
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫాం హౌస్ దాటితే ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ‘సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా, కల్వ కుంట్ల రాజ్యాంగంలో జీ హుజూర్.. అంటూ వంగిదండాలు పెట్టాలా’అని ఒక ప్రకటనలో నిలదీశారు. శుక్రవారం కేసీఆర్ జనగామ పర్యటన నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
‘బీజేపీ కార్య కర్తలు, నేతలను అరెస్టు చేయడం నీచాతి నీచం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా?’అని ప్రశ్నించారు. ‘‘ప్రధాని మోదీ దిష్టి బొమ్మలు తగలటెట్టిన టీఆర్‌ఎస్ నేతలపై కేసులుండవు. కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడితే కేసులు పెట్టి అరెస్టు చేస్తారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment