డోర్‌లాక్ ఉండడంతోనే బాల్‌నర్సయ్య చనిపోయినట్లుగా తమ సిబ్బంది నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆర్పీకి మెమో ఇచ్చి ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
సాక్షి ఎఫెక్ట్: ఇద్దరు పిల్లల చదువుకు ఖర్చు భరిస్తాం..
సాక్షి, జనగామ(వరంగల్): సాఫీగా సాగుతోన్న జీవితంలో అనారోగ్యం చిచ్చుపెట్టింది. అల్లారుముద్దుగా తల్లిదండ్రుల ఆలనాపాలనలో పెరుగుతున్న చిన్నారులను ఆగం చేసింది. దంపతులిద్దరూ మృతి చెందడంతో అనాథలుగా మారిన పిల్లలు వృద్దాప్యంలో ఉన్న నానామ్మ వద్ద సేదదీరుతున్నారు.. ఇదే విషయమై ‘అన్నీ నానమ్మే’ శీర్షికన “సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో కొంతమంది దాతలు స్పందించారు. జిల్లాలోని నర్మెట మండలం హన్మంతాపూర్ గ్రామానికి చెందిన మైలాం రాజు, భార్య రజని మృతి చెందడంతో వారి సంతానం ఇద్దరు కుమారులు అనాథలైన వార్తకు స్పందించిన అంబేడ్కర్ సేవాసమితి సభ్యుడు రామిని హరీష్ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చాడు. దీంతోపాటు సమితి ఆధ్వర్యాన మల్లిగారి రాజు, మంగ శంకర్, వంగ భీమ్రాజ్, ఎండీ అసిఫ్, గూడెపు పృథ్వి, దుబ్బాక వీరస్వామి బృందంతో కలిసి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల కిట్టు అందించారు. ఇదిలా ఉండగా.. అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి తో పాటు సభ్యులు సైతం ఇద్దరు చిన్నారులకు తమవంతుగా సాయం అందజేస్తామని ప్రకటించారు. జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి జనగామ: ఈ నెల10న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నందికొండ నర్సింగారావు అన్నారు. జనగామ కోర్టును ఆయన బుధవారం సందర్శించి, మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు, పోలీసులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. కోర్టుకు హాజరు కానీ కక్షిదారులు పర్చువల్ విధానం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి, కొత్తగా ఏర్పాటు చేసి పోక్సో కోర్టును పరిశీలించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కె.జయ్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి కె.ఉమాదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పృద్వీరాజ్, డి.టి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూరెళ్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రసవం అయిన మూడు రోజులకే వంశీప్రియ..
సాక్షి, జనగామ: కరోనా కాటుకు ఓ బాలింత బలైంది. ప్రసవం అయిన మూడు రోజులకే ఆమె మృత్యువాత పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జనగామకు చెందిన నిండు గర్భిణి వంశీప్రియకు నొప్పులు రావడంతో నాలుగు రోజుల క్రితం ప్రసూతి కోసం జనగామ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే, పాజిటివ్ ఉన్నందున హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అక్కడకు వెళ్లాక ప్రసవానికి సమయం ఉందంటూ ఇంటికి పంపించడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను భర్త స్వస్థలమైన హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల క్రితం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే.. పరిస్థితి విషమించి ఆమె మంగళవారం మృతి చెందింది. దీంతో మూడు రోజుల క్రితం పుట్టిన పసిగుడ్డుకు తల్లి లేకుండా పోయినట్లయింది. కాగా, అంతకుముందు వారం వ్యవధిలో వంశీప్రియ అమ్మమ్మ, మేనమామ కూడా మృతి చెందారు. చదవండి: (మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు) -
కేన్సర్ పేషెంట్లకు తన జుట్టు ఇచ్చిన స్టాఫ్ నర్సు!
జనగామ: కేన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ చేసే క్రమంలో జుట్టు దాదాపుగా ఊడిపోతుంది. తద్వారా వారికి విగ్గుల అవసరం ఏర్పడుతోంది. ఈ మేరకు విగ్గుల తయారీ కోసం ఓ ట్రస్ట్‌కు తన 15 ఇంచుల జుట్టును అందజేసి ఉదారతను చాటుకుంది. జనగామ జిల్లాకు చెందిన ఓ స్టాఫ్ నర్స్ ముంబై, తమిళనాడులోని మధురైలో తమ సేవలు సాగిస్తున్న ఓ ట్రస్ట్ బాధ్యులు కేన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసి అందిస్తున్నారు. ఈ విషయం జనగామ జిల్లా బచ్చన్నపేటలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్ నర్సు గుజ్జుల శ్వేతకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసింది. అప్పటికే ఆమె మామయ్య కేన్సర్‌తో బాధపడుతున్న క్రమంలో జుట్టు రాలిపోయి మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో కొందరికైనా ఉపయోగపడాలనే భావననతో తన జుట్టును విరాళంగా ఇస్తానని భర్త నరేష్‌కు చెప్పగా ఆయనతో పాటు మిగతా కుటుంబీకులు కూడా ఒప్పుకున్నారు. దీంతో ట్రస్ట్ ప్రతినిధి శివకు ఫోన్ చేయగా సిబ్బంది ఇటీవలే వచ్చి శ్వేత 15 ఇంచుల జడ(జుట్టు)ను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శ్వేత ‘సాక్షి’తో మాట్లాడుతూ తల వెంట్రుకలు, జడలను సేకరించే ట్రస్ట్ ప్రతినిధులు విగ్గులు తయారు చేసి కేన్సర్‌తో బాధపడే వారికి అందజేస్తారని తెలిపారు. ఈ విషయాన్ని తానేమి గొప్పగా భావించడం లేదని, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలనే మనసాక్షి సూచనతో చేశానని వెల్లడించారు. కాగా, జుట్టు ఇచ్చిన శ్వేత ఫొటోలను ట్రస్ట్ బాధ్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. -
నిర్లక్ష్యం ఖరీదు కోటి రూపాయలు!
గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తేవటమంటే ఇదే. బీటలు పెద్దవి అయినప్పుడు రూ.26 లక్షలతో మరమ్మతు చేద్దామనుకుని నిర్లక్ష్యం చేశారు. తీరా గోడ కూలిన తర్వాత ఇప్పుడు పునర్నిర్మాణానికి రూ.1.26 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవల ఆ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పురావస్తు శాఖ ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండకపోతే రూ.కోటి మిగిలి ఉండేది. ఈ కోట గోడను మెరుగుపరిచేందుకు మూడేళ్ల క్రితమే రూ.4 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులే జరగటం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలకు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు పనులు జరగాలి. కానీ ఇక్కడ ఆ వూసే లేదు. కోటకు మరిన్ని బీటలు ఏర్పడ్డాయి. ఇలాగే పురావస్తు శాఖ ఇంజినీరింగ్ విభాగం కళ్లుమూసుకుని ఉంటే తదుపరి వానలకు మరిన్ని చోట్ల గోడ కూలటం ఖాయంగా కనిపిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలోని సర్వాయి పాపన్న కోట గోడ. గతేడాది సెప్టెంబర్‌లో గోడ పగుళ్లిచ్చింది. గతంలో చిన్నగా మొదలైన పగులు ఇలా పెరిగిపోయింది. దీంతో గోడకు దగ్గరగా ఇళ్లున్నవారు అది కూలితే ప్రమాదమని ఆందోళన చెంది ఫిర్యాదు చేయటంతో పురావస్తు (హెరిటేజ్) శాఖ అధికారులు వచ్చి దానికి మరమతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.26 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. అధికారులు అంచనా వేసిన నెల తర్వాత కుప్పకూలింది. గోడ కూలకుండా వెంటనే తాత్కాలిక చర్యలు తీసుకోవాల్సిన పురావస్తు ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంతో కాలయాపన చేసిన ఫలితమిది. తొలుత తాత్కాలిక చర్యలు తీసుకుని, వానాకాలం ముగిసిన తర్వాత పూర్తిస్థాయి మరమ్మతు చేస్తే సరిపోయేది. కానీ, నెల రోజుల వరకు పట్టించుకోకపోవటంతో గత అక్టోబరులో కురిసిన పెద్ద వర్షానికి పగుళ్లలోంచి నీళ్లు లోపలికి పోయి గోడ ఇలా కుప్పకూలింది. కూలేంతవరకు ఎదురు చూస్తారా? తెలంగాణలోని పల్లెల్లో ఆకట్టుకునే బురుజులు