సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను నియమించింది.
ఇదిలా ఉండగా, టీ కాంగ్రెస్‌లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. లేదు.. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు తెలిపారు.
టీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను పంపించి.. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను అధిష్ఠానం నియమించింది.
ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయ్యే ముందు.. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment