
ఆ ఘనత వైఎస్‌ఆర్‌దే
రాష్ట్రంలో మళ్లీ శాసన మండలి వ్యవస్థను తెచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డేనని శాసనమండలి చైర్మన్ చక్రపాణి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్
వేంపల్లె:రాష్ట్రంలో మళ్లీ శాసన మండలి వ్యవస్థను తెచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డేనని శాసనమండలి చైర్మన్ చక్రపాణి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేసిన శాసనమండలిని 2007లో ఆ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించిన ఘనత వైఎస్‌ఆర్‌కు దక్కుతుందన్నారు.శాసనమండలి వ్యవస్థ ఏర్పాటులో జాతీయ విధానం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా రైతు విభాగపు అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వెంకటసుబ్బయ్య, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
కడప కల్చరల్ : రాష్ట్ర శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ఆదివారం కడప అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలోని ప్రధాన గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయనకు దర్గా ప్రతినిధి నయీమ్ గురువుల చరిత్ర, దర్గా విశేషాల గురించి వివరించారు. ఈ సందర్బంగా డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ దర్గా సందర్శన ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గండి అంజన్న సన్నిధిలో
చక్రాయపేట: శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఆదివారం సాయంత్రం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గండి అంజన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.