చాలానే ఉన్నాయి. వాటిని తన ఆధీనంలోకి తీసుకొస్తే నిర్వహణ భారం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ బురుజులను పురావస్తుశాఖ గుర్తించట్లేదు. ఫలితంగా మరమ్మతులు, నిర్వహణ పనులు లేక ఇవి శిథిలమవుతున్నాయి. ఇది మెదక్ జిల్లా గుమ్మడిదల గ్రామంలో కళాత్మకంగా నిర్మించిన బురుజు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కానీ దానిపై మొలిచిన మొక్కలు క్రమంగా వేళ్లూనుకుంటూ కట్టడాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అధికారులు పరిరక్షణ చర్యలను విస్మరించడంతో క్రమంగా ధ్వంసమవుతోంది. -
‘నీవు లేకుండా నేను ఎలా బతకాలి’
జఫర్‌గఢ్: ఆ దంపతులకు సంతానం లేదు.. ఒకరికొకరు తోడునీడగా బతికారు. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే నీ వెంటే నేను.. అంటూ భార్య తనువు చాలించింది. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రొడ్డ మంగయ్య (68), ఎల్లమ్మ (65) దంపతులకు సంతానం లేదు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హన్మకొండకు వలస వెళ్లారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మంగయ్య అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతదేహం వద్ద భార్య కన్నీరు మున్నీరైంది. ‘చూసే వాళ్లు లేరు.. కన్నవాళ్లు లేరు.. నీవు లేకుండా నేను ఎలా బతకాలి’ అంటూ మంగళవారం తెల్లవారుజాము వరకు ఏడుస్తూ ఉన్న ఎల్లమ్మ.. భర్త శవం ఎదుటే తనువు చాలించింది. మృత్యువులోనూ కలిసే సాగిన వారి బంధాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. -
15 గ్రాముల పాప్‌కార్న్ తక్కువ.. రూ.10వేల జరిమానా
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్(సినిమా థియేటర్)లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. థియేటర్ క్యాంటీన్లో 60 గ్రాముల పాప్‌కార్న్‌ను రూ.40తో అమ్ముతుండగా.. తక్కువగా వస్తోందని ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేసి.. క్యాంటిన్ యజమానిపై కేసు నమోదు చేశారు. 60 గ్రాముల పాప్‌కార్న్‌లో 15 గ్రాములు తక్కువగా వస్తోందని గుర్తించి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారి తెలిపారు. నిర్దేశిత ధరల కంటే అదనంగా అమ్మినా, తూకంలో మోసం చేసినా కఠిన చర్యలు ఉంటాయని విజయ్ కుమార్ హెచ్చరించారు. -
మరో వివాదంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగాం: టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జనగాం మండలం పెంబర్తిలోని ఓ వెంచర్ విషయంలో రాత్రి సమయంలో మహిళా వీఆర్వీ ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. మహిళా వీఆర్‌ఓతో దుందుడుకుగా, దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో నొచ్చుకున్న ఆ మహిళా వీఆర్ఓ, రెవిన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ విషయం తెలియ జేసింది. ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్ నాయకులు మహిళ వీఆర్‌ఓతో సద్దుమనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహిళ వీఆర్ఓ మాత్రం బాగా నొచ్చుకుని ఉండటం వల్ల పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకే సమాయత్తం అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
సమస్యల ‘స్టేషన్’
సాక్షి, జనగామ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్లో ఎలాంటి నిధులను కేటాయించకపోవడంతో స్టేషన్లో సమస్యలు తీరేటట్లు లేవు. ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్‌కు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు మూడో లైన్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. జిల్లాలో 54 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విస్తరించి ఉంది. జిల్లా కేంద్రంలోని జనగామ స్టేషన్‌తోపాటు, యశ్వంతాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, పెంబర్తి, నష్కల్ స్టేషన్లు ఉన్నాయి. రైల్వే ట్రాక్ దాటిపోవడానికి ఫుట్ఓవర్ బ్రిడ్డి లేకపోవడంతో ప్రయాణికులతోపాటు పట్టణవాసులు ఇక్కట్లు పడుతున్నారు. పట్టణాన్ని రైల్వే ట్రాక్ రెండు విభాగాలుగా విడదీస్తుంది. స్టేషన్‌కు ఇరువైపులా జనావాసాలున్నాయి. స్టేషన్ లోపలి నుంచే ఉన్న ఓవర్ బ్రిడ్జి నుంచి అటు ఇటు వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా టీసీ కంటపడకుండా వెళ్లాలి. లేకుంటే టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా అనుమానిస్తే మరింత చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. కనిపించని కోచ్ డిస్ప్లే .. చిన్న స్టేషన్లలో ఉన్న ఈ సౌకర్యం జిల్లా కేంద్రంలోని స్టేషన్లో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కోచ్ డిస్ప్లేతో వచ్చిన రైలులో మనకు ఏ సీటు కేటాయించారో అదే ప్లాట్‌ఫాంపై నిలబడితే ఆగే రైలు అక్కడే ఆగుతుంది. డిస్ప్లే సౌకర్యం లేక పోవడంతో ఎక్కడ ప్లాట్‌ఫాంపై నిలబడినా మన సీటు ఎక్కడ బోగిలో ఉందో చూసుకోవడం కష్టతరంగా మారుతుంది. బ్రేకులు లేని రైళ్లు.. దూర ప్రాంతాల రైళ్లు ఇక్కడ ఆగడం లేదు. దశాబ్దాల నుంచి ముఖ్యమైన రైళ్లను ఆపాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడకు వెళ్లే శాతవాహన , చైన్నెకి వెళ్లే చార్మినార్, భువనేశ్వర్, ముంబై వెళ్లే కోణార్క్, విశాఖపట్నం, షిర్డీ పోయే షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకుండానే పోతున్నాయి. మో‘డల్’ స్టేషన్.. 2010లో జనగామ స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా ఎంపిక చేశారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలను కల్పించడం కోసం మోడల్ కింద ఎంపిక చేశారు. నిధులను కేటాయించక పోవడంతో స్టేషన్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మూడో లైన్‌కు మోక్షమెప్పుడో? హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు 155 కిలోమీటర్ల వరకు మూడో ట్రాక్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి అందించారు. సుమారు రూ.600కోట్ల వ్యయం మూడో ట్రాక్ నిర్మాణానికి అవసరమని అంచనా వేశారు. కానీ, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. రోజు వేలాది మంది జనగామ స్టేషన్ నుంచి రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడం లేదు. మూడో లైన్‌కు నిధులు కేటాయించలేదు. –సాధిక్ అలీ, జనగామ -
పెద్దమ్మ ఆలయంలో దొంగల హల్చల్
సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని దుర్గామాత, పెద్దమ్మ తల్లి ఆలయాల్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి అమ్మవారి బంగారు ఆభరణాలు, హుండీలు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అమ్మవారి బంగారు ముక్కు పుడకలు, వడ్డానాలు, హుండీలోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. -
పోరాటాల ఖిల్లా..
నిజాం రాజుల ఆగడాలను ఎదురించిన వీరులనుగన్న జన్మభూమి.. నక్సల్ బరి ఉద్యమానికి ఊతమిచ్చి.. భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పోరుగడ్డ.. నాడు నల్లగొండ జిల్లాలో అంతర్భాగమై.. నేడు రెండు వందల గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా విలసిల్లుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది జనగామ జిల్లా. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకుసాగి సొంత జిల్లా కలను సాకారం చేసుకుని ఇక్కడి ప్రజలు జయహో అంటూ నినదించారు. ఆర్థిక, సామాజిక వనరులు కలిగిన ఈ ప్రాంతం జిల్లా గా ఏర్పడడంతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. జనగామ: బ్రిటిష్ పాలనలో వ్యాపార, వాణిజ్య, విద్య రం గాలను అభివృద్ధి చేయడంలో జనగామ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన ప్రిస్ట¯ŒS పాఠశాల, మిషనరీ చారిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ను రైల్వే మార్గాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగించారు. స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1952 నవంబర్‌లో జనగామ పట్టణాన్ని జిల్లాలోనే ఏకైక మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయితే మునిసిపాలిటీకి ఆదాయ వనరులు తగ్గిపోవడంతో మధ్యలో మూడేళ్ల పాటు నగర పంచాయతీగా కు దించబడింది. అప్పటి వరకు నల్లగొండ జిల్లా పరిధిలో వరంగల్, ఖమ్మం ప్రాంతాలు కలిసే ఉండేవి. కాగా, మద్రాసు నుంచి విడిపోయి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం వరంగల్, ఖమ్మం ప్రాంతాలను వేరు చేశారు. ఆ సమయంలోనే నల్లగొండ పరిధిలో ఉన్న జనగామ తాలూకాను వేరు చేయడంతో వరంగల్ జిల్లాలో కలిసి.. దినాదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం జనగామ పట్టణంలో 28 వార్డులు, 1.12 లక్షల జనాభాతో గ్రేడ్–1 మునిసిపాలిటీగా కొనసాగుతుంది. ఆలయాలకు నెలవు.. జనగామ కొత్త జిల్లా ఆలయాలకు నెలవుగా మారనుంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొమురవెల్లి, మ ద్దూరు మండలం బెక్కల్ రామలింగేశ్వరాలయం, నిజాం రజాకార్లను ఎదిరించిన వీరబైరా¯ŒSపల్లి చరిత్ర జనగామ నుం చి విడిపోయాయి. జిల్లాల విభజనలో భాగంగా కొత్తగా పాలకుర్తి సోమేశ్వరస్వామి, చిల్పూర్‌లోని బుగులు వెంకటేశ్వరస్వామి, దేవరుప్పులలోని మానకొండ లక్ష్మీనర్సింహస్వా మి, లింగాలఘనపురంలోని జీడికల్ సీతారామచంద్రస్వా మి, నవాబుపేటలోని శ్రీకోదండరామస్వామి ఆలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లనుంది. చీట కో డూరులోని కోటిలింగాల పుణ్యక్షేత్రం..పట్టణ ప్రజలకు 365 రోజుల పాటు తాగునీరు అందించే చీటకోడూరు రిజర్వాయర్ జనగామ జిల్లాలోనే ఉండడం గమనార్హం. సాహితీ రంగంలో ప్రత్యేక గుర్తింపు.. కళలకు పుట్టినిల్లు అయిన జనగామ చరిత్ర ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. హస్తకళలకు ప్రసిద్ధి గాంచిన పెంబర్తి గ్రామం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. అమెరికా, లండ¯ŒS, ఆసే్ట్రలి యా, అరబ్ దేశాలతో పాటు పలు ఖండాల్లో ఇక్కడ తయా రు చేసే హస్తకళలకు పేరుంది. ప్రపంచ గుర్తింపు పొందిన ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తెయ్యది కూడా జనగామ ప్రాంతమే. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయన గండ పెండేరం అందుకుని, ఎన్నో అవార్డులను పొందారు. కాగా, ఐఐటీ ద్వారా ఎందరో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసి, ప్రపంచం నలుమూలా ల తన శిషు్యలను తయారు చేసుకున్న చుక్కా రామయ్య పా లకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన పలకనూరి సోమేశ్వర్, బమ్మెర పోతన ఈ ప్రాంతానికి చెందిన వారే. జనగామ జిల్లాలోని మండలాలు.. కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలో జనగామ, నర్మెట, లింగాలఘణపురం, బచ్చన్నపేట, తరిగొప్పుల (కొత్త), గుండాల(నల్లగొండ జిల్లా) స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, చిల్పూరు(కొత్త), పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పు ల మండలాలు ఉన్నాయి. మొత్తంగా 13 మండలాలతో సుమారు 5,82,457 జనాభాతో జనగామ జిల్లా నూతనంగా ఆవిర్భవించింది. అభివృద్ధిలో పోటీ పడుతూ.. గ్రామంగా ఆవిర్భవించిన జనగామ అభివృద్ధిలో పోటీపడుతూ జిల్లాస్థాయికి ఎదిగింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే రైల్వే మార్గం, ఐదు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కలిగి ఉన్న రోడ్డు మార్గం జనగామ సొంతం. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా చంపక్‌హిల్స్ లో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రితో జిల్లాస్థాయి కేడర్‌ను కలిగి ఉంది. విద్య, ఉపాధి రంగాలకు నెలవుగా ఇంజనీరింగ్, ఫార్మసీ, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, నర్సింగ్‌తో పాటు వైద్య రంగంలో కార్పొరేట్ స్థా యి కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులతో వరంగల్ తర్వాత జనగామ విద్యాహబ్‌గా విలసిల్లుతోంది. దేశంలోనే ఏకైక పట్టుదారం రోలింగ్ యూనిట్ సెంటర్ ఇక్కడ ఉండడం విశేషం. రైతులు పండించిన సరుకులను భద్రపరుచుకునేందుకు వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గోదాంలు, వ్యవసాయ మార్కెట్, కాటన్ యార్డు ఉన్నాయి. రెండు ఫస్ట్ క్లాస్ మెజిసే్ట్రట్ కోర్టులు, సెకండ్ క్లాస్ మెజిసే్ట్రట్, సబ్‌కోర్టు, అడిషనల్ జిల్లా కోర్టుతో పాటు సబ్ జైలు ఉంది. క్రీడాపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మినీ స్టేడియం, మినీట్యాంకు బండ్ ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయ ల్, ఐటీ కారిడార్‌తో జనగామకు మరింత ప్రాధాన్యం కలుగనుంది. పది దశాబ్దాల చరిత్ర కలిగిన జనగామ ఘనకీర్తి ప్రచారానికి నోచుకోవడంలేదు. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని అందించిన జైనులు జీవించిన ఈ ప్రాంతంలో సజీవ సాక్ష్యాలెన్నో కళ్లెదుటే కని పిస్తున్నా.. నేటి తరానికి అందించే ప్రయత్నం జరగడంలేదు. నల్లగొండ జిల్లా కొలనుపాక రాజధానిగా క్రీ.శ 973లో తెలంగాణను పాలించి న కళ్యాణ చాణక్యులు ఇక్కడ జైన మతాన్ని ఆచరించారు. దేవాలయాలు, విద్యాలయాల ను ని ర్మించి సాక్ష్యాలుగా అనేక శాసనాలు వేయిం చా రు. జనగామ కేంద్రంగా జైనులు వర్తక వ్యా పారం చేస్తూ కాలక్రమేణా ఇక్కడే స్థిర పడ్డారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కొలనుపాక జైన దేవాలయంతో పాటు మద్దూరు మండలం బైరాపల్లి జైన దేవాలయం (ప్రస్తుత వీరభద్రస్వామి) ఆలయాలు నాటి పూర్వ వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జనగామ మం డలం ఎల్లంల గ్రామ శివారులో శిథిలమైన జైన యక్ష దేవాలయం గుట్టపై బసది (విడిది కేం ద్రం) బండ్ల గూడెంలోని జైన ఆనవాళ్లు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సిద్ధెంకి గుట్టపై ఉన్న ఓ బండరాయిపై వర్ధమాన మహావీరుడు, పా ర్శ్వనాథుడు, జైనయక్షిణి శిల్పలాలు సుందరం గా చెక్కినట్టు కనిపిస్తాయి. గ్రీకు రాయబారి మొ గస్తనీస్ తన రచనల్లో నగ్న సన్యాసులను ఎంతో మందిని తెలంగాణ ప్రాంతంలో చూసినట్లు రా సిన గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించిన ‘మాక్ క్రిండాల్’ అనే పరిశోధకుడు వివరించారు జైనమతాన్ని విస్తరించేందుకు లింగాలఘనపురం మండలం కళ్లెంలో ఆర్యవైశ్యులు భూమిని దా నం ఇచ్చినట్లు అక్కడి శాసనంలో కనిపిస్తుంది. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు తీసిపోని చరిత్ర కలిగిన జనగామకు గురింపు తీసుకొచ్చేందుకు పురావస్తు శాఖ స్పందించాలి. ఇక్కడ మ్యూజి యం ఏర్పాటు చేసి భావితరాలకు నాటి ఘనచరిత్రను తెలియజేసేందుకు చర్యలు తీసుకోవాలి. పర్యాటక అర్హతలున్న ఎల్లంల, బండ్లగూడెం, బండనాగారం, సిద్దెంకి గుట్టలను తీర్చిదిద్దాలి. పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారనుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో జనగామకు సువర్ణ అవకాశం దక్కనుంది. పరిశ్రమల స్థాపనకు జనగామ జిల్లా అన్నింటికి తగిన విధంగా ఉంది. అనుకూల, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే స్వభావమున్న ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. లింగాలఘణపురం మండలం ఏనె బావి వద్ద గతంలో ప్రభుత్వం 150 ఎకరాల విస్తీర్ణంలో కామోజీ టెక్స్టైల్స్ పా ర్కు ఏర్పాటుకు సన్నాహాలు చేయగా, నాటి ఉమ్మడి ప్రభుత్వం దానిని ఆంధ్ర ప్రాంతానికి తరలించింది. నూతన జిల్లాల విభజన తరుణంలో టెక్స్టైల్స్ పా ర్కు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తే వందలాది కార్మికులు, నిరుగ్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఆవకాశం ఉంది.