narayana reddy
-
గుర్రంపోడు ఎస్ఐ సస్పెన్షన్
గుర్రంపోడు/హైదరాబాద్: హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన గుర్రంపోడు ఎస్ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. వివరాలివి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆగస్టు 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జాల రజిత (32) కేసును తొలుత ఆత్మహత్యగా నమోదు చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.దీనిపై ఎస్పీ శరత్చంద్ర పవార్.. ఏఎస్పీ రాములునాయక్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రధాన నిందితుడు రాములుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినప్పటికీ.. మిగతా నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఎస్ఐ.. కానిస్టేబుల్ (నంబర్ 3524) ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య కేసు నమోదు చేయడంతోపాటు సహ నిందితులైన రాములు భార్య జాల పార్వతమ్మ, అన్న కుమారుడు జాల వెంకటయ్యను పోలీసు ఉన్నతస్థాయి విచారణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలో ముగ్గురు పాల్గొన్నట్లు తేలింది.ఏ2, ఏ3 నిందితులను రక్షించే ప్రయత్నం జరిగినట్లు తేలడంతో ఎస్ఐపై చర్య తీసుకున్నారు. గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం ఎస్ఐ నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
తలకొండపల్లి, కల్వకుర్తి /కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ద్విచ క్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తలకొండపల్లి మండల పరిధి వెల్జాల్ సమీపంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వివరాలి లా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నారాయణ్‌రెడ్డి వెల్జాల్ నుంచి మిడ్జిల్ వెళ్తుండగా రామాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌ను తప్పించే క్రమంలో ఎమ్మెల్యే వాహనం రోడ్డు దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్ (25) అక్కడిక్కడే మృతి చెందగా బైరపాక పరశురాం(35) గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం వెల్దండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్‌కు తరలించగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే కారులోని ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యేతో సహా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
పాలమూరు ‘లోకల్’ పోరుకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్దే ఆధిపత్యం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. -
జల భద్రతతోనే సుస్థిర సాగు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడం, యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం, భూగర్భజలాలను పరిరక్షించడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌లో రాష్ట్రంలో జలవనరుల వినియోగం, సుస్థిర సాగునీటి నిర్వహణకు చేపట్టిన చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. సదస్సులో ఆయన ఏం చెప్పారంటే.. ♦ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులు, 35 చిన్న నదులు ఉన్నాయి. సాగుకు యోగ్యంగా 2 కోట్ల ఎకరాలున్నాయి. ఇప్పటిదాకా 1.067 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కింద 90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ రాష్ట్రంలో ఏడాదికి సగటున 967 మి.వీు.ల వర్షపాతం కురుస్తుంది. దీని పరిమాణం 1,811 టీఎంసీలు. ఇందులో 54.8 శాతం అంటే 617.34 టీఎంసీలు భూమిలోకి ఇంకుతాయి. 510.03 టీఎంసీలు ఉపరితలంలో ప్రవహిస్తాయి. మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 983.39 టీఎంసీలు. ♦ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 14 పూర్తిగా, రెండు పాక్షికంగా పూర్తయ్యాయి. వీటి ద్వారా కొత్తగా 49.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 33.3 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. 1.17 కోట్ల మందికి తాగునీరు అందుతుంది. ♦ పోలవరం ప్రాజెక్టు ద్వారా 322.73 టీఎంసీలను వినియోగించుకుంటాం. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ♦ దేశంలో మొదటిసారిగా 1863–70 సంవత్సరాలలో కేసీ (కర్నూల్–కడప) కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేశారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే.. కృష్ణాతో పాటు పెన్నా బేసిన్లో వర్షాభావం వల్ల ఏటా 100 నుంచి 500 టీఎంసీల కొరత ఏర్పడుతోంది. ♦ గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే పనులను దశలవారీగా చేపడతాం. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. రాయలసీమకు గ్రావిటీపై నీళ్లందించాలంటే.. గోదావరి జలాలను ఆ ఎత్తుకు ఎత్తిపోయాలి. తక్కువ ఖర్చుతో కృష్ణా, పెన్నా బేసిన్లకు నీటిని తరలించే విధానాలను సూచించాలని కోరుతున్నాం. ♦ రాష్ట్రంలో 1,254 ఫిజియోవీుటర్లను ఏర్పాటు చేసి.. 15 లక్షల బోరుబావులను జియోట్యాగింగ్ చేసి భూగర్భజలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, పరిరక్షిస్తున్నాం. 2017తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలమట్టం 5.65 మీటర్లకు పెరిగింది. దేశంలో భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ♦ నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ♦ 33.34 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిస్తున్నాం. దీనివల్ల 11.90 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 201.3 టీఎంసీలు ఆదా అవుతున్నాయి. ♦ చిన్ననీటివనరులను మరమ్మతు చేయడం, ఆధునీకరించడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని 84.5 టీఎంసీలకు పెంచి.. 6.9 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నాం. -
బీజేపీకి బీఆర్ఎస్ రక్షణ నిధి!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ ఫండ్ (రక్షణ నిధి) ఇస్తున్నందున బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయని ప్రజలకు అర్థం అయిందని అన్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి, కసిరెడ్డి మాట్లాడారు. అవగాహనలో భాగంగానే మోదీ పర్యటనలు అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందని రేవంత్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నిలువరించేందుకు ఏ విధంగా అయితే తమ ఓట్లన్నీ బీఆర్ఎస్కు బదిలీ అయ్యేలా బీజేపీ పథకం రచించిందో.. అదే విధంగా ఈసారి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అన్నారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇన్నిసార్లు తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 7, ఎంఐఎం 1 స్థానంలో కలిసి పోటీ చేయనున్నాయని చెప్పారు. బిల్లా, రంగాలు తెలంగాణను దోచుకున్నారు గత కొద్దిరోజులుగా తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక రకమైన దోపిడీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకమైన దోపిడీ చేశారని రేవంత్ ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయలు, ధరణి రూపంలో వేల ఎకరాల భూములను బిల్లా, రంగాలు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో తండ్రి కేసీఆర్‌ను అడగాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. 2004లో సోనియాగాంధీ బిచ్చమేస్తే ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌రావు మంత్రి అయిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మరుగుజ్జులు అయితే కేసీఆర్ ఏమైనా బాహుబలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబట్లో తెడ్డులా బీజేపీ ఉందని, వారికి అభ్యర్థులు లేరు.. మేనిఫెస్టో లేదని రేవంత్ విమర్శించారు. ఏఐసీసీ నేత వంశీచంద్ రెడ్డి తాను పోటీ చేసే స్థానాన్ని కసిరెడ్డికి ఇచ్చినందుకు అభినందిస్తున్నానని అన్నారు. కాగా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని కసిరెడ్డి చెప్పారు. ప్రాజెక్టుకు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా
కల్వకుర్తి/ఆమనగల్లు/సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ పారీ్టకి రాజీనామా చేశారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ కూడా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు వీరు తమ రాజీనామా లేఖలను సీఎం కేసీఆర్‌కు పంపించినట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్ భేటీ అయ్యారు. కల్వకుర్తిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారం¿ోత్సవానికి మంత్రి హరీశ్‌రావు వచ్చిన రోజే వీరు పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నామని వీరు చెప్పారు. నాలుగేళ్లు ఎమ్మెల్సీ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు, ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కసిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనకు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు అని తెలిపారు. కాగా ఆయన ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. ఫలించని బుజ్జగింపులు ఇదిలా ఉండగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని బుజ్జగించడానికి బీఆర్ఎస్ ముఖ్యనేతలు పలుదఫాలు మంతనాలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రెండుసార్లు ప్రగతి భవన్లో మంతనాలు జరిపినా బుజ్జగింపులు ఫలించలేదని చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఆయన బీఆర్ఎస్ను వీడినట్లు సమాచారం. ఆదివారం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం నెరవేరలేదు: కసిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా లక్ష్యం నెరవేరలేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, ఇటీవల తుక్కుగూడ సభలో ఆమె ప్రకటించిన ఆరు గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం తనకు కలిగిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సోనియా పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆ లేఖలో తెలిపిన కసిరెడ్డి.. బీఆర్ఎస్లో తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ఆదివారం ఉదయం.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన కసిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. -
బీఆర్ఎస్ను వీడనున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్త నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ను వీడుతున్నట్లు సమచారం. గుబాబి పార్టీకి బైబై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కసిరెడ్డి నారాయణ రెడ్డి 2016లో బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లోనే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. 2018లోనూ మళ్లీ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం ఈ సారి కూడా మొండిచేయి చూపించింది. దీంతో ఆయన తన రాజకీయ జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపై దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు సిట్టింగ్ స్థానాలకే ప్రధాన్యతనిచ్చింది. పార్టీలో ఈసారి టిక్కెట్ దక్కుతుందని భావించిన ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానానికి మొరపెట్టుకున్నా.. ప్రయోజనం లేకపోవడంతో కొత్తదారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత -
నేను ఎంత త్యాగం చేసిన నాకు సరైన గుర్తింపు లేదు..!
-
విద్యా వ్యవస్థ లేని ఊరు మాది..!
-
పోలవరంపై బాబువి కాకి లెక్కలు
బి.కొత్తకోట : గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సీ నారాయణరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై శనివారం ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనులపై మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో కాంట్రాక్టర్లు లాభదాయకమైన పనులు మాత్రమే చేసి సొమ్ము చేసుకున్నారు. నిజానికి.. పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు అక్కడ ఆరు కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని మళ్లించి చేపట్టిన పనులను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే.. కుప్పంకు అక్టోబర్‌లో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తాం. కుప్పం ఉపకాలువ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నాం. ఇక్కడ రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లు ప్రతిపాదించాం. అవుకు రెండో సొరంగం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడినుంచి ఒక టీఎంసీ నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలిస్తాం. గత ప్రభుత్వం ఈ పనులను వదిలేసింది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని 68 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి నింపుతాం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు గురించి తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు తన ప్రభుత్వంలో నిర్వహణకు కేవలం రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.కోటిన్నర పార్కు కోసం ఖర్చుచేసి.. మిగతా రూ.3.5 కోట్లను భోంచేశారు. వెలిగొండ మొదటి సొరంగం పనులు పూర్తిచేశాం. రెండో సొరంగం పనులు అక్టోబర్‌లోగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశాం. ఆ పనులు ముందుకు సాగే పరిస్థితుల్లేవు. శ్రీశైలం జలాశయంలో 66 శాతం జలాలు ఏపీ వాటాకు వస్తాయి. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలు జరగలేదని తెలంగాణ వాదించడం సరికాదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం. ఉత్తరాంధ్రకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను రూ.2వేల కోట్ల వ్యయంతో పూర్తిచేయనున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదటి దశ ఒక టీఎంసీ సామర్థ్యంతో తాగునీటి సంబంధిత పనులు ప్రారంభమయ్యాయి. -
Vizag: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్.. 24 గంటల్లోనే
కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులకు షేక్ రిజ్వానా, షేక్ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. -
సీఎం జగన్ కు వస్తున్న ఆధరణ తట్టుకోలేక ప్రతిపక్షాల కుట్రలు
-
అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు నీటి రంగం అభివృద్ధిని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్ – ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ తప్పిదాలను దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం ‘ఈనాడు’ చేస్తోందని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టుల నిధులను గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికా రహితంగా ఖర్చు చేసి, కాంట్రాక్టుల రూపంలో అనుయాయులకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, పనులు మాత్రం జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందన్నారు. వంశధార నిర్వాసితులకు అదనపు ప్రయోజనం వంశధార ప్రాజెక్టు రెండో భాగం రెండో దశలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని నారాయణ రెడ్డి తెలిపారు. దీని ద్వారా 27,800 ఎకరాలకు ఇప్పటికే నీటి వసతి లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 225 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి కలుగుతోందని తెలిపారు. అదేవిధంగా 1.2 టీఎంసీల నీటిని హీరమండలం రిజర్వాయర్ ద్వారా కిడ్నీ వ్యాధి పీడిత ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. ఈ నిర్వాసితులకు అదనపు ప్రయోజనం కల్పించేందుకు సీఎం జగన్ రూ. 217 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా హీర మండలం రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని అందించేందుకు రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనుసంధానంతో 18,527 ఎకరాల స్థిరీకరణ వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా 18,527 ఎకరాల స్థిరీకరణకు, 4 మండలాల్లోని 38 గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.145 కోట్ల నిధులకు అనుమతిచ్చిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గజపతినగరం బ్రాంచి కాలువ పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో 43% పనులు పూర్తయ్యాయని, భూ సేకరణలో కొన్ని ఇబ్బందుల వల్ల మిగిలిన పనులు ఆగాయని చెప్పారు. మిగతా పనులకు రూ.137 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. ఈ పనులను కూడా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. తారకరామతీర్థ సాగరం ద్వారా 16 వేల ఎకరాలకు నీరు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజి నిర్మించి 2.75 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని, మూడు మండలాల్లోని 49 గ్రామాల్లో 16,538 ఎకరాలకు నీరు ఇవ్వచ్చని చెప్పారు. ఈ పనులు 59 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులకు రూ.198 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి పనులు అప్పగిస్తామన్నారు. పునరావాస కార్యక్రమాలను ముందుగానే పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.7,214 కోట్లతో బీఆర్ అంబేడ్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. దీనిద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖతోపాటు ఇతర ప్రాంతాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు తరలించాలనేది లక్ష్యమన్నారు. తొలి దశలో రెండు ప్యాకేజీల్లో గత ప్రభుత్వం 2017–18లో రూ.2,022కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా పురోగతి లేదన్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, అంచనాలను రూ.17,411కోట్లకు పెంచిందన్నారు. ఫేజ్–2 కింద రెండు ప్యాకేజీలను చేపట్టిందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 63వ కిలోమీటరు నుంచి 102వ కిలోమీటరు పొడవున శ్రీకా కుళం జిల్లా నడిగెడ్డ వరకు నీటిని తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 7,500 ఎకరాల భూసేకరణ త్వరగా జరుగుతోందని, 60 శాతం మేర డిజైన్లకు అనుమతి లభించిందన్నారు. మడ్డువలస రెండో దశ పనులు 79% పూర్తి మడ్డువలస రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.5టీఎంసీల నీరిచ్చే లక్ష్యంతో రెండో దశ పనులను చేపట్టామని ఈఎన్సీ చెప్పారు. దీనివల్ల జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే 79 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను పాత కాంట్రాక్టరు చేయలేకపోవడంతో రూ.26.9కోట్లతో సవరిం చిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించిందన్నా రు. వచ్చే ఖరీఫ్‌కు ఈ పనులు పూర్తవుతాయన్నారు. తోటపల్లి బ్యారేజి 83% పూర్తి విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మించి 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 1,31,000 ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు తోటపల్లి బ్యారేజ్ పనులను ప్రభుత్వం చేపట్టిందని నారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.1127.58 కోట్లతో చేపట్టగా, 83 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.123.21 కోట్లతో మిగిలిన పనులను రెండు ప్యాకేజిలుగా చేపట్టామన్నారు. ఈ పనులు 2023 జూన్‌కి పూర్తవుతాయన్నారు. రూ.854 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ మహేంద్రతనయ నది మీద చాప్రా గ్రామం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి 1,200 క్యూసెక్కుల నీటిని రేగులపాడు రిజర్వాయర్‌కు తరలించే ప్రధాన ఉద్దేశంతో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నట్టు నారాయణరెడ్డి తెలిపారు. 2.1 టీఎంసీల నీటిని నిల్వచేసే ఈ రిజర్వాయర్ ద్వారా 24,600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియల్లో ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, రూ.854.25 కోట్లతో మిగిలిన పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చిందని చెప్పారు. త్వరలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులను చేపట్టి 2024 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
తీరు మార్చుకోని తెలంగాణ జెన్కో.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, అమరావతి : తెలంగాణ జెన్కో తీరు మారలేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. దిగువన సాగు, తాగు నీటి అవసరాలు లేవు. అయినా, తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్‌లలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. దాంతో శ్రీశైలం, సాగర్‌లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా నది నికర జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇదే అంశాన్ని వివరిస్తూ, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేదంటే రిజర్వాయర్లలో నీరు తగ్గిపోయి, సీజన్ చివర్లో సాగు, తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో తాగు, సాగు నీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తుకు కాదని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఈ నెల 24 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 213.401 టీఎంసీలు నిల్వ ఉండేవి. వరద కనిష్ట స్థాయికి చేరడంతో స్పిల్ వే గేట్లు మూసేశాం. తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ.. దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలంలో నీటి మట్టం 881.3 అడుగుల్లో 195.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే.. 18 టీఎంసీలను శ్రీశైలం నుంచి దిగువకు వదిలేశారు. ► గురువారం ఉదయం 6 గంటలకు నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన ఎలాంటి తాగు, సాగునీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. ఆ జలాలు నదిలో కలుస్తున్నాయి. ► పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉంది. దాంతో.. ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. ► ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే.. బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అవసరాలు లేకపోతే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించారు. ► బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తెలంగాణ జెన్కో ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దాంతో కృష్ణా నికర జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. -
Hyderabad: పథకం ప్రకారమే నారాయణరెడ్డి హత్య!
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు చెందిన నారాయణరెడ్డిని నిందితులు పక్కా పథకం ప్రకారమే అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తు న్న శ్రీనివాస్‌రెడ్డి..తన బంధువుల అమ్మాయి ని నారాయణరెడ్డి ప్రేమ, పెళ్లి పేరుతో పరువుకు భంగం కలిగించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని..అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని మరో ఇద్దరు నిందితులతో కలిసి రెండు నెలల ముందే పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చులు, సహకరించిన వారికి సుపారీ పేరు తో యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డి నుంచి రూ.ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ముందుగా మూడు లక్షలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు అదే ప్రాంతానికి చెందిన కాశీ, షేక్ ఆషిక్లతో కలిసి నారాయణరెడ్డిని గత నెల 27న అంతమొందించిన త ర్వాత విషయాన్ని వెంకటేశ్వరరెడ్డికి వీడియోకాల్ ద్వారా తెలిపి ముగ్గురు ఒక్కొక్క లక్ష రూపాయలు తీసుకొని ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. అయితే నారాయణరెడ్డి కనిపించకుండా పోయిన ఫిర్యాదును స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును మొదలు పెట్టారు. నారాయణరెడ్డికి చివరిగా వచ్చిన శ్రీనివాసరెడ్డి సెల్ నెంబర్ ఆధారంగా అతనికి ఫోన్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి తనకు పోలీసులు ఫోన్ చేస్తున్నారు, మీరు కూడా ఎవరికి దొరకకుండా ఉండాలని, ఏమి చెప్పవద్దని హెచ్చరించి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. దీంతో శ్రీనివాసరెడ్డి ఫోన్ నుంచి చివరిగా కాల్ వెళ్లిన కారు డ్రైవర్ షేక్ ఆషిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కుట్రకోణం బట్టబయలయ్యింది. దీంతో శ్రీనివాసరెడ్డి, కాశి, షేక్ ఆషీక్, వెంకటేశ్వరరెడ్డిలపై కేసునమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా హత్యకేసులో ముందుగా పట్టుబడి వివరాలు వెల్లడించిన షేక్ ఆషిక్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. షేక్ ఆషిక్ నగరంలోని ఓ పేరొందిన కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేసినట్లు తెలిసింది. అయితే అతని ఇంటిని గాలించిన సమయంలో అతని ప్యాంటు జేబుల్లో 50 వేల నగదుతో పాటు అతను తాను చదువుతున్న కళాశాల నుంచి తీసుకున్న టీసీ కనిపించింది. కాగా శ్రీనివాసరెడ్డి, కాశీలు గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!) -
మా నీరు మిగిలే ఉంది
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాలో మిగిలిన 171.163 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుతించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో 350.585 టీఎంసీలు వాడుకున్నామని పేర్కొంది. అదేవిధంగా తెలంగాణ వాటాలో 108.235 టీఎంసీలు వాడుకోగా ఇంకా 160.545 టీఎంసీలు మిగిలాయని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ కూడా ఇదే విధమైన ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలు కృష్ణా బోర్డు నుంచి త్రిసభ్య కమిటీకి వచ్చాయి. గురువారం డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, వాటాలో మిగిలిన నీటి కేటాయింపులుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కేటాయింపుల ఆధారంగా రబీలో ఆయకట్టుకు నీటి విడుదలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి. మూడో ఏడాదీ కృష్ణాలో నీటి లభ్యత పుష్కలం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 2019–20, 2020–21 తరహాలోనే ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో సాగు, తాగునీటి కోసం అవసరమైన జలాలు వాడుకోవాలని, డిసెంబర్లో లెక్కలు తేల్చి.. వాటాలో మిగిలిన జలాలపై నిర్ణయం తీసుకుంటామని రెండు రాష్ట్రాలకు ఆదిలోనే కృష్ణా బోర్డు చెప్పింది. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో 790.528 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు లెక్కతేలింది. ఏపీ, తెలంగాణకు 66 : 34 నిష్పత్తిలో పంపిణీ చేస్తామని బోర్డు ఆదిలోనే చెప్పింది. ఈ విధంగా ఏపీకి 521.75 టీఎంసీలు, తెలంగాణకు 260.78 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఇందులో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ఏపీ 350.585 టీఎంసీలు, తెలంగాణ 108.235 టీఎంసీలు.. మొత్తం 458.82 టీఎంసీలను వాడుకున్నాయి. ఇంకా 331.708 టీఎంసీల లభ్యత కృష్ణాలో నీటి లభ్యత ఇప్పటికీ పుష్కలంగా ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన 253.311 టీఎంసీలు ఉంది. జూరాలలో 5.853, పులిచింతల ప్రాజెక్టులో 38.17 టీఎంసీలు ఉంది. తుంగభద్ర డ్యామ్‌లో ఏపీ, తెలంగాణ కోటా కింద ఇంకా 24.474 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో మధ్య తరహా ప్రాజెక్టుల్లో 9.90 టీఎంసీలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే డిసెంబర్ రెండో వారానికి కృష్ణా బేసిన్లో 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఏపీ వాటా నీటిలో ఇంకా 171.163 టీఎంసీలు, తెలంగాణకు 160.545 టీఎంసీలు ఉంటాయి. ఇలా మిగిలిన నీటిని ఇప్పుడు వాడుకుంటామని రాష్ట్రాలు కోరుతున్నాయి. 49.72 టీఎంసీల మిగులు జలాలు మళ్లింపు శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా వరద జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్ చేసిన ప్రతిపాదనకు కృష్ణా బోర్డు అంగీకరించింది. వృథాగా సము ద్రంలో కలిసే నీటిని ఎవరు వాడుకున్నా నష్టం లేదని పేర్కొంది. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 17.96, పోతిరెడ్డిపాడు 21.24, హంద్రీ–నీవా 2.73, సాగర్ కుడి కాలువ 7.28, ఎడమ కాలువ 0.91 వెరసి 49.72 టీఎంసీల మిగులు జలాలను ఏపీ సర్కార్ మళ్లించింది. ఇదే విధంగా తెలంగాణ సర్కారు ఏఎమ్మార్పీ, ఎఫ్ఎఫ్సీ, కల్వకుర్తి, ఎడమ కాలువ ద్వారా 11.94 టీఎంసీలను వాడుకుంది. -
తెలంగాణ విద్యుత్ దోపిడీని ఆపండి
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏకపక్షంగా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని తక్షణం నిలిపివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను కోరింది. కృష్ణా జలాల కేటాయింపుతోపాటు సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద జరిగే విద్యుదుత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వ వాదనల్లో సహేతుకం లేదని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని తెలంగాణ ఉద్దేశపూర్వకంగా తప్పుగా అన్వయిస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్ సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి చేయాలని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా అక్కడ విద్యుదుత్పత్తి చేస్తోందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విద్యుదుత్పత్తిపై తెలంగాణ జెన్కో కేఆర్ఎంబీకి ఇచ్చిన వివరణపై కేఆర్ఎంబీ ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏపీ ఈఎన్సీ స్పందిస్తూ.. తెలంగాణ వాదన సహేతుకంగా లేదంటూ.. విద్యుత్ దోపిడీకి సంబంధించిన వాస్తవ విషయాలను లేఖ ద్వారా కేఆర్ఎంబీ దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణాడెల్టా సాగు, తాగునీరు అవసరాల కోసం ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచి నీటి విడుదలను కోరినప్పుడే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయాలని ఈఎన్సీ స్పష్టంచేశారు. అలాగే, పులిచింతలలోనూ తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా ఆ రాష్ట్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండూ ఏపీలోనే ఉన్నాయి నాగార్జునసాగర్ కుడికాలువ పవర్‌హౌస్, టెయిల్‌పాండ్ పవర్‌హౌస్ భౌగోళికంగా ఏపీ పరిధిలో ఉన్నాయని, ఆ ప్రాజెక్టుల దిగువన నీటి అవసరాలు ఉన్న ప్రాంతాలు కూడా ఏపీలోనే ఉన్నాయని ఈఎన్సీ వివరించారు. కాబట్టి ఈ రెండుచోట్ల ఉత్పత్తి చేసే విద్యుత్ పూర్తిగా ఏపీకి సంబంధించిందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పవర్‌హౌస్ వద్ద 60 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ఈఎన్సీ తెలిపారు. ఏపీపై తెలంగాణ ఆంక్షలకు ఆస్కారం లేదు ఇక రాష్ట్ర పునర్విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని 1,059 టీఎంసీల ఏపీ ప్రభుత్వ డిమాండ్ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందుంచిందని ఏపీ ఈఎన్సీ ఆ లేఖలో గుర్తుచేశారు. ఈ అంశం కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్ ముందు ఉందని, ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ఏపీకి కేటాయించిన నీటిని ఏ విధంగానైనా ఏపీ భూభాగంలో వినియోగించుకునే హక్కు తమ రాష్ట్రానికి ఉందని, కేటాయించిన నీటిని వినియోగించుకోవడంలో ఏపీపై తెలంగాణ ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలకు ఆస్కారంలేదని నారాయణరెడ్డి అందులో స్పష్టంచేశారు. రెండు విడతల్లో చెన్నైకు 15 టీఎంసీలు చెన్నై నీటి సరఫరాకు సంబంధించి.. 1983లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉందని ఏపీ ఈఎన్సీ ఆ లేఖలో గుర్తుచేశారు. చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలను రెండు విడతల్లో కృష్ణా జలాలను సరఫరా చేయాల్సి ఉందన్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు 9.90 టీఎంసీలను ఒక్కో రాష్ట్రం 3.30 టీఎంసీల చొప్పున మూడు రాష్ట్రాలు చెన్నైకి సరఫరా చేయాలని.. అలాగే, జనవరి–ఏప్రిల్ మధ్య 5.10 టీఎంసీలు ఒక్కో రాష్ట్రం 1.70 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇక వరద జలాలపై ఎస్ఆర్బీసీ ఆధారపడలేదని.. 1981లోనే సీడబ్ల్యూసీ దీనిని ఆమోదించిందన్నారు. అలాగే, 75 శాతం నికర జలాల ఆధారంగా 19 టీఎంసీల వినియోగానికీ కేంద్ర జలవనరుల కమిషన్ ఆమోదించిందని ఈఎన్సీ తెలిపారు. నీటి మళ్లింపు అధికారం ఏపీకి ఉంది మరోవైపు.. పోతిరెడ్డిపాడు ద్వారా 2019–20లో 170 టీఎంసీలను, 2020–21లో 124 టీఎంసీలను మళ్లించినట్లు నారాయణరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్ఆర్బీసీ, చెన్నైకి నీటి సరఫరాకే కాకుండా వరద జలాలపై ఆధారపడిన తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌కి కూడా ఈ నీటిని వినియోగించినట్లు ఈఎన్సీ తెలిపారు. వరద సమయంలో మిగులు జలాలను వరద నిర్వహణతో పాటు అవసరమైన వాటికి మళ్లించుకునే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఏపీకి ఉందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. -
కృష్ణా జలాల్ని 80:20 నిష్పత్తిలో కేటాయించండి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 79.88:20.12 నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రతిపాదించింది. చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణ సర్కారు 89.15 టీఎంసీల వినియోగానికే పరిమితమైతే అప్పుడు ఏపీ, తెలంగాణలకు 70:30 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పు నోటిఫై అయ్యే వరకూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) తీర్పే అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేయడాన్ని ఎత్తిచూపిందని తెలిపింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు 512.04, 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేసుకునేలా రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం కొనసాగుతుందని తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) విచారణ చేస్తోందని గుర్తు చేసింది. నీటి పంపిణీ బోర్డు పరిధిలోకి రాదని.. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ జల వనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. లేఖలోని ప్రధానాంశాలివీ.. ► 2020 జూన్ 4న జరిగిన కృష్ణా బోర్డు 12వ సమావేశంలో చిన్న నీటి వనరుల విభాగంలో కేటాయించిన 89.15 టీఎంసీలకుగానూ 45 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. వీటిని పరిగణనలోకి తీసుకుని నీటిని పంపిణీ చేయాలి. ► అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. చిన్న నీటి వనరుల విభాగంలో 89.15 టీఎంసీల వినియోగానికే తెలంగాణ సర్కార్ పరిమితమైతే 70:30 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరాం. దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్ జోక్యం చేసుకుని 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని చేసిన సూచనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ► చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపులు ఉంటే 175 టీఎంసీలను వాడుకుంటోంది. ఈ విషయాన్ని జూలై 6, 9 తేదీల్లో బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. ఈ దృష్ట్యా మధ్య, భారీతరహా ప్రాజెక్టుల్లో 79.88: 20:12 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలి. ► ఒకే తరహా నీటి లభ్యత సూత్రాన్ని అన్ని నదులకు అమలు చేయలేం. ఒక్కో నది స్వరూపాన్ని బట్టి నీటి లభ్యత సూత్రం ఆధారపడి ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 70.8: 29.2 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలో కృష్ణా పరీవాహక ప్రాంతం ఉంది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటిని పంపిణీ చేయాలన్న తెలంగాణ వాదన అసంబద్ధం. ► విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల అవసరాలతో కలుపుకుని 1,059 టీఎంసీలను కేటాయించాలనే డిమాండ్లను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఇతర బేసిన్లకు మళ్లిండం, ఇతర బేసిన్ల నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించడం, బేసిన్లను ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ నీటి వాటా కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్లు పెట్టగా బోర్డు విచారిస్తోంది. చెరి సగం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరడం సహేతుకం కాదు. -
82.4 టీఎంసీలు తోడేసిన తెలంగాణ
సాక్షి, అమరావతి: తాగు, సాగునీటి అవసరాలు లేనప్పటికీ.. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ 82.4 టీఎంసీలను అక్రమంగా వాడుకుని విద్యుదుత్పత్తి చేసిందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. తెలంగాణ సర్కార్ అక్రమంగా వాడుకున్న నీటికిగానూ.. 66:34 నిష్పత్తిలో అదనంగా తమకు 160 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి శనివారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో నీటిమట్టం కనీస స్థాయి దాటిందని వివరించారు. జూరాల, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు తక్షణమే ఏపీకి 27 టీఎంసీలు(చెన్నైకి తాగునీరు 3, తెలుగుగంగకు 7, ఎస్సార్బీసీ/గాలేరు–నగరికి 8, కేసీ కెనాల్‌కు 2, హంద్రీ–నీవాకు 7 టీఎంసీలు) విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని లేఖలో కోరారు. లేఖలో ప్రధానాంశాలు.. ► ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించి శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తున్న అంశాన్ని అనేకసార్లు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. విద్యుదుత్పత్తిని ఆపేయాలని బోర్డు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ తుంగలో తొక్కింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలంలో 43.25, సాగర్‌లో 27.23, పులిచింతల ప్రాజెక్టులో 11.92 వెరసి 82.4 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. ఈ నీటిని ఆ రాష్ట్ర కోటా అయిన 299 టీఎంసీల్లో కలిపి లెక్కించాలి. ► ప్రస్తుతం శ్రీశైలంలో 853.7 అడుగుల్లో 88.47, సాగర్‌లో 536.5 అడుగుల్లో 181.11, పులిచింతలలో 173.71 అడుగుల్లో 43.79 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో ఏపీకి 27 టీఎంసీలను విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలి. -
కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరతారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విజయశాంతి కలిశారు. (అమిత్‌షాను కలిసిన విజయశాంతి) -
కడ్తా తీస్తే కాల్ చేయండి
సాక్షి, ఇందూరు : కడ్తా పేరిట రైతులను దోచుకుంటున్న వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కడ్తా తీసే మిల్లర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ధాన్యానికి కూడా రైస్ మిల్లర్లు కడ్తా తీస్తే రైతులు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కడ్తా తీసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఆదివారం క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, రెవెన్యూ, సివిల్ సప్లయి, ఐకేపీ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో సేకరిస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని కడ్తా లేకుండా తీసుకునేలా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. అయితే, నాణ్యంగా ఉన్న ధాన్యానికి రైస్ మిల్లర్లు కడ్తా తీసుకున్నా, కొనుగోలు కేంద్రాల్లో ఇతర ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి రైతుల కోసం కాల్ సెంటర్ (18004256644, 73826 09775)ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులు పంట కోసే ముందు హార్వెస్టర్ యంత్రాల్లో సరైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. యంత్రం వేగం ఏ–2, ఏ–3లలో, బ్లోయర్ వేగం 19–26 మధ్యలో ఉంచి కోతకు వెళ్లాలని, తద్వారా నాణ్యమైన ధాన్యం వస్తుందని కలెక్టర్ వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తరువాత వ్యవసాయ అధికారులు పరిశీలించి నాణ్యతను ధ్రువీకరిస్తారని, నాణ్యత సరిగా లేకుంటే కడ్తా ఎంత తీయాలో సూచిస్తారన్నారు. వర్షాలు, తదితర కారణాల వలన నాణ్యత తక్కువగా ఉంటే అందులో ఐదు నుంచి పది శాతానికి మించి నాణ్యత తగ్గదన్నారు. రైస్ మిల్లర్లు కూడా వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి కడ్తా తీసుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కొనుగోలు కేంద్రం బాధ్యులు, ఇతరులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులపై కూడా చర్యలుంటాయన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని, చెన్నీ తప్పనిసరిగా పట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్‌లో ఓపీఎంఎస్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేసి రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు సమీక్షించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. -
కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. నువ్వా... నేనా.. అనేవిధంగా ఇద్దరు నేతలు బహిరంగంగా సవాలు చేసుకోకున్నా.. అంతర్గతంగా అదే తలపిస్తోంది. వీరిద్దరి గ్రూపులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తి పోసుకుంటుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు.. తమ అనుయాముల నిరసనల రూపంలో బహిర్గతమవుతున్నాయి. దీనికి కొనసాగింపుగా పార్టీ శ్రేణులు సైతం రెండుగా విడిపోవడంతో వర్గపోరు రచ్చకెక్కిందని చెప్పవచ్చు. ఇటీవల స్థానికంగా చోటుచేసుకున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇరువర్గాల ప్రెస్మీట్లు, నిరసనలు, విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలతో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇతర పార్టీల నేతలు, అధికార పార్టీలోని తటస్థులు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. చదవండి: లైసెన్సుల ‘లొల్లి’ యుద్ధం మొదలైందిలా... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకుల్లో జైపాల్‌యాదవ్,ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. చివరకు జైపాల్‌కు టికెట్ దక్కడం.. గెలవడం చకాచకా జరిగిపోయాయి. కొంతకాలంగా నియోజకవర్గంలో నారాయణరెడ్డి క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. కాంగ్రెస్ పారీ్టకి చెందిన కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ ఇటీవల ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యే వర్గం నొచ్చుకుంది. నియోజవకర్గ బాస్‌గా ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారనేది ఆయన అనుయాయుల ప్రశ్న. దీనిపై ప్రెస్‌మీట్ పెట్టి... ఎమ్మెల్సీ తీరును సైతం ఎండగట్టి తప్పుబట్టారు. అయితే, ఆమనగల్లు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కన్వినర్ వస్పుల జంగయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యేకు కొన్ని రోజులుగా దూరం పాటిస్తూ.. తాజాగా ఎమ్మెల్సీకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్ కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ వర్గం వైపు వచ్చారు. వీటన్నింటినీ గమనించిన ఎమ్మెల్యే వర్గం.. ఎమ్మెల్సీపై గుర్రుగాఉంది. చినికిచినికి గాలివాన.. ఇటీవల ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఎంపీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. దీనిని స్థానిక ఎంపీపీ అనిత తీవ్రంగా తప్పుబట్టారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యాలయంలో సమావేశం నిర్వహించడమే కాకుండా ఎంపీపీ కుర్చీలో కూర్చోవడమేంటనేది ఆమె వాదన. ఒకరకంగా తనను అవమానించారని, గిరిజన ఎంపీపీ కావడంతోనే ఇలా చేశారని ఆమె మండిపడుతున్నారు. ఆమె ఆరోపణలు.. ఎమ్మెల్సీ ప్రోత్సాహ ఫలితమేనని ఎమ్మెల్యే వర్గం ప్రత్యారోపణ చేస్తోంది. గ్రూపు రాజకీయాలు చేస్తూ.. పార్టీని భ్రష్టు పటిస్తున్నారని బాహాటంగానే కసిరెడ్డిపై విమర్శల దాడికి దిగింది. మరోపక్క ఎమ్మెల్సీ వర్గం కూడా వీటిపై ఘాటుగానే స్పందిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీని ఆహ్వానించవద్దని అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేస్తున్నారని మండిపడుతున్నాయి. రాజకీయం.. వ్యాపారం కాదు ఆమనగల్లు: రాజకీయం అంటే వ్యాపారం కాదని, సేవాభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుంటున్నానే తప్పా ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో ఉన్న మంచి వాతావరణాన్ని కొందరు నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు వద్దూ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. కులమతాలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 20 లక్షలతో సరుకుల పంపిణీ ఆమనగల్లు మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో పది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కడ్తాల్ మండలంలో రూ.20 లక్షలతో దాదాపు 4 వేల మంది ప్రైవేటు వాహనాల డ్రైవర్లు, వలస కార్మికులకు సరుకులు అందించామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిట్టె నారాయణ, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! పార్టీ బలోపేతం కోసమే.. ‘ఇతర పార్టీలోంచి టీఆర్ఎస్లోకి వస్తామంటే చేర్చుకున్నాం. ఒక ఎమ్మెల్సీగా పార్టీలో చేర్చుకునే హోదా నాకు లేదా? దీనిని తప్పు బట్టాల్సిన అవసరమేం ఉంది..? ఎంపీపీ అనిత వ్యాఖ్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది ఆమె వ్యక్తిగతం. దీని వెనక నా ప్రమేయం ఉందని ఆరోపించడం.. నూరుపాళ్లు తప్పు. ఎన్నికల సమయంలో జైపాల్ యాదవ్ గెలుపునకు కృషి చేశా. నేను సహకరించలేదని ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసమే తప్ప నాకు స్వార్థం లేదు’ అని ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆరోపణలు ‘ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓ ఎమ్మెల్యేగా వమ్ము చేయలేను. రాజకీయం అంటే వ్యాపారం కాదు. సేవాభావంతో పనిచేసేవారే రాజకీయాల్లో ఉండాలి. కొందరు రాజకీయ దురుద్దేశంతో నాపై ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ్యునిగా నాకున్న అధికారాలను వినియోగించుకుంటున్నా. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తున్నా. ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కల్వకుర్తిలో కొందరు నేతలు స్వార్థం కోసం రాజకీయాలను కలుషితం చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. -
‘రూ.599 కోట్లలో 10 శాతం కుడా ఖర్చు చేయలేదు’
సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో రైతు సమస్యలపై గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కడ్తా పేరుతో 3 నుండి 5కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 599 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కుడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. వలస కార్మికుల కోసం కేటాయించిన 599 కోట్ల నుంచే 1500 చొప్పున అందరికి ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) -
అధికార లాంఛనాలతో నారాయణ రెడ్డి అంత్యక్రియలు
సాక్షి, డిచ్పల్లి: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ ఎం నారాయణరెడ్డి పారి్థవ దేహానికి అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులోని కృషి దర్శన్ కేంద్రంలో (నారాయణరెడ్డి వ్యవసాయ క్షేత్రం)అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం నుంచి స్వర్గ రథయాత్ర వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని కృషి దర్శన్ కేంద్ర వరకు ర్యాలీ నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, జీవన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త, నగర మేయర్ నీతూకిరణ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు నారాయణరెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తూ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులరి్పంచారు. నారాయణరెడ్డి కుమారుడు అరుణ్‌రెడ్డి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరెడ్డి కుమార్తెలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, సీపీ, మేయర్ ఉద్యమకారుడు.. అభ్యుదయవాది అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, అభ్యుదయ వాది, మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై ఆనాడే పార్లమెంట్లో గళం విప్పి 45 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించిన నాయకుడని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని విషయాలు తెలుసుకుని సభలలో సుదీర్ఘంగా తెలంగాణ వాణి విని్పంచే వారని అలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు నారాయణరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల్లో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, నాయకులు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్ మాజీ ఎంపీ కన్నుమూత
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. నారాయణ రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణరెడ్డి మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. పౌర సన్మానం ఏర్పాట్లు... అంతలోనే..! ప్రముఖ తెలంగాణవాది నారాయణరెడ్డికి ఇవాళ పౌర సన్మానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఆయన మరణవార్త విషాదాన్ని నింపింది. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన నారాయణరెడ్డి 1967లో నిజామాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి పార్లమెంట్లో ఏకధాటిగా 45 నిముషాలు ప్రసంగించారు. 1972లో నిజామబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. నిజామాబాద్‌లో మొట్టమొదటి మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. 1969 నుంచి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. నారాయణరెడ్డి టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. -
‘26 మందిని సస్పెండ్ చేసి వచ్చాను’
‘అనుమతి లేకుండా జిల్లా అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది విధులకు గైర్హాజరైతే కఠినంగా ఉంటా.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి ఆలస్యంగా వస్తే ఊరుకోను... ఈ విషయాల్లో ఇప్పటికే ములుగు జిల్లాలో 26 మందిని సస్పెండ్ చేసి వచ్చాను’. అంటూ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణరెడ్డి సున్నితంగా హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా ఫ్రెండ్లీగా పని చేసుకుందామన్నారు. సాక్షి, నిజామాబాద్ : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డి తొలిరోజే తన మార్క్‌ను ప్రదర్శించారు. కల్టెరేట్‌లోని అన్ని శాఖలను సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. ఎన్నికల సెక్షన్లో సంబంధిత తహసీల్దార్, కిందిస్థాయి ఉద్యోగులు చెప్పే వివరాలు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించి ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారో తనకు తెలపాలన్నారు. కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో రెండు గంటలకు పైగా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని శాఖలకు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రతి విషయాన్ని తనకు తెలియజేయాలన్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాన్ని పరిశీలించారు. బాధ్యతలు చేపట్టగానే జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి మంగళవారం కలెక్టరేట్లోని అన్ని జిల్లా కార్యాలయాలను తిరిగి పరిశీలించారు. ముందుగా కలెక్టర్ పరిపాలనా విభాగంలోని డీఆర్వో చాంబర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సెక్షన్ల వారీగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అక్కడే ఉన్న కాల్ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికల సెక్షన్లో సంబంధిత తహసీల్దా ర్, కిందిస్థాయి ఉద్యోగులు చెప్పే వివరాలు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. టాయిలెట్ల నుంచి దుర్వాసన రావడంతో వాటిని క్లీన్‌గా ఉంచాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూం, వీడి యో కాన్ఫరెన్స్ గదిని పరిశీలించారు. పక్కనే గల రికా ర్డు గదికి వెళ్లారు. అక్కడ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రికార్డులను భద్రంగా ఉంచేందుకు అవసరమైన నిధులు తానిస్తానన్నారు. కలెక్టరేట్ పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తతో నిండి ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ రెండు, మూడు రోజుల్లోగా కార్యాలయం పరిశుభ్రంగా కనిపించాలని, చెట్టు దిమ్మెలకు రంగులు వేయాలని కలెక్టరేట్ పరిపాలనా అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశ మందిరాన్ని, అక్కడి నుంచి పెన్షన్, డీఆర్డీఓ, ఉపాధిహామీ, ఐసీడీఎస్, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కార్యాలయాలు పరిశీలించారు. ప్రగతిభవన్ దగ్గర పాడైన నీటి యంత్రాన్ని తొలగించాలని లేదా కొత్తదైనా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయం, ప్రగతిభవన్ గోడలపై ఉన్న మొక్కలు, చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. బీసీ వెల్ఫేర్ ఉద్యోగులకు హెచ్చరిక... బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లగానే జిల్లా అధికారి శంకర్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించారు. కోర్టు పనిమీద వెళ్లారని చెప్పారు. ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారో తనకు తెలపాలన్నారు. అక్కడే ఉద్యోగులతో మాట్లాడిన కలెక్టర్... అనుమతి లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే ఊరుకోనని, కఠినంగా ఉంటానని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య ఉన్నారు. ప్రతి శాఖ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయాలి ప్రతి శాఖ జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తన ఫోన్ నంబర్, సీసీ నంబరు యాడ్ చేసి శాఖా పరంగా జరుగుతున్న ప్రతి విషయం తనకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో రెండు గంటలకు పైగా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.అధికారికంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించాలని, డివిజన్లో ఆర్డీవోను, జిల్లాలో డీఆర్వో కార్యాలయాన్ని సంప్రదించాలన్నా రు. అధికారులు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి సాయంత్రం కార్యాలయ విధులు నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో సిబ్బందిచే బాగా పని చేయించడానికి ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు, మున్సిపల్ కమిషనర్లు పట్టు సాధించాలన్నారు. సెలవు రోజుల్లో ఇబ్బంది పెట్టనని, ఆరోగ్యం పాడు చేసుకోవాల్సి పని లేదని, పని రోజుల్లో మాత్రం అనుమతి లేకుండా గైర్హాజరైతే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలని, జిల్లా స్థాయికి వస్తే మాత్రం మొహమాటం లేకుండా కలానికి పని చెప్పా ల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజావాణి అద్భుతంగా జరగాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యులు విడుదలైనందున వార్డుల వారీగా ఫొటో ఎలక్ట్రోల్ జాబితా 30న ప్రచురించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నా రు. నూరుశాతం తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా సిద్ధ చేసుకోవాలని, అభ్యంతరాలన్నీ రిజిస్టర్లలో నమోదు చేసి పరిష్కరించాలన్నారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమానికి మించినది మరొకటి లేదని, గ్రామాల్లో మార్పులు తేవడానికి కృషి చేయాలన్నారు. అర్హత గల రైతులందరికీ పాసు పుస్తకాలివ్వాలని, ఇబ్బందులు పెడితే ఉపేక్షించనన్నారు. కలెక్టరేట్ భవన సముదాయం పరిశీలన... జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల వద్ద జరుగుతున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. అధికారులతో కలియతిరిగి అన్ని వివరాలు, మ్యాప్‌ను పరిశీలించారు. వీలైనంత త్వరగా భవనాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, డీఎఫ్ఓ సునీల్, జడ్పీ సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధ, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా విధానంలో ఉత్తమ ప్రమాణాలు, భారీ సంస్కరణలు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానటరింగ్ కమిషన్ పని చేస్తుందని కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు పెంచడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణలిచ్చి విద్యాబోధనలో నైపుణ్యం సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో భాగంగా ఈ నెల 14 నుండి మొదటి విడతలో ప్రతి మండలంలో 15 పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేద బడుగు వర్గాల పిల్లల చదువు కోసం ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేయనుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా 25 శాతం సీట్లు బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ కు జ్యుడీషియల్ అధికారాలు వున్నాయని వెల్లడించారు. -
తెలంగాణ వంటల తాత ఇకలేరు..!
సంప్రదాయ వంటల నుంచి.. చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ వరకు అన్నింటినీ అవలీలగా వండి వార్చే యూట్యూబ్ వంటల తాత ఇకలేరు. ‘గ్రాండ్‌పా కిచెన్’ను యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్లందరికీ వంటల తాతగా పరిచయమున్న నారాయణరెడ్డి(73) అక్టోబర్ 27న అనారోగ్యంతో హైదరాబాద్‌కు సమీపంలోని తన సొంతూరులో మరణించారు. ఈ తెలంగాణ తాత 2017లో ప్రారంభించిన గ్రాండ్ పా కిచెన్ చానల్‌కు ఏకంగా 60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేస్తారు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతారు. అంతేకాదు యూట్యూబ్ చానల్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టిన రోజు కానుకలు కొనిపెడు తుంటారు. చనిపోయే ముందు 6 రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు. నోరూరించే వంటకాలను తయారుచేసే విధానాన్ని చూపించి, వాటిని అనాథలకు పంచిపెట్టే నారాయణరెడ్డికి విదేశాల్లోనూ అభిమానులున్నారు. -
ప్లాస్టిక్‌పై యుద్ధం
సాక్షి, ములుగు: ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే రాజ్యమేలు తోంది. పల్లె లేదు.. పట్నం లేదు.. ఇల్లు లేదు.. వాకిలి లేదు.. ఎక్కడ చూసినా ఈ మహమ్మారే కనిపిస్తోంది. చివరకు పచ్చని అడవులు, ఆహ్లాదపరిచే పర్యాటక ప్రాంతాలు, భక్తి తన్మయత్వాన్ని పంచే ఆలయాలకు నెలవైన ములుగు ఏజెన్సీ జిల్లాలో సైతం ప్లాస్టిక్ భూతం బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ మహమ్మారిని అరికట్టాలని నిర్ణయించారు. అయితే, ప్లాస్టిక్ వస్తువు లను ఇవ్వాలని అడిగితే ప్రజలు ముందుకురారని భావించిన ఆయన.. ఇందుకు ఓ ఉపాయం కని పెట్టారు. కేజీ ప్లాస్టిక్ అందించేవారికి కేజీ ఫైన్ రైస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో భారీగా స్పందన వచ్చింది. జిల్లాలో గతనెల 16 నుంచి 26 వరకు చేపట్టిన కార్యక్రమం ద్వారా తొమ్మిది మండలాల్లోని 174 గ్రామపంచాయతీల పరిధిలో ఏకంగా 48,849 కేజీల ప్లాస్టిక్ సేకరణ జరగడం విశేషం. పైగా వరుస వర్షాలతో పనిలేక ఇబ్బందులు పడిన వారికి దీనివల్ల ఉపాధి కూడా కలిగినట్లయింది. ఇప్పటి వరకు సేకరించిన ఈ ప్లాస్టిక్‌ను డిస్పోజ్ చేయడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను సిమెంట్ ఫ్టాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మేడారం జాతర వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. జాకారం నుంచి మొదలు... 30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ ములుగు మండలంలోని జాకారం గ్రామాన్ని పరిశీలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు అక్కడ తిరుగుతూ కనిపించారు. దీంతో ఎస్పీ సంగ్రాంసింగ్ వారికి సరదాగా ప్లాస్టిక్ సేకరణ టాస్క్ ఇచ్చారు. దీంతో వారు మూడు బృందాలుగా విడిపోయి గంట సమయంలోనే ఏకంగా 996 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. వాటిని చూసిన నారాయణరెడ్డి.. ఒక్క గ్రామంలోనే ఇన్ని బాటిళ్లు ఉంటే జిల్లాలో ఎన్ని ఉంటాయో అని భావించి ప్లాస్టిక్‌పై సమరభేరి పూరించాలని నిర్ణయం తీసుకుని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బియ్యం కొనుగోలుకు విరాళాలు... ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది తరపున ప్రతీ గ్రామం నుంచి పాత, కొత్త బట్ట సంచులను సేకరించారు. స్థానిక టైలర్ల సహాయంతో సుమారు 40వేల బట్ట సంచులను సేకరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఇక ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా వెదురు బొంగులతో తయారు చేయించిన కప్పుల వాడకంపై జిల్లా సంక్షేమ శాఖ అవగాహన కల్పించింది. ప్లాస్టిక్‌కి అడ్డుకట్టగా మంగపేట మండల కేంద్రానికి చెందిన చికెన్ వ్యాపారి ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకొస్తే కేజీకి రూ.10 తక్కువ తీసుకుంటానని ప్రకటించాడు. ఇక ఫైన్ రైస్ కొనుగోలుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ వంతుగా విరాళాలు అందించారు. ఇలా అన్ని రంగాల ప్రజల చేయూతతో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ములుగులో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలవుతోంది. ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రకటించారు. ప్లాస్టిక్ వాడితే రూ.5వేల జరిమానా... జిల్లా యంత్రాంగం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలకు వచ్చే వారు బయటి ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు, గ్లాసులు, ప్లేట్లు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు మండలం గట్టమ్మ ఆలయంతో పాటు జిల్లా సరిహద్దుల్లో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేసి వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ని తీసుకొని ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, ప్లాస్టిక్ రహిత గ్లాసులు, పేపర్ ప్లేట్లు అందిస్తారు. ఇందుకయ్యే ఖర్చును భక్తులు, పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు. మేడారంపై ప్రత్యేక దృష్టి కోటిమందికి పైగా హాజరయ్యే మేడారం మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరలో ప్లాస్టిక్‌ని పకడ్బందీగా నిషేధించేందుకు జిల్లా యంత్రాంగం సమయత్తమవుతోంది. జాతర జరిగే సమయంలో వెయ్యి మంది వలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తారు. వీరంతా భక్తులను పరిశీలించి ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్ నియంత్రణ కొనసాగుతుంది జిల్లాలో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం అందించారు. ప్లాస్టిక్ నియంత్రణ నిత్యం కొనసాగుతుంది. గ్రామాల్లో ప్లాస్టిక్ సేకరణ దాదాపుగా పూర్తిచేశాం. అలాగే ప్లాస్టిక్ వస్తువులు విక్రయించకుండా నోటీసులిచ్చాం. జిల్లాలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకు రాకుండా ములుగు మండలం గట్టమ్మ ఆలయం వద్దే కాకుండా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తాం. ముఖ్యంగా మేడారం మహా జారతను ప్లాస్టిక్ ప్రీ జాతరగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. – చింతకుంట నారాయణరెడ్డి, కలెక్టర్, ములుగు జిల్లా -
వంటల తాత
‘గ్రాండ్‌పా కిచెన్’.. యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్లందరికీ పరిచయం. ఆసక్తి ఉన్న చానెల్. ఈ చానెల్ నడుపుతున్న కుక్, గ్రాండ్ పా పేరు నారాయణ రెడ్డి. ముద్ద పప్పు, పులిహోర, చింతకాయ తొక్కు, బిర్యానీ వంటి సంప్రదాయ వంటల నుంచి.. మంచూరియా, పిజ్జా, బర్గర్స్ లాంటి చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ వరకు అన్నిటినీ అవలీలగా వండి వార్చేవారు నారాయణ రెడ్డి. డెజర్ట్స్ ఆయన చేయి పడితే అదుర్సే! వీటన్నిటినీ కట్టెల పొయ్యిమీదే చేస్తాడు. అవెన్ వాడకుండా ఆయన చేసే చాక్లెట్ కేక్స్, పాన్‌కేక్స్ చూస్తూంటేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. మిల్క్ షేక్స్, పుడ్డింగ్స్ గురించే చెప్పే పనేలేదు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతాడు. అంతేకాదు ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టినరోజుకి కానుకలు కొనిపెడ్తూంటాడు. ఈ తెలంగాణ తాత నడిపే ‘గ్రాండ్‌పా కిచెన్’ యూట్యూబ్ చానెల్‌కు 60 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంత మంచి మనిషి గురించి చెప్పుకునే సందర్భమే ఇప్పుడు విషాదమైంది. నారాయణ రెడ్డి మొన్న 27 తారీఖున అనారోగ్య కారణాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చనిపోయే ముందు ఆరు రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు. తను పోయాక కూడా చానెల్‌ను ఆపొద్దని సహ ఉద్యోగులకు చెప్పారట నారాయణ రెడ్డి. అనాథల ఆకలి తీర్చేందుకే కాదు, వాళ్ల జీవితాలనూ తీర్చిదిద్దే గ్రాండ్‌పా కిచెన్ ఎప్పటికీ నిండుకోకూడదనే ఆశిద్దాం. -
‘అందుకే కేసీఆర్ సభ రద్దు చేసుకున్నారు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన బంద్ పూర్తిగా విజయవంతమైందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం పోలీసులతో బంద్‌ను విఫలం చేయాలని ప్రయత్నించినా... ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్లపైకి బంద్‌ను విజయవంతం చేశారని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజకీయ నాయకుల గృహ నిర్బంధాలు.. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. కార్మికులతో చర్చలు జరపాలని ఉన్నత న్యాయస్థానం చెప్పినా... బేఖాతరు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆయనపై కోర్టు ధిక్కారణ నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులకు స్వేచ్ఛ లేదని.. స్వచ్చందంగా పని చేయలేని దద్దమ్మలు ఆయన క్యాబినేట్లో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని.. నియంతృత్వ వైఖరి వీడకపోతే ప్రకృతి ఆయనను శిక్షిస్తుందని దుయ్యబట్టారు. చర్చలు జరపాలి.. ‘అనుభవం లేని డ్రైవర్ల కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ మొండి పట్టు వీడి కార్మికులతో చర్చలు జరపాలి. ఇబ్బందులు ఏమైనా ఉంటే.. మీ సమస్యలు గవర్నర్‌కు వివరించండి. ఆర్టీసీ ఆస్తులను తన చెంచాలకు కట్టబెట్టడానికే కేసీఆర్ సంస్థకు పూర్తిస్థాయి ఎండీని పెట్టలేదు. హుజుర్నగర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా. ధైర్యం ఉంటే.. హుజుర్నగర్ ఎన్నికను రిఫరెండంగా తీసుకుంటారా. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే అక్కడ సభను రద్దు చేసుకొని మొహం చాటేశారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయ్యాయి. హైదరాబాద్‌లో మరీ దారుణంగా మారాయి. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు నగరంలోని అన్ని రోడ్లపై తిరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి’ అని నారాయణరెడ్డి సీఎం కేసీఆర్ తీరును విమర్శించారు. -
బయటపడ్డ సీఐ నారాయణరెడ్డి వార్నింగ్ టేపులు
-
సీఐ నారాయణరెడ్డి వార్నింగ్ టేపులు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి సీఐ నారాయణరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఐ నారాయణరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈసీ పోలింగ్‌కు ముందే ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయినా జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ ఏజెంట్లకు వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో పోలింగ్ ఏజెంట్ కిషోర్‌ను పీఎస్‌కు రావాలంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు బయటపడ్డాయి. పోలింగ్ తర్వాత ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ నారాయణరెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అండదండలతో రెచ్చిపోతున్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా వెనకాడుతున్నారు. -
ఖాకీ కక్ష సాధింపు
అనంతపురం సెంట్రల్: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణరెడ్డి మరో సారి రెచ్చిపోయారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదు మేరకు సీఐపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. దీంతో తనను బదిలీ చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై సీఐ అక్కసు పెంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ ఘటనకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్తలైన ఖాదర్, హుస్సేన్, రఘులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని వారిపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. విచారణ పేరుతో విచక్షణారహితంగా చితకబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జేసీ బ్రదర్స్‌కు అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఐని తాడిపత్రిలో ఎం దుకు కొనసాగిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు.విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అ«ధ్యక్షులు గయాజ్‌బాషా, ఎస్సీ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు తదితరులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇటీవల ఎన్నికల కమిషన్ వేటు వేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని కక్షసాధింపులకు పాల్పడుతున్న సీఐ నారాయణరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని గయాజ్‌బాషా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈయనకు తాడిపత్రితో సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడే మకాం వేశారన్నారు. వైఎస్సార్సీపీ కోసం పనిచేసిన ముగ్గురు కార్యకర్తలనూ కేసు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి బండబూతులు తిట్టడమే కాకుండా విచక్షణారహితంగా కొట్టాడని తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు మాట్లాడుతూ తాడిపత్రిలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకం సృష్టిస్తున్నాడన్నారు. దళితుల జోలికొస్తే పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు కూడా పచ్చ చొక్కాలు వేసుకొని వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే సీఐని సస్పెండ్‌చేయాలని, లేదంటే తాడిపత్రి పట్టణ బంద్, ఎస్పీ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షారెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు కూడా బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కందిగోపుల మురళీధర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సంపత్, భాను తదితరులు పాల్గొన్నారు. -
తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి బరితెగింపు
-
వైఎస్సార్సీపీ నేతలపై బదిలీ అయిన సీఐ దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి బరితెగించారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. దీంతో నారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపుకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఖాదర్, హుస్సేన్, రఘులపై లాఠీలతో తాడిపత్రి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు. జేసీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ అయిన సీఐ వైఎస్సార్సీపీ శ్రేణులపై ఈ విధంగా దాడి చేయడంపై పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అండతో నారాయణరెడ్డి రెచ్చిపోతున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి తప్పుబట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం నారాయణరెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. బదిలీ అయిన సీఐకి తాడిపత్రిలో ఏం పని అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ సీఐని సస్పెండ్ చేసి.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఏపీలో మరో అధికారి బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాపై మరో సీఐపై బదిలీ వేటు పడింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో శరత్ చంద్రను తాడిపత్రి సీఐగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలతో చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో పట్టణ సీఐ సురేశ్‌కుమార్‌పై ఇప్పటికే బదిలీ వేటు పడింది. అధికార టీడీపీ ఎన్నికల ప్రచార సభలో కోడ్ ఉల్లంఘన జరిగిన విషయాన్ని రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు నవీన్‌కుమార్ గుర్తించి కేసు నమోదు చేయమని చెప్పినా సురేశ్‌కుమార్ పెడచెవిన పెట్టారు. ఏకపక్షంగా వ్యవహరించిన సురేశ్‌ను ఎన్నికల విధుల నుంచి ఆయన స్థానంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సీఐగా పనిచేస్తున్న పి. సుబ్బారాయుడును నియమిస్తూ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు. (చదవండి: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ) -
నారాయణరెడ్డిని అప్పులు మింగేశాయి
బోర్లు వేసి చీనీ, వేరుశనగ సాగు చేసి అప్పుల పాలైన రైతు నారాయణరెడ్డి(51) ఆత్మహత్య చేసుకొని ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు. నారాయణరెడ్డిది అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామం. అప్పుల బాధతో 2017 సెప్టెంబరు 16న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి 11 ఎకరాల భూమి ఉంది. భార్య రమాదేవి పేరు మీద 7.50 ఎకరాలు, కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. బోరులో నీళ్లు తగ్గిపోవడంతో పొలంలోని చీనీ చెట్లను 2009లో కొట్టేశారు. అప్పట్నుంచీ వర్షాధారంగా వేరుశనగ సాగు చేస్తున్నారు. తదనంతరం అప్పు చేసి నాలుగు బోర్లు వేయిస్తే రూ. 1.6 లక్షలు ఖర్చయింది కానీ నీళ్లు పడలేదు. ఆ తర్వాత ప్రతి ఏటా అప్పుచేయడం, వేరుశనగ వేయటం. పంట సరిగ్గా రాక ప్రతి ఏటా అప్పు పెరగడం. చివరకు అప్పు రూ. 4 లక్షల చేరింది. అప్పల బాధ భరించలేక నారాయణరెడ్డి 2017 సెప్టెంబర్ 16న ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి భార్య రమాదేవి, కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. కుమారైకు వివాహం చేశారు. అనిల్‌కుమార్‌రెడ్డి అనంతపురంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ‘పరిహారం నేటికీ అందలేదు. పెట్టుబడి లేక భూములు బీడు పెట్టుకున్నాం..’ అన్నారు రమాదేవి. – మునెప్ప, సాక్షి, శింగనమల -
ఓటు హక్కు.. వంద నోటు కాదు
సాక్షి, ములుగు: ఓటు హక్కు అంటే వంద రూపాయాల నోటు, లిక్కర్ బాటిల్ కాదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. డీఆర్డీఏ తరఫున మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులం విద్యార్థులతో ఆదివారం ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకుడిని ఎంచుకునే అవాకాశం ఉంటుందని అన్నారు. కొంతమంది ఓటు వేసే రోజును ప్రభుత్వ సెలవుదినంగా అనుకుంటున్నారని, ఆ ఆలోచనను మరిచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వినియోగంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రలోభాల విషయంలో పౌరులు నేరుగా 1950 టోల్ ప్రీ నంబర్‌కి కానీ, ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం తరఫున గంటన్నర సమయంలో పరిష్కరిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటును వినియోగించే విధంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చేపట్టిన ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సంజీవరావు, డీపీఎం సతీష్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, సీఐ సార్ల రాజు, తహసీల్దార్ భూక్యా గన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరిద్దరే
సాక్షి, కరీంనగర్ : పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్- కరీంనగర్- నిజామాబాద్- మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీ చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్ వేసిన అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని విస్మరించి విద్యార్థులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రజా గొంతుక వినిపించేందుకే తాను మండలికి పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ప్రకటన చేయడంతో గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా మండలి ఎన్నికల్లో సంఖ్యాపరంగా కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. ఇప్పటికే టీఆర్ఎస్- మజ్లిస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఐదు స్థానాలకు గానూ టీఆర్ఎస్ నుంచి నలుగురు, మజ్లిస్ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్‌కు 21మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా ప్రస్తుతం వారి బలం19. దీంతో ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
మట్టి మర్మమెరిగిన మహా రైతు!
సేంద్రియ వ్యవసాయంలో ఆరితేరిన సుప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి. కర్ణాటక దొడ్డబళ్లాపూర్ దగ్గరలోని మరలేనహళ్లిలోని తన కలల పంట అయిన సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ రైతు శిక్షణా కేంద్రంగా మలిచారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యవసాయం ప్రారంభించిన ఆయన విదేశీ యాత్రికుడి ద్వారా కొన్ని దశాబ్దాల క్రితమే జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు డాక్టర్ మసనోబు ఫుకుఓకా రచించిన ‘వన్ స్ట్రా రెవెల్యూషన్’ (గడ్డి పరకతో విప్లవం) చేతికి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేపట్టి 40 ఏళ్లు సుభిక్షంగా కొనసాగించారు. ఇటీవల 84 ఏళ్ల వయసులో తన వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 14న రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. మన భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 శాతం ఉందని అంచనా. అయితే, నారాయణరెడ్డి తన 4.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ కర్బనాన్ని 5 మేరకు పెంచారంటే నేలతల్లిని ఆయన ఎంతగా గుండెలకు హత్తుకున్నారో అర్థమవుతుంది. మట్టి మర్మమెరిగి మెసలిన ఆ మహా రైతు, మహోపాధ్యాయుడిని ‘సాక్షి’ దినపత్రిక 2012 జూలైలో తెలుగు రైతులకు తొలిసారి పరిచయం చేసింది. రానున్న కాలం సేంద్రియ రైతుదేనని గొప్ప దార్శనికతతో ప్రకటించిన నారాయణరెడ్డితో ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు అప్పట్లో జరిపిన సంభాషణను పునర్ముద్రిస్తూ ప్రకృతి వ్యవసాయ యోధుడికి అక్షరాంజలి ఘటిస్తున్నాం.. ► వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని మీరెలా చూస్తున్నారు? రైతు శ్రమకు సరైన ప్రతిఫలం దక్కటం లేదు. గిట్టుబాటు ధర దొరకటం లేదు. ప్రభుత్వమే రైతుకు మొదటి శత్రువు. మంచినీటికి ఉన్న ధర పాలకు లేదు. 1960లో రూ. 18 వేలున్న ట్రాక్టర్ ధర ఇప్పుడు(ఏడేళ్ల క్రితం) రూ. 3.5 లక్షలు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర దానికి తగ్గట్టు ఎందుకు పెంచటం లేదు? గ్రామాల నుంచి 40 శాతం మంది యువకులు ఏటా పట్టణాలకు వలసపోతున్నారు. వాళ్లను కూడా తప్పుపట్టలేం. వృద్ధులం ఆత్మగౌరవం చంపుకోలేక ఊరు వదల్లేకపోతున్నాం. ► ఈ దుస్థితి ఎక్కడికి దారితీస్తుంది? రాసిపెట్టుకోండి. కొద్ది ఏళ్లలోనే దేశంలో తినడానికేమీ ఉండదు. రెండో హరిత విప్లవం, జన్యుమార్పిడి సాంకేతికత.. వీటి వల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రభుత్వం చేసిన ద్రోహం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సమాజం రైతులను చిన్నచూపు చూస్తోంది. పదెకరాలుండి ఏటా రూ. 5 లక్షలు సంపాదించే తమిళ బ్రాహ్మణ రైతుకు 42 ఏళ్లొచ్చినా వధువు దొరకడం లేదు. ► మీ వ్యవసాయం గురించి చెప్పండి? బయటి నుంచి కొని తెచ్చిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయం. చెరువు మట్టితో పాటు వానపాములు, ఆకులు ఆలములతో కంపోస్టు తయారు చేసి వేస్తాను. నా పొలంలో 18 ఏళ్ల క్రితం భూసారానికి నిదర్శనమైన జీవన ద్రవ్యం (హ్యూమస్) 0.4 శాతం ఉండేది. ఇప్పుడు(ఆరేళ్ల క్రితం) 3.2 శాతం ఉంది (ఇటీవల ఇది 5 శాతానికి పెరిగింది). ఎండు ఆకు గాలికి పోతుంటే రూ. 5 పోయినట్టేనని బాధపడతాను. మా పొలంలో ఇప్పటికి ఒక్కసారి కూడా చెత్తకు నిప్పు పెట్టలేదు. టేకు, మద్ది, పనస, చింత, సపోట, బటర్ ఫ్రూట్, కొబ్బరి చెట్లను పెంచడంతో పాటు కూరగాయలు, ధాన్యాలు పండిస్తాను. రాగులు, దండిగా కూరగాయలు, పండ్లు తింటాం. మా జీవితం, మా వైభవం రాష్ట్రపతికి కూడా దొరకదు. నేను వ్యవసాయం ప్రారంభించిన మొదట్లో (1972లో) రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడి నష్టపోయా. పొలం అమ్మేసి వ్యాపారం చేదా ్దమనుకున్నాను. సేంద్రియ రైతుగా మారిన నాసా సైంటిస్టు మాట సాయంతో.. మసనోబు ఫుకుఓకా ‘గడ్డి పరకతో విప్లవం’ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, రెండేళ్లలోనే నిలదొక్కుకున్నాను. ► రసాయనిక వ్యవసాయం ఎందుకు వద్దో వివరంగా చెబుతారా? ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ శాస్త్రం ఒక మిథ్య. చైనాలో వాడుతున్న ఎరువుల్లో 35 శాతం మానవ విసర్జితాల నుంచి వచ్చిన సేంద్రియ ఎరువే. భూమి పైపొరలోని ఒక గ్రాము మట్టిలో 2 కోట్ల 90 లక్షల సూక్ష్మజీవులుంటాయి. రసాయనాల వాడకం వల్ల మన భూముల్లో జీవం నశించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) సహాయ సంచాలకుడుగా పనిచేసిన శైలేంద్రనాథ్ 1972లోనే రసాయనిక ఎరువులు పూర్తిగా మాని సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పాడు. కానీ, వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ డా. స్వామినాథన్ రసాయనాల్లేకుండా జానానికి తిండి ఎలా పెడతామని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాడు. ప్రభుత్వం చెబుతున్న పద్ధతిలో ఎకరానికి 12 క్వింటాళ్లు పండుతున్న రాగులను నేను 23 క్వింటాళ్లు పండించాను. నిజంగా దిగుబడి పెరగటమే కావాలంటే.. నేను చెప్పిన పద్ధతిని అనుసరించవచ్చు కదా? ► భూసార పరీక్షలు చేశాకే గదా ఎరువులు వేయమంటున్నారు? రసాయనిక ఎరువులు వేసే ముందు భూసార పరీక్షలు చేయించమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ పోషకం లోపిస్తే ఆ ఎరువును ఎక్కువగా వేస్తున్నారు. బాగానే ఉంది. అయితే, పోషకాలు ఒక పొలంలో ఒక చోట ఉన్నట్లు మరో చోట ఉండవు. పైగా రుతువును బట్టి మట్టిలో పోషకాల స్థాయి మారుతూ ఉంటుంది. అందుకే భూసార పరీక్షలు అసంబద్ధమైనవి. నేను బడిలో చదువుకున్నది నాలుగో తరగతే. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లను కూడా నోరు మూయించగలను. మట్టిలో పుట్టి పెరిగిన వాళ్లం. మట్టి రుచి చూసి, చెప్పుల్లేకుండా పొలంలో నడిచి వచ్చి ఆ భూమి గుణగణాలు గ్రహిస్తాం. ► ఎరువుల ద్వారా కాకుండా మరే విధంగా పోషకాలు అందుతాయి? ప్రకృతి సిద్ధంగా పోషకాలు అందే మార్గాలున్నాయి. ఒక చదరపు మీటరు వాతావరణంలో 8 టన్నుల నత్రజని ఉంటుంది. మైకోరైజా అనే సూక్ష్మజీవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి భూమికిస్తుంది. మెరుపు మెరిసినప్పుడు 2,600 సెంటీగ్రేడ్ ఉష్ణం వస్తుంది. మెరుపు నత్రజనిని అమోనియా వాయువుగా మార్చి వర్షంతో కలిపి ఇస్తుంది. కంపోస్టు వేస్తే 26 రోజులకు, యూరియా వేస్తే 35 గంటలకు, మెరుపుల ద్వారా 4 గంటలకే పోషకాలు అంది, పంటల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. దీని లెక్కేమైనా ఉందా ఈ సైంటిస్టుల దగ్గర? గ్రాము వరి మొక్క వేరును ఆశ్రయించి వంద కోట్ల సూక్ష్మజీవులుంటాయి. వేళ్లు స్రవించే ఆమ్లం మట్టిలో 70 శాతం మేర ఉండే ఇసుక, రాళ్ల ముక్కలను కరిగిస్తుంది. కిలో ఇసుక, రాళ్ల ముక్కల్లో మొక్కలకు అవసరమైన 453 గ్రాముల పోషకాలుంటాయి. ► రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనం లేదా..? రసాయనిక ఎరువులో 16 శాతమే పంటకు ఉపకరిస్తుంది. అది కూడా తగుమాత్రంగా తేమ ఉంటేనే. దాని ప్రభావం వేసిన తర్వాత 4 రోజులే ఉంటుంది. రసాయనిక ఎరువులు నేలను విషపూరితం చేస్తాయి. గట్టిపరుస్తాయి. భూమిని గుల్లబరుస్తూ సారవంతం చేసే వానపాములు, సూక్ష్మజీవులు, చెద పురుగులు, చీమలను రసాయనిక ఎరువులు చంపేస్తాయి. గత 60 ఏళ్లుగా రసాయనిక ఎరువులు వేయడం వల్ల మన పొలాల్లో ఏటా ఎకరంలో 16 నుంచి 20 టన్నుల జీవన ద్రవ్యం జీవం కోల్పోయి గట్టిపడిపోతుంటుంది. గుల్లగా ఉండి పంటలకు పోషకాలు అందించే జీవన ద్రవ్యం నీటి తేమను పట్టి ఉంచే శక్తిని కోల్పోయి, రాయి మాదిరిగా మారిపోతుంది. రసాయనిక ఎరువుల వల్ల గట్టిపడిపోయిన పొలాన్ని అరకతో దున్నలేం. ట్రాక్టర్ పెట్టి దున్నాల్సి వస్తుంది. 4 టన్నుల బరువున్న ట్రాక్టర్ తిరిగితే పొలం మరింత గట్టిపడక ఏమవుతుంది? పంజాబ్ రైతులు 75 హెచ్.పి. ట్రాక్టర్ వాడేవాళ్లు. ఇప్పుడు 135 హెచ్.పి. ట్రాక్టర్ వాడుతున్నారు. పొలాల్లో మానులను కొట్టేశారు. భూమికి ఆచ్ఛాదన ఏమీ లేకుండా పోయింది. పంట నూర్చిన తర్వాత చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. గట్టిపడిపోయిన నేలకు నీడలేక, గాలి ఆడక, నీరు అందక నిస్సారమైపోతోంది. ► భూసారం అందుకే తగ్గిపోతోందా..? దక్కన్ పీఠభూమిలో 1960లో పొలాల్లో జీవన ద్రవ్యం 3 శాతం ఉండేది. హరిత విప్లవం ఫలితంగా గత 58 సంవత్సరాల రసాయనిక కృషి వల్ల మన భూముల్లో 3% ఉన్న సేంద్రియ కర్బనం ఇప్పుడు 0.3%కు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. పైన జానెడు మన్నులో ఎకరానికి 90 టన్నులు ఉండాల్సిన సేంద్రియ కర్బనం 3 టన్నులకు వచ్చిందంటే మనం భూమికి ఎంత ద్రోహం చేశామో, మనకెంత ద్రోహం చేసుకున్నామో తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో 0.27 శాతానికి తగ్గిపోయింది. వర్షానికి పొలంలో నుంచి ఎర్రనీళ్లు పారుతూ ఉంటాయి కదా. అదే భూమికి బలాన్నిచ్చే జీవన ద్రవ్యం. పూర్వీకులు పెంచిన పెద్ద చెట్లు కొట్టేయడం, రసాయనిక ఎరువులు వాడటం వల్ల సాగునీటి అవసరం పది రెట్లు పెరిగింది. భూమి గట్టిపడిపోవటం వల్ల వేర్లకు ప్రాణవాయువు కూడా అందటం లేదు. ► రైతు సోదరులకు ఇంకేమైనా చెప్తారా? జీవన శైలిని మార్చుకోవాలి. ఒకర్ని చూసి మరొకరు ఏదీ చేయకూడదు. ఇంకొకరి కోసం బతకకూడదు. మనకి తగినట్టుగానే మనం బతకాలి. ఎవరికీ భయపడకూడదు. సంగటి తింటామని చెప్పుకోవటం నామోషీ కాకూడదు. సంస్కృతి, సంప్రదాయక ఆహారం అంతరించిపోయాయి. ఈ రెంటినీ కాపాడుకుంటున్న జపాన్ వంటి దేశాలు ఎన్ని సునామీలొచ్చినా కూలిపోవు. ఉత్పాదక భూములు(ప్రొడక్టివ్ సాయిల్స్), ఉత్పాదక ప్రజలు (ప్రొడక్టివ్ పీపుల్) ఉన్న దేశమే బాగుంటుంది. కానీ, ఇప్పుడు మనుషులు వ్యాధిగ్రస్తులై పనిచేసే మనుషులు, శక్తివంతులుగా ఉండే మనుషులు ఎందరున్నారన్నది ప్రశ్న. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మొదట భూమి ఆరోగ్యం బాగుండాలి. సాయిల్ హెల్త్ బాగుంటే మంచి ఆహారం దొరుకుతుంది. ఆరోగ్యం దొరుకుతుంది. మన రాజకీయ నాయకులు అందరూ సేంద్రియ వ్యవసాయం గురించి ఆలోచించాలి. పెరిగిన జనాభాకు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహారం పండించగలమా అని అడుగుతూ ఉంటారు. నేను చెబుతున్నాను.. నిస్సందేహంగా పండించగలం. నేలతల్లిని మనం ప్రేమించి సేంద్రియ కర్బనం పెంచుకుంటే మనకు, ముందు తరాలకూ ఆరోగ్యం, ఆనందం, సంపద కూడా దొరుకుతుంది. ► రైతులు చేయాల్సిందేమిటి? నారాయణరెడ్డి: రైతులు చేయాల్సిన పనులు ఐదు ఉన్నాయి. 1. మల్చింగ్ : పొలానికి ఆచ్ఛాదన కల్పించాలి. ఇందుకోసం ఎకరానికి 25 చెట్లు.. 4,5 రకాలు పెంచుకోవాలి. చెట్లలో 20 శాతం మల్చింగ్ రొట్ట కోసం (సుబాబుల్, అవిశ, గిరిపుష్పం లేదా గ్లైరిసీడియా వంటి చెట్లు), 20 శాతం (జిల్లేడు, వయ్యారిభామ – దీని పువ్వు రాక ముందే కోసెయ్యాలి – కానుగ, వేప వంటి చెట్లు), 40 శాతం మెట్ట నేలల్లో పెరిగే (చింత, మామిడి, నేరేడు, సీతాఫలం, సపోట, పనస వంటివి) చెట్లు, మిగతా 20 శాతం (టేకు, మలబారు వేప వంటి) కలప చెట్లు పెంచాలి. 20 ఏళ్ల చెట్టు రోజుకు 40 లీటర్ల నీటి తేమను వాతావరణంలోకి వదులుతుంది. చెట్లు పొలంలో ఉండటం వల్ల సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. అత్యంత ఖరీదైన వ్యవసాయ ఉపకరణం సూర్యరశ్మి. పెద్ద చెట్లున్న ఎకరంలో సూర్యరశ్మిని, గాలిని 3 రెట్లు ఎక్కువగా వినియోగించుకోవచ్చు. 2. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా ఉండటం. 3.వర్మీ కంపోస్టు కొనకుండా స్వయంగా తయారు చేసుకొని వాడటం. 4. చెరువు మట్టి తోలుకోవటం. 5. పురుగుమందులకు బదులు ఆకుల కషాయాలు, పశువుల మూత్రం వాడటం. దేశవాళీ ఆవు విసర్జితాల్లో ఔషధ గుణాలున్నాయి. జెర్సీ ఆవైనా దాని తల్లి మన ఊళ్లో పుట్టినదై ఉంటే ఫర్వాలేదు. మన వేప గింజల ద్రావణానికి మించిన పురుగుమందు లేదు. రైతు అన్ని విధాలా స్వయం సమృద్ధి సాధిస్తేనే మనుగడ సాధ్యమని రుడాల్స్ స్టైనర్ వంటి వాళ్లు 90 ఏళ్ల క్రితమే చెప్పారు. డాక్టర్ లక్ష్మయ్య నారాయణరెడ్డి బడిలో చదివింది 4వ తరగతే అయినా, పొలాన్ని అనుదినం అధ్యయనం చేస్తున్న నిత్య విద్యార్థి. బయటి నుంచి ఏదీ కొనే పని లేకుండా వ్యవసాయం చేస్తూ బతికి బట్టకట్టడం ఎలాగో ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. ‘లీసా ఇండియా’ ఆంగ్ల మాసపత్రికలో రైతుగా తన అనుభవాలను ఆయన రాస్తుంటారు. హంపీ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. నలభయ్యేళ్లుగా సేద్యం చేస్తున్న ఆయన ముగ్గురు కుమారులూ రైతులే. ఆయన తన పొలంలో ‘పరాశర కృషి గురుకులం’ నడుపుతున్నారు. కాలేజీల్లో వ్యవసాయ శాస్త్రం చదివిన వాళ్ల ఆలోచనా విధానాల వల్లే దేశం గుల్లయ్యిందని, రాబోయే కాలం తనలాంటి రైతు శాస్త్రవేత్తలదేనని నారాయణరెడ్డి నిండైన ఆత్మవిశ్వాసంతో ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. ఆ సంభాషణ ముఖ్యాంశాలు.. -
ప్రకృతిసేద్య నిపుణుడు నారాయణరెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిద్రలోనే కన్నుమూశారు. మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సైతం ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. కాగా, ఆయన స్వస్థలం బెంగళూరు రూరల్ వర్తూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వర్తించారు. జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా నారాయణరెడ్డి ప్రసిద్ధి పొందారు. ఫుకువోకా భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు మరలేనహళ్లిలోని నారాయణరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. డాక్టర్ నారాయణరెడ్డి 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ పొలంలోని మట్టి 5 శాతం సేంద్రియ కర్బనంతో కూడి ఉండటం విశేషంగా చెబుతారు. దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి ఆయన వద్ద అనుభవపూర్వకంగా ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రికకు చాలా ఏళ్లుగా ఆయన కాలమిస్టు. వేలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించిన డా. నారాయణరెడ్డి మరణం తీరని లోటని పలువురు నివాళులర్పించారు. -
మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూత
రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నారాయణరెడ్డి (65) గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 10 రోజులుగా శ్వాసకోస, గుండెనొప్పి సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ఉదయం రెండు సార్లు గుండెపోటు రావడంతో నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి 1991లో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో సోదరుడి కుమారుడైన నారాయణరెడ్డి రాజకీయ వారసుడిగా వచ్చారు. ఆయన 1993 లో జరిగిన ఉప ఎన్నికల్లో, 1994 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో ఓటమి చెందారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన మండిపల్లి జయరామిరెడ్డి, మల్లమ్మల దంపతులకు 1955 జూలై 1న నారాయణరెడ్డి జన్మించారు. ఆయనకు కుమార్తె సద్గుణ, కుమారుడు రాహుల్‌రెడ్డి ఉన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె సమీపంలోని ఆయన స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు్ల కుటుంబీకులు తెలిపారు. -
‘పోతే అమెరికాకు.. లేదంటే సన్యాసమే’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి కేటీఆర్ వెళితే అమెరి కాకు వెళ్లాలని, లేదంటే ఆయన భాషలో సన్యాసం తీసుకోవాల్సిందేనని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానిం చారు. ఓటమి అంచున ఉన్నందునే అలాంటి మాట లు మాట్లాడుతున్నారని అన్నారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓడిపోతే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలే తప్ప సన్యాసం తీసుకుంటాననడం చినరాజు కేటీఆర్‌కు సరైంది కాదని తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటిం టికీ నీరు, ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన పెదరాజు కేసీఆర్ ఏం మొహం పెట్టుకుని ఇప్పుడు ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారన్నారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని, దీనిపై డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలు దృష్టి సారించాలని కోరారు. పార్టీ టికెట్ల కేటాయింపు కొందరికి భరించలేని బాధను మిగిల్చిందని, వారందరికీ భవిష్యత్‌లో తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు. డిసెంబర్ 12న కూటమి పక్షాన ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరుగుతుందని చెప్పారు. -
‘మోదీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్నమోదీ, కేంద్రంలోని పెద్దమోదీ లను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇద్దరు నియంతలు పాలిస్తున్నారని విమర్శించారు. వీరిని ఎప్పుడు ఓడించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణలో వచ్చే నిశ్శబ్ద విప్లవంలో 80–85 స్థానాలు గెలవడం ఖాయమని చెప్పారు. -
సుల్తాన్‌పూర్‌లో టీఆర్ఎస్ నేత దారుణ హత్య
-
టీఆర్ఎస్ నేత దారుణ హత్య
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. నారాయణ రెడ్డి వర్గానికి, గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. గతంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలపై కూడా పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థులే నారాయణ రెడ్డిని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణ రెడ్డి హత్యతో సుల్తాన్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులపై ఆయన వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. టీఆర్ఎస్ నేత నారాయణ రెడ్డి దారుణ హత్యతో సుల్తాన్పూర్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. -
తెలంగాణలో కూటమి గెలుపు ఖాయమైంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి విజయం ఖాయమైందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియంత పోకడలతో పాలన సాగించే ప్రభుత్వా ల గద్దె దింపడమే కాంగ్రెస్ సిద్ధాంతమని, ఈ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. గతంలో ఇతర పార్టీలతో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పెట్టుకున్న పొత్తుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఇప్పుడు ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు రాహుల్‌గాం« దీని కలిస్తే గుంటనక్క, ముసలినక్క అని మాట్లాడుతున్న కేసీఆర్ తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుం బాల సంక్షేమం కోసం రూ.5కోట్లు కూడా ఇవ్వని కేసీఆర్.. అమరావతికి రూ.100 కోట్లు ఇద్దామనుకున్నామని చెప్పడం ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడమేనన్నారు. త్వరలోనే టీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత కాంగ్రెస్‌లో చేరుతారని ఆయన ద్వారా 2, 3 జిల్లాల్లో టీఆర్ఎస్కు నష్టం వాటిల్లనుందని గూడూరు చెప్పారు. -
టీఆర్ఎస్కు పది సీట్లు కూడా రావు: పొన్నం
ప్రజల ఆకాంక్ష మేరకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. సోనియాను ‘అమ్మా.. బొమ్మా’అంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ దురుసుగా మాట్లాడుతూ తన నోటిదూలను ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, తమ పార్టీ దయతోనే కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతులను కేసీఆర్ నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. జగ్గారెడ్డిపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. హరీశ్‌పై కూడా కేసు పెట్టించేందుకు కేసీఆర్ ఓ మహిళను అమెరికాకు పం పించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో చేతులు కలిపి రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో విచారణ ఎదుర్కొనేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారని, ఇందుకు సీఎం సిద్ధమేనా? అని ప్రశ్నిం చారు. ఒకవైపు కొడుకు, మరోవైపు అల్లుడి పోరుపడలేకనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని వ్యాఖ్యానించారు. మైనారిటీలకు 14 అసెంబ్లీ సీట్లు: ఫక్రుద్దీన్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మైనారిటీలకు 14 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ స్పష్టం చేశారు. నిజాం క్లబ్లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి మైనారిటీ ముఖ్యుల సమవేశంలో ఈ మేరకు హామీ లభించిందన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మైనార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్, ఫారూఖీ ఖాద్రీ, అరిఫుద్దీన్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం కోసం సబ్ ప్లాన్ అమలుతో పాటు నామినేటెడ్ పదవుల్లో 20 శాతం కేటాయిస్తామని హమీ ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ.. ఇప్పటివరకు కనీసం 50% కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. మైనారిటీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో మైనారిటీలందరూ కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. సైన్యం పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు టీపీసీసీ కోశాధికారి గూడూరు ధ్వజం సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం భారతీయ సైన్యం, శౌర్య పరాక్రమాలపై చిల్లర రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. ‘పరాక్రమ్ పర్వ్’పేరుతో ప్రజల దృష్టిని కుంభకోణాలు, పాలన వైఫల్యాల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేకే సర్జికల్స్ స్ట్రయిక్స్ వార్షికోత్సవం పేరుతో ప్రధాని మోదీ అత్యంత చిల్లర రాజకీయాలకు దిగారని మండిపడ్డారు. 2011 ఆగస్టు 30న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సైతం సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 1971లో భారత సైన్యం పాకిస్తాన్‌ను ఓడించిందని, 95 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారతీయ సైన్యం ముందు లొంగిపోయారన్నారు. దేశ సైన్యం సాధించిన విజయాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు. రాజకీయ మనుగడ కోసం ప్రతి చిన్న విషయం నుంచి ప్రచార లబ్ధి పొందేందుకు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, బీఫ్ బ్యాన్, ట్రిపుల్ తలాక్ అంశాలు ఇందుకు ఉదాహరణ అని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ నారాయణరెడ్డి
-
‘దానం టీఆర్ఎస్లో ఉండరు’
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్‌ది పక్కా అవకాశవాద రాజకీయమని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు పవర్లో ఉన్న పార్టీల పట్ల మాత్రమే ప్రేమ ఉంటుందని మండిపడ్డారు. బీసీ నాయకుడుగా ఆయన ఎప్పుడూ వారి సమస్యలపై పోరాడలేదనీ, పదవులకోసమే రాజకీయాలు చేసేవారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్న దానం.. గతంలో మంత్రి పదవులెలా పొందారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పీజేఆర్, శశిధర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినా నాగేందర్‌కే మంత్రి పదవులు, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీలు మారడం దానంకు కొత్తకాదనీ.. టీఆర్ఎస్ ఓడినా, గెలిచినా ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరతారని నారాయణరెడ్డి జోస్యం చెప్పారు. ఏదేమైనా కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
వార్తా శీర్షికలలో చిరంజీవి సినారె
సి.నారాయణ రెడ్డి పాటలు తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. విద్యాలయాల్లో సారస్వత శాఖలు మూతపడి విద్యార్థులలో భాషాధ్యయనం తగ్గి, కవిత్వం రాసే వాళ్లు తగ్గుతున్న ఒక దశలో భాషాభిమానులు తెలుగు సాహిత్యం క్షీణదశకు చేరిందని ఆవేదన చెందుతున్న సమయంలో ‘కవిత్వం ఎక్కడికి పోతుంది? నిత్యనూతనంగా వర్థిల్లుతూనే ఉంటుంది. ప్రతి రోజూ దినపత్రికల వార్తా శీర్షికల్లో..’ అని సినారె వ్యాఖ్యానించారు. సామాన్య పదబంధాలతో అనన్య సామాన్య భావ సృష్టి చేయడం సినారెకే చెల్లింది. అందువల్లనే పత్రికల వార్తలకు ఆయన పాటలలోని పదాలు చక్కగా అమరేవి. ఎందరో పాత్రికేయులు.. ఎన్నో పత్రికల డెస్కులలో అర్ధరాత్రి వార్తలు, వార్తా కథనాలు ముందు పెట్టుకుని శీర్షికల కోసం తపన పడుతుంటే ముందుగా సినారెనే వారి తలపులోకొచ్చేవారు. ఇలా ఎందరో ఎన్నెన్నో వార్తలను సినారె గీతమాలికలతో అలంకరించారు. నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలపై ఆయన ఆవేదనగా రాసిన పాట పల్లవి ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) ఎన్ని మానవీయ కథనాలకు పత్రికలలో వాడుకున్నారో చెప్పలేం. మూడేళ్ల పాప బొద్దుగా.. ముద్దుగా ఉంది. ఓ తిరుణాలలో తప్పిపోయింది.. ఆ వార్తకు ఓ పాత్రికేయుడు ఇచ్చిన శీర్షిక.. ‘ఎవరో.. ఏవూరో.. ఎవరు కన్నారో..!’ అని ఆత్మబంధువు సినిమా కోసం సినారె రాసిన గీతం. అంతే.. ఆ వార్త చూసిన పాప తల్లిదండ్రులు ఆ పత్రిక కార్యాలయానికి ఉరికారు. పాప ఫొటో చిన్నగా వేయడం వల్ల చూడలేదని, పాటను శీర్షికగా చూసి ఆవార్త చది వామని వారు చెప్పడం విశేషం. అసలు కవిత్వం ఎంతమాత్రమూ సరిపడని సందర్భానికి కూడా సినారె గీతంలోని పదబంధాన్ని తగిలించి కాదేదీ కవిత కనర్హం అనిపించిన సందర్భం ఉంది. పోలీసులు కేసులు పెట్టి సీజ్ చేసిన కొన్ని వందల వాహనాల వల్ల తుప్పు పట్టి నాశనమవుతుంటే, ఓ విలేకరి రాసిన వార్తకు ‘కదలలేవు.. మెదలలేవు.. పెదవి విప్పి పలుకలేవు..’ అని సినారె అమరశిల్పి జక్కన చిత్రంలో రాసిన పాటలోని చరణాలు శీర్షికగా పెడితే పై అధికారులు స్పందించి, వెంటనే ఆ వాహనాలు వేలం వేసి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది. అలాగే, ఓ ప్రభుత్వ అధికారి ఉండేవారు. ఏ శాఖలో పనిచేస్తున్నా ఆయన మీద ఉద్యోగినులపట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలతో బదిలీ చేసేవారు. ఆయన్ని ఒకసారి ఉద్యానవన శాఖకు బదిలీ చేశారు. ఆ శాఖలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారట. దీనిపై అక్కడి సిబ్బంది ఆందోళన చెంది ఆయన మాకొద్దు.. వేరేవారిని వెయ్యండని పై అధికారులకు అర్జీ పెట్టుకున్నారట. దీన్ని పసిగట్టి ఇచ్చిన వార్తకు సినారె రాసిన పాట పల్లవి రామబాణంలా పనిచేసింది. ‘తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా..’ (బుద్ధిమంతుడు) ఆ పట్టణంలో వార్త వచ్చిన వారం రోజులదాకా పాఠకులు శీర్షికను తలుచుకుంటూనే ఉన్నారు. పై అధికారులు ఆ తుంటరి తుమ్మెదను తూనికలు, కొలతల శాఖకు పంపారు. సమాజంలో అధోగతిలో బతుకుతున్న వేశ్యల జీవితాలపై మానవుడు–దానవుడు సిని మాలో సినారె ఓ పాట రాశారు. ‘ఎవరో కాదు.. వీరెవరో కాదు.. మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు..’ చాలా శక్తివంతమైన ఈ పదబంధాలను వేశ్యవాటికల మీద, వారి హృదయవిదారకమైన జీవితాల మీద రాసిన వార్తా వ్యాసాలకు శీర్షికలుగా, ప్రవేశికలుగా ఆరోజుల్లో చాలా పత్రికలు వాడుకున్నాయి. సరిలేరు నీకెవ్వరూ పాట యువతలో సై్థర్యం నింపేది. సినారె చెప్పినట్లు మీడియా వార్తలలో కవిత్వమే కాదు ఆయన కూడా నిత్యనూతనంగా వెలుగొందే చిరంజీవి. (డాక్టర్ సి.నారాయణరెడ్డి తొలి వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో అచంట కళాంజలి సభ) అచంట సుదర్శనరావు, అధ్యక్షులు, అచంట కళాంజలి ‘ 90005 43331 -
అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
నారాయణ.. నారాయణ!
ఓ సీనియర్ అసిస్టెంట్ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.50కోట్లు. జీవితాంతం కష్టపడినా నాలుగు రాళ్లు మిగుల్చుకునేందుకు చిరుద్యోగుల ఎన్నో లెక్కలు వేసుకుంటారు. అలాంటిది.. కోట్లాది రూపాయలు కూడబెట్టిన నారాయణరెడ్డి ఇప్పుడు ఆ స్థాయి ఉద్యోగులతో పాటు జిల్లా అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారారు. అసలు ఎవరీయన? ఈ స్థాయికి ఎలా ఎదిగారు? మూలాల్లోకి వెళితే.. వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కదిరి: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఐసీడీఎస్ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతోంది. ధర్మవరం–బత్తలపల్లి మార్గమ««ధ్యంలోని వేల్పుమడుగు ఇతని స్వగ్రామం. పిల్లల పోషణలో భాగంగా 1980లో అనంతపురానికి మకాం మారింది. తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటూ సైకిల్‌పై ఇంటింటికీ వెళ్లి పాలమ్మేవాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో కాపురం ఉంటున్న అప్పటి ఐసీడీఎస్ పీడీ భగీరథమ్మ(ప్రముఖ రచయిత కొలకనూరి ఇనాక్ సతీమణి) ఇంటికీ పాలు పోస్తుండేవాడు. ఆ సందర్భంలో ‘మేడం.. ఇల్లు జరగటం కష్టంగా ఉంది. పిల్లలను బాగా చదివించాలని అనంతపురానికి చేరుకున్నా. సాయం చేయాలని ప్రతిరోజూ ప్రా«ధేయపడేవాడు. జాలిపడిన ఆమె.. ఐసీడీఎస్ శాఖకు అనుబంధంగా ఉన్న సేవాసదన్‌లో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఆ తర్వాత అటెండర్‌గా.. జూనియర్ అసిస్టెంట్‌గా.. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ ఇతను జిల్లా కేంద్రంలోని కొవూరునగర్, తపోవనం ప్రాంతాల్లో పాలనారాయణరెడ్డిగానే చిరపరిచుతులు. ఒకప్పుడు ఇక్కడే పాలమ్మేవాడు.. రూ.కోట్లు ఎలా సంపాదించాడని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు. ఆ ఫైల్‌ను మాయం చేశారట.. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసే టెండర్‌కు సంబంధించిన టెండర్ బాక్స్‌ను పై అధికారులకు తెలియకుండా నారాయణరెడ్డి గోల్మాల్ చేస్తున్నట్లు గ్రహించిన అప్పటి ఏజేసీ చెన్నకేశవరావు ఇతన్ని సస్పెండ్ చేశారు. విచారణ చేపట్టాలని అప్పట్లో ఆదేశించారు. ఆ బాధ్యతలను అప్పటి బీసీ కార్పొరేషన్ ఈడీ, ప్రస్తుత ఐసీడీఎస్ పీడీ అయిన వెంకటేశంకు ఆ ఫైల్‌ను అప్పగించండని అప్పటి పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. అయితే నారాయణరెడ్డి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫైల్ వెంకటేశంకు చేరకుండా జాగ్రత్త పడ్డారు. తనకున్న పలుకుబడితో మళ్లీ మూడు రోజుల్లోనే సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నట్లు తెలిసింది. అలాగే తనపై ఆ రోజు ఏజేసీ విచారణకు ఆదేశించిన ఫైల్‌నే మాయం చేశారనే చర్చ జరుగుతోంది. పెద్ద మోసగానివే! నారాయణరెడ్డి ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ పెద్ద మెసగానివే అని ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు అన్నట్లు తెలుస్తోంది. ఆ మాట ఎందుకన్నారంటే.. జీసెస్ నగర్లో ఓ దళిత మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని ఆమెకు సంబంధించిన రూ.22.50 లక్షల విలువ చేసే 3 సెంట్ల స్థలాన్ని కేవలం రూ.10 లక్షలు ఇచ్చి తన పేరిట రాయించుకున్నట్లు సమాచారం. అయితే అగ్రిమెంట్ పత్రాల్లో మాత్రం రూ.22.50 లక్షలని కనబర్చినట్లు తెలిసింది. కాకపాతే.. ఆ తర్వాత స్థలం విలువ కేవలం రూ.5 లక్షలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. అగ్రిమెంట్లో అలా.. రిజిస్ట్రేషన్‌లో ఇలా.. అంటూ పెద్ద మెసగానివే.. అని డీఎస్పీ అన్నట్లు విశ్వసనీయ సమాచారం. బెయిల్‌కు సన్నాహాలు ఏసీబీకి పట్టుబడిన నారాయణరెడ్డి అప్పుడే ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నారాయణరెడ్డి రూ.2.30 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చూపారని, ఇప్పటికే ఆయన ఆ డబ్బుకు లెక్కాచారాలు సిద్ధం చేసినట్లు సమాచారం. తాను అక్రమంగా సంపాదించలేదని, తనది సక్రమ సంపాదనేనని.. బెయిల్ మంజూరు చేయాలని శుక్రవారం ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరనున్నట్లు తెలిసింది. -
ఏసీబీ వలలో భారీ తిమింగలం
-
సీనియర్ అసిస్టెంట్ ఆస్తులు రూ.50 కోట్లు
అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమశాఖ పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధకశాఖ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో పలువురు సీఐలు ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేశారు. అనంతపురం జిల్లాతో పాటు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం రామచేర్ల గ్రామంలోనూ సోదాలు చేపట్టారు. దాడుల్లో దాదాపు రూ.50 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. విచారణ అనంతరం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు వెల్లడించారు. -
ఏసీబీ వలలో భారీ తిమింగలం
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో భారీ తిమింగలం పట్టుబడింది. మహిళా, శిశు సంక్షేమశాఖ పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.వెంకటనారాయణరెడ్డి అలియాస్ నారాయణరెడ్డి ఆస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తనిఖీల్లో బయటపడింది. దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఆస్తులుంటాయని గుర్తించారు. కిలోన్నర బంగారు ఆభరణాలు, అరకిలోకు పైగా వెండి వస్తువులు, ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం సెంట్రల్: పెనుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదు అందడంతో అనంతపురం ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో బుధవారం దాడులు నిర్వహించారు. అనంతపురంలోని కోవూరునగర్‌లో నారాయణరెడ్డి నివాసంలో డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నగరంలోనే మరో మూడు చోట్ల ఆయన ఆస్తులపై సోదాలు నిర్వహించారు. నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలోని నారాయణరెడ్డి మామ, మాజీ ఉపసర్పంచు పుట్లూరు రామకృష్ణారెడ్డి ఇంట్లోను, ధర్మవరంలోని నివాసంలోనూ సోదాలు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయం, స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం దామచెర్ల గ్రామంలోనూ మొత్తం ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. అటెండర్‌గా మొదలై.. మహిళా శిశు సంక్షేమశాఖలో నారాయణరెడ్డి తొలుత అటెండర్‌గా నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలోని శిశుగృహలో పనిచేశారు. అనంతరం కొన్నాళ్లకు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. కూడేరు, గుత్తి, కంబదూరు, అనంతపురం, కదిరిలోనూ పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ ప్రాజెక్టుకార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో దాదాపు 7 సంవత్సరాలు పైగా పనిచేశారు. కీలకమైన విభాగాలకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పౌష్టికాహారం పంపిణీ, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ బాధ్యతలు చూశారు. ఈ సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడింది. అనంతపురం జిల్లాతో పాటు స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల మండలం దామచెర్లలోనూ ఆస్తులు బయటపడ్డాయి. అనంతపురంలో మూడు భవంతులున్నాయి. ధర్మవరంలో ఓ రెండంతస్తుల భవనం ఉంది. వీటి విలువలో రూ.కోట్లలో ఉంటుంది. బుక్కరాయసముద్రం మండలంతోపాటు గార్లదిన్నె మండలం ఇల్లూరులో ఆయన పేరిట వ్యవసాయభూములు ఉన్నట్లు తేలింది. బ్యాంకుల్లో దాచినది కాకుండా కేవలం అనంతపురం, స్వగ్రామం దామచెర్లలో కలిపి కిలోన్నర బంగారు అభరణాలు బయటపడ్డాయి. నూతన మారుతీ ఎస్‌క్రాస్ కారు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, మరో రెండు ద్విచక్రవాహనాలు ఉన్నాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నట్లు అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఆస్తుల విలువ లెక్క కట్టాల్సి ఉందన్నారు. పూర్తిగా విచారించిన అనంతరం నారాయణరెడ్డిని కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరుస్తామని వివరించారు. ‘ఆ ఆస్తులన్నీ పూర్వం నుంచి సంక్రమించినవే’ తన తండ్రి, అత్తమామల నుంచి సంక్రమించిన ఆస్తులు ఇవి అని సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. పూర్వం నుంచి సంక్రమించిన ఆస్తుల కింద రెండు ఇళ్లు ఉన్నాయని, మరో ఇల్లు బ్యాంకు లోన్ తీసుకొని ఇటీవల నిర్మించుకున్నానని చెప్పారు. ఇవి తప్ప తనకు రూ. 50 కోట్ల ఆస్తులు ఎక్కడా లేవు. అన్ని ఆస్తులకూ ఆధారాలు, రికార్డులు ఉన్నాయన్నారు. ఇన్‌కం ట్యాక్సులు కూడా సక్రమంగా చెల్లిస్తున్నామని తెలిపారు. -
ఏసీబీ వలలో మరో తిమింగలం..
సాక్షి, అనంతపురం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి ఇంట్లో ఏసీబీ బుధవారం దాడులు జరిపింది. ఆయన మహిళా, సంక్షేమశాఖ పెనుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అవినీతి నిరోదకశాఖ జిల్లా ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో కొంతమంది సీఐలు ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించారు. నారాయణరెడ్డి ఆస్తులు, అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. జిల్లాతోపాటు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం రామచేర్ల గ్రామంలో కూడా సోదాలు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 50 కోట్లు విలువైన స్థిర, చరాస్తులను గుర్తించిట్లు అధికారులు వివరించారు. మహిళా, శిశుసంక్షేమశాఖలో నారాయణరెడ్డి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. అటెండర్ నుంచి పదోన్నతులపై సీనియర్ అసిస్టెంట్ స్థాయికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో కీలక విభాగాల సూపరింటెండెంట్‌గా దాదాపుగా ఎనిమిదేళ్ళపాటు పని చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు, పౌష్టికాహారానికి సంబంధించిన సెక్షన్ సూపరింటెండెంట్‌గా చేశారు. ఈ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో బుధవారం దాడులు జరిగాయి. అనంతపురంలోని కోవూర్‌నగర్‌లో ఆయన నివాసంలోనూ, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన గృహాల్లోనూ, బందువుల ఇళ్ళలో, నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలో అత్త, మామల ఇంటిలో, పాకాల మండలంఓని రామచేర్ల గ్రామంలోని తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిలో దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఈ దాడుల్లో కేజిన్నర బంగారు, భారీ మొత్తంలో వెండీ, వ్యవసాయ భూములకు సంబంధించిన విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విచారణ అనంతరం నిందితున్ని కస్టడీలోకి తీసుకొని కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. -
మనిషి రూపాలే ఆ అక్షరాలు
ఉర్దూతో విద్యాభ్యాసం మొదలైనా తెలుగు భాషాభిమాని అయ్యాడు నారాయణరెడ్డి. ఆయన కవిత్వంలో ఉర్దూ గజళ్లలోని మానవతావాద స్పర్శ ఉంది. అయితే ఆయన నిరాశను కాక ఆశావహ సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నించాడు. తెలుగు కవిత్వంలో వేమన, గురజాడ, జాçషువ, శ్రీశ్రీ, సినారె వీరంతా కవిత్వంగా పుట్టి, కవిత్వంగా జీవించారు. శరీరం మట్టిలో కలుస్తుంది. అక్షరం ఆకాశ నక్షత్రమై వెలుగొందుతుంది. అక్షరానికి మరణం లేదు.. కవికీ మరణం లేదు.. ఆకాశం నుంచి భూమికి కవితా వెలుగులు ప్రసరింపజేసినవాడు.. తెలంగాణ మాగాణం నుంచి ఆకాశాన నక్షత్రమై వెలుగొందినవాడు. భూమి పొరలు చీల్చి కవితా జలతరంగమై పొంగినవాడు. కవిత్వాన్ని మానవతా గానం చేసి ఆలపించినవాడు. మానవత్వాన్ని జీవితాచరణగా మలచినవాడు. నిరంతర కవితాధ్యయన సంపన్నుడు డాక్టర్ సి. నారాయణరెడ్డి. సుబంధుడు అన్నట్టు ‘ప్రత్యక్షర శ్లేషమయ ప్రబంధ–విన్యాçస వైదగ్ధ్య నిధి: కవీనామ్’. మాటే శ్లేషగా పలికినవాడు. పలుకు పలుకులో పలుకుబడినీ, శ్రుతినీ మేళ వించి కవిత్వమై భాసించినవాడు. మహాకవి, పరిశోధకుడు, మహోపాధ్యాయుడు, మహావక్త. ‘విశ్వనాథనాయకుడు’లో ఆయనే అన్నట్టు ‘గుండెపై కుంపటి రగుల్కొనగ పరుగెత్తి–పశ్చిమాంభోధి గర్భమున సూర్యు డుదూకె– తన ప్రతాపమ్ము వార్ధక్యదోషోపహత–మైపోయె బ్రతుకెందుకని ముఖము తప్పించె– చిర్రుబుర్రను అల్పచిత్తుల ముఖస్థితికి–ప్రతిబింబమటు లెర్రవడెను పడమటిదిక్కు–ఒక భ్రష్టచేతసుని వికృతోహలకు బాహ్య రూపమోయన్నట్టు వ్యాపించెను తమస్సు’. మహాకవి నారాయణరెడ్డి సూర్యుడినీ, చీకటినీ తన కవిత్వంలో లోతుగా అభివ్యక్తి చేశాడు. ఆ పలుకు మీద ఎన్ని ప్రభావాలో! ఇతివృత్తం ఏదైనా దానిని సుసంపన్నం చేయటం ఆయన కవితాశైలి. విశ్వనా«థనాయకుని కావ్యం తంజావూరు రాజుల చరిత్ర నుంచి తీసుకున్నారు. విశ్వనా«థనాయకుని తల్లిని సృష్టించారు. ఈ కావ్యాన్ని అతి ప్రసిద్ధమైన ఖండగతి, మిశ్రగతి, త్రిశ్రగతి ఛందస్సులో రాశారు. ఈ కావ్యం జగత్ ప్రసిద్ధి కావటానికి కారణం సినారె అధ్యయం చేసిన, బోధించిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, పాండురంగ మహత్మ్యం, విజయ విలాసం గ్రంథాల అధ్యయన స్పృహ ఇందులో ఉండడమే. సినారె శ్రీనాథుడిని ఒడిసి పట్టారు. ఆ కవిసార్వభౌముడి సీసపద్యంలో ఉన్న గమకాన్ని తెలుగు వచన ఛందంలోకి ప్రవహింపచేశారు. అటు కృష్ణశాస్త్రినీ, ఇటు శ్రీశ్రీనీ తనలో ఇముడ్చుకొని భిన్నంగా సొంత శైలిని అభ్యసించారు. ఆయనది శ్రీనాధుని జీవనశైలి. ఆత్మాభిమానం కూడా ఎక్కువ. మహాకవి జాషువ అంటే ప్రాణం. జాషువ ప్రభావమూ ఆయన జీవన శైలి మీద, కవిత్వం మీద ప్రగాఢంగా ఉంది. సంభాషణలలో ఆయనే చెప్పినట్టు పుట్టిన ఊరు హన్మాజీపేటలో జానపదులు పాడే జక్కుల కథల నుంచి, హరికథల నుంచి శ్రుతి నేర్చుకున్నారు. భూమి ఉన్న వారి కుటుంబంలో పుట్టినా అహంకారాన్ని వీడి దళితవాడల్లో సంచరించాడు. ఆయన కవిత తపఃఫలం కవిత్వాన్ని అలవోకగా రాసినట్టు అనిపించినా అది వచ్చేది మాత్రం తపస్సు నుంచే. భూమిని చూసినా, కొండను చూసినా, నదిని చూసినా సినారె పొంగిపోతాడు. మనిషిని చూస్తే విచ్చుకుంటాడు. జ్ఞానపీఠ్ పురస్కారాన్ని తీసుకువచ్చిన ‘విశ్వంభర’ గురించి ఇలా అన్నారాయన: ‘ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి! కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి! ఆదిమ దశ నుంచీ ఆధునిక దశ వరకూ మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు, క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు. ‘విశ్వంభర’ కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది. విశ్వంభరలో ఆయన మానవునిలో ఉండే అన్ని కోణాలను మనముందుకు తీసుకువచ్చాడు. మనిషి అంతర్మథనాన్ని గురించి మహత్తరంగా వర్ణించాడు. ప్రకృతినీ, మనిషినీ ఉజ్జ్వలంగా సమన్వయిం చాడు. కవిత్వానికి మానవతత్వం తోడైతే చిత్తదీప్తిని అభివ్యక్తి చేయగలిగిన మహత్తర గుణం ముందుకు వస్తుంది. మహా కవిత్వంలో ఉండే భావ గాంభీర్యం, రస ప్రతీతి లక్షణాలు విశ్వంభరలో కనిపిస్తాయి. అవి ఇలా సాగాయి: ‘అడుగు సాగుతున్నది అడుసులో నక్కిన ముళ్ళను తొక్కేస్తూ/ అడుగు సాగుతున్నది అడ్డగించిన మంచుబెడ్డలను కక్కిస్తూ/ కనిపిస్తున్నాయి అడుగు కంటికి మనుషుల తోళ్లు కప్పుకున్న తోడేళ్లు/ వినిపిస్తున్నాయి అడుగు చెవికి తునిగిపోతున్నా అరవలేని లేళ్లనోళ్లు. అడుగు గుండెలో ఉబికింది కడలిని ముంచేసే కన్నీరు/ అడుగు గొంతులో ఉరిమింది పిడుగులను మింగేసే హోరు’. ఈ కవిత్వం చదువుతుంటే చేమకూర వేంకటకవి ‘విజయ విలాసం’ చదివినట్టుంటుంది. రామరాజభూషణుడి వసుచరిత్రలా భాసిస్తుంది. కవి త్వంలో శ్రుతిబద్ధతే కాక అంతర్మ«థనం, వ్యక్తిత్వ ప్రకటన, ప్రకృతి అన్వయం మనకు కన్పిస్తాయి. ఉర్దూ ఉషస్సులో తెలుగు కవితా వాకిలికి సినారె జీవితంలో విద్యార్జన ఘట్టమూ అధ్యయనపూర్ణమైందే. చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత చాదర్‌ఘాట్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలోనే ఆయన (1948–49) ఇంటర్ పూర్తిచేశారు. నిజానికి ఉర్దూ భాష మనిషిని ఉన్నతునిగా మారుస్తుంది. సినారె కవిత్వంలోని సాంద్రతకూ, సూక్తుల అభివ్యక్తికీ కారణం ఉర్దూ కవిత్వమే. ఉర్దూ కవిత్వంలో ఆయనకున్న అభినివేశం మెుత్తం ఆయన కవిత్వంలో పరిమళిస్తుంది. కబీర్ అన్నట్టు ‘చక్కీ చలతీ దేఖ్ కర్దియా కబీరా రోయ్– దో పాటన్ కే బీచ్ మే సాబిత్ బచా న కోయ్’ (రెండు రాళ్ల మధ్య ధ్యానమంతా నలిగిపోతున్నది. ఏమీ మిగలలేదు. సుఖం, దుఃఖం, పుణ్యం, పాపం, పగలు, రాత్రి, వెలుతురు, చీకటి ఇవన్నీ కలగలసిన ప్రపంచం ద్వంద్వ జగత్తు. జనన మరణాలు సైతం రెండు. ఈ రెండింటి నడుమ చిక్కుకుని అమూల్యమైన జీవనకాలం మానవ జన్మ నష్ట పోయింది. లక్ష్యం సిద్ధంచలేదు– అని భావం. తిరుగుతున్న విసుర్రాయిని చూసి కబీర్ అలా అన్నాడు). ఉర్దూతో విద్యాభ్యాసం మొదలైనా తెలుగు భాషాభిమాని అయ్యాడు నారాయణరెడ్డి. ఆయన కవిత్వంలో ఉర్దూ గజళ్లలోని మానవతావాద స్పర్శ ఉంది. అయితే ఆయన నిరాశను కాక ఆశావహ సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నించాడు. ఉర్దూ కవిత్వం నుంచి ఆయన చీకటిని పారద్రోలి, వెలుగును చిమ్మే అభ్యుదయ పద్ధతిని స్వీకరించాడు. వామపక్ష భావాలున్న అభ్యుదయానికి బౌద్ధాన్ని సమన్వయించాడు. అయితే ఆయన విప్లవకారులు మరణించినప్పుడు కన్నీటి సంద్రమై కూడా రగిలాడు. ‘ఉదయం నిన్నురితీస్తారని తెలుసు, ఆ ఉదయాన్నే ఉరి తీస్తారని తెలుసు, కాంతి పచ్చినెత్తురులా గడ్డకట్టునని తెలుసు, కాలం క్షణకాలం స్తంభించిపోవునని తెలుసు. న్యాయాన్నే శవంలాగ విసిరేస్తారని తెలుసు, ధర్మాన్నే చితి లోపల తగలేస్తారని తెలుసు. నీ నాదం జలధరాల నిండిపోవునని తెలుసు, నీ క్రోధం సాగరాల పొంగి పొరలునని తెలుసు. నీ చూపులు జ్యోతులుగా నీ శ్వాసలు ఝంఝలుగా, నీ స్మృతి జనసంస్కృతిగా నిలిచిపోవునని తెలుసు.’ అన్నారాయన. ఆయన రచనల్లో ‘మనిషి , మట్టి, ఆకాశం’ విశిష్టమైన కావ్యం. ఆయనది జీవన మథనం. ఆయన మనిషిని లోతుగా చూశాడు. మనిషిలోని వైరుధ్యాలను కవితాత్మకం చేశాడు. మనిషిలో ఉండే చీకటిని పారద్రోలి, మనిషిలో ఉన్న క్రాంతి నదులకు ఆనకట్టలు కట్టాడు. ఆయన నిత్యనూతనం. నిరంతర అక్షర సృష్టి ఆయనది. ఆయన పాటల్లోని కవిత్వం తెలుగు సినిమాలకు నూత్న శోభనిచ్చింది. మానవతా సందేశాన్ని, ప్రబోధ చైతన్యాన్ని, కుటుంబ నీతిని, స్త్రీ అభ్యుదయాన్ని, ఆత్మీయ బంధాన్ని అందించింది. మనిషిని నమ్మినవాడు సినారె జీవితంలో స్నేహభావం మెండు. బుద్ధుడు చెప్పిన ప్రేమ, కరుణ, ప్రజ్ఞలు ఆయన జీవిత గమనంలో కనిపిస్తాయి. ఆయన మనిషిని నమ్మాడు. మనిషే ఆయన కవిత్వానికి గీటురాయి. గురజాడ ప్రభావం ఆయన మీద బలంగా ఉంది. రాయప్రోలు సుబ్బారావు ప్రభావమూ ఉంది. ఆయన తెలుగు కవే అయినా సంస్కృత భాషా పదాలను కవిత్వంలో విరివిగా వాడారు. కొత్త తెలుగు పదబంధాలను సృష్టించారు. ‘మనిషి, మట్టి, ఆకాశం’లో ఆయన ఇలా అన్నాడు. ‘మడిచి చూస్తే మనిషి మెదడు పిడికెడు, తరిచి చూస్తే సముద్రమంత అగాధం ఆకాశమంత అనూహ్యం. ఎన్ని సజీవ భావధారలను తనలో కలుపుకుంటుందో ఎన్ని ప్రాణాం తక ప్రవృత్తుల తిమింగలాలను తన అడుగు పొరల్లో భద్రంగా దాచుకుంటుందో. పరవశించిందా అంతరిక్ష ఫాలంలో కొత్త నక్షత్రమై మెరుస్తుంది. కసి పుట్టిందా చీకటి పుట్టలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తుల్లో విషం నింపుకుని వస్తుంది. సృష్టి ఎత్తునూ లోతునూ కొలిచే మానదండం మానవ మస్తిష్కం. మస్తిష్కమంటే ఒత్తితే సొనకారే గుజ్జు పదార్థం కాదు. అమూర్తంగా ప్రభవించే అద్భుతాలోచనల ప్రసూతి నిలయం’’. ఆయన అవార్డుల కంటే ఆయనే ఉన్నతుడు సినారె గారితో నాది 30 ఏళ్ళ సాహితీ బంధం. ఆయనకంటే 22 సంవత్సరాలు చిన్నవాడిని. అయినా అటువంటి తేడాలు ఎప్పుడూ చూపించలేదు. ఆయనకు కవిత్వమంటే ప్రాణం. కవిత్వం వినటమే ద్యానం. కవిత్వం చదవడమే గానం. అందుకే ఆయనకు కవితా మిత్రులే ఎక్కువ. సంభాషణలో ఎన్నో జీవన గా«థలు వర్ణిస్తారు. జీవనసూత్రాలు చెబుతారు. నా కవితా సంకలనాలు పది ఆయనే ఆవిష్కరించారు. నాకు ఆయన పేరున ఉన్న పురస్కారాలు వచ్చాయి. ఆయన పొందిన పదవులు, అవార్డుల కంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. డాక్టర్ నారాయణరెడ్డి జీవనశైలి ఆయన గుండెల్లో ఉండే భావోద్వేగాలను వ్యక్తావ్యక్తంగా ఉంచుతుంది. ఆయన ఉపన్యాసం సంగీత ధుని. ఆయన పాఠం గజల్ గానం. ఆయన ఎదుట మనిషిని నొప్పించడు. చెప్పదలచుకున్నది మాత్రం చతురంగా చెబుతారు. ప్రవక్త, తత్వవేత్త మరణిస్తే తిరిగి లేస్తారు. కవికైతే మరణమే రాదు. తెలుగు కవిత్వంలో వేమన, గురజాడ, జాçషువ, శ్రీశ్రీ, సినారె వీరంతా కవిత్వంగా పుట్టి కవిత్వంగా జీవిం చారు. శరీరం మట్టిలో కలుస్తుంది. అక్షరం ఆకాశ నక్షత్రమై వెలుగొందుతుంది. అక్షరానికి మరణం లేదు.. కవికీ మరణం లేదు.. వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత డా.కత్తి పద్మారావు మొబైల్ : 98497 41695 -
విశ్వవీణపై మన పాట
