jadcherla
-
ఎమ్మెల్యేల రహస్య భేటీ.. అనిరుథ్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భేటీ.. రహస్య భేటీ కాదంటూ వ్యాఖ్యానించారు. ‘‘కోహినూర్ హోటల్లో లంచ్ చేశాం. తాను ఏ ఫైల్ కూడా మంత్రుల దగ్గరకు తీసుకెళ్లలేదని అనిరుథ్ స్పష్టం చేశారు. ‘‘నా నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో మాట్లాడా. బీఆర్ఎస్ హయాంలో భూముల ఆక్రమణకు గురయ్యాయి. భూముల అన్యాకాంతంపై విచారణ చేయాలని కోరా. భూముల అన్యాక్రాంతం ఎవరూ చేశారో విచారణలో తేలుతుంది’’ అని అనిరుథ్ వ్యాఖ్యానించారు.తెలంగాణలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని.. మ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షీ వ్యాఖ్యానించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ మున్షీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా, అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదన్న మున్షీ.. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవన్నారు.ఇదీ చదవండి: దీపాదాస్ మున్షీ సీరియస్.. ఎమ్మెల్యేలకు వార్నింగ్ -
ఆదివారం నాడు ఆఫీసుల్లో మీకేం పనయ్యా?
జడ్చర్ల: ప్రభుత్వ కార్యాలయంలో సెలవురోజున ఏం పనులు వెలగబెడుతున్నారంటూ ఓ ఆర్ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే...మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్ఐ వెంకట్‌రెడ్డి గిరప్పతో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నోట్స్ రాయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి ఆర్ఐ వెంకట్‌రెడ్డితోపాటు రికార్డులు రాస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. తలుపులు మూసుకొని రికార్డుల ఫైల్స్ రాయడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ అనుమతితో సక్సేషన్ రాస్తున్నామని ఆర్ఐ సమాధానం ఇవ్వడంతో, జేసీకి ఫోన్ కలపాలని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకొచ్చి రికార్డులు రాయించడం ఏమిటని నిలదీశారు. సంబంధిత ఆర్ఐపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తాము సెలవు రోజు కూడా కార్యాలయంలో పనులు చేస్తున్నామని ఆర్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. Jadcherla Congress MLA Anirudh Reddy caught a Revenue Inspector who was reportedly manipulating records in MRO office, on Sunday at Balanagar Mandal pic.twitter.com/xyjf3HlVSN— Naveena (@TheNaveena) June 23, 2024 -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
-
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
jadcherla:తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్న పోలీస్‌స్టేషన్ సిబ్బంది!
జడ్చర్ల: రెండు జాతీయ రహదారులు కలయుకతో పాటు పారిశ్రామికంగా, వ్యాపార వాణిజ్యపరంగా, తదితర అనేక రంగాలకు సంబంధించి నిత్యం రద్దీని సంతరించుకున్న జడ్చర్లలో పోలీసుల సత్వర సేవల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సకాలంలో పోలీసుల సేవలు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక నేరాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సరైన నిఘా పెట్టలేని పరిస్థితి నెలకొంది. వీటికి తోడు ట్రాఫిక్ సమస్యను కూడా స్థానిక పోలీసులే పర్యవేక్షించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చోరీలు, తదితర నేరాల నియంత్రణ కష్టతరమైంది. వీటన్నింటి పరిష్కారానికి జడ్చర్లలో పోలీస్ సబ్‌డివిజన్ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా రూరల్ పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తే తప్పా సమస్యల పరిష్కారానికి నోచుకోలేని పరిస్థితి నెలకొంది. రూరల్ స్టేషన్‌కు ఎదురుచూపులు.. జడ్చర్లలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దశాబ్ద కాలంగా రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. పట్టణం రోజు రోజుకు నలుదిక్కులా విస్తరిస్తుండటంతో పాటు ఓ వైపు 44వ నంబర్ జాతీయ రహదారి, మరో వైపు 167 నంబర్ జాతీయ రహదారి ఉన్నాయి. వీటితో పాటు మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సెజ్, గ్రీన్ ఇండస్ట్రీయల్ ఏరియాతో నియోజకవర్గం కేంద్రంగా ఉన్న జడ్చర్ల పోలీస్‌స్టేషన్ బిజీబిజీగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పలు సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాదేపల్లి, కావేరమ్మపేట(జడ్చర్ల) జంట పట్టణంతో పాటు మండల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు, వాటి పరిధిలోని 23 అనుబంధ తండాలు, తదితర నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లక్షకు పైగా జనాభా ఉంది. ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంది. ఇంత జనాభాకు సంబంధించి ఒకే ఒక పోలీస్‌స్టేషన్ ఉండటంతో ప్రజలకు సత్వర పోలీస్‌సేవలు అందడం లేదనే అపవాదు ఉంది. ట్రాఫిక్ సమస్యలతో.. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసులే చూడాల్సి వస్తుంది. పట్టణంలోని నడిబొడ్డున జాతీయ రహదారులతో పాటు అంతర్రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. దీంతో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. రోడ్లు ఇరుగ్గా ఉండటంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. పనిభారంతో సతమతం.. జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. స్టేషన్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది. మండల పరిధిలోని సెజ్‌లో పరిశ్రమల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడికి సంబంధించిన శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. జిల్లాలోనే అధిక నేరాలు నమోదవుతున్న పోలీస్స్టేషన్లలో జడ్చర్ల ప్రధానంగా ఉంది. ప్రతి ఏడాది దాదాపుగా 500–600 వరకు కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది దాదాపు 800 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు.. జడ్చర్లలో పోలీస్ సబ్‌డివిజన్‌తో పాటు రూరల్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు పంపించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కూడా కొట్టారు. ఇటీవల ఎన్నికల ప్రచార సభకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ కూడా రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా డివిజన్ కార్యాలయంతో పాటు రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులో సేవలు.. జడ్చర్ల పట్టణంతో పాటు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జడ్చర్ల మున్సిపాలిటీ మరియు గ్రామీణ ప్రాంతాలు, తండాలకు కలిపి ఒకే పోలీస్‌స్టేషన్ ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటయితే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. –రమేశ్‌బాబు, సీఐ, జడ్చర్ల ఏర్పాటుకు కృషి.. జడ్చర్లలో రూరల్ పోలీస్‌స్టేషన్ అవసరం ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. తమ హయాంలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తాం. – అనిరుద్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
రెండో రోజు రాహుల్ పర్యటన.. పలువురు కాంగ్రెస్‌లోకి చేరిక
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం వరకు నొవాటెల్ హోటల్లోనే ఉండనున్న రాహుల్.. పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెండింగ్ సీట్లపై పీసీసీ నేతలతో సమావేశం కానున్నారు. రాహుల్ భేటీతో వామపక్ష సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌లోకి గడ్డం వివేక్? కాసేపట్లో నోవోటెల్ హోటల్‌కు మాజీ ఎంపీ వివేక్ వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది. రాహుల్‌తో వివేక్ భేటీ అవుతారని, కొడుకు వంశీతో సహా కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో చేరికను ఖండించిన బీజేపీ నేత గడ్డం వివేక్‌వెంకటస్వామి.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫునే పోటీ చేస్తానని ప్రకటించారు. చదవండి: ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్ -
తెలంగాణను కాంగ్రెస్ ఉత్తిగా ఇవ్వలేదు: కేసీఆర్
-
కాంగ్రెస్‌ను నమ్మితే.. శంకరగిరి మాన్యాలే
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 ఏళ్లు పాలించినా ఏనాడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నందున మాకొక అవకాశమివ్వండి అంటూ కాంగ్రెస్ సన్నాసులు నక్క వినయాలు ప్రదర్శించి మీ ముందుకు వస్తున్నారని చెప్పారు. వారిని పొరపాటున నమ్మితే మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేమిటో.. అలాగే తాము చెడగొట్టింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. జడ్చర్లలో రూ.33.03 కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో రెండు దఫాలుగా ఇచ్చే ఆరు గంటల కరెంట్‌తో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఎవరైనా చస్తే మేం అంత్యక్రియలకు పోతున్నాం బావి దగ్గర స్నానాలకు ఒక అరగంట పాటు కరెంట్ ఇవ్వండని విద్యుత్ సిబ్బందిని బతిమిలాడిన రోజులను ఎలా మరిచిపోతామన్నారు. నేడు 24 గంటలూ కరెంట్ ఇస్తున్న ఘనత తమదేనని స్పష్టంచేశారు. ‘నాడు తాగునీటికి గోస ఉండే.. 14 రోజులకోసారి తాగునీళ్లు వచ్చేది. తెలంగాణ రాక ముందు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే తాగునీటి సమస్యలపై బిందెలు అడ్డుపెట్టి కుండలు మర్లేసి తంతరనే భయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడైనా ఉందా’అని అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని.. లెక్కలతో రండి బట్టలూడదీస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘జడ్చర్లలో మా లక్ష్మన్న, మహబూబ్‌నగర్‌లో శ్రీనన్నలు అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే చర్చకు రావాలి. కోర్టు కేసులతో కాంగ్రెస్ సన్నాసులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నా.. వాయువేగంతో 90 శాతం పనులు పూర్తిచేశాం. ఆగస్టులో కర్వెన రిజర్వాయర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం. ఉదండాపూర్నూ త్వరగా పూర్తిచేసి జడ్చర్ల నియోజకవర్గంలోని 1.44 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’అని చెప్పారు. ‘ఒకాయన 800 కి.మీ. తిరిగిన అంటూ బోర్డులు పట్టుకుని తిరుగుతుండ్రు. నాడు మీరు అభివృద్ధి చేసి ఉంటే.. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు సన్నాసి యాత్రలు ఉండేవా’అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరిక మేరకు జడ్చర్ల మున్సిపాలిటీని గ్రేడ్–1గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జెడ్పీ సెంటర్/భూత్పూర్/అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ, మూసాపేట, జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా భూత్పూర్ మున్సిపాలిటీలో మినీ ట్యాంక్‌బండ్‌పై ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం మూసాపేట మండలం వేముల సమీపంలోని ఎస్జీడీ ఫార్మా వద్ద రూ.500 కోట్లతో కొత్తగా ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ఫ్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్న కేటీఆర్ మెట్టుగడ్డలోని మహిళా ఐటీఐ కాలేజీ ఆవరణలో సెయింట్ ఫౌండేషన్, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. కాగా, జడ్చర్లలోని నేతాజీ చౌరస్తాలో కొందరు బీజేపీ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయికి అడ్డుగా రావడంతో కాసేపు నిలిపివేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. -
వ్యవస్థలో మార్పు కోసమే యాత్రలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర, మల్లు భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కాదని.. వ్యవస్థలో మార్పు కోసమేనని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రధాని పదవి కోసం చేయలేదని, దేశంలో నెలకొన్న విద్వేషాలను తొలగించేందుకు చేశారని చెప్పారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి.. రాహుల్ సందేశాన్ని వివరిస్తూ వ్యవస్థలో మార్పు కోసం పాదయాత్రలు చేస్తున్నారని వివరించారు. ఆ మార్పు కోసం కాంగ్రెస్ పారీ్టకి ఓటు వేయాలని కోరారు. ‘పీపుల్స్‌మార్చ్ ఫర్ ఛేంజ్’ పేరుతో ప్రారంభమైన భట్టి పాదయాత్ర 69వ రోజు 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం నిర్వహించిన బహిరంగ సభకు హిమాచల్ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ కారణంగానే దేశాభివృద్ధి స్వాతంత్య్రం వచి్చన తొలినాళ్లలో దేశంలో గుండుసూది కూడా తయారు చేసే పరిస్థితి లేదని.. ఆ స్థితి నుంచి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పారీ్టయే కారణమని సుఖు చెప్పారు. 2004లో సోనియాగాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ త్యాగం చేశారని గుర్తు చేశారు. అప్పట్లో సోనియా ప్రధాని కావాలని చెప్పిన పారీ్టల్లో బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ కూడా ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఓపీఎస్ (పాత పింఛను విధానం) తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పేదలకు అన్నం పెట్టేందుకు కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కరోనా కాలంలో ఎంతోమంది పేదలకు ఆ పథకం కడుపు నింపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్, భట్టిల పాదయాత్రలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలందరితో కలిసి బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. అన్ని జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ కిడ్నీలు ఇచ్చినా జనం నమ్మరు: రేవంత్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నారని, కేసీఆర్ కిడ్నీలు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితిలో లేరని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితే, బడుగుల బిడ్డలు వలసలు పోవాలా? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసిన కేసీఆర్, పాలమూరుకు మాత్రం చుక్కనీరు తేలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి అండగా నిలవాలని కోరారు. రేవంత్‌రెడ్డి పరోక్షంగా అలంపూర్ అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. వెనుకబడిన అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంపత్‌కుమార్‌ను అధిక మెజారీ్టతో గెలిపించాలన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో తిరగబడాలి: భట్టి ‘కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో లాక్కొంటోందని.. ఈ భూములపై పోరాడతాం.. రుతుపవనాలు వస్తున్నాయి.. మేమంతా వచ్చి అరకలు దున్నిస్తాం..’ అంటూ రైతులకు భట్టి విక్రమార్క భరోసా కలి్పంచారు. కాంగ్రెస్ పంచిన భూములను కాపాడుకునేందుకు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు గుర్తించామని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేయని బీఆర్ఎస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సభలో మొదటగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తామూ నల్లగొండలో 12 సీట్లను గెలిపించి మొత్తం 24 సీట్లతో కాంగ్రెస్‌కు ఆధిక్యాన్ని కట్టబెడతామని చెప్పారు. సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నవీన్ జావెద్, కొప్పుల రాజు, టీపీసీసీ నేతలు వి.హన్మంతరావు, అనిరు«ద్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బహిరంగసభకు హాజరయ్యేందుకు సిమ్లా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచి్చన సుఖుకు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు. దాదాపు అర్ధగంటకు పైగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. -
హాస్టల్లో ర్యాగింగ్ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్ క్లాస్ విద్యార్థి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు. హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు?
సాక్షి, జడ్చర్ల: డిగ్రీ విద్యార్థిని మునావత్ మైన(19) ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కళాశాలలో అసలేం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో చరిత్ర కలిగి ఉండి ఇటీవలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల. దీనికితోడు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు, హెర్బేరియం గుర్తింపు తదితర కార్యక్రమాలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు ఉండగా.. మరోవైపు కొందరు ఆడపిల్లల పట్ల అనుచిత భావన కలిగి ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గురుశిష్యుల బందాన్ని తప్పుగా అర్థం చేసుకోలేరన్న భావనను కొందరు లెక్చరర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. వైరల్ అయిన ఫొటోలు విద్యార్ధిని మైన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఓ విద్యార్ధినితో ఓ లెక్చరర్ కలిసి ఉన్న ఫొటోలు గురువారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెస్టారెంట్ తదితర ప్రాంతాల్లో ఉన్న సమయంలో కొందరు వారిని అనుసరించి దూరంగా ఉండి తీసినట్లుగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ ఫొటోలలో ఉన్న విద్యార్థిని ఎవరన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. సంబంధిత వార్త: Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం వీడియో ఎవరు తీశారు? విద్యార్థిని మైనా ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న వీడియోను ఎవరు తీశారన్నది తెలియాల్సి ఉంది. డిగ్రీ కళాశాల తరగతి గదిలో ఆ రోజు ఎందుకు గొడవ జరిగింది. ప్రిన్సిపాల్, లెక్చరర్లు చెబుతున్నదే నిజమా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారించాల్సి ఉంది. అసలు ఈ గొడవలో దాడికి పాల్పడిన విద్యార్థిని, ఫొటో తీశారని చెబుతున్న మరో విద్యార్థిని, లెక్చరర్ల పాత్ర ఎంత మేరకు ఉందో కూడా విచారించాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్న మైన తాను తీసిన ఫోటోలను ఎవరికి పంపిందో కూడా తెలియాల్సి ఉంది. లెక్చరర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిఘా వేసి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా..? అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓ లెక్చరర్, ఓ విద్యార్థిని ఎక్కడెక్కడ తిరిగిన ఫొటోలో తీయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉందో కూడా తేలాల్సిన అవసరం ఉంది. విద్యాబోధన గాలికొదిలారా..? విద్యా బోధనను గాలికి వదిలేసి, బోధనేతర కార్యక్రమాలపై లెక్చరర్లు దృష్టి సారించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపాల్ చిన్నమ్మ అడ్మినిస్ట్రేషన్‌లో కొంత వీక్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది. పోలీసులు, ఉన్నత విద్యాధికారులు జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కళాశాల ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన మైన ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నాగర్‌కర్నూల్ సీఐ హన్మంతు ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రస్తుతానికి అలాంటిదేమి లేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కళాశాలలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ సస్పెండ్ చేశారు. -
Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం
సాక్షి, జడ్చర్ల: తరగతి గదిలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఒక ఆత్మహత్యకు దారి తీసింది. ఓ విద్యార్థిని మరో విద్యార్థిని చెంపపై కొట్టిన దృశ్యాన్ని ఇతరులు వీడియో తీసి వైరల్ చేయడంతో.. చెంపదెబ్బ తిన్న విద్యార్థిని మనస్తాపంతో పురుగులమందు తాగింది. దీనిపై ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఆందోళన సమాచారం అందిన పోలీసులు కాలేజీ వద్ద భారీగా మోహరించారు. విద్యార్థులను వెనక్కి పంపించి ప్రధాన గేటు మూసివేసినా.. విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీలోకి చొచ్చుకువచ్చి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగింది? నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం హనుమాన్తండాకు చెందిన ముడావత్ మైనా (19) జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (బీజెడ్సీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం తరగతి గదిలో మైనాతో తోటి విద్యార్థిని దేవయాని గొడవ పెట్టుకుంది. మైనా చెంపపై కొట్టింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ చిన్నమ్మ, లెక్చరర్లు గొడవపడిన విద్యార్థినులకు అదేరోజున కౌన్సెలింగ్ ఇచ్చి సర్దిచెప్పారు. కానీ తీవ్ర మనస్తాపానికి గురైన మైనా బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ వద్ద ఉద్రిక్తత దీనితో మైనా కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. కాలేజీలోకి చొచ్చుకువెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో వాగ్వాదానికి దిగారు. మైనాపై దాడి జరిగితే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్ చిన్నమ్మ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఆమెను వైద్యం కోసం బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీనితో ఒక వైద్యుడిని కాలేజీకి రప్పించి ప్రిన్సిపాల్‌కు చికిత్స అందజేశారు. మృతదేహంతో రాస్తారోకో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో మైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత స్వగ్రామానికి తరలిస్తుండగా.. జడ్చర్లలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. వేరే అమ్మాయి ఫొటో తీసిందని గొడవ! పెళ్లయిన ఓ విద్యార్థిని తరగతి గదిలో తోటి విద్యార్థులైన అబ్బాయిలతో మాట్లాడుతుండగా మైనా ఫోన్లో ఫొటో తీసిందని.. సదరు విద్యార్థిని భర్త మిత్రుడికి ఆ ఫొటోను పంపడంతో గొడవ జరిగిందని ప్రిన్సిపాల్ చిన్నమ్మ, లెక్చరర్లు మీడియాకు వివరించారు. సదరు వివాహిత విద్యార్థిని స్నేహితురాలు దేవయాని జోక్యం చేసుకుని మైనా చెంపపై కొట్టిందన్నారు. ఈ విషయం తెలియడంతో ముగ్గురు విద్యార్థినులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపామని తెలిపారు. లెక్చరర్ వేధింపులే కారణం ఓ లెక్చరర్, ఇద్దరు విద్యార్థినుల కారణంగా తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మైనా తల్లి మణెమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. లెక్చరర్ కారణంగానే మైనా ఆత్మహత్య చేసుకుందని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. సదరు లెక్చరర్ కొందరు విద్యార్థినులతో చనువుగా ఉండేవాడని.. సదరు లెక్చరర్ ప్రోత్సాహంతోనే విద్యార్థినులు మైనాపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాం: పోలీసులు బిజినేపల్లి: మైనా ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు తిమ్మాజిపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై షంషుద్దీన్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. బుధవారమే యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, గురువారం వారు చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘నేను ఇక ఇంటికి రాను.. సన్యాసం స్వీకరిస్తా.. అనుమతివ్వండి’
సాక్షి, మహబూబ్‌నగర్: చక్కటి విద్య, క్రమశిక్షణ అలవడుతుందని రూ.లక్షలు ఫీజు చెల్లించి ఓ గురుకుల విద్యాలయంలో తమ కుమారుడిని చేర్పిస్తే.. ఆధ్యాత్మిక చింతను ఎక్కువగా అలవరిచి చివరికి కన్నవారికే దూరం చేశారని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. జడ్చర్లలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న సింహ్మయ్య, పారిజాత దంపతులకు మణిదీప్(18) ఒక్కగానొక్క కుమారుడు. భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, మంచి విద్య అలవర్చాలన్న ఉద్దేశంతో జడ్చర్ల శివారులోని ఓ గురుకుల విద్యాలయంలో 6వ తరగతిలో జాయిన్ చేశారు. పదో తరగతి వరకు అదే గురుకులలో చదివిన మణిదీప్ ఇంటర్ మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో పూర్తిచేశాడు. గతంలో ఒకసారి.. అయితే 3 నెలల కిందట మణిదీప్ అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మణిదీప్ తాను విద్యనభ్యసించిన గురుకుల అనుబంధ విద్యాలయం బెంగుళూర్లో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన మణిదీప్ ఇక తాను ఇంటికి రానని, సన్యాసం స్వీకరిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అప్పట్లో అక్కడి స్వామీజిలు నచ్చజెప్పి ఇంటికి పంపారు. వారం రోజులు ఇంటి దగ్గర ఉండి రెండు నెలల కిందట మళ్లీ కనిపించకుండాపోయాడు. చదవండి: మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడి నుంచి ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడిన మణిదీప్ తాను సన్యాసం స్వీకరించేందుకు అనుమతి పత్రం ఇవ్వాలని లేకుంటే తాను ఇంటికి రానని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక గురుకుల నిర్వాహకులను సంప్రదించి తమ కుమారుడిని అప్పగించాలని కోరారు. ప్రస్తుతానికి అంగీకార పత్రం ఇవ్వాలని, ఆ తర్వాత మణిదీప్ని ఇంటికి తిరిగి తీసుకువస్తామని గురుకుల నిర్వాహకులు చెప్పడంతో సన్యాస స్వీకరణకు సమ్మతిస్తూ లెటర్ ఇచ్చారు. తర్వాత తమ కుమారుడు ఈ నెల 5న బెంగుళూరు నుంచి బయలుదేరినట్లు అక్కడి స్వామీజీలు చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్నారు. మణిదీప్ విషయమై స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు గురుకుల నిర్వాహకులతో సోమవారం ఆందోళనకు దిగారు. మణిదీప్‌ను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన
జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్‌లో ఉండే వడ్డె వినయ్‌కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్‌నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్‌సీ కృష్ణ తెలిపారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య -
సమాచారం అడిగితే.. తెల్లకాగితాలు పంపారు
జడ్చర్ల: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి అధికారులు వివరాలేమీ లేని తెల్లకాగితాలు పంపారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రంగారావుతోటలో నివాసం ఉంటున్న సామాజికవేత్త అనిల్‌కుమార్ 40 రోజుల క్రితం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై పూర్తి వివరాలు అందించాలని ఆర్టీఐ కింద మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌కు సంబంధిత అధికారులు పోస్టులో ఓ కవర్ పంపారు. దాన్ని విప్పి చూసిన అనిల్‌కుమార్ ‘తెల్ల’బోయారు. అందులో ఎలాంటి వివరాలు లేకుండా తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తెచ్చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్‌ను వివరణ కోరగా తాము పూర్తి సమాచారాన్ని కవర్లో పెట్టి పోస్టు చేశామని, ఇందుకు సంబంధించిన కాపీ ఒకటి తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మున్సిపల్ అధికారుల నిర్వాకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అనిల్‌కుమార్ చెప్పారు. -
ప్రజా సంగ్రామ యాత్ర 300కి.మీ. పూర్తి
జడ్చర్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం 300కి.మీ. పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 14న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 25వ రోజు ఆదివారం జడ్చర్ల మండలంలోని గంగాపూర్‌కు చేరుకుంది. 167నంబర్ జాతీయ రహదారిపై ‘300కి.మీ.’అని రాసి అక్కడే భారీ కేక్‌ను కట్ చేసిన సంజయ్, నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం ప్రసిద్ధి చెందిన లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం నా చావు కోసం ఎదురుచూస్తున్నారు ‘నా చావు కోసం సీఎం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. నేను మరణిస్తే నా కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తానన్నారు. కానీ నేను మాత్రం ఆయన చావును కోరుకోవట్లేదు. ఆయన నిండు నూరేళ్లు బతకాలి. పేదలను మాత్రం మోసం చేయొద్దని కోరుతున్నా..’అంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం రాత్రి పది గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో నిర్వహించిన ‘జనం గోస.. బీజేపీ భరోసా’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోది తెలంగాణ ప్రజల కోసం అనేక పథకాల కింద నిధులు మంజూరు చేస్తుంటే.. అవి పేదలకు అందకుండా కేసీఆర్ తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు చేరాలంటే ఒక్కసారి తమకు అధికారమివ్వాలని విజ్ఙప్తి చేశారు. -
రైలులో ప్రయాణిస్తుండగా గుండెపోటు
జడ్చర్ల: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు సాయం కోరుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే కలెక్టర్, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ లోగా గుండెపోటు వచ్చిన ప్రయాణికుడు తుదిశ్వాస విడిచాడు. వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్‌లోని పాటియాల జిల్లా ప్రతాప్‌గఢ్‌కు చెందిన హరిప్రీత్‌సింగ్ (35) కొన్నాళ్లుగా కర్ణాటకలోని దావణగెరెలో వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం అతను తన మిత్రుడు హరిప్రీత్‌సింగ్ (ఇద్దరి పేర్లు ఒక్కటే)తో కలసి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి బయలుదేరాడు. ఆదివారం ఉదయం మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ దాటాక హరిప్రీత్‌సింగ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఇది గమనించిన మరో ప్రయాణికుడు వెంటనే మంత్రి కేటీఆర్‌కు సాయంకోసం ట్వీట్ చేయడంతో తక్షణం స్పందించారు. ఆయన కార్యాలయ అధికారులు మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే అంతలోనే అతను మృతి చెందాడు. దీంతో జడ్చర్ల స్టేషన్ సమీపంలో చైన్‌లాగి రైలును ఆపారు. అనంతరం మృతదేహాన్ని జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, రైల్వే హెచ్‌సీ కృష్ణ ఆధ్వర్యంలో బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహం బుధవారం అక్కడికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మృతుని స్వగ్రామం ఇక్కడికి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దృశ్యం’ సినిమా చూసి.. భార్య, అత్త, ప్రియుడితో కలిసి కుట్ర
సాక్షి, జడ్చర్ల (మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య, అత్తతో పాటు ప్రియుడు, మరో స్నేహితుడు కలిసి తుదముట్టించారు. ఓ సినిమాను చూసి అందులో జరిగిన విధంగా పథకం పన్నారు. ఈ కేసును ఎనిమిది రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. శుక్రవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను డీఎస్పీ కిషన్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లిలోని శ్రీశైలం (29)కు అదే గ్రామానికి చెందిన గీతతో 2013 డిసెంబర్లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త కారు డ్రైవర్‌గా, కూలీగా పనిచేసేవాడు. ఆరేళ్లక్రితం బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లి రత్నానగర్‌లో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి ఎదురుగా ఉండే విక్రంతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో అతని వద్ద గీత రూ.50వేలు అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త వారిద్దరినీ మందలించినా ఎలాంటి మార్పు రాలేదు. కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ కిషన్ దృశ్యం సినిమా చూసి.. అతని అడ్డు తొలగించుకునేందుకు గీత, ఆమె తల్లి వెంకటమ్మ, ప్రియుడు విక్రం దృశ్యం సినిమా చూసి అందులో ఉన్నట్టుగానే పథకం పన్నారు. విక్రం స్నేహితుడు రాజును శ్రీశైలంతో చనువుగా ఉండాలని పురమాయించారు. ఈ క్రమంలోనే గత నెల 31న శ్రీశైలం బూర్గుపల్లికి వచ్చాడు. అప్పటికే విక్రం ప్రత్యేక రాడ్ తయారు చేసుకున్నాడు. ఒక్కో వస్తువును ఒక్కోచోట కొనుగోలు చేసి ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సనత్‌నగర్‌లో దుస్తులు, రోడ్డుపై హెల్మెట్ కొన్నారు. నంబర్ ప్లేట్ సరిగ్గాలేని బైక్‌ను తీసుకుని రాజుతో కలసి జడ్చర్లలో మద్యం కొనుగోలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విక్రం, రాజు తమ సెల్ఫోన్లను హైదరాబాద్‌లోనే ఉంచి తరచూ ఇతరులతో ఆ ఫోన్లకు కాల్ చేసి వారిద్దరు అక్కడే ఉన్నట్టుగా నమ్మబలికారు. కిష్టంపల్లికి చేరుకుని అక్కడ ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్, మాస్క్‌లు ధరించి ఓ దుకాణంలో వాటర్‌బాటిల్ కొని వారి వద్ద తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలని దుకాణం మహిళ వద్ద తీసుకుని శ్రీశైలంకు రాజు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆటో కొనేందుకు వచ్చానని వెంటనే హనుమాన్ దేవాలయం వద్దకు రావాలని కోరాడు. అక్కడికి వచ్చిన అతడిని బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని పొలంలోకి వెళ్లి అదేరోజు అర్ధరాత్రి మద్యం తాగారు. చదవండి: దృశ్యం’ సినిమా చూసి.. భార్య, అత్త, ప్రియుడితో కలిసి కుట్ర నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఇనుపరాడ్ అంతలోనే విక్రం వెనుక నుంచి వచ్చి ఇనుపరాడ్‌తో శ్రీశైలం తలపై కొట్టగా, కళ్లల్లో రాజు కారం కొట్టి చంపేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరుసటి రోజు చుట్టుపక్కలవారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఎట్టకేలకు నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం గొల్లపల్లి సమీపంలో అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐలు రమేష్‌బాబు, జములప్ప, ఎస్ఐలు రాజేందర్, జయప్రకాష్ పాల్గొన్నారు. -
బొటానికల్ గార్డెన్లో అరుదైన తూనీగ
జడ్చర్ల టౌన్: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్లో రియోథెమిస్ వరిగేటా జాతికి చెందిన రంగురంగుల తూనీగను గుర్తించినట్లు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భరత్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గార్డెన్‌ను సందర్శించి పక్షులు, జంతువులను కెమెరాలో బంధిస్తుండగా అరుదైన తూనీగను గుర్తించినట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి తూనీగలు చిత్తడి నేలలో ఎక్కువగా నివసిస్తూ చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తాయన్నారు. ఈ రకమైన తూనీగలు మనదేశంతో పాటు, చైనా, వియత్నాం, జపాన్ దేశాల్లో మాత్రమే జీవిస్తాయన్నారు. అనేక అరుదైన మొక్కలు, జంతువులకు తెలంగాణ బొటానికల్ గార్డెన్ నిలయంగా మారుతోందన్నారు. -
ప్రియురాలితో కలిసి భార్య హత్యకు ప్లాన్.. చివరి నిమిషంలో ట్విస్ట్
సాక్షి, జడ్చర్ల టౌన్: అగ్ని సాక్షిగా ఒక్కటైన భార్యను.. ప్రియురాలితో కలిసి హత్య చేసేందుకు ఓ భర్త యత్నించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో గురువారం చోటు చేసుకుంది. అయితే తనను హత్యచేస్తారని గ్రహించిన బాధితురాలు స్థానిక పోలీసులు సమాచారం అందించడం.. వారు సకాలంలో స్పందించ టంతో భర్త, ఆయన ప్రియురాలు పరారయ్యారు. ఎస్ఐ అభిషేక్‌రెడ్డి అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా.. బాదేపల్లి పట్టణం పాతబజార్ కు చెందిన వినోద్–అనితకు కొంతకాలం క్రితం వివామైంది. కొన్నాళ్లపాటు అన్యోన్య దాంపత్యం సాగించాక పట్టణంలోనే డిగ్రీ కళాశాల వెనకాల ఉంటున్న కవిత అనే మరో మహిళతో వినోద్‌కు పరిచయమై.. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో భార్య అయిన అనితను తప్పించి కవితను పెళ్లిచేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. చదవండి: సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో.. అందుకు సమయం కోసం వేచిచూసి అనితను గురువారం తెల్ల వారుజామున 4గంటలకు కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఈ క్రమంలో వారి కుట్రను గుర్తించిన బాధితురాలు 4.30గంటలకు జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న సీఐ స్పందించి ఫోన్‌సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి 44వ నంబరు జాతీయ రహదారిపై బూరెడ్డిపల్లి వద్ద వారిని గుర్తించారు. పోలీసు వాహనాన్ని చూసిన ప్రియుడు– ప్రియురాలు అనితను వదిలేసి పరారయ్యారు. అనిత ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని -
తండ్రికి వీడని మత్తు.. వదలని బాలుడు
సాక్షి, జడ్చర్ల: నిండుగా మద్యం తాగి రోడ్డుపై పడిపోయిన ఓ తండ్రిని వదలివేయకుండా తన కాళ్లపై పడుకోబెట్టుకొని తండ్రి లేచిన తర్వాత ఇంటికి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం స్థానిక నేతాజీచౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొత్తతండాకు చెందిన మన్యానాయక్ తన బైక్ సర్వీస్ కోసం కుమారుడు హరీష్‌తో కలిసి జడ్చర్లకు వచ్చాడు. అనంతరం తండ్రి మద్యం తాగి రోడ్డుపై పడిపోవడంతో తనయుడు ఎర్రటి ఎండలో తన కాళ్లపైనే పడుకోబెట్టుకున్నాడు. కాగా ఓవైపు ఎండ వేడిమి, నేలపై ఉన్న చీమలు కుడుతున్నా ఆ బాలుడు ఓపికతో ఏమీ జరుగకుండా చూసుకున్నాడు. ఈ తీరును పలువురి కలిచి వేసిన చివరికి ఆ బాలుడిని శభాష్ అంటూ మెచ్చుకున్నారు. చదవండి: (కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్..) -
పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో
సాక్షి, జడ్చర్ల టౌన్(మహబూబ్‌నగర్): సమాజంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. అలాంటిదే ఈ వింత. జడ్చర్లలో మంగళవారం ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు. పిల్లి కొద్దిసేపు పాలు తాగినా పంది వద్దని వారించకపోవటం విశేషం. దీన్ని సోషల్ మీడిమాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! -
ఆర్నెల్లు అధికారం అప్పగిస్తే..అందరికీ ‘బంధు’ ఇస్తారా?: లక్ష్మారెడ్డి
జడ్చర్ల: ‘కాంగ్రెస్, బీజేపీలకు ఆరు నెలలపాటు అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రంలో దళితబంధు వంటి పథకాలను బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలందరికీ ఏకకాలంలో అందజేస్తారా.. ఇంటింటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా.. అది సాధ్యమయ్యేనా..’ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆయా పార్టీలకు సవాల్ విసిరారు. శనివారం జడ్చర్లలోని తాలుకా క్లబ్ కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ వార్డు కమిటీల ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ కమిటీల నుంచి ఆయా పథకాలు రాష్ట్రవాప్తంగా ఒకేసారి అమలు చేసేలా తీర్మానించి లెటర్ తీసుకొస్తే ఓ ఆరు నెలల పాటు వారికి అధికారం అప్పజెబుతామన్నారు. సీఎం కేసీఆర్ అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమం కోసం దశలవారీగా ‘దళితబంధు’ను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, మైనార్టీ తదితరులకు వర్తింపజేస్తారన్నారు. అయితే విపక్ష నేతలు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ‘దళితబంధు’తెచ్చారని, రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయడంలేదని, ఇతర వర్గాలకు ఆయా పథకం ఎందుకు ఇవ్వరని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం సరైందికాదన్నారు. -
బాలుడి దవడలోకి దిగిన సైకిల్ బ్రేక్ పెడల్
జడ్చర్ల: సైకిల్‌పై వెళ్తుండగా కింద పడిన బాలుడి దవడలోకి చేతితో పట్టుకునే బ్రేక్ పెడల్ దిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లికి చెందిన సంతోష్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇంటి నుంచి ట్యూషన్‌కు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో బ్రేక్ పెడల్ ఒక్కసారిగా దవడ భాగంలోకి చొచ్చుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఆ బాలుడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. -
కాపాడాల్సిన రక్షకులే భక్షకులు
-
నల్గొండలో ఈనెల 8న సభ: ప్రవీణ్ కుమార్
జడ్చర్ల టౌన్: తెలంగాణలో బహుజన రాజ్యం తెచ్చుకునేందుకు ముందుకు సాగాలని మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఇంపీరియల్ గార్డెన్లో ఉమ్మడి జిల్లా బహుజన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లు ఎంతో కీలకమని, ప్రతి నిమిషం ఎంతో విలువైందని గుర్తుంచుకోవాల న్నారు. ఇక్కడ వేసిన అడుగులు ప్రగతిభవన్ వెళ్లే వరకు ఆ పొద్దని చెప్పారు. బండలు పిండిచేసి ప్రాజెక్టులు నిర్మించిన కూలీల జిల్లాగా పాలమూరుకు పేరుందని, అదే తరహాలో బహుజన రాజ్యం సాధించుకునేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తన రాజీనామాతో ఫాంహౌజ్‌లు కూలటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తను రాజీనామా చేసిన మరుసటి రోజే కేసు పెట్టారని, అయినా భయపడేది లేదన్నారు. ప్రాణమున్నంత వరకు స్వేరోగానే ఉంటానని పేర్కొన్నారు. నల్లగొండలో ఈనెల 8న నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అంతకుముందు జడ్చర్ల క్రాస్‌రోడ్‌నుంచి ఇంపీరియల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి.. ఐదుగురితో కలిసి కారులో
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఈ క్రమంలోనే బలవంతంగా కారులో ఎక్కించుకుని మరో నలుగురితో కలిసి ఆమెను రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి మొబైల్ ఫోన్, పర్సు గుంజుకున్నాడు. తెల్లవారుజామున ప్రధాన రహదారిపై ఆపి బయటకు తోసేసి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న 37ఏళ్ల మహిళతో ఎనిమిది నెలలుగా జడ్చర్లకు చెందిన పెద్ద వెంకటేశ్‌గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కలువలేకపోతున్నానని చెప్పాడు. తాను పెద్ద దిక్కుగా ఉంటానంటూ నమ్మబలికి భార్యతోనూ మాట్లాడించాడు. ఇటీవల మహబూబ్‌నగర్‌కు చెందిన మిత్రుడు వెంకటేశ్ తదితరులతోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈనెల 2న జడ్చర్లలోని తన ఇంటికి రప్పించాడు. అనంతరం కారులో ఎక్కించుకుని తన బావమరిదితో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి క్రిస్టియన్‌పల్లి మీదుగా భూత్పూర్కు తీసుకెళ్లారు. అక్కడి దాబాలో ఉన్న పెద్ద వెంకటేశ్‌గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేశ్‌గౌడ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. కాలినడకన మహబూబ్‌నగర్‌లోని పాత డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడును వెళ్లబోసుకుంది. చివరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చి బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ధర్నాకు అనుమతివ్వండి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సిగ్నల్‌గడ్డపై ధర్నా చేసేందుకు అనుమతివ్వాలని కోరగా పోలీసులు నిరాకరించారు. అనంతరం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. నిందితులు ధన బలంతో పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తన మొబైల్లోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ఒకప్పుడు మన రాజధాని కందూరు.. తాజాగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: కందూరు.. ఇది మహబూబ్‌నగర్ జడ్చర్ల సమీపంలో ఉంది. ఇప్పుడు ఓ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. క్రీస్తుశకం 1025-1248 మధ్య కాలంలో కల్యాణి చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు స్వతంత్ర పాలన నిర్వహించారు. ఆనాటì ఈ ప్రాంత వైభవం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. తరచుగా వెలుగు చూస్తున్న అలనాటి గుర్తులు అప్పటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. తాజాగా విశ్రాంత పురావస్తు అధికారి, చరిత్ర పరిశోధకుడు, విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి నాటి వివరాలు మరికొన్ని వెలుగులోకి తెచ్చారు. ఇనుప యుగం నాటి అరుదైన మానవ సమాధులు, కందూరు చోళుల పాలన కాలం నాటి శిల్పాలు, మందిర ఆనవాళ్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. నాటి జ్ఞాపకాలు చెదిరిపోకుండా కాపాడాలని స్థానిక సర్పంచ్ మున్నూరు శ్రీకాంత్‌కు సూచించారు. శివనాగిరెడ్డి వెంట నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు తదితరులున్నారు. అరుదైన రాక్షస గుళ్లు ఇది క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి ఇనుప యుగం నాటి మానవ సమాధి. సమాధి పైభాగంలో భారీ రాళ్లను వృత్తాకారంలో పేర్చి ఉండే ఈ నిర్మాణాలను రాక్షస గుళ్లుగా పేర్కొంటారు. కానీ వృత్తాకారంలో రాళ్లు రెండు వరసలుగా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన రాకాసి గుళ్ల సమాధి ఇది. రెండో వరస రాళ్ల పైభాగపు మొనలు మాత్రమే ఉపరితలంలో కనిపిస్తున్నాయి. వ్యవసాయం విస్తరణ కోసం అవగాహన లేక రైతులు తొలగించగా కేవలం నాలుగు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా మాయమైతే స్థానిక భావితరాలకు వీటిని చూసే అవకాశం ఉండదు. అద్భుత శిల్పకళా చాతుర్యం అద్భుత అలంకరణతో చిన్నచిన్న వివరాలను కూడా ఇట్టే గుర్తించగలిగే శిల్పకళా చాతుర్యం.. వెరసి ఇదో కమనీయ శిల్పం. 12వ శతాబ్దపు కల్యాణిచాళుక్యుల కాలం నాటి శిల్పుల నేర్పరితనానికి నిలువుటద్దం ఈ చెన్నకేశవస్వామి విగ్రహం. ఇటీవల అభివృద్ధి పనులు చేస్తుండగా ఇలా భూగర్భం నుంచి బయటపడింది. స్థానిక దేవాలయంలో పూజలందుకునే వేళ ముష్కరుల దాడిలో కొంత ధ్వంసమైంది. చేతి భాగాలు విరిగి ఉన్నాయి. మిగతా విగ్రహం అపురూపంగా కనిపిస్తోంది. గుండుపై వీరగల్లు ఇది ఓ వీరగల్లు. యుద్ధంలో వందమందిని మట్టి కరిపించిన స్థానిక వీరుడి స్మారకం. సాధారణంగా వీరగల్లులు విడిగా శిల్పాలుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా గుండుపై చెక్కినవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఓ యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడి వీరమరణం పొందిన వీరుడిని నిరంతరం తలుచుకునేలా ఇలా గుండుపై చెక్కి సగర్వంగా నిలిపారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం
సాక్షి, జడ్చర్ల: ఓ ట్రక్కు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ధాన్యం అమ్ముడుపోక తిరిగి వెళుతున్న ట్రాక్టర్‌ను, ఎదురుగా వస్తున్న బైక్, స్కూటీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు విస్తరణ పనులకు మెటీరియల్‌ను అన్లోడ్ చేసి వస్తున్న కాంక్రీట్ రెడీమిక్స్ ట్రక్కు.. ముందుగా ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ ట్రక్కును నియంత్రించకపోవడంతో అదే వేగంతో ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను సైతం ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బాలయ్యకు తోడుగా వచ్చిన సురేశ్ (20) ధాన్యం బస్తాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న రవికుమార్ (20), స్కూటీపై వస్తున్న బన్రెడ్డి వెంకటేశ్వర్రావు (32), అతని తండ్రి (52) సైతం దుర్మరణం చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ బాలయ్య, ట్రక్కు డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. కాగా, మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
Jadcherla: 12 గంటలు.. ఓ బ్రిడ్జి!
జడ్చర్ల టౌన్/మహబూబ్‌నగర్: కేవలం 12 గంటల్లోనే ట్రిపుల్ ట్రాక్ బ్రిడ్జిని నిర్మించి రైల్వేశాఖ రికార్డు సృష్టించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల్లోపు బ్రిడ్జి పనులు పూర్తిచేసి ట్రాక్‌ను పునరుద్ధరించింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ సమీపంలో రైల్వేశాఖ ఈ బ్రిడ్జిని నిర్మించింది. సుమారు 200 మంది అధికారులు, కూలీలు, ఇంజనీర్లు ఈ పనుల్లో పాలుపంచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ట్రిపుల్ ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మించడం ఇదే తొలిసారని ఇంజనీరింగ్ విభాగం ఏజీఎం మూర్తి తెలిపారు. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉందానగర్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనుల్లో భాగంగా అధికారులు ఈ బ్రిడ్జిని నిర్మించారు. మధ్యాహ్నం: 1.40 గంటలు సాయత్రం: 5.30 గంటలు చదవండి: చేర్యాలలో లజ్జా గౌరీ శిల్పం -
ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో హల్చల్
జడ్చర్ల: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ఇళ్లను ఇవ్వబోమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్న ఓ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4వ వార్డు పరిధిలోని బోయలకుంటలో ప్రచార సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నికలు కాబట్టి ఎవరెవరో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎవరొచ్చి ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేసినా మనమే చేయాలి. పొరపాటు జరిగి మా అభ్యర్థికి తక్కువ ఓట్లువస్తే ఇళ్లు కూడా ఇవ్వను. బీరుకో, బిర్యానీకో ఆశపడి ఓట్లు వేయొద్దు’ అని అన్నారు. ఈ వీడియోపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేసేలా లక్ష్మారెడ్డి వైఖరి ఉండడం సరికాదన్నారు. అర్హులకు పథకాలు అందించడం ప్రభుత్వాల పని అని, ఎవరూ బెదిరింపులకు భయపడొద్దన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య -
ఐదు దర్వాజల్లో నుంచి సూర్యోదయం, ఎక్కడంటే?
సాక్షి, జడ్చర్ల టౌన్: ఆలయ నిర్మాణాల్లో శిల్పులు తమ ప్రత్యేకతకు చాటుకోవటం పరిపాటి. అలాంటి కోవలోనే 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద ఉన్న లలితాంబికా తపోవనం రాజగోపురం నిలుస్తోంది. దీనికి ఐదు గవాక్షాలు ఉండగా సూర్యుడు ఉదయించే సమయంలో వాటిల్లోనే పయనించడం విశేషం. ఆదివారం కనిపించిన సుందర దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. సాధారణంగా భక్తులు గవాక్షాలను అంతస్తులుగా పిలుస్తారు. ఒక్కో గవాక్షం ఒక్కో అంతస్తుగా, గవాక్షాన్ని దర్వాజగా భావిస్తారు. ఆ దర్వాజలో నుంచే సూర్యోదయం జరగటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. చదవండి: అరే ఏంట్రా ఇది.. అలా తాగేస్తున్నారు! -
మాకు ఓటేయకుంటే బాగుపడరు.. మంత్రి శాపనార్ధాలు
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న వారు టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే బాగుపడరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని తిని ఓటు వేయకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆ కుటుంబం బాగుపడదు. స్పృహలో ఉండి ఓట్లు వేయాలి’అని పేర్కొన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, మీ అందరి మంచి చెడు చూసేటోళ్లమని.. అందుకే తమను ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి పాల్గొన్నారు. -
పిల్లలకు పురుగుమందు తాపి..
తెలకపల్లి : ఆర్థిక ఇబ్బందులతో తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు తాపి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గట్టునెల్లికుదురుకు చెందిన మల్లే, మాధవి భార్యాభర్తలు. ఆర్థిక ఇబ్బందులతో వారు శుక్రవారం ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన మాధవి భర్త పొలానికి వెళ్లిన సమయంలో తన రెండు సందవత్సరాల కుమారుడు నందుకు, ఆరు నెలల పాప మమతకు పురుగు మందు తాపి, తాను తాగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి వాహనంలో తరలించారు. ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని, తల్లి మాధవి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. చికిత్స పొందుతూ బాలిక మృతి జడ్చర్ల: మండల పరిధిలోని నసరుల్లాబాద్‌కు చెందిన సుజాత(17) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ షంషద్దీన్ తెలిపారు. ఎస్ఐ కథ నం మేరకు.. మూడు రోజుల క్రి తం సుజాత పురుగు మందు తా గుగా.. చికిత్స నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా బాధిత కుటుంబాన్ని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్ ప్రణీల్‌చందర్ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. యువకుడి ఆత్మహత్య ఊర్కొండ: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మాదారంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్ చారి(30) అనే యువకుడు తన ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహేశ్ చారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రోధిస్తూ తెలిపారు. మహేశ్ చారి తల్లి అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏటీఎంలో 15 లక్షల నగదు చోరీ
సాక్షి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. తెల్ల కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించడంతోపాటు రుమాలును చుట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. ఏటీఎంలోని డబ్బును అపహరించి షట్టర్‌ను కిందికి దించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది ఏటీఎం షట్టర్ మూసి ఉండటాన్ని గమనించి షట్టర్‌ను తెరవగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ దీపిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. -
ఎక్సైజ్ అధికారులపై దాడి
జడ్చర్ల: తనిఖీలకు వెళ్లిన ఎక్సై జ్ అధికారులు, సిబ్బందిపై గుడుంబా తయారీదారులు ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఎక్సైజ్ సీఐ, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జడ్చర్ల మం డలం కిష్టారం సమీపంలోని ఒంటిగుడిసె తండాలో చోటు చేసుకుంది. గుడుంబా నియంత్రణలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ, ట్రెయినీ ఎస్ఐ ఉమామహేశ్వ ర్, హెచ్‌సీ రమేశ్, కానిస్టేబుళ్లు సిద్ధార్థ, వెంకటేశ్ తమ వాహనం లో కిష్టారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బైక్, లూనాపై నలుగురు వ్యక్తులు 20 లీటర్ల గుడుంబాను తరలి స్తుండగా పట్టుకుని విచారించారు. తాము ఒంటిగుడిసె తండా సమీపంలో రాజు నుంచి గుడుంబాను కొనుగోలు చేసినట్లు వారు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరి రాకను పసిగట్టిన నలుగురు తయారీదారులు విచక్షణారహితంగా కర్రల తో దాడి చేశారు. దీంతో సీఐ, హెచ్‌సీ, ఇద్దరు కానిస్టేబుళ్ల తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ వీరస్వామి కేసు దర్యాప్తు చేపట్టా రు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దాడులకు వెళ్లే సమయంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాయపడిన ఎక్సైజ్ సీఐ బాలాజీ, కానిస్టేబుల్ సిద్ధార్థ -
ఇలా ఉంటే.. కరోనా రాదా!
సాక్షి, జడ్చర్ల : కరోనా వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు, పాలకులు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో కొందరు పట్టించుకోవడం లేదు. గురువారం జడ్చర్ల లోని పలు రేషన్ దుకాణాల వద్ద జనం గుంపులు గుంపులుగా నిలబడి సరుకులు తీసుకెళ్లారు. ఇప్పటికే కావేరమ్మపేటలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనా ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలనివిజ్ఞప్తి చేస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వైరస్ విజృంభించే అవకాశం ఉందనిపేర్కొంటున్నారు. -
సింగపూర్‌లో చిక్కుకున్న మన విద్యార్థులు
సాక్షి, జడ్చర్ల: కరోనా వైరస్ కారణంగా సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్టులో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఆరుగురు వైద్య విద్యార్థులు చిక్కుకుపోయారు. బుధవారం భారత్ వస్తుండగా చివరి నిమిషంలో అధికారులు వీరి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న వీరిని 72 గంటల్లోగా తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విద్యార్థులు ముందు సింగపూర్ చేరుకున్నారని, తర్వాత ఇక్కడికి రావడానికి విమానం ఎక్కే చివరి నిమిషంలో ప్రయాణం నిలిపివేయాలని భారత్ నుంచి అధికారులు అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు గురువా రం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ పిల్లలను రప్పించాలని కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విద్యార్థులను క్షేమంగా జడ్చర్లకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. (ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకు వచ్చాం..) -
లారీ భీభత్సం.. బడుగుల బ్రతుకులు ఛిద్రం
సాక్షి, జడ్చర్ల: పట్టణంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఇందులో ఇద్దరు వలస కూలీలు, మరొకరు దుర్మరణం చెందారు. రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి సర్వీస్ రోడ్డును అనసరించి ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో ఇటుగా వెళ్తున్న ముగ్గురు లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా.. కేరళ రాష్ట్రం పెరంబాకు నుంచి ఉత్తరప్రదేశ్‌కు పనసకాయల లోడ్‌తో లారీ వెళుతుంది. అయితే కావేరమ్మపేట వద్ద ఏఎస్ఆర్ గార్డెన్ ఎదుట అకస్మికంగా సరీ్వస్ రోడ్డుపై దారి మళ్లించాల్సి ఉండడంతో అతివేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపుకు దూసుకెళ్లింది. ఎడమ వైపు సరీ్వస్ రోడ్డును అనసరించి ఉన్న ఇంటిని ఢీకొట్టి ఎడమవైపునకు బోల్తా పడింది. అదే సమయంలో లారీకి ఎడమవైపున అదే సర్వీస్ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కాలినడకన వెళ్తున్న మరో వ్యక్తి లారీ కింద పడి మృతిచెందారు. మృతుల్లో కావేరమ్మపేట వాసి లారీ కింద పడి మృతిచెందిన వారిలో ఓ వ్యక్తిని కావేరమ్మపేటకు చెందిన రఫియొద్దీన్(50)గా గుర్తించారు. సరీ్వస్ రోడ్డు దగ్గర షాద్‌నగర్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మృతుడికి భార్య హబీబున్నీసాబేగం, కుమారుడు రియాజొద్దీన్, కూతురు అయేషా ఉన్నారు. మరో ఇద్దరు వలస కూలీలు మరో ఇద్దరు కూలీలు మల్లే‹Ù(30), బంగారయ్య (24) ఇద్దరు హైదరాబాద్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుంటారు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. బైక్‌పై వీరిద్దరూ అదే రూట్లో వెళ్తుండగా.. లారీ వీరి మీద పడింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లే‹Ùది కోడేరు మండలం రాజాపూర్ గ్రామం కాగా, అతనికి భార్య మంజుల, కుమారుడు పవన్, కూతురు భవాని ఉంది. బంగారయ్యది గోపాల్పేట మండలం మన్ననూర్ గ్రామం. ఇతనికి ఆర్నెళ్ల కిందట వివాహం కాగా, ప్రస్తుతం ఇతని భార్య గర్భిణి. మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారీ ఇదిలాఉండగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. లారీ బోల్తాపడడంతో వెంటనే క్యాబిన్ నుండి బయటపడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పోలీసులు పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని బావిస్తున్నారు. క్రేన్ల సహాయంతో మృతదేహాల వెలికితీత లారీ కింద పడి నలిగిపోయిన మృతదేహాలను భారీ క్రేన్ల సహాయంతో వెలికి తీశారు. లారీ టైర్ల కింద నుంచి ఇద్దరు వ్యక్తుల కాళ్లు కనిపించడంతో ఇద్దరు మృతిచెందినట్లు మొదట భావించారు. క్రేన్ల సహాయంతో లారీని పైకి ఎత్తి ఇద్దరి మృతదేహాలను బయటకు తీస్తున్న క్రమంలో మరో మృతదేహం కనిపించింది. దీంతో పనస కాయాలను పక్కకు తొలగించి ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. తరువాత లారీని అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి క్రేన్ల సహాయంతో తరలించారు. డీఎస్పీ శ్రీధర్ పరిశీలన మహబూబ్‌నగర్ డీఎçస్పీ శ్రీధర్ ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబందించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు. కావేరమ్మపేట వద్ద రోడ్ అండర్‌బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో ప్రధాన రహదారిని మూసివేసి సరీ్వస్రోడ్లపై రాకపోకలు కొనసాగించగా.. ప్రమాదం చోటుచేసుకుంది. తప్పిన మరో పెను ముప్పు లారీ ప్రమాదం అరగంట ముందు జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది. లారీ ఢీకొట్టిన ఇంటిలో మొత్తం పది మంది కుటుంబ సభ్యులు ఉంటారు. లారీ వీరి ఇల్లును ఢీకొట్టిన సమయంలో ఇంట్లో సాయమ్మ, భాగ్యలక్ష్మి మాత్రమే ఉన్నారు. వీరు స్వల్పంగా గాయపడ్డారు. అంతకు ముందే చంద్రకళ, శేఖర్, స్వప్న, కృష్ణయ్య హాస్టల్స్‌లో వంట పనులు చేసేందుకు వెళ్లారు. ఇక వీరి పిల్లలు నిహారిక, నమ్రత, అజయ్, పండు స్కూల్‌కు వెళ్లారు. వీరంతా ఇంటి నుంచి వెళ్లిన అరగంట తరువాత ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లయ్యింది. ఆర్యూబీ పనుల కారణంగానే..? జాతీయరహదారిపై ఆర్యూబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తిరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయరహదారిని మూసివేసి సర్వీస్ రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి రాకపోకలు నిలచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. -
జడ్చర్ల వద్ద లారీ బీభత్సం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. పనసకాయల లోడ్ లారీ సర్వీస్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న బంగారయ్య(23), మల్లయ్య (28)తో పాటు రఫీయొద్దీన్(50) అనే వ్యక్తిపై లారీ పడి దుర్మరణం చెందారు. -
పెట్రోల్ దొంగల పట్టివేత
జడ్చర్ల: మోటార్ బైక్‌లు, తదితర వాహనాల్లో రాత్రివేళ పెట్రోల్ చోరీ చేసే దొంగలను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించిన సంఘటన ఆదివారం స్థానిక లక్ష్మీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. కాలనీవాసులు తెలిపిన వివరాలిలా.. గత ఏడాది కాలంగా ఇళ్ల ముందు పార్కు చేసిన మోటార్ బైక్‌లు, తదితర వాహనాల్లో పెట్రోల్‌ను అపహరించడంతో పాటుగా ఇంజన్ విడిభాగాలను సైతం విడదీసి తీసుకెళ్లడం జరిగిందని, పలుసార్లు నిఘా వేసి పట్టుకునేందుకు ప్రయత్నించామన్నారు. విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు వివరించారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున బైక్‌ల నుంచి పెట్రోల్ తీసి బాటిళ్లలో నింపుతుండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నామని కాలనీకి చెందిన వెంకటేశ్, తదితరులు తెలిపారు. కావేరమ్మపేటకు చెందిన హసన్, ఇందిరానగర్‌కు చెందిన ముజావిద్, వెంకటేశ్వర కాలనీకి చెందిన నవాజ్ పట్టుబడగా వారిని జడ్చర్ల పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహబూబ్‌నగర్‌లో భూముల ధరలకు రెక్కలు?
రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి మరింత ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఏడేళ్లుగా భూములు, పాట్ల మార్కెట్ విలువను పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరించిన ప్రభుత్వం, ప్రస్తుతం భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఎంతమేరకు పెంచవచ్చనే విషయమై ప్రతిపాదనలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూములు, ప్లాట్లకు మార్కెట్ విలువ అత్యధికంగా పెరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా అయ్యే ప్రాంతాల్లో మార్కెట్ విలువను అమాంతం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. మిగతా ప్రాంతాల్లో 50 నుంచి వందశాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఇక్కడ 60 నుంచి 100శాతం పెరగవచ్చునని ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందనే సమాచారంలేదని వనపర్తి సబ్ రిజిస్ట్రార్ ఖుషియా బదర్ తెలిపారు. ఏడేళ్ల తర్వాత తెరపైకి మార్కెట్ విలువ అంశం మార్కెట్ విలువ పెంచే విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏడేళ్ల తర్వాత తెరపైకి తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం.. ప్రతి రెండేళ్లకు ఒకసారి భూములు, ప్లాట్ల విలువను పెంచాల్సి ఉంది. ఆయా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి ఇదివరకు రెండుసార్లు ప్రతిపాదనలు పంపించినా మార్కెట్ విలువ పెంచలేదు. నెలరోజుల నుంచి ప్రభుతం ఈ విషయంపై క్షేత్రస్థాయి అధికారులతో ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచే పెంచాలనుకుంది. కానీ కొన్నిమార్పులు చేయాలనే ఉద్దేశంతో మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నిరకాల భూములకు ఒకే మార్కెట్ విలువ? ఇదివరకే తరి, మెట్ట భూములకు వేర్వేరు మార్కెట్ విలువ ఉండేది. ప్రస్తుతం పెంచే మార్కెట్ విలువరేట్లలో అన్నిరకాల భూములకు, ప్లాట్లకు ఒకే రకమైన మార్కెట్ విలువను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. వనపర్తి రెండింతలు.. మహబూబ్‌నగర్, జడ్చర్ల తర్వాత అత్యధికంగా వనపర్తి జిల్లాలోనే మార్కెట్ విలువను పెంచేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మార్కెట్ విలువను బట్టి స్టాంప్ డ్యూటీ ప్రతి రిజిస్టేషన్‌కు మార్కెట్ విలువను బట్టి కొ నుగోలుదారులు రూ.లక్షకు రూ.6వేల చొప్పు న ప్రభుత్వానికి స్టాంప్‌డ్యూటీ పేర చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల నుంచి ఏటా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరగనున్న మార్కెట్ విలువతో రెట్టింపు కానుంది. ఫిబ్రవరి 1న పెంచుతామన్నారు ఇప్పటికే మార్కెట్ విలువను పెంచేందుకు పలుమార్లు ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. మాతో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఏయే ప్రాంతంలో ఎంత మేరకు పెంచాలనే అంశంపై ఇదివరకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లతో ప్రతిపాదనలు తీసుకునేది. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారులు, ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్లతో ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు. – ఖుషియా బదర్, సబ్‌రిజిస్ట్రార్, వనపర్తి స్పష్టత లేదు.. మార్కెట్ విలువపై సమావేశాలు నిర్వహించారు. ప్రతిపాదనలు అడిగారు. పెంచిన మార్కెట్ విలువ రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి చేయాలనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టతరాలేదు. – రవీందర్, జిల్లా రిజిస్ట్రార్, మహబూబ్‌నగర్ -
ప్రాణం తీసిన గాలిపటం
జడ్చర్ల టౌన్: పండుగ రోజు తండ్రితో కలసి గాలిపటం ఎగరేస్తున్న ఓ బాలుడు మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. నల్లగొండ జిల్లాకు చెందిన గణేష్, నిరోష దంపతులు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లికి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరికి కుమారుడు కార్తీక్ (6)తో పాటు కూతురు ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం తండ్రీ కొడుకులు తమ ఇంటి పైకెక్కి గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఇదే క్రమంలో గాలిపటం పక్కింటి మేడపై ఉన్న వాటర్‌ట్యాంక్‌కు తగిలింది. దీంతో తండ్రి అక్కడికి వెళ్లి దానిని తీసుకోగా.. దారంతో లాగుతున్న కుమారుడు ప్రమాదవశాత్తు మేడపై నుంచి కింద పడ్డాడు. బాలుడిని హుటాహుటిన బాదేపల్లి ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. పండుగ పూట బాలుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన..
సాక్షి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్, నరేశ్, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కలెక్టర్ అయ్యేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు..
రాజాపూర్ (జడ్చర్ల): ‘కష్టపడితేనే ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేందుకు బాగా చదవాలి. మొదట రైల్వేలో ఉద్యోగం వచ్చినా కలెక్టర్ కావాలనేదే నా లక్ష్యం. దానిని చేరుకునేందుకు ఎంతో కష్టపడి చదివా. నిద్రలేని రాత్రిళ్లు గడిపా. మీరు కూడా లక్ష్యాన్ని ఎంచుకొని.. ఆ దిశగా చదవండి’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పలు విషయాలు, సూచనలు చేశారు. మొదట పదో తరగతి విద్యార్థులు శ్రీవాణి, వైష్ణవి విద్యార్థులను పిలిచి మీ పాఠశాలలో అన్ని మౌళిక వసతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. వారు సమాధానమిస్తూ.. పాఠశాలకు ప్రహరీ లేదు అని అన్నారు. దీంతో ఇంటికి వంద.. బడికి చందా కార్యక్రమంలో మౌళిక వసతులు కల్పించుకోవాలని చెప్పాం కదా అని కలెక్టర్ సూచించారు. ఇంటికో పది పెల్లలు తెచ్చుకోండి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ఏం పర్వాలేదని, ఇంటికో పది ఇటుకలు తెచ్చుకోండని, మిగతా సిమెంట్ తదితర వస్తువులను నేను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో ప్రహరీని పూర్తి చేద్దామని పేర్కొన్నారు. మన వసతులను మనమే సమకూర్చుకుందామని సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల ఆత్మస్థైర్యం కోసం కరాటే తరగతులను నిర్వహించాలని ముఖ్యంగా బాలికలకు తప్పనిసరిగా శిక్షణ ఇప్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనుకున్న లక్ష్యం చేరుకోకపోతే గ్రామీణ స్థాయిలోనే మన జీవితం ఉంటుందని, ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమని, రైల్వేలో ఉద్యోగం వచ్చినా.. ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు చదివి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. మంచి ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయుడికి అభినందనలు ఇదిలాఉండగా, కారులో నుంచి కలెక్టర్ దిగి పాఠశాల ఆవరణలోకి వచ్చే క్రమంలో ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దీంతో కలెక్టర్ ఆ కవర్ తీసుకొని ఉపాధ్యాయుడు లక్ష్మినారాయణ చేతికి ఇవ్వడంతో.. ఆయన అట్టి కవర్‌ను జేబులో పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ వెరీగుడ్ అని అభినందించారు. డ్రెసింగ్ విషయంలో కూడా ఉపాధ్యాయులందరూ చక్కగా ఉండాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. -
బాదేపల్లి కాదు.. జడ్చర్ల
జడ్చర్ల టౌన్: బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మున్సిపాలిటీ కమిషనర్ సునీత గురువారం విలేకరులకు తెలియజేశారు. బాదేపల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీ, బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామపంచాయతీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. జనవరిలో బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామాలు బాదేపల్లిలో విలీనం కాగా జడ్చర్ల మేజర్‌గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు మరో 2021 డిసెంబర్ వరకు ఉండటంతో విలీనం నిలిచిపోయింది. ఈ కారణంగా ఇప్పటి వరకు మున్సిపాలిటీ పేరు బాదేపల్లి పేరునే కొనసాగుతూ వచ్చింది. ప్రజల్లో సందేహాలు ఉండటంతో బాదేపల్లి మున్సిపాలిటీ పేరును జడ్చర్లగా మార్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి పేరు మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019 ప్రకారం పేరును మార్చారు. ఇకపై జడ్చర్ల మున్సిపాలిటీగా కొనసాగనుంది. బ్యాంకు లావాదేవీలతోపాటు అన్ని వ్యవహారాల్లోనూ పేరు మార్పుచేసుకోవాలని కమిషనర్‌కు ఉత్తర్వులో సూచించారు. 2012నుంచి దోబూచులాట.. మున్సిపాలిటీ విషయంలో 2012నుంచి దోబూచులాట కొనసాగుతూనే ఉంది. 2012 జనవరిలో బాదేపల్లి, జడ్చర్ల మేజర్గ్రామపంచాయతీలను జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే జడ్చర్ల గ్రామపంచాయతీకి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించగా జడ్చర్లను గ్రామపంచాయతీగా కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత బాదేపల్లిని సైతం గ్రామపంచాయతీగా మార్చారు. 2014 జూన్‌లో తిరిగి బాదేపల్లిని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే క్రమంలో 2016 డిసెంబర్లో జడ్చర్ల గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగగా బాదేపల్లి మున్సిపాలిటీ కొనసాగుతూ వచ్చింది. గతేడాది మేలో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం సమీప గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయగా బాదేపల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాలలను కలిపారు. అయినప్పటికి బాదేపల్లి పేరు కొనసాగింది. జడ్చర్ల విలీనానికి మరో ఏడాది గడువు ఉండగానే బాదేపల్లి పేరు మారుస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం. మార్పు చేస్తున్నాం బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్లగా మారుస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బాదేపల్లిని జడ్చర్లగా మార్పు చేస్తున్నాం. రికార్డులతో పాటు కార్యాలయ బోర్డులు అన్నీ శుక్రవారం నుంచి జడ్చర్లగానే వ్యవహరించబడతాయి. – సునీత, కమిషనర్, మున్సిపాలిటీ -
ఎలా జరిగిందో తెలియదు.. కానీ చెల్లా చెదురయ్యాం
జడ్చర్ల: పెళ్లి వేడకకు హాజరై తిరిగి ఆటోలో వస్తుండగా.. ముందున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు..తిమ్మాజీపేట మండలం బాజీపూర్ గ్రామ సమీపంలోని తువ్వబండతండ, తుమ్మలకుంట తండాలకు చెందిన వారు ఆదివారం తిమ్మాజీపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తంతు ముగించుకుని సోమవారం ఆటోలో జడ్చర్లకు బయలుదేరారు. ఆటోలో దాదాపు 15మంది దాక ఉన్నట్లు తెలుస్తుంది. తండాకు చెందిన వారంతా హైద్రాబాద్‌లో ఉపాధి నిమిత్తం నివాసం ఉంటుండడంతో హైద్రాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమను ఆటోలో జడ్చర్లలో విడిచి రావాలని ఆటో డ్రైవర్ సురేష్‌ను కోరడంతో వారిని ఎక్కించుకుని జడ్చర్లకు బయలు దేరారు. 10 నిమిషాల తరువాత తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకగా ఆటో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. చికిత్స పొందుతూ ఇద్దరి మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లలిత(18), లక్ష్మణ్ (28) అనంతరం మృతిచెందారు. లలిత మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. లక్ష్మణ్ హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న తావుర్యా, బుజ్జి, లక్ష్మి, అనిత, బుజ్జాలి, వైష్ణవి, చరణ్,చింటూ, జాంప, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108అంబులెన్స్‌లో బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్య చికిత్సలు నిర్వహించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న అనిత, వైష్ణవి, తావుర్యా, సురేష్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంటున్నారు. అంతా తువ్వబండతండాకు చెందిన వారేనని, ఆటో డ్రైవర్ సురేష్ మాత్రం తుమ్మలకుంట తండాకు చెందిన వాడని బంధువులు తెలిపారు. చెల్లాచెదురయ్యాం ఆటో ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని, తామంతా చెల్లాచెదరై రోడ్డుపై పడిపోయామని క్షతగాత్రులు ఈసందర్భంగా తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో, అసలేం జరిగిందో తెలియదని, తామంతా తీవ్ర గాయాలకు గురయ్యామని వారు కన్నీరు మున్నీరయ్యారు. లలిత మృతిచెందడంతో తల్లిదండ్రులు జంబ్రు, పాత్లావత్ తార్యా కన్నీరు మున్నీరయ్యారు, -
విషాదం మిగిల్చిన ‘ఆదివారం’
సాక్షి, మిడ్జిల్ (జడ్చర్ల): మండలంలోని బోయిన్పల్లి గ్రామ సమీపంలోని జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి బోల్తా పడడంతో అందులోని చిన్నారి ఆర్య(2) మృతి చెందగా, తల్లి ప్రియదర్శినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. బాదేపల్లి (జడ్చర్ల)కి చెందిన సుజీవన్ కుమార్ కల్వకుర్తిలో శుభకార్యం ముగిసిన తర్వాత శనివారం అర్ధరాత్రి తన కారులో కల్వకుర్తి నుంచి భార్య ప్రియదర్శిని, కూతురు ఆర్యతో కలిసి బయలు దేరారు. బోయిన్పల్లి గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న చిన్నారి ఆర్య అక్కడికక్కడే మృతిచెందగా తల్లి ప్రియదర్శినికి తీవ్ర, సుజీవన్కు స్వల్ప గాయాలైనట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని సీఐ శివకుమార్ పరిశీలించారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించిన్నట్లు ఆయన తెలిపారు. కల్వర్టును ఢీకొట్టి వ్యక్తి.. మిడ్జిల్ మండలం వాడ్యాల్ గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై వెళ్తూ కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ రవి కథనం మేరకు వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఊర్కోండ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు (50) సొంత పనిమీద ఆదివారం ఉదయం జడ్చర్ల వైపు బైక్‌పై బయల్దేరాడు. ఈక్రమంలో వాడ్యాల్ గ్రామ శివారులోని జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపైన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడె మృతి చెందాడు. ఇదిలా ఉండగా మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి కొద్ది దూరంలో బైక్ ఉండడంతో ఎవరో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. మృతుడి కుమారుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. సీఐ శివకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కారు, ఆటో ఢీకొని బాలుడు.. పెబ్బేరు (కొత్తకోట): కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో 11ఏళ్ల బాలుడు దుర్మరణం చెందగా.. బాలుడి తండ్రితోపాటు ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలైన సంఘటన పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద ఎన్‌హెచ్ 44పై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలిలా.. వనపర్తిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రమేష్, అతని కుమారుడు పృథ్వికుమార్ (11), బంధువు రాజు అలియాస్ అరవింద్ వనపర్తి నుంచి ఇటిక్యాల మండలం తిమ్మాపూర్‌కు సొంత ఆటోలో వెళ్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు పెబ్బేరు బైపాస్ రోడ్డుపై ఈ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని బాలుడు పృథ్వికుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమేష్, అరవింద్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 అంబులెన్స్‌లో మొదట వనపర్తికి.. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారెడ్డి తెలిపారు. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు.. కృష్ణా (మక్తల్): కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మక్తల్ మండలం చందాపూర్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా.. మండలం లోని గుడెబల్లూర్‌కి చెందిన బొల్ల తాయప్ప(25) మక్తల్ నుంచి తమ స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మక్తల్ మండలం చందాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. తాయప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉంది. బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు.. కోస్గి (కొడంగల్): ఇంటి నుంచి బయలు దేరిన ఓ వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మే రకు.. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం అల్లీఖాన్పల్లికి చెందిన కావలి ఎల్లప్ప(46) తన కోడలు వసంతకు దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లిలో ఆయుర్వేద వైద్యం చేయించేందుకు అల్లుడు దస్తప్పతో కలిసి బైక్‌పై ముగ్గురు బయల్దేరారు. ఈ క్రమంలో మండలంలోని నాచారం చేరుకోగానే రోడ్డు మలుపు దగ్గర మహారాష్ట్ర నుంచి విజయవాడ వెళ్తున్న ఓ లారీ వేగంగా వెళ్తూ బైక్‌ను ఢీకొట్టడంతో ఎల్లప్ప తల లారీ టైర్ల కింద ఇరుక్కొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వసంత, దస్తయ్యలకు సైతం తీవ్రగాయాలుకాగా.. వీరిని మొదట స్థానిక ప్రభుత్వాస్పత్రికికి తరలించారు. ఎస్ఐ సంఘటన స్థ లానికి వెళ్లి పంచనామా నిర్వహించి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ సంఘనపై మృతుని భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు.. అమ్రాబాద్ (అచ్చంపేట): బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన పదర మండలం వంకేశ్వరంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా.. పదర మండలం వంకేశ్వరానికి చెందిన రాజగిరి అంబరీష్(30), బద్రులు.. అంబరీష్ పొలంలో పండించిన బంతిపూలను వ్యాన్‌లో పంపి పదర నుంచి వంకేశ్వరానికి తిరిగి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వంకేశ్వరం సమీపంలోని మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో అంబరీష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్‌పైనున్న బద్రు, ఎదురు బైక్నున్న బద్రు అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా ఇరువురిని పదరలో ప్రథమ చికిత్సలు నిర్వహించి అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తండ్రి నారాయణ, తల్లి మల్లమ్మ ఉన్నారు. వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి.. ఉండవెల్లి (అలంపూర్): వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఇటిక్యాలపాడు శివా రులో జాతీయ రహదారిపై ఆదివారం చో టుచేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపి న వివరాల ప్రకారం.. ఇటిక్యాలపాడు సమీ పంలో జాతీయ రహదారి డివైడర్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. విషయాన్ని గుర్తించిన జాతీయ రహదారి సిబ్బంది పోలీ సులకు సమాచారం అందించగా.. వారు వెళ్లి పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు బూడిద రంగు షర్టు, నేరుడు రంగు నిక్కరు, నీలం, తెల్లని గీతలు ఉన్న లుంగీ ధరించాడని, ఆనవాళ్లు గుర్తించిన వారు ఉండవల్లి పోలీస్‌స్టేషనులో సంప్రదించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి సిబ్బంది శివప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి ఊట్కూరు (మక్తల్): విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశవాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. నారాయణపేట మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన మొగులప్ప(26) కతాల్ అనే విద్యుత్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. నాగిరెడ్డిపల్లిలోని శేఖర్‌గౌడ్ పొలంలో స్తంభాలపై తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం పేట ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!
సాక్షి, జడ్చర్ల: రహదారులపై వెళ్తున్న ద్విచక్రవాహనాలను లిఫ్టు అడిగి కొంతదూరం వెళ్లాక ఆపి చోరీకి పాల్పడే దారి దోపిడీ దొంగల ముఠాను పట్టుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అఖిల్ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్ శివ, శివగళ్ల రాజ్‌కుమార్, నాయిడు దుర్గరాజ్‌కుమార్‌లు ఓ ముఠాగా ఏర్పడి ఆటోలో ప్రయాణిస్తూ దారిపై ఒంటరిగా వస్తున్న మోటార్‌బైక్‌లను ఆపుతారు. బైక్ ఆపితే వారిలో ఒకరు దానిపై ఎక్కి కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను ఆపడం ఆ వెంటనే వెనకగా ఆటోలో వచ్చిన మిగతా దొంగలు అందరూ కలిసి లిఫ్టు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న బైక్, నగదు, మొబైల్ ఫోన్ తదితర సొత్తును దోచుకుని పరారవుతారు. ఈ క్రమంలో ఈ నెల 10న బూర్గుపల్లికి చెందిన కుమ్మరి రాములు బైక్‌పై వస్తుండగా లిఫ్టు అడిగి నాగసాల గ్రామ శివారులో ఆపి అతని దగ్గర రూ.1,800 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెళ్లడించారు. ఈ క్రమంలో మంగళవారం వాహనాలను స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు. అంతకు ముందు తిమ్మాజిపేట మండలంలో కూడా ఇదే విధంగా లిఫ్టు ఆపడం, కొద్ది దూరం వెళ్లాక బైక్ ఆపడం వెనువెంటనే వెనుకగా ఆటోలో వచ్చి బెదిరించి బైక్, సొమ్ము తదితర సొత్తును దోచుకెళ్లినట్లు చెప్పారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, ఆటో, మొబైల్ ఫోన్, రూ.1,200 నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం జడ్చర్లకు వచ్చి టిఫిన్ సెంటర్ తదితర ఉపాధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. వీరికి బాదేపల్లికి చెందిన యువకులు కూడా సహకరించి చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుళ్లు మహేందర్, మహమూద్, కానిస్టేబుళ్లు బేగ్, శంకర్, రఘునాథ్‌రెడ్డి, బాబియా తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు చిక్కిన దొంగల ముఠా?
సాక్షి, జడ్చర్ల: ఇటీవల కాలంలో జడ్చర్లలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. చోరీలు చేయడం.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండేందుకు సీసీ పుటేజీల రికార్డింగ్ డీవీఆర్ బాక్సులను ఎత్తుకెళ్లడం వీరి అలవాటు. దీంతో ఈ కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఇలాంటి క్రమంలోనే దొంగలకు కనపడని ఓ సీసీ కెమెరా వారిని పట్టించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈ ఏడాది జులై 5వ తేది రాత్రి బాదేపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్ సమీపంలో గల ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ) గోదాంలో భారీ చోరీ చోటుచేసుకుంది. గోదాం పైకప్పు రేకును కట్టర్‌ద్వార కత్తిరించి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదును, సిగరెట్ల నిల్వలను, సీసీ కెమెరాలకు సంబందించిన హార్ట్‌డిస్క్‌లను సైతం వారు అపహరించుకెళ్లారు. భద్ర పరిచిన డబ్బుల దాదాపు రూ.6.85 లక్షలు అపహరించారని అదేవిధంగా రూ.2.40 లక్షల విలువ గల సిగరెట్లు ఎత్తుకెళ్లారని అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తీరనున్న యూరియా కష్టాలు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు ఇక తీరనున్నాయి. తాజాగా బుధవారం జడ్చర్ల రైల్వేస్టేషన్‌కు వ్యాగన్ ద్వారా స్పిక్ కంపెనీకి చెందిన 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. గురువారం మరో రెండు వ్యాగన్ల ద్వారా 3,800 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. జడ్చర్ల రేక్‌పాయింట్‌కు చేరుకున్న యూరియాను మహబూబ్‌నగర్ డీఏఓ సుచరిత, మార్క్‌ఫెడ్ ప్రతినిధి ప్రణీత్, రేక్‌పాయింట్ అధికారి, జడ్చర్ల ఏఓ రాంభూపాల్ పరిశీలించారు. వచ్చిన ఈ యూరియాను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా జిల్లాలకు పంపిణీ ఇలా యూరియాను మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాలకు 129 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను పంపించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించిన యూరియాలో జడ్చర్ల మండలానికి 120 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోరమండల్ యూరియా మొదటి విడతగా 800 మెట్రిక్ టన్నులు, రెండో విడతగా 3,000 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలో కొరత లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యూరియా కొరత లేదని డీఏఓ సుచరిత స్పష్టం చేశారు. బుధవారం జడ్చర్ల రేక్‌పాయింట్ పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, గురువారం 3,800 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కావాల్సిన విధంగా యూరియాను సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చిన యూరియాలో 50 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా సంఘాలకు ఇస్తామని, మిగతాది డీలర్లకు కేటాయిస్తామన్నారు. తద్వారా రైతులు రద్దీ లేకుండా సౌకర్యంగా యూరియా తీసుకువెళ్లగలుగుతారన్నారు. గత జూన్‌లో వర్షాలు కురియకపోవడం వల్ల యూరియా డిమాండ్ లేదన్నారు. జూలై, ఆగస్టులో వర్షాలు కురియడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.17 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. వీటికోసం 34 వేల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు పంపామన్నారు. నెల వారీగా నివేదికలు ఇచ్చామని అందులో బుధవారం సాయంత్రం వరకు 22,649 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యిందన్నారు. జిల్లాలో మండలాల వారీగా ముందుజాగ్రత్తలు తీసుకుని యూరియా నిల్వలు ఉంచటం వల్ల సమస్య తలెత్తకుండా చూశామన్నారు. అవసరమైన ప్రాంతాలకు నిల్వ ఉన్నచోటనుంచి పంపిణీ చేశామని తెలిపారు. -
కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు
సాక్షి, జడ్చర్ల : బాదేపల్లి మున్సిపాలిటీలో అంటువ్యాధులు ప్రబలుతుండటంతో అందుకు కారణమైన పందుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జడ్చర్ల న్యాయ సేవాధికార సంఘం చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జిని స్థానిక న్యాయవాది శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఆశ్రయించారు. స్పందించిన సంఘం చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ఈ నెల 12న జిల్లా కలెక్టర్‌తోపాటు ఐదు మంది అధికారులు జడ్చర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని లోక్ అదాలత్ బెంచ్‌కు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. వివరాలిలా.. బాదేపల్లిలో అంటువ్యాధులై న మలేరియా, టైఫాయిడ్ తదితర వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ న్యాయ సేవాధికార సంఘాన్ని ఆశ్రయించారు. దోమల వల్ల రోగాలు వస్తున్నాయని, దోమలను నియంత్రిస్తేనే దోమలు వ్యాధులు రాకుండా ఉంటాయని విన్నవించారు. దోమలకు కారణమైన పందులను తరలించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అనేక మంది పేదలు రోగాలతో సతమతమవుతున్నారని ఫిర్యాదు చేశారు. తాను నివాసం ఉండే గాంధీనగర్‌లో మహిళల హాస్టల్ ఉందని, ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. పందులను తరలించకుండా కొందరు రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల అనారోగాలకు కారణమవుతున్న మున్సిపాలిటీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ, జడ్చర్ల సీఐ, మహబూబ్‌నగర్ డీఎస్పీతోపాటు జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకుని తగు ఉత్తుర్వులు జారీ చేయాలని కోరారు. స్పందించిన న్యాయ సేవాధికారి సంఘం చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి షాలినిలింగం ఈ నెల 12న జిల్లా కలెక్టర్‌తోపాటు ఐదు మంది అధికారులు జడ్చర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని లోక్ అదాలత్ బెంచ్‌కు హాజరుకావాలని వారికి నోటీసులు జారీ చేశారు. -
రోడ్డు పక్కన ఆపడమే శాపమైంది..!
