in charge
-
AP: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
సాక్షి, విజయవాడ: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది.జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వీరే..శ్రీకాకుళం జిల్లా- కొండపల్లి శ్రీనివాస్పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు- కింజరాపు అచ్చెన్నాయుడువిజయనగరం జిల్లా- వంగలపూడి అనితవిశాఖ జిల్లా- డోలా బాలవీరాంజనేయస్వామిఅల్లూరి సీతారామరాజు జిల్లా- గుమ్మడి సంధ్యారాణిఅనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్రకాకినాడ జిల్లా- పొంగూరు నారాయణతూర్పుగోదావరి జిల్లా- నిమ్మల రామానాయుడుఏలూరు జిల్లా- నాదెండ్ల మనోహర్పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు- గొట్టిపాటి రవికుమార్ఎన్టీఆర్ జిల్లా- సత్యకుమార్ యాదవ్కృష్ణా జిల్లా- వాసంశెట్టి సుభాష్గుంటూరు జిల్లా- కందుల దుర్గేష్బాపట్ల జిల్లా- కొలుసు పార్థసారథిప్రకాశం జిల్లా- ఆనం రామనారాయణరెడ్డినెల్లూరు జిల్లా- ఎన్ఎండీ ఫరూఖ్నంద్యాల జిల్లా- పయ్యావుల కేశవ్అనంతపురం జిల్లా- టీజీ భరత్శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు- అనగాని సత్యప్రసాద్వైఎస్సార్ జిల్లా- ఎస్.సవితఅన్నమయ్య జిల్లా- బీసీ జనార్దన్రెడ్డిచిత్తూరు జిల్లా- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి -
రూ.రెండొందలు తీసుకో.. ఫొటోకు ఫోజిచ్చుకో..
శ్రీరంగరాజపురం: ‘రూ.రెండు వందలు తీసుకోండి.. ఫొటోకు ఫోజు ఇవ్వండి’ అని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి డాక్టర్ థామస్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని వెంకటాపురం సచివాలయం పరిధిలో పొదలపల్లె దళితవాడలో మీ ఇంటికే మీ థామస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం లేక వెలవెలబోయింది. ప్రతి ఇంటికీ వెళ్లి రూ.200 ఇచ్చి తన వెంటా నడిస్తే మీకు మరిన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా జనం రాకపోవడంతో గంగాధరనెల్లూరు మండలంలోని కొండేపల్లెలో తమ గ్రామానికి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళుతున్న వారిని పిలిచి రూ.200 తీసుకోండి ఫొటోకు ఫోజు ఇవ్వండి అని చెప్పి వారికి పార్టీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామం ఎప్పటికీ వైఎస్సార్సీపీ కంచు కోట అని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పయ్య మాట్లాడుతూ టీడీపీ అధినేతకు తాము ఏ మాత్రం తీసిపోమని అన్నట్లు థామస్ వ్యవహరశైలి ఉందన్నారు. శ్రీరంగరాజపురం మండలం వైఎస్సార్సీపీ పార్టీకి కంచుకోట అని అన్నారు. టీడీపీ ఎన్ని కుప్పి గంతులు వేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. -
కందుకూరు తొక్కిసలాట ఘటన.. ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు కందుకూరు సభ తొక్కిసలాట ఘటనలో కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది మృతికి కారణమైన నాగేశ్వరరావు, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 304 పార్ట్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరులో ఇరుకు సందులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే చంద్రబాబు సభ పెట్టడంతో తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా.. కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చదవండి: Fact Check: ప్రాణాలు పోతున్నా ఆగని టీడీపీ ప్రచార యావ.. ఫేక్ వీడియోలతో.. -
ఇక సెలవు.. ఉంటా మరి..! టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పిన మాణిక్కం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను నియమించింది. ఇదిలా ఉండగా, టీ కాంగ్రెస్‌లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. లేదు.. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు తెలిపారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను పంపించి.. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయ్యే ముందు.. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. -
నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ రామ్మూర్తి
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ నెలరోజులు సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో డీన్ డాక్టర్ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన వచ్చే నెల 2వరకు ఇన్చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. -
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జీఎంగా అరుణ్‌కుమార్ జైన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్‌గా అరుణ్‌కుమార్ జైన్ బాధ్యతలు చేపట్టారు. జోన్ జీఎం గజానన్ మాల్యా ఇటీవలే పదవీ విరమణ పొందడంతో తాత్కాలికంగా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ రెండు నెలలుగా అదనపు బాధ్యతలతో జీఎంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏజీఎం అరుణ్‌కుమార్ జైన్‌కు జీఎం స్థాయి హోదా కల్పిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అరుణ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 1986 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజినీర్‌గా, హైదరాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. ఇతర జోన్లలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. -
బాధ్యులెవరు బాసూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని పదే పదే చెబుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను మాత్రం చక్కదిద్దుకోలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బాధ్యులు లేకు న్నా టీపీసీసీ అగ్ర నేతలు మిన్నకుండి పోవడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మరో 10 చోట్ల అసలు ఇన్చార్జి ఎవరో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామనే ధీమా నుంచి ఇప్పుడు కనీసం నియోజకల బాధ్యులెవరో తేల్చుకోలేని పరిస్థితి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ వర్గాలు అం చనా వేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే రెండో స్థానం కోసం పోటీ పడటం తప్ప గత్యంతరం ఉండబోదని అంటున్నాయి. ఖమ్మంలో 8 సెగ్మెంట్లలో బాధ్యులెవరో! ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే పార్టీ చాలా బలంగా ఉందనుకుంటున్న ఖమ్మం జిల్లాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులెవరో తెలియని పరిస్థితి. మధిర, భద్రాచలంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పిస్తే ఎక్కడా పార్టీకి బాధ్యులు లేకుండా పోయారు. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను గతంలో టీడీపీకి కేటాయించారు. కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, పాలేరుల నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. వైరాలో గత ఎన్నిక ల్లో పోటీ చేసిన అభ్యర్థి క్రియాహీనంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలాగెలుస్తోందో ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలోనూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లగా అక్కడ ఇన్చార్జి లేడు. ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్లోకి వెళ్లాక పూర్తి స్థాయి ఇన్చార్జి లేని పరిస్థితి. బీర్ల అయిలయ్య క్రియాశీలంగానే పనిచేస్తున్నా ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరాక అభిలాశ్, జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లోకి వచ్చినా వారిలో ఎవరికీ ఇన్చార్జి బాధ్యతలివ్వలేదు. మక్తల్‌లోనూ బాధ్యుడు లేని పరిస్థితుల్లో వాకిటి శ్రీహరి కొంత మేర పార్టీకి అండగా ఉంటున్నారు. రంగారెడ్డిలో ఇలా.. హైదరాబాద్‌లో అలా.. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, మహబూబాబాద్ సీట్లలో బాధ్యుల్లేరు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్ బీజేపీలో చేరాక అక్కడ పార్టీకి ఓ నాథుడు లేని పరిస్థితి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్లో జిల్లా కేంద్రం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేసినా ఇప్పుడు ఆయన కూడా అసెంబ్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించట్లేదు. సిరిసిల్లలో మహేందర్‌రెడ్డి క్రియాశీలంగా లేని పరిస్థితి. రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో కూడా బాధ్యుల్లేరు. హైదరాబాద్ పాత బస్తీని మినహాయించినా గోషామహల్, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి. మేమంటే మేం ఇన్‌చార్జులమంటూ..! కొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు నేతలు తామంటే తాము ఇన్‌చార్జులమని చెప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు సభ్యత్వం డబ్బులు ఎవరు కట్టాలో కూడా సమస్యగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. చదవండి: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
కుటుంబ పాలనతో లూటీ: తరుణ్ చుగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. ఆయన శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తండ్రి కొడుకుల పార్టీ తెలంగాణను దోచుకుంటుందని దుయ్యబట్టారు. కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘టీఆర్ఎస్తో ఏ దోస్తీ లేదు’) ఫామ్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు రావడంలేదని, ఒక్క గ్రామానికైనా, ఒక్క ఆస్పత్రికైనా, ఒక్క పేద వాడి ఇంటికైనా సీఎం వెళ్ళారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిజాం సర్కారు కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడ్దుపెట్టుకొని బీజేపీని తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గరీబ్ విముక్త్ భారత్ నిర్మాణానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. (చదవండి: కొత్త కోడళ్లకు నో రేషన్..) -
నిరంతరం ప్రజల్లో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పార్టీ నేతల మధ్య ఐక్యత... విజయ సోపానాలని, కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలను చేరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమితులైన తర్వాత మాణిక్యం తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులపై వరుస పోరాటాలు, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. మూడున్నర గంటలు సాగిన సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ మనమంతా టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని అన్నారు. ప్రతి నెలలో రెండుసార్లు తప్పకుండా కొర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ సమావేశాల్లో అన్ని విషయాలు చర్చించుకుందామని పార్టీ నేతలకు చెప్పారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడవచ్చని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్ర స్థాయి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, సోనియా వల్లనే తెలంగాణ సాధ్యమయిందని, ఆమె త్యాగాన్ని జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, కోర్ కమిటీ సభ్యులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ ఇటీవల కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలివిగా ఆటలాడుతున్నారని, రైతులపై కపట ప్రేమ చూపెడుతున్నారని మాణిక్యం విమర్శించారు. అన్ని బిల్లుల విషయంలో అందరి కంటే ముందుగానే బీజేపీకి, మోదీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయాలని కోరారు. ఈ నెల 28న గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేయాలని, అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాలని, ఈ కార్యక్రమంలో మండల, రాష్ట్ర స్థాయి నేతలు పాలుపంచుకోవాలని కోరారు. అక్టోబర్ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల్లో సంతకాల సేకరణ పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల కోసమే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రైతుల పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పారు. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా స్పీకప్ ఆన్ అగ్రికల్చర్ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశామని చెప్పారు. ఇంకా వరుస కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని విజయవంతం చేయాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. సమావేశంలో పొన్నాల, సంపత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని సూచించారు. ఠాగూర్‌కు ఘన స్వాగతం శనివారం సాయంత్రం 5 గంటలకు చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డిలు విమానాశ్రయానికి వచ్చారు. గాంధీభవన్ వద్ద ఠాగూర్‌కు డప్పులు, భజంత్రీలు, బాణాసంచాతో పార్టీ కేడర్ స్వాగతం పలికింది. -
జడ్చర్ల కాంగ్రెస్ ఇన్చార్జిగా అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జనంపల్లి అనిరుధ్‌రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు దశాబ్ద కాలం గా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనిరుధ్ గత ఆగస్టులో కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ నుంచి పోటీకి అనిరుధ్ పేరును కాంగ్రెస్ పరిశీలించింది. అసెంబ్లీ టికెట్ దక్కకున్నా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అనిరుధ్ చేసి న కృషిని గుర్తించిన పార్టీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించింది. -
ఇన్చార్జిల గుప్పెట్లో బీసీ సంక్షేమం!
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్చార్జిల చేతుల్లోకి వెళ్లిపోయింది. కీలక పోస్టులకు ఇన్‌చార్జిలే పాలకులై కూర్చున్నారు. దీంతో ఇక్కడ పనులు సక్రమంగా సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పట్టించుకొనేవారు లేక.. సిబ్బంది మధ్య ఉన్న విభేదాలు మరింత ముదురి పాకాన పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్: కొద్ది సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో సహా య బీసీ సంక్షేమాధికారులు (ఏబీసీ) పోస్టులు భర్తీ జరగలేదు. దీంతో సీనియర్ సంక్షేమ వసతి గృహ అధికారులకు ఏబీసీలుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకూ ఉన్న రెగ్యులర్ జిల్లా బీసీ సంక్షేమాధికారి (డీబీసీ) బి.రవిచంద్రను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం శుక్రవారం ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో అదీ ఇన్చార్జి పాలనకు వెళ్లిపోయింది. దీంతో ఈ శాఖలోని జిల్లా బీసీ సంక్షేమాధికారితో పాటు ఐదుగురు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా ఇన్‌చార్జీలే వ్యవహరిస్తున్నారు. కొరవడిన సమన్వయం! గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ శాఖలోని ఉద్యోగులో ్ల సమన్వయం కొరవడింది. ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటుగా మారింది. సిబ్బందిలో ఉన్న వివాదాలు ఆ శాఖను రోడ్డున పడేస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా గతంలో పని చేసి.. పదవి విరమణ చేసిన వారు కూడా ఫిర్యాదులు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇన్చార్జిల వివరాలు ఇలా.. జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇన్చార్జిగా శ్రీకాకుళం ఏబీసీ-2 బగాన ప్రకాశరావు వ్యవహరిస్తున్నారు. ఈయన ఆమదాలవలస వసతి గృహం సంక్షేమాధికారి. ఈయనకు శ్రీకాకుళం ఏబీసీ-2 ఇన్చార్జితో పాటు, డీబీసీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం-1 ఏబీసీగా సత్తారు వసంత కుమారి వ్యవహరిస్తున్నారు. ఈమె శ్రీకాకుళంలోని బీసీ కళాశాల మహిళా వసతి గృహం సంక్షమాధికారిణి. పలాస ఏబీసీగా హెచ్ కృష్ణారావు ఇన్చార్జిగా ఉన్నారు. ఈయన పలాస బీసీ వసతి గృహం అధికారి. టెక్కలి ఏబీసీగా ఎం.రాఘవేంద్రరావు ఇన్చార్జిగా ఉన్నారు. ఈయన కోటబోమ్మాళి మండలం నిమ్మాడ బీసీ వసతి గృహం అధికారి. పాలకొండ ఏబీసీగా ఎల్.అప్పారావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన కొత్తూరు మండలం లోని కడుమ బీసీ వసతి గృహం సంక్షేమాధికారిగా ఉన్నారు. వెంటాడుతున్న వివాదాలు -ఈ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు వెంటాడుతున్నాయి. జిల్లా కార్యాలయంలో కొంతమంది సిబ్బంది వారి హవా సాగించుకొనేందుకు నిరంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి వల్ల కాకపోతే ఇతరులచే ఫిర్యాదు చేయించి, వారికి నచ్చిన విధంగా, నచ్చిన సీటుని పొందడం పరిపాటుగా మారింది. బదిలీ జరిగినా పలుకుబడితో జిల్లా కేంధ్రంలోనే ఉండేలా ఆధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ శాఖలో గతంతో పనిచేసిన డీబీసీలు కూడా వివాదాలతోనే వెళ్లిపోయారు. నాగరాణి డీబీసీగా పనిచేసిన కాలంలో పలు లోకాయుక్త కేసులు ఉండేవి. ఆ తరువాత వచ్చిన లాలా లజపతిరావు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమ బిల్లులతో నగదు స్వాహ, ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. గత ఏడాది క్రితం ఇద్దరు కింది స్థాయి ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు మాయమయ్యాయి. దీనిపై అప్పట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా స్కాలర్‌షిప్పుల విభాగం కోసం ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ల మద్య వివాదం పెరిగింది. దీంతో మహిళా ఉద్యోగి ప్రైవేటు వ్యక్తుల సాయంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే డీబీసీ సరెండర్‌కు దారితీసింది. -
సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జీఎంగా ఎం.ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సిండికేట్ బ్యాంక్ శాఖల ఇన్చార్జ్గా ఎం.ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ రీజనల్ మేనేజర్‌గా ఉన్న ప్రసాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 7 రీజనల్ ఆఫీసులు, 550 శాఖలకు ఇన్చార్జ్గా ప్రసాద్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. -
విత్తన క్షేత్రానికి నిర్లక్ష్యం చీడ
బూర్జ : మండలంలోని పెద్దపేట విత్తనాభివృద్ధి క్షేత్రం ఒకప్పుడు ఉత్తరాంధ్రకే తలమానికం. ఇప్పుడు నిర్లక్ష్యం చీడ ఆవరించి... సమస్యలతో సతమతమవుతోంది. దీన్ని పట్టించుకునే నాథుడు కరువవ్వడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 1961లో 122ఎకరాల విస్తీర్ణంలో ఈ విత్తనాభివృద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుంచి సరఫరా అయిన విత్తనాలు వేసి ఇక్కడ ఉత్పత్తయిన పౌండేషన్ సీడ్‌ను జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుంచి జిల్లాలోని రైతులకు విత్తనాలు అందజేసేది. ఇక్కడి విత్తనాలు చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఎగుమతి అవుతుండేవి. ఏటా 80ఎకరాల విస్తీర్ణంలో సేద్యం చేపట్టి విత్తనాలు సిద్ధం చేసేవారు. కూలీల కొరత, వర్షాబావం, సాగునీటికొరత, నీటినిల్వకోసం ఏర్పాటు చేసిన చెరువులు పూడుకు పోవటం వంటి సమస్యలు దీని మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత ఏడాది 55 ఎకరాల భూమిలో వరి పండించారు. ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రోసెసింగ్ చేసి విత్తనాలు సిద్ధం చేసి గన్నీబేగ్‌లో లోడుచేసి నిలువ వుంచుతారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశాక వీటిని ఏఓలకు సరఫరా చేస్తారు. గత ఏడాది సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ మండలంలోని రైతులను నాశనం చేసిప్పటికి క్షేత్రంలోని పంటలకు సకాలంలో సాగునీరందించి మేలు చేసింది. అయినా అధికారుల నిర్లక్ష్యం,ప్రజాప్రతినిధుల అలక్ష్యం వెరసి క్షేత్రం నాశనమవుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత ఈ క్షేత్రంలో ఒక మేనేజర్, ఏఈఓ, ముగ్గురు వాచ్మన్లు ఉండాలి. పెర్మినెంట్‌గా ఒక్క వాచ్‌మన్ తప్ప ఎవ్వరూలేరు. మేనేజర్‌గా వీరఘట్టం ఏఓ స్వర్ణలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఏఈఓగా బూర్జ ఏఈఓ సురేష్‌ను తాత్కాలికంగా వారం రోజుల నుండి డెప్యుటేషన్‌పై ఈ సీజన్లో నియమించారు. ఇన్చార్జి అధికారుల్లో చిత్తశుద్ధి లోపించి అనుకున్నస్థాయిలో విత్తనాభివృద్ధిని సాధించడంలేదు. సకాలంలో సాగని వ్యవసాయం రాష్ట్రంలో రైతులంతా విత్తనాలు వేసి వరినారును ఏపుగా పెంచుతూ నాట్లు వేసేందుకు నానా తంటాలు పడుతూ ఖరీఫ్‌సీజన్‌కి సిద్ధమైనా అన్నీ తెలిసిన వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఇంకా క్షేత్రంలో దుక్కులు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పది సంవత్సరాలుగా ఇక్కడ సమయానికి ఉభాలు చేయరు. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గుతోంది. ఇక్కడ మామిడి, చింత చెట్లు ఉన్నాయి. వాటి ఆదాయం ఏమవుతుందో తెలియటం లేదు. క్షేత్రానికి సంబంధించిన ట్రాక్టర్, ఇంజిన్లు వంటి యంత్రాలు మూలకు చేరాయి. ఓనిగెడ్డ నుంచి నీరు విడుదలైతేకాని ఇక్కడ నాట్లు పడవు, ప్రభుత్వం కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించక పోవటంతో ఇక్కడ పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. బయటపనులు లేనప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తుంటారు. కూలీలు ఎప్పుడు దొరికితే అప్పుడే ఇక్కడ ఉభాలు ప్రారంభిస్తారు. క్షేత్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు =1966లో ఏర్పాటు చేసిన వ్యవసాయబావులు అడుగంటి పోయాయి. = 1994లో ఒక వ్యవసాయబావి నిర్మించి పక్కనే పంపుషెడ్ నిర్మించి విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. మూడేళ్ళ క్రితమే అవన్నీ మూలకుచేరాయి. = 2007లో రూ. ఆరు లక్షలతో సాగునీటి నిలువ కోసం 5చెరువులు తవ్వారు. వీటి నిర్వహణ సక్రమంగా చేపట్టక పోవటంతో గత ఏడాది సంభవించిన మూడు తుఫాన్ల కారణంగా అధిక వర్షాలు కురిసినప్పటికి నీరునిలువ వుండలేదు. తుప్పలు, డొంకలు ఏపుగా పెరగటంతో మిగిలిన భూములు బీడుభూములుగా మారాయి. = 2సిమెంటు కల్లాలు పూర్తిగా పాడయ్యాయి, సిబ్బంది క్వార్టరు, విత్తనాలు నిలువచేసే గోడౌన్, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రహ రీ లేక క్షేత్రం ఆక్రమణలపాలవుతోంది. = ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ప్రతిపాదనలు పంపించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఈ క్షేత్రం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి ఈ క్షేత్రాన్ని ప్రగతి పధంలో నడిపించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
శాంతారావుకు ఆరోగ్య వర్సిటీ బాధ్యతలు
హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ జి. శాంతారావుకు ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్య విద్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత వీసీ రవిరాజు ఈ నెల 9 నుంచి 26 వరకు విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన వచ్చే వరకూ ఈ బాధ్యతలను డీఎంఈకి అప్పగించినట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జిల నియామకం
విజయనగరం టౌన్ : జిల్లాలోని పలు మండలాలకు వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జిలను నియమించినట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. డెంకాడ, భోగాపురం మండలాలకు గదిరాజు సూ రపురాజు, గరివిడి మండలానికి గొర్లె వెంకటరమణ, గజపతినగరం, బొండపల్లి మండలాలకు బర్రి చిన్న అప్పన్న, జామి, వేపాడ మండలాలకు పి. జైహింద్‌కుమార్, ఎస్. కోట, ఎల్. కోట మండలాలకు మామిడి అప్పలనాయుడు, నెల్లిమర్లకు కడియాల రామకృష్ణను నియమించినట్టు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను నాయకు లు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. -
తమ్ముళ్ల మధ్య అడహాక్ చిచ్చు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్ల మధ్య అడహాక్ కమిటీ చిచ్చు రాజుకుంటోంది. కమిటీలో కీలక బాధ్యతలు తమకే కావాలంటూ ముగ్గురు నేతలు పట్టుబడుతున్నారు. దీంతో నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదుపై సందిగ్ధత నెలకొంది. టీడీపీలో జిల్లా, మండల, గ్రామ, నియోజక వర్గ కమిటీలకు గడువు పూర్తి కావచ్చింది. దీంతో అడహాక్ కమిటీలను నియమించి పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని రాష్ట్ర పార్టీ సూచించింది. ముఖ్యంగా నవంబర్ మొదటి వారంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సభ్యత్వ నమోదు ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లాలో రెండు పర్యాయాలు టీడీపీ ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర పార్టీ కన్వీనర్ పదవి కోసం ముగ్గురు నేతలు తనకే కట్టబెట్టాలని పోటీ పడినట్లు సమాచారం. అందులో ఒకరు నగర నియోజక వర్గ ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రమేష్‌రెడ్డి, చాట్ల నరసింహారావు ఉన్నారు. వీరు కాకుండా రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా నెల్లూరు సిటీ, రూరల్‌లో తన కనుసన్నల్లోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ నడవాలని భావిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తనకు కట్టబెడితేనే... అడహాక్ కమిటీలో నగర కన్వీనర్ బాధ్యతలను తనకు కట్టబెడితేనే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటానని, లేకపోతే బాలకృష్ణ వద్ద తేల్చుకుంటానని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్యాయం జరిగిందని, కనీసం అడహాక్ కమిటీలోనైనా న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని జిల్లా పార్టీ నాయకుల వద్ద గట్టిగా చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నగర నియోజక వర్గ ఇన్చార్జి బాధ్యతలను చూస్తున్నందున తనకే సభ్యత్వ నమోదు బాధ్యత అప్పగించాలని జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్రకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీనిపై మాజీ మంత్రి రమేష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నగర, రూరల్ నియోజక వర్గాల్లో సభ్యత్వ నమోదు తనకే అప్పజెప్పాలని గట్టిగా వాదించినట్లు సమాచారం. టీడీపీ వ్యవస్థాపకుల్లో తాను కీలకమైన వ్యక్తి అయినందున తనకే బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మంత్రి నారాయణ అనుచరుడైన చాట్ల నరసింహారావు నగర కన్వీనర్ పదవికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో తమ వర్గం పట్టునిలుపుకునేందుకు మంత్రి ఆయనను తెరపైకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అడహాక్ కమిటీల ఏర్పాటు వ్యవహారం తలనొప్పిగా మారటంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదావేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఎన్నాళ్లీ ఇన్చార్జి ఎంఈవో వ్యవస్థ
నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరును, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చే మండల విద్యాధికారుల నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య గాడి తప్పుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో 52 మండలాలకు గానూ కేవలం మూడు మండలాల్లోనే రెగ్యులర్ విద్యాధికారులు ఉన్నారు. దీంతో మిగతా 49 మండలాల్లో ఇన్‌చార్జీలే విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే సీనియర్ ప్రధానోపాధ్యాయులైన పీజీ హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎంఈవోల నియామకంపై దృష్టి సారించకపోవడంతో ప్రాథమిక విద్య అటకెక్కింది. 49 ఇన్‌చార్జీలే. కెరమెరి, బెజ్జూర్, తిర్యాణి మినహా 49 మండలాలకు ఇన్‌చార్జీలే ఎంఈవోలుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో విద్యా పథకాల అమలు, పాఠశాలల పర్యవేక్షణ జరుగుతోంది. సీనియర్ ఉపాధ్యాయులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో పనిభారంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు పాఠశాలలపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాఠశాలలో బోధన సక్రమంగా జరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడే పాఠశాలల్లోని విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇన్చార్జి ఎంఈవోల పాలనను ఆసరాగా చేసుకొని కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆలస్యంగా వస్తూ ముందు వెళ్లిపోవడం జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారైతే ఆసలు పాఠశాలలకే వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం ఇన్చార్జి ఎంఈవోల వ్యవస్థను ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫీజుల వివరాలు తెలిపే పట్టికను పాఠశాలల్లో ప్రదర్శించడం లేదు. జిల్లాలోని అనేక పాఠశాలకు అనుమతులు కూడా లేవనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్నింటిలో కనీస వసతలు, ఆట స్థలాలు, తదితర నిబంధనలు పాటించకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్న ఇన్చార్జి ఎంఈవోలు చూసీ చూడనట్లు ‘మామూలు’గా వ్యవహరిస్తూనే విమర్శలున్నాయి. -
నగరం కాషాయమయం
అమిత్ షా రాకకు సర్వం సిద్ధం ఇంపీరియల్ గార్డెన్లో నేడు అభినందన సభ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న పలువురు కార్పొరేటర్లు సాక్షి, సిటీబ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాకను పురస్కరించుకుని నగరం కాషాయ మయమైంది. ప్రధాన మార్గాలు, కూడళ్లలో బీజేపీ జెండాలు, నాయకుల ఫ్లెక్సీలతో నిండిపోయింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నగర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సమాయత్త మయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నగర బీజేపీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 2.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు సాదర స్వాగతం పలికి అటునుంచి నేరుగా బేగంపేటలోని టూరిజం గెస్ట్‌హౌస్‌కు తరలనున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో అమిత్ షాకు అభినందన సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. బలోపేతమే ప్రధాన వ్యూహం కేంద్రంలో అధికారంలో ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలం పుంజుకోవాలన్న వ్యూహంతో బీజేపీ కదులుతోంది. కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వంపై నమ్మకం కుదరడంతో రాష్ట్రంలో పలువురు నేతలు అటు వైపే దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తొలిసారిగా నగరానికి వస్తుండటంతో గ్రేటర్ బీజేపీలో కొత్త ఊపు వచ్చింది. త్వరలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు అమిత్ షా రాకను సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి భావిస్తున్నారు. దేశ, నగర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్, మజ్లిస్ల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు గ్రేటర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. బీజేపీలో చేరనున్న నేతలు! పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా భారీగా చేరికలకు నగర శాఖ గేట్లు తెరిచింది. అమిత్ షా అభినందన సభలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు బేగంపేట కార్పొరేటర్ శంకర్ యాదవ్ (కాంగ్రెస్), బర్కత్‌పురా కార్పొరేటర్ దిడ్డి రాంబాబు (కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్), జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి లక్ష్మీబాయి భర్త మామిడి నర్సింగరావు పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం.