
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్నమోదీ, కేంద్రంలోని పెద్దమోదీ లను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇద్దరు నియంతలు పాలిస్తున్నారని విమర్శించారు. వీరిని ఎప్పుడు ఓడించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణలో వచ్చే నిశ్శబ్ద విప్లవంలో 80–85 స్థానాలు గెలవడం ఖాయమని చెప్పారు.