రెండో మాట ‘‘విశ్వంభర’’ ద్వారా కావ్య నాయకుణ్ణి మానవుణ్ణి చేసి, కథకు నేపథ్యంగా ప్రకృతిని ఉపాసించి వాటి పుట్టుపూర్వాలనూ, అభ్యుదయ పరంపరనూ కీర్తిస్తాడు. ‘సృష్టికి జీవహేతువేదో, ప్రకృతి పురుషులకు మూలధాతువేదో’ చెబుతాడు. మానవుని ఉషోదయానికి ముందు ప్రకృతి పురుటినొప్పులను పరవశించి వర్ణించాడు. కావ్యసాధనకూ, కార్యసాధనకూ పొట్టి మాటలలోనే గట్టి భావాలూ, చిట్టిపాదాలలోనే దిట్టతనమూ వ్యక్తం చేస్తాడు. సినారె శిరస్సున కవి, మనస్సున కవి. కనుకనే వ్యక్తిత్వం, సహృదయత అతని రచనలకు ఆయుధాలు. అతడొక ‘పద్మశ్రీ’, కళాప్రపూర్ణ, మధురకవి, ఈనాటి ‘జ్ఞానపీఠ్’ పురస్కార పురుషుడు. అతడే డాక్టర్ సి. నారాయణరెడ్డి. ఒకనాడు రాక్షసుణ్ణి పట్టుకున్నవాడికి ‘‘లక్ష రూపాయల బహుమతి’’ని ప్రకటించిన పత్రికావార్త ఆధారంగా ప్రచలితుడై అందుకు వేట ప్రారంభించిన వాడు ‘సినారె’. మంచి–చెడుల పూర్ణకుంభమైన మానవునిలోని సగం రాక్షసాంశ, సగం మానవాంశను గురించి, అతడి అంతరంగంలోకి చొరబడి, రాక్షసుడెక్కడి వాడోకాడు, నీలో నాలో ఉన్నాడని చాటాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు భగవద్గీతనూ, భర్తృహరినీ అదే పనిగా పదే పదే వల్లిస్తుండే, తిరగేస్తుండే ఈ పయోముఖ విషకుంభం ‘‘దండలు వేయించుకుంటూ’’, దండోరా వాయించుకుంటూ, గుహల్లో తానై, గ్రూపు ఫొటోలో తానై, సభల్లో తానై, సంతల్లో తానై, ప్రదర్శనశాలల్లో తానై, పానశాలలోనూ తానై చరించే ఈ మానవుడెవడు? పై లక్షణాలున్న రాక్షసుణ్ణి ‘సినారె’ పసికట్టాడు: ‘‘ప్రతి ఇద్దరిలో ఒక రాక్షసుడు/ ప్రతి ఒక్కరిలో ఒక రాక్షసుడు/ అంతరంగంలోకి తొంగిచూడగా అక్కడా ఒక రాక్షసుడు!’’అయితే ఈ పరిశోధనను జైత్రయాత్రగా సాగించిన నారాయణరెడ్డి అపరాధ పరిశోధనకై ప్రకటించిన ‘‘లక్ష రూపాయల బహుమతి’’ తనకు చిక్కనందుకు చింతించనక్కరలేదు! తన స్వరూపం తెలిసినందుకు (మానవుని అంతరంగం) సంతృప్తిగా నాడు నిట్టూర్చినందుకు ప్రతిఫలంగా, మానవునిలో రాక్షసాంశ పోనూ మిగిలిన మానవాంశకు గుర్తింపుగా, మానవతా విలువలకు నివాళిగా జావళీ పట్టిన ‘‘జ్ఞానపీఠ్’’లక్షన్నర రూపాయల అవార్డూ ప్రతిభా పురస్కార పరిహారంగా భావించుకోవచ్చు! నాడూ, నేడూ కూడా లోకవృత్తానికి కేంద్రబిందువైన ప్రకృతినీ–మానవుణ్ణీ తన చైతన్య కవితారథానికి రెండు చక్రాలుగా మలచుకున్నవాడు సినారె. ఈ లోకం మానవ ద్వేషికీ, సమున్నత శిఖరాలను అధిరోహించగోరే మానవతా ఉన్మేషికీ భిన్న రూపాలలో దర్శనమిస్తుంది. ఆ విశ్వదర్శనంలో భాగంగానే విశ్వనాథ, రాయప్రోలు, మధునాపంతుల, శ్రీశ్రీ, బైరాగి, రావిశాస్త్రి, బీనాదేవి అమోఘమైన రచనలు చేశారు. అయినా గత పందొమ్మిదేళ్లలో ‘విశ్వనాథ’కు తప్ప మిగతా వారెవరినీ ‘జ్ఞానపీఠం’ పురస్కరించి తన ప్రతిష్టను నిలబెట్టుకోలేక పోయింది. పందొమ్మిదేళ్ల తరువాత మరొక తెలుగువాడికి (సినారెకు) ఈ పురస్కారం లభించినందుకు సంతోషించనివాడుండడు. అయితే అవార్డు ప్రకటనానంతరం సినారె హుందాగా, నిగర్వంగా చెప్పినట్టు ‘‘ఆంధ్రదేశంలో అర్హతగల ప్రతిభావంతులైన కవులూ, రచయితలూ కనీసం పదిమంది ఉన్నారు. వారిలో తానొకణ్ణ’’ని బెర్నార్డ్షాలా దిలాసాగా ప్రకటించాడు, అయితే ‘‘వారిలో ఎవరికి ఈ అవార్డు వచ్చినా నేను సంతోషించేవాణ్ణే’’నని చాటారు! ఎందుకంటే, నిజానికి ఒక ‘‘ఆంధ్రపురాణం’’, ఒక ‘‘మహా ప్రస్థానం’’అవార్డులకు మించిన అనంత ప్రతిభా సంపన్నాలు, అఖండ కీర్తిమంతాలు. అవి, సినారె ‘‘మంటలూ–మానవుడూ’’, ‘‘విశ్వంభర’’కావ్యాలకు ముందు విశ్వజనీన సత్యాలను విశాల ప్రపంచానికి పంచిపెట్టిన నవనీతాలు. ఈ విశ్వం పుట్టుకకూ సినారె ‘‘విశ్వంభర’’ కావ్యజనానికీ పూర్వరంగం ఒక్కటే. ‘బిగ్ బ్యాంగ్’ తర్వాత ఈ భూమండలం ఏర్పడినప్పుడు పుట్టిన మంటలు కాలక్రమంలో చల్లారాయిగానీ మనిషిలోని ఆవేదన చల్లారలేదని సినారె ‘‘మంటలూ–మానవుడూ’’ కవితా ఖండికలలో చెప్పాడు: ‘‘మార్కం డేయుని లాంటి/ మారుతిలాంటి/ మహోజ్వల భావి చిరంజీవి మానవుడు చల్లారలేదు’’ అన్న కవి ‘‘విశ్వంభర’’ ద్వారా కావ్య నాయకుణ్ణి మానవుణ్ణి చేసి, కథకు నేపథ్యంగా ప్రకృతిని ఉపాసించి వాటి పుట్టుపూర్వాలనూ, అభ్యుదయ పరంపరనూ కీర్తిస్తాడు. ‘‘సృష్టికి జీవహేతువేదో, ప్రకృతి పురుషులకు మూలధాతువేదో’’ చెబుతాడు. మానవుని ఉషోదయానికి ముందు ప్రకృతి పురుటినొప్పులను పరవశించి వర్ణించాడు. కావ్యసాధనకూ, కార్యసాధనకూ పొట్టి మాటలలోనే గట్టి భావాలూ, చిట్టిపాదాలలోనే దిట్టతనమూ వ్యక్తం చేస్తాడు. సినారె శిరస్సున కవి, మనస్సున కవి. కనుకనే వ్యక్తిత్వం, సహృదయత అతని రచనలకు ఆయుధాలు. అతని దృష్టిలో, సాహిత్య సృష్టిలో ఉపమాలంకారం లేనిదే మానవుని ఉనికే ఉబుసుపోనిది (ఉపమా సినారెస్య). ఉక్తిలోనూ, వక్రోక్తిలోనూ అందెవేసిన చెయ్యి. కనుకనే ‘‘విశ్వంభర’’లో ప్రకృతిలో అంతర్లీనమైన మానవుని జీవనాదం వినిపించాడు. ఆత్మర క్షణకు నేర్చుకున్న ఆది పాఠాలు చెప్పాడు. మనిషిలో, మనస్సులో ఒక ప్రభాతం వెలసి మౌనాన్ని చీల్చుకుపోతున్నప్పుడు ఆ నాదం సర్వసంగమానికి నాంది ఎలా అయిందో వినిపిస్తాడు. ‘‘విశ్వంభర’’ రెండో అధ్యాయం ఒక రసవత్ గుళిక. పదపదంలో పరిమళం, భావనలో సమభావనలో మంగళం. నిజానికి పరిమళ బిరుదులు కుమారగిరికే (వసంతరాయలు, ‘కర్పూర వసంతరాయలు’) కాదు, సినారెకూ వర్తిస్తాయి– సంస్కృతంలో పరిమళ కాళిదాసుల్లో, తెలుగులో ఘంట సింగయలాంటి మలయమారుత కవుల్లా! ఎందుకంటే ఉపమాలంకార ప్రియుడైన సినారె ‘‘పొడుపుకొండ మీద/శిరస్సు జెండా ఎత్తి/ అడుగేసిన ఉదయా’’న్నీ, ‘‘పడమటి ఉరికంబం మీద వెలుతురు తలను వేలాడదీసిన అస్తమయా’’న్నీ ఒకటిగా భావించినప్పుడు ‘‘ఉర్రూతలూగెడు ఉదయాస్తగిరులతో ఆకాశలక్ష్మి కోలాటమాడె’’నన్న నాచన సోముడు చటుక్కున గుర్తుకొస్తాడు. పద్య కవిత కంటే, వచన కవిత ఎంత కష్టమో సినారె ప్రయోగాలూ, కుందుర్తి శ్రమా స్పష్టం చేస్తాయి. మాత్రా ఛందస్సులో తొలి మజిలీ ‘‘నాగార్జున సాగరం’’ కాగా, ‘‘కర్పూర వసంతరాయలు’’ మలి మజిలీ కాగా, ‘‘మంటలూ–మానవుడూ’’ వచన కవితా ఖండికలు. ‘విశ్వంభర’ వచన కవితలో సమగ్ర కావ్యం. మాత్రా ఛందస్సులో కూడా డి.హెచ్. లారెన్స్ ("Mountain Lion") లాగా ఛందోమాత్రలుæ మార్చడమే కాదు, గతులను కూడా అందంగా మార్చుతాడు. సెలఏళ్లూ జలపాతాలూ కావ్యాత్మను ఊగించి శాసిస్తాయి. హెర్మన్ మెల్విల్లీ ‘‘మాబీడిక్’’ను నవల అయినా కావ్యంగా భావించారు; వాల్ట్ విట్మన్ ‘‘లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ వచన కవిత అయినా ఒక సమగ్ర కావ్యంగా తలంచారు. ఆ మాటకొస్తే, కాల్పనిక కవులైన బైరన్ సుదీర్ఘ కవిత రాయగా, టెన్నిసన్ వచన కవితలో ఒక నవలే (‘‘ది ప్రిన్సెస్’’) రాసిపడేశాడు. కథాకావ్యం నడిపిన మాస్ ఫీల్డు కూడా అంతే. విల్ఫ్రెడ్ ఓవెన్ మాదిరిగా (The poetry is in the Pity) కరుణ, శృంగారాలకు, ధీరత్వానికీ సమపాళ్లలో సినారె జ్ఞానపీఠాలు అమర్చాడు. మానవుణ్ని ఉద్దేశించి, ‘‘మిత్రమా! నీ రాకతో/ ధాత్రి నవచైతన్య గాత్రి/ఆప్తుడా! నీ రేఖతో ప్రకృతి రూపెత్తిన ద్యుతి’’ అని సినారె అన్నప్పుడు– డబ్లు్య.బి.యేట్స్ కవి ("Easter 1916") చరణాలు గుర్తుకు వచ్చి తీరుతాయి: "All chan-ged, changed utterly/ A terrible beauty is born" అంతేగాదు, సాహసానికీ, సాలోచనా పూర్వకమైన జ్ఞానానికీ మధ్య సరిహద్దులను నిర్ణయించడంలో ఓవెన్ కవికీ, సినారెకూ పోలికలు కన్పిస్తాయి. "Courage was mine, and I had Mystery Wisdom was mine, and I had Mastery"అని ఓవెన్ అంటే ఇక్కడ సినారె ‘‘సత్యమంటే నగ్నమైందని/తాండవ నృత్యం కంటే ఉద్విగ్నమైందని/ఇన్నాళ్లు అనుకునేవాణ్ణి/ సత్యానికీ అందముందని/ చట్రాయిలోనూ హృదయ స్పందనముంద’’నీ చాటాడు. ఎందుకని? దురంత పద్మవ్యూహాల వల్ల కానిది రవంత అనురాగం వల్ల అవుతుందన్నది సినారె విశ్వా సం. అతను శ్రమజీవి చెమట బిందువులో ఆణిముత్యాలను మాత్రమేగాక, అగ్నిగోళాలను కూడా ఏకకాలంలో చూడగలిగిన కవి. మానవుణ్ణి చేతనామూర్తిగా మలచి, కొలిచిన కవి వాగర్ధమూర్తి. ఆ ‘‘వెలుగు ఆవులించే కాలానికి వెన్ను చరువు/ఆ అడుగు ఆగిపోయిన మార్గానికి మరో మలుపు’’. అందుకే సినారె కూడా అభ్యుదయ మార్గాన్ని సునిశితం చేయడానికి మందు మాత్రం గానైనా వాడిన మంటల మానవుడూ, విశ్వంభరా జ్ఞానపీఠమూ సినారె. సెప్టెంబర్ 19, 1989 (‘ఏబీకే సంపాదకీయాలు’ నుంచి) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సినారేకి సినీ ప్రముఖుల నివాళి
నారాయణరెడ్డిగారు చనిపోయారని విని, షాక్ అయ్యా. నా భర్త రమణారావుగారు, నారాయణరెడ్డిగారు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్స్, కొలీగ్స్. ఒక విధంగా ఆయనతో మాకు దగ్గరి అనుబంధం ఉంది. కవులలో తెలంగాణలో ఉత్తమోత్తమమైన కవి. మహా జ్ఞాని కూడా. నారాయణరెడ్డిగారి ‘కర్పూర వసంత రాయలు’ ఆయన కవితా ధోరణికి గొప్ప నిదర్శనం. ఆయన తొలి చిత్రం ‘గులేబకావళి కథ’లో నేనే హీరోయిన్ కావడం నాకు ఒక మధుర జ్ఞాపకం. సినారేగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు చిరంజీవులు. – జమున, నటి దాసరిగారు దూరమై ఎన్నో రోజులు కాలేదు. ఇప్పుడు నారాయణరెడ్డిగారు. చాలా బాధగా ఉంది. నా హిట్ సాంగ్స్‌లో సినారేగారు రాసిన ‘వస్తాడు నా రాజు ఈరోజు..’ ఒకటి. అప్పట్లో నేను ఎక్కడికెళ్లినా ‘అల్లూరి సీతారామరాజు’లోని ఈ పాట గురించే చాలామంది మాట్లాడేవాళ్లు. నాకూ ఇష్టమైన పాట. నాకోసమే రాసినట్లుగా ఉంటుంది. విశేషం ఏంటంటే.. ఈ ప్రేమ పాట ఎంత అద్భుతంగా రాశారో.. అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలిపే ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి..’ (‘బంగారు గాజులు’) పాటను కూడా అంతే అద్భుతంగా రాశారు. అలాగే, ‘కురుక్షేత్రం’లోని ‘మ్రోగింది కల్యాణ వీణ...’ పాట కూడా రాశారు. నేను డైరెక్షన్ చేసిన సినిమాలక్కూడా సినారేగారు పాటలు రాశారు. పాట సందర్భం గురించి వివరించినప్పుడు ఎంతో ఓపికగా వినేవారు. త్వరగా రాసిచ్చేవారు. గొప్ప రచయితను కోల్పోయాం. – విజయనిర్మల, నటి–దర్శకురాలు నాకేం చెప్పాలో తెలియడం లేదు. నారాయణరెడ్డిగారు లేరంటే ఒక అధ్యాయం ముగిసినట్టే. చరిత్ర ఉన్నంత కాలం ఆయన పాటలు, రచనలు ఉంటాయి. అటువంటి మహా కవి లేకపోవడం అనేది చిత్రపరిశ్రమకే కాదు.. తెలుగు జాతికే లోటు. ఆయనతో నాది 30 ఏళ్ల అనుబంధం. ‘కృష్ణవేణి’ సినిమాలో ‘కృష్ణవేణి...’ పాట రాయడానికి ముప్ఫై నలభై పుస్తకాలు తెప్పించి, రెండు నెలలు అధ్యయనం చేసి పాట రాశారు. ‘మన ఊరి పాండవులు’కి గంటన్నరలో ఓ పాట రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహా భాగవతం అంత చరిత్ర ఉంది. ఆయనలా రచనలు చేసి, చరిత్ర సృష్టించే వారు రావాలని కోరుకుంటున్నా. – కృష్ణంరాజు, నటుడు మా గురువుగారి (దాసరి) దర్శకత్వంలో చేసిన ‘స్వర్గం–నరకం’ టైమ్‌లో సినారేగారితో నాకు పరిచయమైంది. నాకు మొదటిసారి ఆయన పాట రాసింది అందులోనే. తర్వాత మా సంస్థలో నిర్మించిన ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఆయన రచించి, పాడిన ‘కర్పూర వసంత రాయగన్’ను సినిమాగా తీయమని నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఓ గొప్ప కవి, రచయితను మనం కోల్పోయాం. మళ్లీ ఈతరంలో ఇటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారేమో నాకు తెలీదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. – మోహన్‌బాబు, నటుడు సాహిత్య లోకంలో ఒక కురువృద్ధుడు సినారేగారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నా మనసు కలచివేస్తోంది. చెన్నైలో (1980) ఉన్నప్పట్నుంచి ఆయనతో నాకు సత్సంబంధాలున్నాయి. నేనెప్పుడు కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. నా సినిమాలకు ఎన్నో పాటలు రాశారు. అలాంటి నారాయణరెడ్డిగారు లేరు అనడమనేది వ్యక్తిగతంగా నాలాంటివాళ్లకు, సాహిత్య లోకానికి, సినిమా లోకానికి తీరని లోటు. ఈ వార్త అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ తీర్చలేనటువంటి, పూడ్చలేనటువంటి లోటు ఇది. – చిరంజీవి, నటుడు తెలుగు భాషకు సినారేగారు చేసిన సేవలు చిరస్మరణీయం. మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్‌గారి ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన, నాన్నగారి ద్వారానే సాంస్కృతికంగా పలు శాఖలకు సారథ్యం వహించి తెలుగు భాషకు పలు సేవలందించారు. పండితుల నుంచి పామరుల వరకు అందర్నీ ఏకకాలంలో మెప్పించగలిగే సాహిత్యాన్ని అందించి, తెలుగు సినిమా పాట గౌరవాన్ని ఇనుమడింపజేశారు. నా సినిమాల్లో ఆయన ఎన్నో పాటలు రాశారు. పోర్చుగల్‌లో ఉన్న నాకు ఆయన కన్నుమూశారని తెలిసింది. తీరని బాధ కలిగింది. సాహితీ లోకానికి సినారేగారు లేని లోటు తీర్చలేనిది. – నందమూరి బాలకృష్ణ, నటుడు మా నాన్నగారి (రామానాయుడు)కి సినారేగారు సన్నిహితులు. మా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో పలు చిత్రాలకు పని చేశారాయన. వెరీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మరణం మాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. – వెంకటేశ్, నటుడు ‘‘తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత సినారేగారి మరణం తెలుగుజాతికే కాక యావత్ సాహితీ లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహానుభావుని స్థానం భర్తీ చేయలేనిది. పురస్కారాలు, పదవులు ఆయనలో వినమ్రతను మరింత పెంచాయి. తండ్రి వ్యవసాయం చేస్తే, సినారేగారు సాహితీ వ్యవసాయం చేసి, తెలుగు వారికి సాహిత్య ఫలాలను అందించారు. ఇంతటి సాహితీ స్రష్ట మరణించారని తెలిసి ఆవేదన చెందాను. భౌతికంగా సినారేగారు మన మధ్య లేకపోయినా ఆయన వెదజల్లిన సాహిత్య సౌరభాలు చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి. – పవన్‌కల్యాణ్, నటుడు నాకు అక్షర భిక్ష పెట్టిన మహానుభావుడు నారాయణరెడ్డిగారు. నేను కంఠం విప్పిన తర్వాత అందరి దృష్టిలో పడటానికి ఆయన పాటలే ఎక్కువ కారణం. ఘంటసాలగారి తర్వాత సినారేగారి పాటలు ఎక్కువగా పాడింది నేనే అనుకుంటున్నా. ఆయన మనసు ఎంత లలితమైనదో, ఆయన మరణం కూడా అంత అనాయాసంగా జరిగింది. ఇటువంటి సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడలేను. అక్షరాన్ని ప్రేమించే వారందరూ ఆయన్ని ప్రేమిస్తారు. – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు సినారేగారి గురించి మాట్లాడాలంటే నాలాంటి వాళ్లకు వారం పడుతుంది. గొప్ప మానవతావాది. ఆయన పొందనటువంటి బిరుదులు, సత్కారాలు లేవంటే నేను నమ్మను. తెలుగు సినీ రంగానికి ఇలాంటి మహానుభావుల నిష్క్రమణ చాలా నష్టం. అది ఇప్పుడున్న జనరేషన్ వారందరికీ తెలుసు. ఆయన అన్ని రకాల పాటలు రాశారు. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చేది ‘మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా’. ఆయనలాంటి వారి గురించి చెప్పడానికి నాలాంటి వాడు సరిపోడు. – కోట శ్రీనివాసరావు, నటుడు తెలుగు చిత్రపరిశ్రమ, సాహిత్య పరిశ్రమను కుదిపేసినటువంటి వార్త ఇది. పద్మభూషణ్, జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత, చివరి వరకూ తన శ్వాసను సాహిత్యానికి అంకితం చేసిన సినారే మనవాడు, మన తెలుగువాడు అని చెప్పుకోవడం మనకెంతో గర్వకారణం. అలాంటి మహనీయుణ్ణి కోల్పోవడం మన దురదృష్టం. నేను నటుడు కాకముందు, చిత్రసీమకు రాక ముందు, మిమిక్రీ చేస్తున్న రోజుల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. నన్ను ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు. – బ్రహ్మానందం, హాస్యనటుడు సినారేగారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు సాహిత్యానికి మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యానికి తీరని లోటు. ఓ ధ్రువతార రాలిపోయింది. నవరసాలను చక్కటి సాహిత్యంతో మేళవించి గొప్ప పాటలు రాసిన మహనీయుడు. ఆయన గొప్పతనం అది. తన పాటల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పారు. నేను చేసిన ‘స్వతంత్ర భారతం, లాల్ సలామ్’ సినిమాలకు ఆయనతో పాటలు రాయించుకున్నా. – ఆర్. నారాయణమూర్తి, దర్శకనిర్మాత–నటుడు–రచయిత తెలుగు సాహితీ వనంలో సినారే ఓ వటవృక్షం. ఆయన మరణం సినీ, రాజకీయ, సాహితీ రంగాలకు తీరని లోటు. నాకు గురుతుల్యులు, స్ఫూర్తిప్రదాత అయినటువంటి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – టి. సుబ్బరామిరెడ్డి, కళాబంధువు కళామతల్లి కీర్తి కిరీటంలో కలికితురాయి వంటి సినారేగారు శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లారు. దర్శక–నిర్మాతగా ఆయనతో పనిచేసే భాగ్యం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ‘సీతయ్య’ సినిమాలో ‘ఎవరి మాటా వినడు సీతయ్య...’, ‘ఇదిగో రాయలసీమ గడ్డ. దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డా...’, ‘రావయ్య రావయ్య రామసక్కని సీతయ్య...’ పాటలను ఆయనే రాశారు. ముఖ్యంగా ‘ఇదిగో రాయలసీమ గడ్డ..’ పాటకు అప్పటి ఏపీ ప్రభుత్వం నుంచి నంది (2003) పురస్కారాన్ని అందుకోవడం నాకూ, మా ‘బొమ్మరిల్లు వారి’ సంస్థకు గర్వకారణం. – వైవీయస్ చౌదరి, దర్శకుడు నారాయణరెడ్డిగారి మరణంతో తెలుగుజాతి మూగబోయింది. తెలుగు భాషకి తీరని లోటు. ఆయనకూ, మా తండ్రి (ఎన్టీఆర్)కి, నాకూ అనుబంధం ఉంది. ‘గులేబకావళి కథ’ చిత్రంలో ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని...’ పాటతో ఆయన సినీ జీవితం ఆరంభమైంది. మా నాన్నగారు, కాంతారావుగారు నటించిన ‘ఏకవీర’ సినిమాకి సినారేగారు డైలాగులు రాశారు. ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రానికి మాటలు, పాటలు రాశారు. – హరికృష్ణ, నటుడు ఉస్మానియా యూనివర్శిటీలో నేను ఎంఏ తెలుగు చదువుతున్నప్పుడు సినారేగారు నా గురువు. ఆయన అడుగుజాడల్లో సినీరంగంలోకి వచ్చిన శిష్యుణ్ణి నేను. రామానాయుడుగారి ‘సర్పయాగం’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు పాటలన్నీ గురువుగారితోనే రాయించుకున్నా. ‘ఏంటయ్యా... నన్ను అంత నమ్మేస్తున్నావ్’ అన్నారు. ‘గురువును కాక ఎవర్ని నమ్ముతాం సార్’ అన్నా. నాకు అక్షరాలు నేర్పిన గురువు మాత్రమే కాదు... అక్షర జ్ఞానం నేర్పిన గురువు. అద్భుతమైన కావ్యాలు వారి వద్ద మేం చదువుకున్నాం. – పరుచూరి గోపాలకృష్ణ, సినీరచయిత ‘‘నారాయణరెడ్డిగారి మాట ఒక పాట. ఆయన పాటల్లోని పదాలు ఆణిముత్యాల్లాంటివి. తెలుగు జాతికి గర్వకారణమైన కవి. నన్నయ, ఎర్రన, తిక్కన వంటి కవుల గురించి మనం వినుంటాం. కానీ, చూడలేదు. ఈ రోజు అంత గొప్ప స్థాయిలో ఉన్న గొప్ప కవి, గేయ రచయిత, సాహితీ పిపాసకులు నారాయణరెడ్డిగారు. ఆయన నన్ను, నా పాటలను ఎంతో ప్రోత్సహించారు. – రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు -
టీడీపీకి చరమగీతం పాడుదాం
► మూడేళ్లలో ఒక్క అభివృద్ధీ లేదు ► రుణమాఫీ పేరుతో మోసం ► జన్మభూమి కమిటీలదే పెత్తనం ► రాజ్యాంగ విరుద్ధంగా నిధుల కేటాయింపు ► నారాయణరెడ్డిది రాజకీయ హత్యే ► ఆదోని ప్లీనరీలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆదోని: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీడీపీకి చరమగీతం పాడుదామని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని పట్టణం బాబా గార్డెన్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు పట్టణంలో పార్టీ కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్లీనరీలో ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రసంగించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కూడా లేదన్నారు. ఆదోని డివిజన్‌కు పరిశ్రమలు రాలేదని, రోడ్లు వేయలేదని గుర్తు చేశారు. పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని.. అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజలలో కలుగుతోందన్నారు. అధికారం ఉందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజలుఅంతా గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యేలకు కాకుండా రాజ్యంగ విరుద్ధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు నిధులు కేటాయిస్తున్నారని.. జన్మ భూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో కరువు వైఎస్ హయాంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షమైన జీవితం గడిపితే.. చంద్రబాబు హయాంలో వర్షాలు కనుమరుగై కరువు తాండవిస్తోందని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక్క ఫోన్ కొడితే తాగునీరు ఇంటికి చేరుతోందని చెపుతున్నారని, అయితే ఆలూరనులో పది రోజులైనా బిందెడు నీరు దొరకని పరిస్థితి ఎందుకు నెలకొందని ఆయన ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వండని ఆందోళన చేసిన ప్రజలపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడం... ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక.. నిరుద్యోగులకు కాకుండా తన కుమారుడు నారా లోకేష్‌కు మాత్రం ఉద్యోగం ఇచ్చారని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ దౌర్జనాలకు భయపడేది లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరకులపాడు నారాయణరెడ్డి ఎదుగుదల చూసి ఓర్వలేక దారుణంగా హత్య చేయించారన్నారు. చంద్రబాబు సహకారంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. మోసం బట్టబయలు రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను, రైతులు మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లయినా ఏ హామీ నెరవేరకపోవడంతో తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే బాగుపడాలనే దుర్మార్గపు ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీపై పెరుగుతున్న అసంతృప్తి.. చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో విసిగి వేశారి పోయిన ప్రజలు నాటి వైఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే, ప్లీనరీ సమావేశం పరిశీలకుడు బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పింఛన్, రేషన్ కూడా సకాలంలో అందడం లేదన్నారు. టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, మూడోసారి కూడా తామే గెలుస్తామని చెప్పారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, పోలీసు కేసులకు తామెప్పుడు భయపడబోమన్నారు. తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నిలబడుతామని భరోసానిచ్చారు. -
నిష్పక్షపాతంగా విచారిస్తాం: ఎస్పీ
► చెరుకులపాడు హత్య కేసుపై ఎస్పీ వ్యాఖ్య వెల్దుర్తి రూరల్: కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులుతో కలిసి చెరుకులపాడు గ్రామంలో ఆదివారం పర్యటించారు. నారాయణ రెడ్డి హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారని, నిష్పక్షపాతంగా విచారిస్తామని ఆయన తెలిపారు. నిందితులను విచారించేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేశామని చెప్పారు. హత్యకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, తమ గ్రామం ప్రశాంతంగా ఉండేదని, తాజాగా అలజడుల కారణంగా తమ నాయకుడినే కోల్పోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వారికి అభయమిచ్చారు. హతుడు సాంబశివుడు కుటుంబాన్ని ఎస్పీ బృందం పరామర్శించింది. అతని తల్లి, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తామెవరం ఏనాడూ ఫ్యాక్షన్ జోలికి వెళ్లలేదని, నారాయణరెడ్డి హత్యను అడ్డుకోబోయిన తన కుమారుడిని హత్య చేశారని, వ్యవసాయంతో జీవనం సాగించే తమకు ఈ దుస్థితి పట్టిందని కుటుంబీకులు వాపోయారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను పరామర్శించారు ఎస్ఐపై వెల్లువెత్తిన ఫిర్యాదులు స్థానిక ఎస్ఐ తులసీనాగప్రసాద్‌పై నారాయణరెడ్డి కుటుంబీకులు, గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తుల పలు ఫిర్యాదులు చేశారు. తమ తమ్ముడు నారాయణరెడ్డి హత్యకు ఎస్ఐ పరోక్ష కారకుడని, అతని ప్రోద్బలంతోనే ప్రత్యర్ధులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్దారని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతోపాటు ముఖ్యంగా ఎస్ఐ పాత్ర ఉందంటూ శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్‌ను.. గర్భవతిని అయినా గ్రామంలో పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే ఎస్సై అవమానించి అసభ్యకరంగా మాట్లాడాడంటూ సర్పంచ్ అపర్ణ, ఆమె భర్త శివలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కోసం పలుమార్లు అక్రమ ఇసుక, తదితర అసాంఘిక కార్యలాపాలపై వార్తలు రాసిన విలేకరులపై సైతం అక్రమ కేసులు బనాయించాడని రైతులు, గ్రామస్తులు ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నానని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. తాను కప్పట్రాళ్లను అభివృద్ధి చేస్తున్న తీరును ఉదహరించారు. గ్రామంలోని రచ్చకట్ట వద్ద విలేకరులతో మాట్లాడుతూ నారాయణరెడ్డి హత్య తరువాత జిల్లాలో అన్ని ఫ్యాక్షన్ గ్రామాలలో ఇటు ఫ్యాక్షనిస్టులుగా ఉన్న అనుమానితులను, అటు అలసత్వం వీడాలంటూ పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. అనుమానితులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఏ గ్రామంలోనైనా ఎవరికైనా ఏ చిన్న సమస్య ఎదురైనా, పోట్లాటలకు దారితీసే పరిస్థితులు ఎదురైనా తన నంబరు 9440795500కు ఫోన్ చేసి తెలపాలన్నారు. -
బెంగళూరు కేంద్రంగా పక్కా స్కెచ్!
-
ఈ రక్త చరిత్ర ఇంకానా?
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ బిహార్ కంటే అధ్వానంగా తయారైందని జపాన్ సంస్థకు చెందిన మాకీ ఏ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నట్టు? సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మార్కం డేయ కట్జుకు ఏమవసరమని రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞాపనలు పంపారు? ఈ సమస్యలన్నీ కొద్దిరోజుల క్రితం ప్రధానిని కలిసినప్పుడు జగన్ వివరించే ఉంటారు. అయితే కేంద్రంలో తమ భాగస్వామి, రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్ల మోదీ సర్కార్ ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. రాష్ట్రాలలో పాలనా యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగంలోని 356వ అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించే వెసులుబాటు ఉంటుంది. ఇది చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్ప అంత తీవ్రమైన డిమాండ్ ఎవరూ చెయ్యరు. అటువంటిది మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చెయ్యాలని కోరారు. కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ నారాయణరెడ్డి దారుణహత్య నేపథ్యంలో ప్రతిపక్ష నేత గవర్నర్‌ను కలిశారు. ఈ ఒక్క సంఘటన కారణంగానే ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారా? లేక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అంత అధ్వానంగా మారాయా? విపక్షాన్ని తుద ముట్టిస్తారా? ముఠా కక్షల కారణంగా నారాయణరెడ్డి హత్య జరిగిందని చెబుతూ జిల్లా పోలీసు యంత్రాంగం కేసును రాజకీయ నాయకుల మీద, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం మీద పడకుండా తప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. నారాయణరెడ్డిది రాజకీయ హత్యేననీ, సీబీఐ విచారణ జరిపించాలనీ జగన్మోహన్రెడ్డి కోరుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదలు, జిల్లా ఎస్పీ దాకా ఇది ముఠా కక్షల కారణంగా జరిగిందని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నారు. నారాయణరెడ్డి హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను ఎద్దేవా చేస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి స్వయంగా జగన్‌ది దింపుడు కళ్లం ఆశ అన్నారు. ఆ హత్య ముఠా కక్షల ఫలితమే అయితే, అవతలి ముఠాలో ఎవరున్నారు? చివరలోనే అయినా ఉప ముఖ్యమంత్రి కొడుకు కేఈ శ్యాంబాబు పేరు నిందితుల జాబి తాలో ఎందుకు చేరింది? ఈ హత్య వెనుక ముఠా కక్షలు లేవు, రాజకీయ కారణాల వల్లనే చంపేశారు కాబట్టే జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారు. ఇది కొత్తేం కాదు. 2005లో తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిశారు. అప్పట్లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. ఒక రాజకీయ హత్య జరిగినప్పుడు, అందునా అధికారపక్షం హస్తం ఉందన్న ఆరోపణ వచ్చినప్పుడు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం కోసం సీబీఐ విచారణ కోరడం సహజం. నిజానికి పరిటాల రవి హత్య జరిగే నాటికి రాయలసీమలో ఫ్యాక్షన్ సమస్యను తుదముట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఠా కక్షలకు తన తండ్రి రాజారెడ్డి బలైనా డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రతీకారాన్ని కోరలేదు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రమంతటా పాదయాత్ర చేసిన తరువాత డాక్టర్ రాజశేఖరరెడ్డి పూర్తిగా మారిన మనిషి. ఆయనే పలు సందర్భాలలో కోపం నరం తెంపేసుకున్నానని చెప్పేవారు. ప్రభుత్వంలో ఉండి ఆయనే పరిటాల రవి హత్య మీద సీబీఐ విచారణకు ముందుకొచ్చారు. ఇక ఇదే కర్నూలు జిల్లాలో ముఠా కక్షలను అంతం చెయ్యడానికి ముఖ్యమంత్రిగా వైఎస్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. మన తరువాతి తరమైనా ఈ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవించాలని చెబుతూ ఉండేవారాయన. కేవలం మాటల్లోనే కాకుండా రాజశేఖరరెడ్డి ముఠాకక్షలను అంతం చెయ్యడం కోసం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి వర్గాల మధ్య స్వయంగా సయోధ్య కుదిర్చిన విషయం ఒక ఉదాహరణ మాత్రమే. మళ్లీ నారాయణరెడ్డి హత్య దగ్గరికే వస్తే 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అతి తక్కువ స్థానాలు గెల్చుకుంది. ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెల్చుకుంటే 14 శాసనసభ స్థానాల్లో 10 వైఎస్ఆర్సీపీ కైవసమయ్యాయి. ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తే ఎల్లకాలం తామే అధికారంలో ఉండవచ్చన్న ఆలోచన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుది. ప్రజాస్వామ్యంలో అటువంటి ఆశ ఉండటం ఒక మానసిక రుగ్మతకు సంకేతమంటారు రాజకీయ పండితులు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల కోసం చేసిన మంచిని చెప్పుకుని ఎన్నికలను ఎదుర్కోవాలి కానీ, దొడ్డిదారిన ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రయత్నం మనను ఎల్లకాలం అధికారంలో ఉంచదన్న సత్యాన్ని విస్మరించడమే ఆ మానసిక రుగ్మతకు మూలం. ఆ కారణం చేతనే తెలుగుదేశం పార్టీ అధినేత స్వయంగా ప్రతిపక్షాన్ని చీల్చే ప్రయత్నంలో 21 మంది శాసనసభ్యులను ప్రలోభ పెట్టి, కేసులు పెట్టి రకరకాల విన్యాసాలు ప్రదర్శించి పార్టీ ఫిరాయింప చేశారు. అందులో ఆరుగురు శాసనసభ్యులు కర్నూలు జిల్లా వారు. డబ్బు, పదవులు, అక్రమ కేసుల్లో ఇరికించడం, బెదిరించడం–ఇట్లా అనేక కారణాలతో ఆరుగురు ఆ జిల్లాలో అధికార పక్షం పంచన చేరినా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మరో 15 మంది ఎంఎల్ఏలు వలస వెళ్లినా చంద్రబాబుకు సుఖం లేకుండా పోయింది. ముఠా సంస్కృతిని అంతం చెయ్యాలని డాక్టర్ రాజశేఖరరెడ్డి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే చంద్రబాబు కొత్త ముఠా సంస్కృతికి తెర లేపారు. అందుకు ఉదాహరణ ప్రకాశంజిల్లా అద్దంకి ప్రాంతంలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఘర్షణ. మొన్నటికి మొన్న బలరాం అనుచరులు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రతి జిల్లాలోనూ కొంచెం అటు ఇటుగా ఇదే పరిస్థితి. నయా రాజకీయ ముఠా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి, పెంచి పోషించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. భూమా మరణం వెనుక వేధింపులు కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డికి పచ్చకండువా కప్పేశారు ముఖ్యమంత్రి. ఆ తరువాత మరో ఆరుగురిని పార్టీ ఫిరాయింప చేసి ఆగం చేశారు. ఆగం అని అనడానికి ఉదాహరణ భూమా నాగిరెడ్డి. వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన నాగిరెడ్డి మీద అడ్డగోలు కేసులు పెట్టి, వేధించి, జైలుకు కూడా పంపి చివరికి అవన్నీ ఎత్తేస్తామనీ, మంత్రి పదవి కూడా ఇస్తామనీ పార్టీ ఫిరాయింప చేసి ఆ తరువాత కేసులూ ఎత్తెయ్య లేదు, మంత్రి పదవీ ఇవ్వలేదు. చివరికి ఆయన ఆగం ఆగమై మనోవ్యధతోనే అకాల మరణం చెందారు. ఏళ్ల తరబడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన భూమా కుటుం బం ఇప్పుడెక్కడ? అయినా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మార్పు రాలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 2014 పునరావృతం అవడమే కాక మరింత ఎక్కువ నష్టం జరగబోతున్న విషయం తెలుగుదేశం అధినేతకు తెలుసు. అందునా మొన్న హత్యకు గురైన నారాయణరెడ్డి పోటీ చేసే పత్తికొండ ఆ జిల్లాలో వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలిచే మొదటి స్థానం అవుతుందనీ తెలుసు. నారాయణరెడ్డి ప్రతిపక్షంలో ఉండి, ప్రభుత్వపక్ష ఆగడాలను ప్రతిఘటిస్తూ వచ్చిన నాయకుడు, ముఖ్యంగా ఇసుక అక్రమ దందాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజల అభిమానం ఎంత చూరగొన్నాడో మొన్న ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజా సమూహమే నిదర్శనం. కేసుల పేరిట బెదిరించి, పదవులూ తాయిలాలూ చూపి ప్రలోభపెట్టి ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసి; వాటికి వేటికీ లొంగని వారిని భౌతికంగా అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో అధికారపక్షం పడిందన్న అభిప్రాయం నారాయణరెడ్డి హత్యోదంతం కలిగిస్తున్నది. ఈ కేసులో సీబీఐ విచారణ కోసం అధికార పక్షమే, ముఖ్యమంత్రే స్వయంగా ముందుకొచ్చి స్వచ్ఛం దంగా కేంద్రానికి సిఫార్సు చేస్తే కొంతన్నా విమర్శ తగ్గుతుంది. పదిహేను మందిని చంపారు ఇక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందనీ, రాష్ట్రపతి పాలన విధించాలనీ గవర్నర్‌కు చేసిన వినతి మాటకొస్తే ఈ మూడేళ్లలో విపక్షానికి చెందిన పదిహేను మంది హత్య, ప్రభుత్వం పట్టించుకోదు, అధికార పక్షానికి చెందిన వారి మీద కేసులు మాఫీ చెయ్యడం కోసం మాత్రం 132 జీఓలు జారీ అవుతాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్ర చందనం స్మగ్లర్ల పేరిట 25 మంది తమిళనాడు కూలీల ఎన్కౌంటర్, గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రి ప్రచారం కోసం సినిమా షూటింగ్ చేసే క్రమంలో 27 మంది అమాయక భక్తులదుర్మరణం, ఇటీవలే ఇసుక దందా వివాదంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ప్రమాదం పేరిట 17మంది అనుమానాస్పద మృతి, పక్క రాష్ట్రం తెలంగాణలో ఎంఎల్ఏను కొనే ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం నుంచి నారాయణరెడ్డి ఆయన అనుచరుడు సాంబశివుడి హత్య దాకా ప్రతిపక్షం రాష్ట్రపతి పాలన డిమాండ్‌కు మద్దతుగా ఎన్నో కారణాలు చూపుతున్నది. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత కాబట్టి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారనుకుందాం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిహార్ కంటే కూడా అధ్వానంగా తయారయిందని జపాన్ సంస్థకు చెందిన మాకీ ఏ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నట్టు? సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మార్కండేయ కట్జుకు ఏమవసరమని ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞాపనలు పంపారు? ఈ సమస్యలన్నీ కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రిని కలిసినప్పుడు ప్రతిపక్ష నేత జగన్ వివరించే ఉంటారు. అయితే కేంద్రంలో తమ భాగస్వామి, రాష్ట్రంలో తాము భాగస్వామీ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల మోదీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. మరో రెండు మాసాల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఏం జరగబోతుందో ఎదురుచూడాల్సిందే. ఏదేమయినా నారాయణరెడ్డి హత్యఅధికార పక్షాన్ని వెంటాడక మానదు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘చంపిరిరా.. నన్ను చంపిరి రా’ అని రెడ్డి అరిచాడు
నారాయణరెడ్డి హత్యలో ప్రత్యక్ష సాక్షుల కథనం ముందుగా మా జీపు వెళ్తోంది. వెనుక మాది ఇంకో జీపు వస్తోంది. మధ్యలో ఒక ట్రాక్టర్ పొలంలో నుంచి వేగంగా వచ్చి మా జీపును (నారాయణరెడ్డి జీపును) ఢీకొంది. బ్రేక్ సరిగ్గా పడక తగిలిందనుకున్నా. మిర్రర్లో వెనుకవైపు చూస్తుండగా, ముందుగా ఇంకో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ఒకేసారి రెండు వైపుల నుంచి రెండు ట్రాక్టర్లు కొద్దిసేపు ఢీకొట్టాయి. దీంతో మా జీపు రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆ వెంటనే జీపుపై రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో మోరీల్లో, బెండచేనులో దాక్కున్న వారు వెంటనే బయటకు వచ్చి కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. నారాయణరెడ్డి జీపు ముందుభాగంలో కూర్చున్నాడు. దిగుదామంటే ట్రాక్టర్ అడ్డంగా ఉంది. అదే సమయంలో దాడి చేయడానికి వచ్చిన వారు నన్ను గుంజి (లాగి) పోతావారా.. నిన్ను చంపాలా అన్నారు. ఇంక నేను దిగి పారిపోయినా. జీపులో ఉన్న మిగతావారిని కూడా అలాగే బెదిరించి పంపించేశారు. సాంబశివుడు ఒక్కడే వారిని ఎదిరించాడు. దీంతో ఆయనను కాస్త దూరం తీసుకెళ్లి నరికి చంపేశారు. ఆ వెంటనే నారాయణరెడ్డి తలనరికి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ సమయంలో రెడ్డి ‘చంపిరి రా నన్ను చంపిరి రా’ అని అరిచాడు. మొత్తం 20 మందికి పైగా దాడి చేశారు. దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తుపట్టాను. ట్రాక్టర్ తోలిన వారిలో రామాంజనేయులు, రామనాయుడుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మిగతా వారు మాస్క్‌లు వేసుకుని వచ్చారు. చంపిన తర్వాత ట్రాక్టర్‌పై వెళ్లేటప్పుడు కొడవళ్లు తిప్పుకుంటూ వెళ్లిపోయారు. – ఎల్లప్ప, నారాయణరెడ్డి వాహన డ్రైవర్ అబ్బా.. రెడ్డిని చంపిరే అని కూతలు వేసినా..! రెండు బండ్లు కలిసిపోతున్నాయి. కల్వర్ట్ రిపేరి ఉండటంతో మా బండ్లు స్లో అయ్యాయి. ఇదే సమయంలో ఒక ట్రాక్టర్ రఫ్‌గా రెండు బండ్ల మధ్య దూరింది. ఆ వెంటనే నారాయణరెడ్డి జీపును వెనుక నుంచి గుద్దాడు. ఆ జీపులో ఉన్న డ్రైవర్ ఎల్లప్ప మిర్రర్ నుంచి వెనుక చూసేలోపు ముందు నుంచి మరో ట్రాక్టర్ గుద్దింది. అప్పుడు డౌట్ వచ్చేసింది మాకు. అబ్బా.. రెడ్డిని చంపిరే అని నేను కూతలు వేసినా. బండి స్లో చేసి దిగడానికి వెళితే లెఫ్ట్‌సైడ్ బాంబు వేసినారు. మనలను కూడా చంపుతారు. మన వద్ద ఏమీ లేవని ముందుకెళ్లి చూసినా అంతలోపే నారాయణరెడ్డి బండిపైకి ఎక్కేసి రాళ్లు వేసి కొడవళ్లతో ఆయనను పొడుస్తున్నారు. మేము ఇబ్బంది పడతామని చెప్పి కిలోమీటర్న్నర దూరంలో ఉన్న క్రిష్ణగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాం. సార్ రెడ్డిని చంపుతున్నారు సార్ అని చెబితే నలుగురైదుగురు పోలీసులు బైక్‌లపై వచ్చారు. ఈలోగా సాంబశివుడును చంపిన వారు పొలాల్లో, నారాయణరెడ్డి చంపిన వారు చెరుకులపాడు వైపు ట్రాక్టర్లో వెళ్లిపోయారు. మొత్తం పది నిమిషాల్లో అయిపోయింది. – కృష్ణమోహన్, నారాయణరెడ్డిని అనుసరిస్తున్న జీపు డ్రైవర్ కేఈ శ్యాంబాబు బెదిరించాడు... కేఈ శ్యాంబాబు నాకు గతంలో ఫోన్ చేసి బెదిరించారు. ‘నువ్వు చిట్యాలలో సుధాకర్‌రెడ్డి కట్ట విషయంలో ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ పంచాయతీలో నీవు ఎక్కువ తల దూరుస్తున్నావు. మీ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆరు నెలల కంటే ఎక్కువ బతకడు’ అని చెప్పి వెంటనే నా ఫోన్ కట్ చేశాడు. – నాగరాజు, చిట్యాల గ్రామస్తుడు, నారాయణరెడ్డి అనుచరుడు -
హత్యకు బెంగళూరు కేంద్రంగా స్కెచ్!
-
మృత్యువులోనూ వెన్నంటి నిలిచాడు
► నారాయణరెడ్డి నమ్మినబంటు సాంబశివుడు ► ప్రత్యుర్థులకు ఎదురొడ్డి నిలిచిన వైనం వైఎస్సార్ సర్కిల్, వెల్దుర్తి రూరల్, కృష్ణగిరి: దారుణ హత్యకు గురైన పత్తికొండ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డికి బోయ సాంబశివుడు నమ్మినబంటు. నారాయణరెడ్డితో పాటే సాంబశివుడు కూడా హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా నారాయణరెడ్డిని కాపాడేందుకు సాంబశివుడు హంతకులకు ఎదురొడ్డి నిలిచిన తీరు గ్రామంలో చర్చనీయాంశమయ్యింది. సాంబశివుడిది సాధారణ రైతు కుటుంబం. ఇతని గుణగణాలను గమనించి నారాయణరెడ్డి తన ప్రధాన అనుచరునిగా ఎంచుకున్నారు. వారిది దాదాపు పదేళ్ల అనుబంధం. నారాయణరెడ్డి ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉండేవాడు. నారాయణరెడ్డికి ప్రాణహాని ఉందని తెలిసినప్పటి నుండి మరింత అప్రమత్తంగా ఉంటున్నాడు. నారాయణరెడ్డిని సైతం ఎప్పటికప్పుడు అప్రతమత్తం చేస్తూ ప్రత్యర్థుల కదలికలు కనిపెట్టి వివరించేవాడు. ఆదివారం కూడా నారాయణరెడ్డి వెంటే ఉన్న సాంబశివుడు ఆయన్ను కాపాడాలని ప్రయత్నించాడు. తమ వెంట ఉన్నవారంతా తలోదిక్కూ చెల్లాచెదురైనా సాంబశివుడు మాత్రం అత్యంత తెగువ కనబరిచాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యర్థులకు అడ్డుపడ్డాడు. తనను చంపే వరకు వదిలి పెట్టరని.. మీరు వెళ్లిపోండని నారాయణరెడ్డి చెబుతున్నా ఖాతరు చేయకుండా ఎదురొడ్డి నిలిచాడు. చివరకు ప్రత్యర్థులు అతడిని చంపిన తర్వాతే నారాయణరెడ్డిని అంతమొందించడం గమనార్హం. సాంబశివుడుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బెంగళూరు కేంద్రంగా స్కెచ్!
► నెల రోజుల నుంచి పక్కా ప్రణాళిక ► 15 రోజుల నుంచీ దుండగుల రెక్కీ ► దాడిలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువకులే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య అంతా పకడ్బందీగా సాగింది. దాదాపు నెల రోజుల నుంచి ప్రత్యర్థులు ఆయన హత్యకు పథక రచన సాగించినట్టు సమాచారం.ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. హత్యకు 15 రోజుల నుంచి రెక్కీ నిర్వíßహించిరట్లు సమాచారం. స్థానికంగా ఉండే వారు ఇంత పకడ్బందీగా హత్యకు స్కెచ్ వేసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఇక హత్యలో పాల్గొన్న వారిలో అత్యధికులు యువకులే ఉన్నారని సమాచారం. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఎంచి మరీ అధికారపార్టీ నాయకులు సమీకరించినట్లు వినిపిస్తోంది. ఇసుకఅక్రమ తవ్వకాలు, రవాణా వ్యవహారాలలో పెద్దమొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్న యువకులు ఎక్కువ మంది నారాయణరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకున్నారని సమాచారం. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరుగుతుండడం, తవ్వకాలు ఆగిపోవడంతో వీరి ఆదాయానికి గండిపడిందని, కేసు వేసిన వారి వెనుక నారాయణరెడ్డి ఉన్నారన్న అపోహతో వారు ఆయనపై కక్ష పెంచుకున్నారని వినిపిస్తోంది. అయితే అటువంటి వారందరినీ సమీకరించి నారాయణరెడ్డిపై ఎగదోయడంలో తెలుగుదేశం నాయకులు సఫలమయ్యారని, వారే హత్యకు స్కెచ్ నుంచి అన్నీ సమకూర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్ డేటా కీలకం..!: హత్య అనంతరం ఆ సంఘటనలో పాల్గొన్న పలువురు యువకులు.. కొద్ది మంది నేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుమానితుల కాల్ డేటాను పరిశీలిస్తే హత్య వెనుక సూత్రధారుల వివరాలు కూడా బైటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా నారాయణ రెడ్డి హత్య అనంతరం కొన్ని గ్రామాల్లో కొద్ది మంది సంబరాలు చేసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ ఆరా తీస్తే కేవలం సంఘటనలో పాల్గొన్న వారే కాకుండా అసలు నిందితుల వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. కల్వర్టు పనులెందుకు ఆగాయి? సాక్షి ప్రతినిధి, కర్నూలు: నారాయణరెడ్డి హత్యకు పథక రచన పక్కాగా జరిగిందనడానికి కల్వర్టు పనుల నిలిపివేత కూడా నిదర్శనంగా నిలుస్తోంది. ఆదివారం నారాయణరెడ్డి ఈ దారిలో వెళతారని పసిగట్టిన ప్రత్యర్థులు భారీ పథకాన్నే రచించారు. ఆదివారం ఇక్కడ జన సంచారం తక్కువగా ఉంటుంది. ఇక్కడ రోడ్డు, కల్వర్టు పనులు కూడా జరగవు. పైగా, ఇక్కడ పైపులు ఉండటం వల్ల దాడి సులువు అవుతుంది. బాధితులు తప్పించుకొనేందుకు కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే, అంతకు నాలుగు రోజుల ముందే రోడ్డు, కల్వర్టు పనులు నిలిచిపోయాయి. పథకంలో భాగంగానే ఈ పనులు నిలిపివేశారని నారాయణ రెడ్డి అనుచరులు అంటున్నారు. ఈ పనులు జరుగుతుంటే దాడికి అవకాశం ఉండేది కాదు. భారీ స్కెచ్‌తో దాడికి దిగాలంటే ముందుగా రెక్కీ నిర్వహించాల్సిందే. ఇక్కడ పనులు జరుగుతుంటే రెక్కీకి అవకాశం ఉండదు. అందువల్లే దాడికి నాలుగు రోజుల ముందునుంచే పనులు నిలిపివేయించి, రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న పైపులను ఆసరాగా చేసుకొని దాడికి పాల్పడ్డారని అంటున్నారు. పనుల నిలిపివేతతో దాడి చేసిన వారు పైపుల్లో, వాటి వెనుక నక్కి ఉండే అవకాశం కలిగింది. అందువల్లే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని, ముందుగానే పనులు నిలిపివేయించారని, దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉందని నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
చంద్రబాబే సూత్రధారి : వైఎస్ జగన్
-
తలపై రాళ్లతో మోది హతమార్చారు
ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి కర్నూలు(హాస్పిటల్): వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు తలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. పెద్ద పెద్ద రాళ్లతో ఆయన తలపై మోది హతమార్చారు. అనంతరం వేటకొడవళ్లతో తలను ఛిద్రం చేసినట్లు సోమవారం నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రాథమికంగా తేలింది. పూర్తిస్థాయి నివేదికను కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ లక్ష్మీనారాయణ రూపొందిస్తున్నారు. -
చంద్రబాబే సూత్రధారి
ఆయన్ను జైలుకు పంపించండి: గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజ్ఞప్తి నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ పాత్రధారి - ఆయుధం రెన్యువల్ చేయలేదు.. రక్షణ కల్పించలేదు - పథకం ప్రకారం నిస్సహాయుడ్ని చేసి చంపారు - రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు - ప్రలోభాలకు లొంగని నేతలను హత్య చేస్తున్నారు - టీడీపీ వారిపై కేసులు తొలగిస్తూ 132 జీవోలిచ్చారు - మూడేళ్లలో ఎన్నో రాజకీయ హత్యలు - గవర్నర్ గారూ... ఇప్పటికైనా జోక్యం చేసుకోండి సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్య వెనుక టీడీపీ ప్రభుత్వం కుట్ర ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కుట్రదారుడని, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత్రధారుడని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, చిర్ల జగ్గిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలతో కలిసి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జగన్ చంద్రబాబు ప్రభుత్వ హత్యా రాజకీయాలను, రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షసపాలన పూర్వాపరాలపై ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాజకీయ వ్యవస్థలను హింసాయుతం చేస్తున్న చంద్రబాబు విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, తన విచక్షణను ఉపయోగించి ఆయన్ను జైలుకు పంపాలని జగన్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిశాక తమ పార్టీ నేతలతో కలసి జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ప్రలోభాలు పెట్టి లోబర్చుకుంటోందని అలా లొంగని వారిని హతమారుస్తూ ఉందని ధ్వజమెత్తారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యం ఖూనీ.. ‘‘కర్నూలులో నెలకొన్న హింసాత్మక పరిణామాలపై గవర్నర్‌కు ఇవాళ వివరంగా చెప్పాం. అధికారపక్షం ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందో... ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తా ఉందో... ప్రత్యర్థులను ఎంత దారుణంగా హతమారుస్తోందో... వివరించాం. ఎన్నికల్లో గెలవని పరిస్థితులు నెలకొంటున్నపుడు, ప్రత్యర్థులు కొనుగోళ ్లకు, ప్రలోభాలకు లొంగక పోతే చివరికి వారిని చంపేసేంత వరకూ టీడీపీ పాలనలో పరిస్థితులు పోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లి... ఇది న్యాయమేనా? ధర్మమేనా? అని గట్టిగా అడిగాం. వారిపై కేసులెత్తేయడానికి 132 జీవోలు టీడీపీ నేతలపై నమోదై ఉన్న కేసులను ఎత్తేయడానికి వాటి నుంచి వారందరినీ విముక్తి చేయడానికి ఒకటి కాదు, రెండు కాదు దాదాపుగా 132 జీవోలను చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోల జారీతో టీడీపీ వారిపై ఉన్న కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పత్తికొండలో మా పార్టీ అభ్యర్థి చెరుకులపాడు నారాయణరెడ్డి గెలిచే పరిస్థితి ఉంది. టీడీపీ అక్కడ గెలవలేదు. నారాయణరెడ్డి ఉంటే వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భావించి ఆయనను కిరాతకంగా హత్య చేశారు. తన వద్ద ఉన్న ఆయుధాన్ని (గన్)ను రెన్యువల్ (పునరుద్ధరించాలని)చేయాలని నారాయణరెడ్డి పోలీసులను కోరితే వారు ఆయన ఆయుధాన్ని తీసేసుకున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయుధాన్ని స్వాధీనం చేయండని చెప్పి పోలీసులు ఆయన నుంచి తీసుకుని ఆ తరువాత దానిని తిరిగి ఇవ్వలేదు. అంటే ఒక పథకం ప్రకారం ఆయన వద్ద లైసెన్సు కలిగిన ఆయుధాన్ని లేకుండా చేసే కుట్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పత్తికొండ ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలను నారాయణరెడ్డి వెలుగులోకి తెచ్చారు. అక్కడ కోర్టులు కూడా జోక్యం చేసుకుని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడిపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చేదాకా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాల మీద ఆయన పోరాటం చేశారు. టీడీపీ వారి ఆగడాలను అడ్డుకుంటున్నాను కనుక తన ప్రాణాలకు హాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వానికి, పోలీసులకు కూడా ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎన్ని విజ్జప్తులు చేసినా నారాయణరెడ్డికి కావాలనే సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇవాళ టీడీపీ మండల స్థాయి నేతకు కూడా ఇద్దరేసి, ముగ్గురేసి గన్మెన్లను ఇస్తున్నారు. అలాంటిది ప్రత్తికొండ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడబోతూ ఉన్న వ్యక్తికి ఆయుధ లైసెన్సును కూడా పునరుద్ధరించలేదు. ఒక పథకం, పద్ధతి ప్రకారం కుట్ర పన్ని కల్వర్టును ఉపయోగించుకుని ట్రాకర్లు అడ్డం పెట్టి అతి కిరాతకంగా హతమార్చారు. సాక్ష్యాలు చెరిపేయాలనే... హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు చెరిగి పోవాలనే ఉద్దేశంతోనే పోలీసులు హత్యాస్థలికి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు. చుట్టు పక్కల నుంచి జనం వచ్చి ఏం జరిగిందోనని చూడ్డానికి ప్రయత్నించినపుడు హత్యాస్థలి వద్ద సాక్ష్యాధారాలు చెరిగిపోతాయి. అలా చెరిగిపోవాలనే ఒక పథకం ప్రకారం అక్కడికి పోలీసులు రాలేదు. ఓవైపు అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారు అనర్హతకు గురికాకుండా కాపాడతారు. ఓ అడుగు ముందుకేసి మంత్రి పదవులు ఇస్తారు. అప్పటికీ లొంగకపోతే ఏకంగా మనుషులనే హతమార్చే స్థాయికి ఈ రాజకీయ వ్యవస్థను చంద్రబాబు దిగజారుస్తున్నారు. ఇంతకన్నా కిరాతకం, దారుణం ఇంకేమీ ఉండదు. ఆయనపై చర్య తీసుకోవాలి. ఈ హత్యలో చంద్రబాబు కుట్రదారుడు, హత్య చేసింది కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గంలో... ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత్రధారుడైతే అందుకు పరోక్షంగా సహకరించిన కుట్రదారుడు చంద్రబాబు. ఇంత దారుణంగా హత్యలు జరిగితే ప్రజాస్వామ్యం బతకదు. ఇవే విషయాలను మేం గవర్నర్‌కు వివరిస్తూ చంద్రబాబు పాలనలో ఈ మూడేళ్లలో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో వినతిపత్రంలో పొందు పర్చి ఇచ్చాం. మా పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో ఆయన ముఖ్య అనుచరుడొకరిని ఇటీవలే చంపించేశారు. నా నియోజకవర్గంలోని వేంపల్లెలో గజ్జెల రామిరెడ్డి అనే నేతను కూడా చంపేశారు. ఇలా ఎన్నో హత్యలు చేయించారు. ప్రభుత్వ ప్రమేయం స్పష్టం... తాను ఉపముఖ్యమంత్రి అయ్యాక పత్తికొండలో చాలా వరకూ హత్యలు తగ్గాయని, తనకు నారాయణరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదని కేఈ కృష్ణమూర్తి చెప్పారని విలేకరులు ప్రస్తావించగా... ‘‘20 నుంచి 25 మంది ఏకమై ట్రాక్టర్లు అడ్డు పెట్టి కిరాతకంగా చంపారు. నారాయణరెడ్డికి ఆయుధ లైసెన్సు రెన్యూవల్ చేయలేదు. ఉన్న ఆయుధమూ తీసుకున్నారు. గన్మెన్ల కోసం విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదు. ఇన్ని సంఘటనలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఈ హత్యలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పడానికి ఎవరికైనా నోరు ఎలా వస్తుంది? .’’ అని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును జైలుకు పంపాల్సిన కేసులున్నాయి.. గోదావరి పుష్కరాలలో తన సినిమా షూటింగ్ కోసం చంద్రబాబు 29 మందిని చంపేశారు. దీనిపై ఇంత వరకూ కేసే లేదు. చిత్తూరులో 26 మంది కూలీలను కాల్చి చంపారు. కేసుల్లేవు. ఇసుకమాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టు మాఫియా నుంచి తీసుకున్న అవినీతి సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోతే కేసులు లేవు. ఇవన్నీ చంద్రబాబు జైలుకు పోవాల్సిన కేసులే... చివరకు రాజధానిలో స్విస్ చాలెంజ్ పేరుతో చంద్రబాబు మరో దారుణం చేస్తున్నారు. ఇదీ జైలుకు పోవాల్సిన కేసే.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ వ్యక్తి సీఎంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. తనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో రాసిన వాళ్లపైకి పోలీసులను పంపి మరీ చర్యలు తీసుకుంటున్నారు. ‘రాష్ట్రంలో చంద్రబాబు పాలనను అంతం చేయండి. 356 ఆర్టికల్‌ను ప్రయో గించండి. రాష్ట్రపతి పాలనను విధించండి’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కాట్జూ కూడా రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాసేంతటి దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కనుక గవర్నర్ జోక్యం చేసుకుని చంద్రబాబు లాంటి వ్యక్తులను జైలుకు పంపితే తప్ప ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడదు.’’అని జగన్ పేర్కొన్నారు. -
అధికార హత్యలు
-
కొనసాగుతున్న కర్నూలు జిల్లా బంద్
కర్నూలు: అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేడు కర్నూలు జిల్లా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం జిల్లాలో ర్యాలీలు, ధర్నాలు చేపడుతోంది. బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక... ప్రతిపక్ష పార్టీ నేతలను అంతమొందించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకుందామనే ధోరణిలో అధికార పార్టీ ఉందని మండిపడ్డారు. మరోవైపు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. -
రాజకీయ రావణకాష్టం కేఈ సోదరుల పనే
-
కర్నూలు జిల్లాలో టీడీపీ రక్తకేళి!
-
తండ్రిని బలిగొన్నదీ టీడీపీయే..
- శివారెడ్డి హత్యానంతరం రాజకీయాల్లోకి నారాయణరెడ్డి - అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగిన వైనం కర్నూలు (వైఎస్సార్ సర్కిల్): చెరుకులపాడు నారాయణరెడ్డి రాజకీయ ప్రస్థానం తండ్రి కంగాటి శివారెడ్డి మరణంతో మొదలైంది. కాంగ్రెస్ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబానికి విధేయుడైన శివారెడ్డి నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదిగారు. శివారెడ్డి చూరగొంటున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేని స్థానిక టీడీపీ దివంగత నేత ఆయన హత్యకు కుట్రపన్నారు. తద్వారా కోట్ల కుటుంబానికి చెక్ పెట్టాలని భావించారు. అనుకున్నదే తడవుగా పథకాన్ని అమలు చేసి 1988లో చెరుకులపాడులోని ఇంటి వద్దే శివారెడ్డిని అతి దారుణంగా హత్య చేయించారు. ఆ నేపథ్యంలోనే నారాయణరెడ్డి రాజకీయాల్లో ప్రవేశించారు. అప్పట్నుంచీ కోట్ల కుటుంబానికి తన తండ్రి శివారెడ్డి లేని లోటును తీరుస్తూ ప్రజా సమస్యలపై పోరాడటమే కాకుండా, మరోవైపు టీడీపీ అరాచకాలను ఎండగట్టేందుకు అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. జిల్లాలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. ఇంటి పేరు కంగాటి కాగా సొంతూరు చెరుకులపాడు నారాయణరెడ్డిగా ప్రాచుర్యం పొందారు. 2006లో కృష్ణగిరి మండల జెడ్పీటీసీగా పోటీ చేసి కేఈ జయన్న చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత తొలినుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో, మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. -
టీడీపీ రక్తకేళి!
కర్నూలు జిల్లాలో అధికారపార్టీ దుర్మార్గం పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి హతం దారుణం.. దుర్మార్గం.. మాటలకందని మహా క్రౌర్యం..అధికారాన్ని అడ్డుపెట్టుకుని హత్యారాజకీయాలనుఎగదోస్తున్న తెలుగుదేశం పార్టీ అకృత్యాలకిది పరాకాష్ట. మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకున్నఅధికారపార్టీ.. దాడులు, హత్యలతో మారణహోమం సృష్టిస్తోంది. ఇపుడు ఏకంగా ఓ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరెడ్డిని మాటువేసి హత్యచేసే నీచానికి ఆ పార్టీ నాయకులు తెగబడ్డారు. ఓ శుభకార్యానికి వెళుతుండగా దారికాచి అత్యంత పాశవికంగా హత్య చేశారు.. మరణించిన తర్వాత కూడా కసికొద్దీ కొడవళ్లతో నరికారు.. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం నాయకులు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారని, రాక్షసంగా వ్యవహరించగలరని ఈ హత్యోదంతం రుజువు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిని ఆదివారం అత్యంత పాశవికంగా హత్యచేశారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమార్చారు. ఉదయమే నంద్యాలకు వెళ్లి ఒక శుభకార్యంలో పాల్గొన్న నారాయణ రెడ్డి... అక్కడి నుంచి వెల్దుర్తి చేరుకుని కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కోసానపల్లెకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆయన సొంతగ్రామం చెరకులపాడు మీదుగా రామకృష్ణాపురం చేరుకోవాల్సి ఉంది. చెరకులపాడు దాటిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని దాడికి అనువైన ప్రాం తంగా ప్రత్యర్థులు ఎంపిక చేసుకున్నారు. అక్కడ కల్వర్టు పనుల కోసం ఏర్పాటు చేసిన సిమెంటు పైపుల్లో కొంత మంది దాక్కున్నారు. మరికొంత మంది రోడ్డు పక్కనే ఉన్న బెండకాయ తోటలో ఉన్నారు. ఇక మిగి లిన వారిలో కొంత మంది పొలంలో ట్రాక్టరుతో పని చేయిస్తున్నట్టు ఉన్నారు. మరికొంత మంది కల్వర్టు పని కోసం ట్రాక్టర్‌ను నిలుపుకున్నట్టు నటించారు. రాళ్లతో దాడి చేసి.. వెంటాడి నరికారు.. నారాయణ రెడ్డి వాహనంతో పాటు ముందుగా మరో వాహనం వెళుతోంది. మొదటి వాహనం కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోగానే పెద్దపెద్ద రాళ్లతో దాడి మొదలు పెట్టారు. దీంతో ముందు వాహనంలోని వారు వేగంగా ముందుకు కదిలారు. ఇదే సందర్భంలో నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఒక ట్రాక్టర్... ముందు నుంచి మరో ట్రాక్టర్లతో గుద్ది ముందుకు వెళ్లకుండా దుండగులు అడ్డగించారు. రాళ్లు విసురుతూ కారు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఆయన తల పై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో బలంగా మోది హత్య చేశారు. ఈ దాడిలో ఆయన తల వెనుక భాగం పూర్తి గా ఛిద్రం కాగా... మెదడు ఊడి కారులో పడిపోయింది. ఆయన చనిపోయాడని గుర్తించిన తర్వాత కూడా వాహనం నుంచి బయటకు ఈడ్చివేసి మరీ కత్తులతో నరికారు. ఈ దాడిలో నారాయణరెడ్డి అనుచరుడు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. దాడిలో పాల్గొన్న వారిలో కొందరు ముఖానికి గుడ్డలు కట్టుకుని ఉన్నారు. తనపై దాడి జరుగుతున్నదని గమనించిన వెంటనే నారాయణ రెడ్డి.... ‘మీరు వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి’అని తనతో పాటు వాహనంలో ఉన్న వారిని హెచ్చరించారని సమాచారం. అయి తే, నారాయణరెడ్డిని కాపాడేందుకు ఆయన అనుచరుడు సాంబశివుడు ప్రయత్నించారు. దీంతో కొందరు దుండగులు సాంబశివుడిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన్ను కూడా కత్తులతో నరికి చంపేశారు. సాంబశి వుడి మృతదేహం ఘటనాస్థలానికి 100 మీటర్ల దూరంలో పడి ఉంది. నారాయణరెడ్డిని కాపాడేందు కు జరిగిన పెనుగులాటలో కొందరు దుండగులను అక్కడివరకు నిలువరించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం 20 నుంచి 25 మంది వరకూ పాల్గొని ఉంటారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆధారాల కోసం జాగ్రత్తలు తీసుకోని పోలీసులు హత్య జరిగిన తర్వాత సాధారణంగా ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటా రు. అక్కడకు ఎవ్వరినీ రానివ్వకుండా ఆధారాల కోసం అన్వేషిస్తారు. తద్వారా హత్య చేసిన నిందితులకు సంబంధించిన వేలిముద్రలు, ఇతర ఆధారాలు ఏమైనా లభించే అవకాశం ఉంటుంది. అయితే, నారాయణ రెడ్డి హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించలేదు. ఘటనా స్థలంలో వందలాది మంది జనం కలియతిరిగారు. అంతేకాకుండా దాడికి గురైన వాహనంలోకి కూడా అందరూ తొంగి చూస్తూ కనిపించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పోలీసులు వేలిముద్రల కోసం ప్రయత్నించారు. దీనిని బట్టి ఈ హత్య విషయంలో పోలీసులు ఎంత ఆషామాషీగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. పోలీసుల ఆలస్యంతో జరగని పోస్టుమార్టం నారాయణ రెడ్డి హత్య ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. నారాయణ రెడ్డితో పాటు వేరే వాహనంలో ప్రయాణించిన వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, క్లూస్ టీం, డాగ్స్ టీం రావడానికి చాలా ఆలస్యం జరిగింది. హత్య జరిగిన రెండు గంటల తర్వాత హాస్పిటల్‌కు నారాయణ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. ఆదివారం కావడంతో ఒంటిగంట వరకు మాత్రమే పోస్టుమార్టం చేస్తామని, ఆ సమయం దాటిపోయింది కాబట్టి ఆదివారం ఇక పోస్టుమార్టం చేయబోమని వైద్యులు స్పష్టం చేశారు. దాంతో ఆదివారం నారాయణరెడ్డి మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. పోస్టుమార్టం సోమవారం ఉదయం చేయనున్నారు. పోలీసులు కావాలనే ఆలస్యం చేశారని, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఈ ప్రక్రియ ఆలస్యంగా సాగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆదివారం మొత్తం కుటుంబ సభ్యులకు కనీసం మృతదేహాన్ని చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. 15 మందిపై కేసు నమోదు ఎ – 14గా కేఈ శ్యాంబాబు కృష్ణగిరి: పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకుల పాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసుకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేసినట్లు కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్ తెలిపారు. చెరుకుల పాడు గ్రామానికి చెందిన గోల్ల క్రిష్ణమోహన్ ఫిర్యాదు మేరకు చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులు, తొగర్చేడు రామానాయుడు, కోసనాపల్లికి చెందిన రామకృష్ణ, తొగర్చేడుకు చెందిన రామాంజనేయులు, బాలు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, వెంకటరాముడు, శ్రీను, చెరుకులపాడుకు చెందిన నారాయణ, రామాంజినేయులు, పెద్ద బీసన్న, రామాంజి నేయులు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే కేఈ శ్యాంబాబు ప్రధాన ముద్దాయి అయినప్పటికీ ఎ14గా కేసు నమోదు చేశారని, ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించడం కోసమే పోలీసులు ఇలా తూతూమంత్రంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేధించి.. వేధించి.. ప్రాణం తీశారు ‘‘రాజకీయ లబ్ధి కోసం మా కుటుంబాన్ని కేఈ కుటుంబం వేధిస్తూ వచ్చింది. వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డికి రోజు రోజుకు ఆదరణ పెరగడంతో ఎన్నికల్లో ఇక ఓటమి తప్పదని భావించడంతోనే నా భర్తను హత్య చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని ఊహించలేదు. పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రకటించినప్పటి నుంచి మా కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు పెరిగింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఇకపై పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కుటుంబాన్ని ఏ ఎన్నికల్లోనూ గెలవనివ్వం. అదే లక్ష్యంగా పని చేస్తా. ప్రాణం ఉన్నంత వరకు కేఈ కుటుంబ ఓటమి కోసమే పని చేస్తా, ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దం.’’ –నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి కేఈ సోదరులే కారణం ‘‘ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకే మా తమ్ముడు నారాయణ రెడ్డిని హత్య చేశారు. పత్తికొండలో కేఈ అరాచకాలు పెరిగిపోయాయి. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి పోరాడుతున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుతో పాటు వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్ హత్యలో కీలక పాత్రధారులు. గన్మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోలేదు. గన్‌లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. నెలన్నర క్రితం ఎస్పీ, డీఐజీతో పాటు ఇంటెలిజెన్స్ డీఐజీని కూడా కలిసి కేఈ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి విన్నవించారు. అయినప్పటికీ ఏం చర్యలు తీసుకోలేదు.’’ – నారాయణ రెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ట్రాక్టర్లతో గుద్ది ఆపై నరికి చంపారు మాది రామకృష్ణాపురం. అన్న చెరుకులపాడు నారాయణరెడ్డి, డ్రైవర్ ఎల్లప్పతో పాటు నేను. శివరామిరెడ్డి, మల్లికార్జున, పోతుగల్లు వెంకటేష్, సాంబశివుడు, గోవర్దన్ జీపులో ఉన్నాం. ముందుగా నంద్యాలలో పెద్దిరెడ్డిగారి రామచంద్రారెడ్డి వారి పెళ్లి చూసుకుని వెల్దుర్తికి వెళ్లాం. అక్కడ క్రిష్ణగిరి వారి పెళ్లి చూసుకుని కోశనపల్లికి వెళ్లాం. అక్కడ ఆంజనేయస్వామి గుళ్లో పూజలు నిర్వహించి, అక్కడ కూడా ఓ పెళ్లికి వెళ్లాం. అనంతరం రామకృష్ణాపురంలో మరో పెళ్లికి వెళ్తుంటే క్రిష్ణగిరికి ఒక కిలోమీటర్ దూరంలో మా వాహనాన్ని ట్రాక్టర్‌తో గుద్దారు. వెనుకవైపున ఉన్న మరో వాహనం రాకుండా ట్రాక్టర్ అడ్డుపెట్టారు. ఆ తర్వాత మేము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు మరో ట్రాక్టర్ తీసుకొచ్చారు. దీంతో మా వాహనాన్ని రహదారి కిందకు తీసుకెళ్లడంతో రాళ్లతో అద్దాలు పగులగొట్టారు. అన్నపై దాడి చేస్తుండగా మేము అడ్డం వెళ్లడంతో మా వెంట పడ్డారు. మమ్ములను తరిమేసి నారాయణరెడ్డి అన్నను రాయితో కొట్టి, వేటకొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. దాడిని అడ్డుకున్న సాంబశివుడును సైతం దారుణంగా చంపేశారు. –పోతిరెడ్డి, ప్రత్యక్ష సాక్షి -
రేపు కర్నూలు జిల్లా బంద్