గాలివానతో తెగిపడిన విద్యుత్ వైర్లు ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.
గాలివానతో తెగిపడిన విద్యుత్ వైర్లు ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కల్లుపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (60) తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. తెగిపడిన విద్యుత్ వైర్లను చూసుకోకుండా తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, మండలంలోని పచ్చారుమాకుపల్లిలో గాలివానకు సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన అరటి తోట గాలి వానకు నేల కూలింది.