'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?' | sarika death is a mystery: narayana reddy forensic departement | Sakshi
Sakshi News home page

'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'

Published Thu, Nov 5 2015 7:11 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?' - Sakshi

'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'

హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని ప్రముఖ ఫొరెన్సిక్ నిపుణుడు నారాయణ రెడ్డి అన్నారు. ఆమెది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో నివృత్తి చేయాల్సిన కోణాలు చాలా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు రెండు రకాల పొగలు వస్తాయని అందులో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతాయని, మోనాక్సైడ్ ఉంటే కాలిన దేహం బ్రైట్ రెడ్ గా మారిపోతుందని దీనిద్వారా కాలిన గాయాలతోనే చనిపోయినట్లు స్పష్టమవుంతుందని అన్నారు.

అలా లేకపోతే ముందే చంపి కాల్చివేశారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎడమవైపు ఎక్కువ కాలిందని చెబుతున్నారని అలా ఎందుకు జరిగిందో తెలియాల్సి ఉందన్నారు. అసలు ఘటన జరిగిన తర్వాత తలుపులు ఎవరు తెరిచారన్నది కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్లూజ్ టీంతోపాటు ఫొరెన్సిక్ డాక్టర్లను కూడా ఘటన స్థలానికి తీసుకెళ్తే బాగుండేదని పక్కా సమాచారం తెలిసేదని అన్నారు.

తెల్లవారుజామున చనిపోతే.. సాయంత్రం వరకు నేరస్థలంలోనే మృతదేహాలు ఉన్నాయని ముందుగానే అక్కడికి వైద్యులను తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. పెద్దకుమారుడు, తల్లి డోర్ దగ్గరే మరణించారంటే, తలుపులు బయటి నుంచి గడియ వేస్తే తెరవడానికి వెళ్లారా అనే కోణంలో కూడా ఆలోచించాలనన్నారు. కనీసం మంటలు అంటుకునే ముందు పిల్లలు అటూ ఇటూ పరుగెత్తాలని కానీ ఇద్దరు బెడ్పై అలాగే పడి ఉండి చనిపోవడం అనుమానం కలిగిస్తోందన్నారు. రెండు సిలిండర్లు తీసుకెళ్లి, ఒకదాన్నే తెరిచారని, ఒకదాన్ని అలాగే వదిలేశారని చెబుతున్నారు కానీ దీనిపై అనుమానమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement