కలకత్తా: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం(మార్చ్5) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
తాను రాజీమా చేయనున్నట్లు గంగోపాధ్యాయ్ సోమవారమే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కొందరు న్యాయవాదులు, కక్షిదారులు ఆయనను కోరారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల గంగోపాధ్యాయ ఇచ్చిన కొన్ని తీర్పులు పశ్చిమబెంగాల్‌లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.
అయితే రాజీనామా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం జస్టిస్ గంగోపాధ్యాయ్ స్పష్టమైన సమాధానమివ్వలేదు. 2020 జులై30న కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా గంగోపాధ్యాయ్ పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment