ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి(పాత చిత్రం)
జనగాం: టీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జనగాం మండలం పెంబర్తిలోని ఓ వెంచర్ విషయంలో రాత్రి సమయంలో మహిళా వీఆర్‌వీ ఇంటికి వెళ్లి హల్‌చల్ చేశారు. మహిళా వీఆర్‌ఓతో దుందుడుకుగా, దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో నొచ్చుకున్న ఆ మహిళా వీఆర్‌ఓ, రెవిన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ విషయం తెలియ జేసింది.
ఎమ్మెల్యే తీరుపై టీఆర్‌ఎస్ నాయకులు మహిళ వీఆర్‌ఓతో సద్దుమనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహిళ వీఆర్‌ఓ మాత్రం బాగా నొచ్చుకుని ఉండటం వల్ల పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకే సమాయత్తం అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment