=ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి
=స్పోర్ట్స్ మీట్ ముగింపులో మంత్రి బస్వరాజు సారయ్య
ఆరెపల్లి (హసన్‌పర్తి), న్యూస్‌లైన్ : నిరుపేదలకు విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వడుప్సా జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆరెపల్లిలో ఎన్‌ఎస్‌ఆర్ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సర్కార్‌కు రెండు కళ్లలాంటివన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న తనను ప్రైవేట్ పాఠశాలల యాజమానులు రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు.
మంత్రి పదవనేది ఔట్ సోర్సింగ్ లాంటిదన్నారు. జిల్లా వాసిగా పదవీ ఉన్నా... లేకున్నా... అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. భారత దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార అన్నారు. వడుప్సా ఆధ్వర్యంలో ఏటా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా వడుప్సా డెరైక్టరీని మంత్రి ఆవిష్కరించారు.
వడుప్సా జిల్లాశాఖ అధ్యక్షుడు భూపాల్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహారావు, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఆర్ పాఠశాల కరస్పాండెంట్ ఎన్.సంపత్‌రావు, చీఫ్ అడ్వయిజర్ నారాయణరెడ్డి, వర్ధన్నపేట నియోజక వర్గ అధ్యక్షుడు వలస జ్ఞానేశ్వర్‌రావు, రాంబాబు, కాసం చంద్రారెడ్డి, ఆకుతోట రమేష్, భరద్వాజ నాయుడు, ముక్తిశ్వర్, తిరుమలేశ్వర్‌రెడ్డి, స్పోర్ట్ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, సరిత, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాంతోపాటు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని వడుప్సా నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఈ సందర్భంగా సారయ్య వారికి హామీ ఇచ్చారు.