
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గంగోపాధ్యాయ్‌కు ఘన స్వాగతం లభించింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు బీజేపీ జెండా అందజేశారు. రాష్ట్రంలో టీఎంసీ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అభిజిత్ ఈ సందర్భంగా అన్నారు.