అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు.
కర్నూలు: అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లాలోని వెల్దూర్తి మండలం చెరుకులపాడులో శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్‌ఆర్ సీపీ నేత నారాయణరెడ్డి వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్కార్పియోను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.