
ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు.
ఆదివారం ఉదయం.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన కసిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.