
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జనంపల్లి అనిరుధ్‌రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు దశాబ్ద కాలం గా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనిరుధ్ గత ఆగస్టులో కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ నుంచి పోటీకి అనిరుధ్ పేరును కాంగ్రెస్ పరిశీలించింది. అసెంబ్లీ టికెట్ దక్కకున్నా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అనిరుధ్ చేసి న కృషిని గుర్తించిన పార్టీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment