resigned
-
షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ రాజీనామా
షావోమి ఇండియా ప్రెసిడెంట్.. బీ మురళీకృష్ణన్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆరు సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్తున్న కారణంగా షావోమికి రాజీనామా చేసినట్లు సమాచారం.షియోమీ ఇండియా అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. స్వతంత్ర వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. 2018లో షావోమి ఇండియాలో అడుగుపెట్టిన మురళీకృష్ణన్ 2022లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ఈయన సంస్థలో కీలక పదవులను చేపట్టారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుఇటీవలే పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని షావోమి ఇండియా పూర్తి చేసుకుంది. 2023లో మను కుమార్ జైన్ కంపెనీని వీడిన తరువాత.. సంస్థ నుంచి వెళ్తున్న వారిలో మురళీకృష్ణన్ రెండో వ్యక్తి. అయితే మురళీకృష్ణన్ స్థానంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ సీఓఓగా సుధీన్ మాథుర్, సీఎఫ్ఓగా సమీర్ రావు, సీపీఓగా వరుణ్ మదన్, సీఎమ్ఓగా అనుజ్ శర్మ ఉన్నారు. -
డబ్బు చేతికి అందగానే.. మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా
-
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
-
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ప్రభుత్వ ఒత్తిడితో రాజీనామాలు చేసిన నలుగురు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు
-
చంద్రబాబు బెదిరింపులతో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
-
ప్రభుత్వ ఒత్తిడితో సవాంగ్ రాజీనామా
-
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.నిన్న వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారుగతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు మొదలు
నెల్లూరు (బారకాసు): ఎన్నికలు ముగియగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు మేయర్ దంపతులను బెదిరించి రాజకీయ అరాచకానికి తెరతీశారు. గిరిజన మహిళ రిజర్వేషన్‌తో వైఎస్సార్సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పోట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్లను పార్టీ మారాలని, లేదంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. నిస్సహాయ స్థితిలో ఆ గిరిజన దంపతులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, నేతలను టీడీపీలో చేరాలంటూ ఎన్నికలకు ముందు నుంచే శ్రీధర్‌రెడ్డి బెదిరింపులకు దిగారు.కొందరిపై రాజకీయంగానూ కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో మరింతగా బెదిరింపులకు దిగుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్ నుంచి పోట్లూరి స్రవంతి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈ డివిజన్ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్రవంతి దంపతులు అప్పట్లో వైఎస్సార్సీపీలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులుగా కొనసాగేవారు.అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సహకారంతో స్రవంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. 9 నెలల క్రితం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో మేయర్ స్రవంతి దంపతులు, కొందరు కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు. కొద్దిరోజుల్లోనే స్రవంతి దంపతులు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు.జరిగిందిదీ..నెల్లూరు నగరంలో దాదాపు 70 భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే తనఖా చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వచ్చిందంటూ ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మేయర్ భర్త జయవర్ధన్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్ విచారణకు ఆదేశించారు.గతంలో తన వెంట ఉండి, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్న మేయర్ దంపతులను తన దారికి తెచ్చుకునేందుకు, వారిపై పెత్తనం సాగించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఈ ‘ఫోర్జరీ’ ఫిర్యాదును ఆయుధంగా ఉపయోగించుకున్నారు. టీడీపీలో చేరితే కేసులు ఉండవని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో భయపడిన ఆ గిరిజన దంపతులు నిస్సహాయ స్థితిలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. -
Lok Sabha Election Results 2024: నవీన్ పట్నాయక్ రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ పరిపాలనకు తెరపడింది. 24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పటా్నయక్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రఘువర్ దాస్‌కు సమరి్పంచారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైంది. 147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. -
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్‌గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్‌ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్‌కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్‌గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్‌ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్‌ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్‌గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్‌ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్‌ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్‌ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన గౌరవ్
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను సనాతనానికి వ్యతిరేక నినాదాలు చేయలేనని, ఇకపై పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు. గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తాను పంపిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో ‘నేడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మార్గంలో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేను సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేను. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు దేశంలోనే ఘన చరిత్ర కలిగిన పార్టీ అని నమ్మాను. యువకులకు, మేధావుల ఆలోచనలకు విలువ ఇస్తారని భావించాను. అయోధ్యలోని నూతన రామాలయం విషయంలో కాంగ్రెస్ వైఖరికి నేను కలత చెందాను. నేను పుట్టుకతో హిందువును. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. ఇండియా కూటమితో సంబంధం కలిగిన పలువురు నేతలు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు నచ్చలేదని’ ఆ లేఖలో గౌరవ్ వల్లభ్ పేర్కొన్నారు. గౌరవ్ వల్లభ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ తూర్పు నుంచి తొలిసారి పోటీ చేశారు. గౌరవ్ విద్యావంతునిగా పేరొందారు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా పనిచేశారు. క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్లో డాక్టరేట్ అందుకున్నారు. విద్యావేత్తల కుటుంబం నుండి వచ్చిన గౌరవ్ వల్లభ్ 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6 — Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024 -
జనసేనకు మాజీ మేయర్ సరోజ రాజీనామా
సాక్షి, కాకినాడ: జనసేనకు మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారంటూ ఆమె మండిపడ్డారు. ‘‘జనసేన అనేది రెసిడెన్షియల్ కాలేజీ లాంటిందని.. ఒక కార్పోరేట్ ఆఫీస్‌లా నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘జనసేనలో మహిళలకు విలువ లేదు. నాదెండ్ల మనోహర్ టీడీపీకి కోవర్ట్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో మేము చాలా ఇబ్బందిపడ్డాం. బీసీలకు కూడా జనసేనలో విలువ లేదు. జనసేనలో బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని సరోజ అన్నారు. ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..! -
బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శనివారం ఆ పారీ్టకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే ఆయన రాజీనామా చేయ డం గమనార్హం. రాజీనామా లేఖలో ఈనెల 18న రాజీనామా చేసినట్లు పేర్కొనగా, చిన్నపరెడ్డి ఈ రోజే రాజీనామా చేశారని, టైపింగ్ ఎర్రర్ వల్ల అలా వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. నల్ల గొండ ఎంపీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో నిల పాలని మొదట్లో బీఆర్ఎస్ భావించింది. అయితే ఆయన బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది. కానీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, టికెట్ తనకే వస్తుందని చిన్నపరెడ్డి రెండ్రోజుల కిందట చెప్పారు. బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్యంగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అధిష్టానం హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. 15 రోజులు గడవక ముందే ఆయన్ను మార్చి చిన్నపరెడ్డికి టికెట్ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. కంచర్ల కృష్ణారెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
బీఆర్ఎస్కు పెద్దిరెడ్డి రాజీనామా
హుజూరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా, కార్మిక సంఘ నేతగా సేవలందించిన ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. 2021 జూలై 27న తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన కదనభేరి సభకు ఆహ్వానించనందుకు మనస్తాపంతో పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, ప్రజాభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పెద్దిరెడ్డి వెల్లడించారు. -
ఈసీ గోయల్ రాజీనామా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం ఆయన రాజీనామా చేయడం, ఆ వెంటనే దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. గోయల్ పదవీకాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. పైగా 2025 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ రిటైరయ్యాక గోయలే సీఈసీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడున్నరేళ్ల ముందే ఆయన రాజీనామా చేయడానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే గత ఫిబ్రవరిలోనే రిటైరయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘంలో అప్పటినుంచీ ఒక స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు గోయల్ కూడా తప్పుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేయడం ఇది తొలిసారేమీ కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన పలు కేసుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాలపై నాటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తీవ్ర అసమ్మతి తెలిపారు. అనంతరం 2020 ఆగస్టులో రాజీనామా చేశారు. తొలుత ఒక్కరే... ఎన్నికల సంఘంలో తొలుత సీఈసీ ఒక్కరే ఉండేవారు. ఆయన అపరిమిత అధికారాలు చలాయిస్తున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ 1989లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి ఈసీ తీసుకునే నిర్ణయాల్లో మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటవుతూ వస్తోంది. గోయల్ నియామకమూ వివాదమే... అరుణ్ గోయల్ 1985 పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియామకమూ వివాదాస్పదంగానే జరిగింది. 2022 నవంబర్ 18న గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా అదే రోజు కేంద్రం ఆమోదించింది. ఆ మర్నాడే ఈసీగా నియమించింది. దీన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదేం నియామకమంటూ విచారణ సందర్భంగా కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ, ఈసీ నియామక ఫైళ్లు మెరుపు వేగంతో కదలడం, మొత్తం ప్రక్రియ 24 గంటల్లోపే పూర్తవడంపై విస్మయం వెలిబుచి్చంది. అంత వేగంగా ఎందుకు నియమించాల్సి వచి్చందని కేంద్రాన్ని నిలదీసింది కూడా. ఇప్పుడేం జరగనుంది...? ఈసీ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అనుసరిస్తున్న 1991 నాటి చట్టానికి కీలక మార్పుచేర్పులు చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల (నియామకం, పదవీ నిబంధనలు, పదవీకాలం) చట్టం తెచ్చింది. దీని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవికి కేంద్ర న్యాయ మంత్రి సారథ్యంలోని సెర్చ్ కమిటీ ముందుగా ఐదు పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది. వారిలోంచి ఒకరిని ప్రధాని సారథ్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీలో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత సభ్యులుగా ఉంటారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాని తనకు అనుకూలమైన వారినే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేందుకు ఇది వీలు కలి్పస్తోందంటూ దుయ్యబట్టాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీలో రెండు ఖాళీల భర్తీ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త చట్టం ప్రకారమే ముందుకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు విని్పస్తున్నాయి. -
Lok Sabha elections 2024: బీజేపీలో చేరిన గంగోపాధ్యాయ్
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గంగోపాధ్యాయ్‌కు ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు బీజేపీ జెండా అందజేశారు. రాష్ట్రంలో టీఎంసీ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అభిజిత్ ఈ సందర్భంగా అన్నారు. -
కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?
కలకత్తా: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం(మార్చ్5) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను రాజీమా చేయనున్నట్లు గంగోపాధ్యాయ్ సోమవారమే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కొందరు న్యాయవాదులు, కక్షిదారులు ఆయనను కోరారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల గంగోపాధ్యాయ ఇచ్చిన కొన్ని తీర్పులు పశ్చిమబెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అయితే రాజీనామా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం జస్టిస్ గంగోపాధ్యాయ్ స్పష్టమైన సమాధానమివ్వలేదు. 2020 జులై30న కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా గంగోపాధ్యాయ్ పదోన్నతి పొందారు. ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికలు.. సీఈసీ ప్రెస్‌మీట్ -
రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ చీఫ్ రాజీనామా
సాక్షి, ఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(63) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన హిమాచల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం లభించింది. బీహార్‌లో పుట్టి పెరిగిన జగత్ ప్రకాష్(జేపీ) నడ్డా.. నరేంద్ర మోదీకి సహచరుడు. లాయర్‌గా కెరీర్‌ను ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన పూర్వ మూలాలు మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయి. అందుకే 1993 నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నెగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ రాష్ట్రానికి పలు శాఖల మంత్రిగానూ పని చేశారు. 2012లో హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. పెద్దల సభకు వెళ్లాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. .. 2014 నుంచి 2019 నడుమ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2019 జూన్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2020, జనవరి 20వ తేదీ నుంచి ఆయన బీజేపీ జాతీయాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2022లోనే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. బీజేపీ అధిష్టానం కాలపరిమితిని పొడగించింది. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పాలమూరు ‘లోకల్’ పోరుకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్దే ఆధిపత్యం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. -
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
Iswaran: బాబు సింగపూర్ పార్ట్నర్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రమణియం ఈశ్వరన్.. బాబు బాటలోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి (PAP)కి సైతం రాజీనామా సమర్పించారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది(వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు). ఇక దర్యాప్తు నేపథ్యంలో.. సింగపూర్ ప్రధాని, ఈశ్వరన్‌ను సెలవుల మీద పక్కకు పెట్టారు. మరోవైపు గతేదాడి సెప్టెంబర్‌లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: చిక్కుల్లో ఈశ్వరన్.. కేసు నేపథ్యం ఇదే! భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరన్‌పై గురువారం న్యాయస్థానంలో 27 రకాల నేరారోపణల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సీపీఐబీ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. 2025లో సింగపూర్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ వస్తోంది. తాజా రాజీనామా పరిణామంతో.. గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుతో లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు. Delighted to have met Second Minister (Trade & Industry) S. Iswaran on opportunities in AP. pic.twitter.com/s8kf19f00g — N Chandrababu Naidu (@ncbn) November 12, 2014 అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న నాడు సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అక్రమాల ఒప్పందం రద్దు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అక్రమాల ఒప్పందం రద్దు అయింది. బాబు తరహా మనిషే! సుబ్రమణియం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే విమర్శలు ఉన్నాయి. ఈశ్వరన్ 1997లో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు. ఆపై 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. మన దగ్గర సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సీఐడీ దర్యాప్తు ద్వారా బద్ధలయ్యిందో.. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సింగపూర్ దర్యాప్తు సంస్థ సీపీఐబీ నిర్ధారించింది. ఇక ఈ కేసులో ఈశ్వరన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హూంగ్ బెంగ్‌ను సైతం దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసి విచారించింది.