
భైంసాటౌన్: నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పి.రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనను కాదని, గత ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన రామారావుపటేల్‌కు టికెట్ కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమై ఆమె రాజీనామాను ప్రకటించారు.
అనంతరం మాట్లాడుతూ... అభ్యర్థుల జాబితా ప్రకటనకు గంట ముందు వరకు ఉన్న పేరును తొలగించి, వేరేవారికి ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ముధోల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ శుక్రవారం రాత్రి రమాదేవిని ఆమె నివాసంలో కలిశారు. పార్టీలోకి రావాలని ఆహా్వనించగా ఆమె అందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment