సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్త నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు సమచారం. గుబాబి పార్టీకి బైబై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కసిరెడ్డి నారాయణ రెడ్డి 2016లో బీఆర్‌ఎస్ తరుపున ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లోనే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. 2018లోనూ మళ్లీ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం ఈ సారి కూడా మొండిచేయి చూపించింది. దీంతో ఆయన తన రాజకీయ జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపై దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం.
ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు సిట్టింగ్ స్థానాలకే ప్రధాన్యతనిచ్చింది. పార్టీలో ఈసారి టిక్కెట్ దక్కుతుందని భావించిన ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానానికి మొరపెట్టుకున్నా.. ప్రయోజనం లేకపోవడంతో కొత్తదారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత
Comments
Please login to add a commentAdd a comment