సాక్షి, జడ్చర్ల : రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి నిద్రించడమే ఆ వ్యక్తి పాలిట శాపమైంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని ముదిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా.. అనంతపూర్ జిల్లా కంబదూర్ మండలం రాంపురానికి చెందిన మహేందర్(32), అతని చిన్నాన్న కుమారుడు పవన్‌కుమార్ హైదరాబాద్ నుంచి అనంతపూర్‌కు బొలెరో వాహనంలో టైల్స్ లోడ్ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఈక్రమంలో నిద్రవస్తుండడంతో శనివారం రాత్రి 11గంటల ప్రాంతంలో ముదిరెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన తమ బొలెరో వాహనాన్ని నిలిపారు. మహేందర్ వాహనం టాప్‌పై నిద్రించగా.. పవన్‌కుమార్ వాహనంలోపల నిద్రించారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంతో హైదరాబాద్ నుంచి నారాయణపేట్‌కు వెళ్తున్న ఆర్టీసి బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనంపై నిద్రిస్తున్న మహేందర్ రోడ్డుపై పడగా.. అతనిపై వాహనం పడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కానిస్టేబుల్ జనార్దన్ తెలిపారు. -
యువత. దేశానికి భవిత
యువత దేశానికి భవిత.. యువతతోనే దేశాభివృద్ధి.. అలాంటి యువత మారుతున్న కాలానుగుణంగా తమను తాము మలుచుకుంటున్నారు.. ముఖ్యంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో దూసుకెళ్తున్నారు.. చదువుతోపాటు ఇతర రంగాల్లో రాణిస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. యునైటెడ్ నేషన్స్‌వారు జనరల్ అసెంబ్లీలో 2014 నవంబర్‌లో ‘జూలై 15’ను వరల్డ్ యూత్ స్కిల్స్‌డేగా నిర్ణయించారు.. అప్పటి నుంచి ‘వరల్డ్ యూత్ స్కిల్స్‌డేగా నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో సోమవారం వరల్డ్ యూత్ స్కిల్స్‌డేను పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న పలువురు యువతపై ప్రత్యేక కథనం.. – మహబూబ్‌నగర్ క్రీడలు అలంపూర్(మహబూబ్‌నగర్) : నాకు సినిమాటోగ్రాఫర్ కావాలని కోరిక ఉండేది. అవకాశాలు కలిసిరాలేదు. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో మా మిత్రులందరం కలిసి సామాజిక స్పృహ కలిగే కథనాలతో షార్ట్‌ఫిల్మ్స్ తీయాలని నిర్ణయించుకున్నాం. నా చిరకాల కోరిక తీరడమే గాక సమాజానికి మేలు చేసిన వారమవుతామని భావించి.. షార్ట్‌ఫిల్మ్స్‌పై దృష్టిసారించాను. ఇప్పటి వరకు పది చిత్రాలకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాను. మా ప్రాంతంలో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ తీశాం. ప్రస్తుతం సూర్యచంద్ర అనే షార్ట్‌ఫిల్మ్స్ తీస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహిస్తే మరెన్నో షార్ట్‌ఫిల్మ్స్ తీస్తాం. – శ్యాంసుందర్, సినిమాటోగ్రాఫర్, శాంతినగర్ డ్రోన్ కెమెరాతో షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరిస్తున్న శ్యాంసుందర్ సామాజిక చైతన్యమే లక్ష్యం 2015లో ఇంటర్నేషన్ల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో ‘చదువు’ షార్ట్ ఫిల్మ్‌కు రెండో ఉత్తమ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌పై 2016లో తీసిన స్వచ్ఛ భారత్ షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ లఘుచిత్రంగా ఎంపిక చేసి, ప్రశంస పత్రం అందజేశారు. అలాగే పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున ఆకలి షార్ట్‌ఫిల్మ్‌కు అవార్డు, నల్లగొండ ఫిల్మ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో బ్యాల వివాహాల నిర్మూలన అనే అంశంపై తీసిన దేవకీ కల్యాణం షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ చిత్రం అవార్డు, ప్రోత్సాహక నగదు అందజేశారు. అంతేకాకుండా కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుడు కాంచం సత్యనారాయణగుప్తా నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషన్లో ఉత్తమ డైరెక్టర్ కేటగిరిలో స్థానం లభించింది. ఆర్ఎక్స్ 100 చిత్రం హీరో కార్తీకేయరెడ్డి, చంద్రబోస్‌తో సన్మానం పొందారు. యూట్యూబ్‌లో తన షార్ట్‌ఫిల్మ్స్‌కు 25 లక్షల వ్యూస్ ఉన్నట్లు లాలుయాదవ్ తెలిపారు. మెమోరీ ట్రైనర్‌గా వంశీకృష్ణ జడ్చర్ల టౌన్: పిల్లల్లో మేధాశక్తి పెరగడానికి వారి తల్లిదండ్రులు మేధావులు కానక్కరలేదంటున్నాడు జడ్చర్లకు చెందిన యువకుడు మెమోరీ ట్రైనర్ వంశీకృష్ణ. మెమోరీ శిక్షణలో ఇప్పటి వరకు 10 వేల మందికిపైగా నేరుగా శిక్షణ ఇచ్చిన ఘనత సాధించి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించేందుకు సాధన చేస్తున్నాడు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని నిరూపిస్తున్నాడు. చిన్నతనంలో ట్రిపుల్ ఎక్స్ ఇంగ్లిష్ టీవీ ఛానల్లో బాల మేధావులు చేసే అద్భుతాలను చూసి అబ్బురపడిపోయి తాను ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి పాండురంగాచారి కొడుకు ఆసక్తిని గమనించి ప్రోత్సహించాడు. తల్లి పుష్పలత మరణించినా ఏమాత్రం ఆత్మస్తైర్యం కోల్పోకుండా మెమోరీ పెంచుకోవడంలో నిష్ణాతుడయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన జయసింహ వద్ద మెమోరీ పెంచుకోవడంపై శిక్షణ పొందాడు. అదేవిధంగా లా ఆఫ్ అటెన్షన్, న్యూరల్ లింగ్విస్టిక్ సైకాలజీ, స్పీడ్ మ్యాథమెటిక్స్‌లో డిప్లొమాలు పూర్తిచేశాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బెంగుళూరులో జరిగే జాతీయ మెమోరీ చాంపియన్‌షిప్‌కు జడ్జిగా ఎంపికై స్థానికుల ప్రశంసలు పొందుతున్నాడు. టీవీలో చూసిన ప్రదర్శనలే.. సాధన, కృషి, పట్టుదల ఉంటే ఎంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తాను చిన్నతనంలో టీవీలో చూసిన ప్రదర్శనలే స్ఫూర్తిగా అమ్మానాన్నలు ప్రోత్సాహంతో మెమోరీ ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నాను. గిన్నిస్‌బుక్‌లో బైనరీ నంబర్స్‌లో రికార్డు నమోదు చేసుకోవాలని ముందుకు సాగుతున్నాను. – వంశీకృష్ణ బాక్సింగ్‌లో రాణిస్తున్నమహేష్ ఊట్కూర్ (మక్తల్): జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఊట్కూర్‌కు చెందిన యువకుడు రాణిస్తున్నాడు. మండల కేంద్రానికి చెందిన కృష్ణమీనన్, లింగమ్మ దంపతుల మూడో కుమారుడు మహేష్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి కరాటే, బాక్సింగ్ అంటే ఇష్టం. ఊట్కూర్‌లో పదో తరగతి వరకు చదివాడు. అనంతరం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాడు. అదే సమయంలో అరవిందో కళాశాలలో బీకాం కంప్యూటర్స్ పూర్తిచేశారు. అక్కడే ఉన్నత చదువులు చదువుతూ స్టార్ మౌతాయ్ అండ్ మా క్లబ్లో కరాటేతోపాటు బాక్సింగ్‌లో ఎంఎస్ జావిద్, ఎంఐ నవీద్ మాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలోనే 2019 జనవరిలో హైదరాబాద్‌లో నరేష్ సూర్య క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో జరిగిన పోటీల్లో 77 కిలోల విభాగంలో వెండి పతకం సాధించాడు. అలాగే జూలై 7, 2019లో ఢిల్లీలో మూడురోజులపాటు జరిగిన ఇండియన్ హెల్త్ ఫిజికల్ ఫిట్నెస్ జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొన్నాడు. ఢిల్లీలో బాక్సింగ్ పోటీల్లో తలపడిన మహేష్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు బైనరీ నంబర్స్ చెప్పడంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఇంపాక్ట్ ఫౌండేషన్ నిర్వహించిన బైనరీ నంబర్స్ పోటీల్లో 5 నిమిషాల్లో 360 అక్షరాలు చెప్పి తన మెమోరీ సత్తాచాటాడు. ఈ క్రమంలోనే బైనరీ నంబర్లు చెప్పడంలో గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించేందుకు సాధన చేస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యి నంబర్లతో రికార్డు ఉండగా తాను 1,500 నంబర్లతో రికార్డు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. అలాగే వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగనున్న వరల్డ్ మెమోరీ చాంపియన్‌షిప్‌కు వంశీకృష్ణ అర్హత సాధించాడు. వరల్డ్ మెమోరీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే చాంపియన్‌షిప్‌లో తన మెమోరీ పవర్‌ను చూయించేందుకు సిద్ధమవుతున్నాడు. పర్వతారోహణలో గిరిజన బాలిక బాలానగర్ (జడ్చర్ల): మండలంలోని గౌతాపూర్ గ్రామం నమ్యతండాకు చెందిన సబావత్ సునీత 14 ఏళ్ల వయస్సులోనే 2017 ఆగస్టు 15న ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమయంలోనే పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, పీఈటీ స్పందన ప్రోత్సాహంతో రాష్ట్ర క్రీడాధికారి రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గిరిజన బాలికగా ఘనత సాధించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని గురి తప్పకుండా సాధన చేస్తే విజయం తథ్యమని విద్యార్థ దశలోనే ఉన్న బాలిక మరోమారు చాటిచెప్పింది. సునీత తండ్రి సబావత్ సేవ్య, తల్లి శారదలది నిరుపేద కుటుంబం. ఎంతో కష్టపడి బిడ్డను చదివించిన వారు తమ కూతురు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిందనే వార్త తెలియగానే అమితానందం పొందారు. సుమారు ఐదు రోజులపాటు రోజుకు 120 మీటర్ల చొప్పున కోచ్ ప్లానింగ్‌తో అధిరోహించానని సునీత తెలిపారు. అప్పట్లో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ భాగ్యమ్మ బాలికను సన్మానించారు. -
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
సాక్షి, జడ్చర్ల: నిరుపేద కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులు.. అంతా ఆడ సంతానం.. దీనికి తోడు కుటుంబ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆ ఆడపిల్లలు ఏమనుకున్నారో.. ఎంతగా మానసిక క్షోభకు గురయ్యారో.. తండ్రి పట్టించుకోవడం లేదనో.. తమకు పెళ్లిళ్లు కావడం లేదనో.. తెలియదు గాని వారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.. ఈ సంఘటన మండలంలోని చర్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెమోని వెంకటయ్య (65), సాయమ్మ (60) దంపతులకు ఆరుగురు కూతుళ్లు. వెంకటమ్మ అలియాస్ మానస (36), అనిత (34), కృష్ణవేణి (30), యాదమ్మ (27), మౌనిక అలియాస్ ప్రవళిక (25), స్వాతి (20) ఉన్నారు. వీరిలో మౌనిక బీఫార్మసీ పూర్తి చేయగా.. స్వాతి ఇంటర్ పూర్తి చేసింది. మిగతా వారు కూడా పదో తరగతిలోపు చదువుకున్నారు. అయితే గురువారం మానస, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు ఇంట్లో ఉన్న పురుగు మందును తాగారు. అస్వస్థతకు గురవడంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆటోలో, ద్విచక్రవాహనంపై వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో 108లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబం గ్రామానికి చెందిన వెంకటయ్యది నిరుపేద కుటుంబం. ఈయనకు భార్య సాయమ్మతో పాటు తల్లి శాంతమ్మ, ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. తన స్థోమతకు తగ్గట్టుగా కూతుళ్లను చదివించాడు. వీరికి గ్రామ శివారులో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో పండే పంటలతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వెంకటయ్యతోపాటు మరో ఇద్దరు సోదరులకు కలిపి మూడు గదుల ఇళ్లు ఉంది. ఇందులో వెంకటయ్య పాలికి వచ్చిన చిన్నపాటి గదిలోనే వీరంతా జీవనం సాగిస్తున్నారు. ఆ గది కూడా చిన్నగా ఉండటం, శిథిలావస్థకు చేరుకుంది. అంతా పెళ్లీడు వారే.. ఆరుగురు ఆడపిల్లలు. అంతా పెళ్లీడు దాటిన వారే. దీంతో ఆ ఆడకూతుళ్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ తండ్రి వెంకటయ్య తమను పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదన్న మానసిక వ్యథ ఒక వైపు కుంగదీస్తుండగా.. మరోవైపు పేదరికం అడుగడుగునా వెక్కిరించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు పురుగు మందు తాగి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం తమ చెల్లెలు కృష్ణవేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈమె ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటుందని వీరి అనుమానం. దీంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కృష్ణవేణి కోసం యాదగిరిగుట్ట, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో వెతికేందుకు వెళ్లాడు. తమ చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తమ పరువు తీసిందని భావించారో.. మరో కారణంగానో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం సర్పంచ్ వెంకటయ్య దాదాపు 25 సంవత్సరాల క్రితం చర్లపల్లికి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం బాదేపల్లి పట్టణం తదితర ప్రాంతాల్లో చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేపట్టి నష్టపోయినట్లు తెలిసింది. దీంతో ఒకవైపు ఆడపిల్లలు, మరోవైపు పేదరికంతో వెంకటయ్య మానసికంగా కుంగిపోయి మౌనస్థితికి చేరినట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే పోలీసుల దృష్టికి.. తమను తమ తండ్రి వెంకటయ్య పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదని, పెద్దదిక్కుగా ఉన్నా తండ్రి పట్టించుకోకపోవడంతో తమకు సంబంధాలు రావడం లేదని ఆవేదన చెందిన కూతుళ్లు తమకు న్యాయం చేయాలని కొద్దిరోజుల క్రితం జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ బాలరాజుయాదవ్ వారికి, తండ్రి వెంకటయ్యకు కౌన్సిలింగ్ నిర్వహించి ధైర్యంగా ఉండాలని చెప్పి పంపించారు. పెళ్లికి సహాయంగా తమవంతుగా సహకరిస్తామని కూడా సీఐ వారికి భరోసా ఇచ్చారు. కేను నమోదు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఆరుగురు ఆడపిల్లలు, పెళ్లిళ్లు కాకపోవడం, వీరిలో ఒక చెల్లెలు ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోవడం కారణంగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో మానస, అనితల పరిస్థితి విషమంగా ఉండడంతో ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు కృష్ణవేణి, యాదమ్మలకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. -
మోక్షం కలిగేనా?
సాక్షి, రాజాపూర్: మండలంలోని రంగారెడ్డిగూడ శివారులో ఉన్న రైౖల్వేగేట్ వద్ద అండర్ బ్రిడ్జి లేక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేట్లు ఉన్న స్థానంలో అండర్ వే నిర్మించి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. మండల కేంద్రం నుంచి మల్లేపల్లికి వెళ్లేదారిలో ఉన్నా రైల్వేగేట్‌ను తొలగించి దాని స్థానంలో అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఇక్కడ నిర్మించినట్లుగానే రంగారెడ్డి గూడా వద్ద నిర్మిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పట్లో అండర్ బ్రిడ్జికి మోక్షం లేనట్లేనని అనిపిస్తుంది. గతంలో రైళ్లు చాలా తక్కువగా తిరిగేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తుండడంతో, ప్రతి సారి రంగారెడ్డిగూడ వద్ద ఉన్న గేట్‌ను వేయడంతో అటు నుంచి వెళ్లే కల్లేపల్లి, అగ్రహారం పొట్లపల్లి, గుండ్లపొట్లపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అదనంగా డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు చకచక పనులు సాగుతున్నాయి. డబుల్ లైన్ పూర్తయితే మరిన్ని రైళ్లు తిరిగే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డిగూడవద్ద అండర్‌బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరం ఎంతైన ఉంది. గతంలో రైల్వేశాఖ అధికారులు సర్వే నిర్వహించి అండర్ వే నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. ఇప్పటి వరకు పనులు మొదలు కాకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులకు వినతులు ఇచ్చాం రైల్వే గేట్ స్థానంలో అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చిన అధికారులకు వినతులు ఇచ్చాం. అండర్ బ్రిడ్జి ఇక్కడ చాలా అవసరం. గ్రామసభలో కూడా తీర్మానం చేసి రైల్వేశాఖ అధికారులకు పంపిస్తాం. గొల్లపల్లి, రాజాపూర్, పెద్దాయపల్లి గ్రామాల వద్ద రైల్వేగేట్ల స్థానంలో నిర్మించినట్లుగానే రంగారెడ్డిగూడ వద్ద ఉన్న రైల్వేగేట్ స్థానంలో ఖచ్చితంగా అండర్ బ్రిడ్జిని నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలి. – జనంపల్లి శశికళ, సర్పంచ్, రంగారెడ్డిగూడ -
ఫార్మా సిటీ.. వెరీ పిటీ
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్) 2017 ఏప్రిల్‌లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నయా పైసా విదల్చని ‘డిప్’ హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వడివడిగా టీఎస్ఐఐసీ అడుగులు... ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్‌కు చెందిన సుర్బాన జురోంగ్ కన్సల్టెంట్స్ ద్వారా సమీకృత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌పైనా ప్రభావం... దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్ నిమ్జ్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం నుంచి స్పందన కరువు... ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఫండ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్ఎల్డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్ఐఐసీ నిలిపివేసింది. ఫార్మాసిటీ ప్రత్యేకతలు.. పెట్టుబడుల అంచనా: రూ.64 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు (ఏటా): రూ.58 వేల కోట్లు ప్రత్యక్ష ఉపాధి: 1.70 లక్షల మందికి పరోక్ష ఉపాధి: 3.90 లక్షల మందికి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్, లాజిస్టిక్ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్ మేనేజ్మెంట్ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. -
తప్పిదాలను పునరావృతం చేయొద్దు
సాక్షి, జడ్చర్ల టౌన్: పోలింగ్ విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు చిన్న చిన్న తప్పిదాలను పునరావృతం చేసుకుంటూ జవాబుదారీగా మారొద్దంటూ మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్చర్ల అసెంబ్లీ పీఓలు, ఏపీఓల ఎన్నికల శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన చిన్న తప్పిదాలే పెద్ద చర్చగా మారాయని గుర్తుచేశారు. మాక్‌పోలింగ్ అయ్యాక తప్పనిసరిగా ఈవీఎంలు, వీవీప్యాట్లు క్లియర్ చేసి పోలింగ్‌కు వెళ్లాలని, పోలింగ్ ముగిశాక తప్పనిసరిగా ఈవీఎం క్లోజ్ చేయాలన్నారు. అలా చేయకపోవడం వల్ల కౌంటింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఫలితంగా ఎన్నికల కమిషన్‌కు జవాబుదారీగా మారాల్సి వస్తుందన్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని విధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాక్‌పోలింగ్ చేసి ఈవీఎంలు క్లియర్ చేయలేదని, వారిలో కొందరు సమాచారం ఇచ్చినా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. తద్వారా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలింగ్ జరిగాక ఇచ్చిన పోలింగ్ శాతం తప్పుగా ఇవ్వద్దని, మీరిచ్చే నివేదికల ఆధారంగానే మీడియాకు సమాచారం అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోలింగ్ పర్సంటేజీల విషయంలో తప్పుగా ఇవ్వడం వల్ల పెద్ద రచ్చ అయిన విషయాన్ని గుర్తుచేసి అలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లతోపాటు 17ఏ, 17సీ వంటి మొతం 7 రికార్డుల్లోనూ పోలైన ఓట్ల సంఖ్య ఒకేలా ఉండాలన్నారు. పోలింగ్‌కు అవసరమైన 9 డాక్యుమెంట్లతో బుక్లెట్ చేశామని, దానిని చింపకుండా సక్రమంగా రాసి రిసెప్షన్ కౌంటర్లో సమర్పించాలన్నారు. పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు సకాలంలో చేరుకుని కేంద్రాలకు సమయానికి చేరుకుని ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిశాక త్వరగా రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుని ఈవీఎంలు, వీవీప్యాట్, బుక్లెట్, డిస్ప్లే యూనిట్‌ను సమర్పించి వెళ్లాలన్నారు. కేంద్రాల్లో ఏవైనా సమస్యలు వస్తే బుక్‌లెట్‌లో సూచించిన ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని, జడ్చర్ల అసెంబ్లీ పరిధిలోని ఊర్కొండ మండలంలో పనిచేసే సిబ్బంది మాత్రం మహబూబ్‌నగర్ కోడ్‌ను ఉపయోగించి ఫోన్ చేయాలన్నారు. సమయాన్ని వృథా చేయడం మనకు అలవాటని, అలా చేయకుండా ఎన్నికలు విజయవంతం చేద్దామన్నారు. గుర్తింపు కార్డులు తేవాల్సిందే ఓటరు స్లిప్‌లు తీసుకువచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అనుమతి ఇవ్వవద్దని, తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాల్సిందేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ముందుగానే తెలియజేయాలని, అంతకు ముందురోజు రాత్రి గ్రామాల్లో ప్రచారం చేయిస్తామన్నారు. శిక్షణలో సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, 300 మంది పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
తండాలకు బీటీ తళుకులు
సాక్షి, బాలానగర్: మండలంలోని పలు తండాలకు బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మండలంలోని మేడిగడ్డ, చింతకుంట, చెన్నంగులగడ్డ, నేలబండ తండాలతోపాటు మొదంపల్లి, బోడజానంపేట్ వంటి పలు గ్రామాలకు బీటీ రోడ్డు పనులకు గత సంవత్సరంలో జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మేడిగడ్డ తండాకు రూ.కోటి యాబై లక్షలు, నేలబండ తండా హేమాజిపూర్కు రూ.2 కోట్లు, చింతకుంట తండాకు రూ.2 కోట్లు, చెన్నంగులగడ్డ తండా ఎక్వాయపల్లికి రూ.1.5 కోట్లు, మొదంపల్లి నుంచి పలుగుతండాకు రూ.2 కోట్ల నిధులతో సుమారు పది కిలోమీటర్లమేర బీటీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. తీరనున్న తండావాసుల కష్టాలు.. గతంలో తండా నుంచి మండల కేంద్రానికి, గ్రామ పంచాయతీకి రావాలంటే రోడ్డు సరిగా ఉండేది కాదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎవరైనా గర్భిణులు కాన్సుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేసరికి కాన్పుకావడం, తల్లి లేదా బిడ్డ వైద్య సదుపాయాలు అందక చనిపోవడం జరిగేది. కానీ ప్రస్తుతం తండాలకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్లతో తండావాసుల కష్టాలు తీరనున్నాయి. తండాలకు మంచిరోజులు స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన తండాలకు ఏనాడు బీటీ రోడ్లు వేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే తండాలకు బీటీ రోడ్లు వేయడం గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుంది. –జర్పుల లక్ష్మణ్ నాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తండాలను గ్రామ పంచాయితీలు చేయడం, తండాలకు బీటీ రోడ్లు వేయడం, మంచినీటి కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి గ్రామపంచాయతీకి, తండా గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం. – ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ -
జడ్చర్ల కాంగ్రెస్ ఇన్చార్జిగా అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జనంపల్లి అనిరుధ్‌రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు దశాబ్ద కాలం గా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనిరుధ్ గత ఆగస్టులో కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ నుంచి పోటీకి అనిరుధ్ పేరును కాంగ్రెస్ పరిశీలించింది. అసెంబ్లీ టికెట్ దక్కకున్నా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అనిరుధ్ చేసి న కృషిని గుర్తించిన పార్టీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించింది. -
అడ్డొస్తున్నాడనే అంతం
సాక్షి, జడ్చర్ల: తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్‌గౌడ్ శనివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని టీడీ గుట్టలో నివాసం ఉంటున్న రావుల నర్సింహ(35), లక్ష్మిదేవి భార్యాభర్తలు. నర్సింహ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి అదే ప్రాంతంలో ఓ కిరాణ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న పూసల శేఖర్ ప్రవేశించాడు. నర్సింహతో పరిచయం పెంచుకుని అతని భార్య లక్ష్మిదేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లికాని శేఖర్ లక్ష్మిదేవితో సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న భర్త నర్సింహ శేఖర్‌ను పలుసార్లు మందలించాడు. దీంతో నర్సింహపై శేఖర్ కసిని పెంచుకుని చాటుమాటుగా లక్ష్మిదేవితో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఏడాదిపాటు ప్రియుడితో సహజీవనం ఈక్రమంలో ప్రియుడు శేఖర్‌తో కలిసి లక్ష్మిదేవి ఇంటి నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు వెళ్లి అక్కడే జీవనం కొనసాగించారు. దీంతో భర్త నర్సింహ జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. దాదాపు ఏడాది గడిచిన అనంతరం తిరిగి నర్సింహ దగ్గరకు లక్ష్మిదేవి రాగా చేరదీశాడు. అయినా లక్ష్మిదేవి, శేఖర్లు తమ ప్రవర్తనను మార్చుకోకుండా సంబంధాన్ని కొనసాగిస్తుండగా నర్సింహ మందలించి బుద్ది చెప్పాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన వారు నర్సింహ అడ్డు తొలగించుకోవాలని, అడ్డు తొలగితే అతని ఉద్యోగంతో పాటు అతనికి సంబంధించిన ఓ ప్లాటు సైతం తమ చేతికి వస్తాయని భావించి హత్య చేసేందుకు వ్యూహరచన చేసి రెక్కీ కూడా నిర్వహించారు. అందులో భాగంగా ప్రియుడు శేఖర్ లక్ష్మిదేవి భర్త నర్సింహతో మంచిగా మసులుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి మద్యం సేవించి విందులు చేసుకోవడం ప్రారంభించారు. మొదట గుర్తు తెలియని మృతదేహంగా.. ఈనెల 7న బూరెడ్డిపల్లి గ్రామ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మొదట గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేయగా.. హత్య కేసుగా గుర్తించారు. వెంటనే మృతుడి ఆచూకీని తెలుసుకుని శేఖర్, లక్ష్మిదేవి నిందితులుగా గుర్తించారు. శనివారం జడ్చర్ల రైల్వే స్టేషన్లో నిందితులు రైలు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. హత్యా ప్రదేశానికి కొద్ది దూరంలో గల ముళ్లపొదల్లో దాచిన నిందితుల రెండు మొబైల్ఫోన్లు, రక్తంతో కూడిన ప్లాస్టిక్ కవర్, బీరు బాటిల్ ముక్కలు స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ బాల్‌రాజ్‌యాదవ్, ఎస్ఐలు కృష్ణయ్య, షంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పని ఉంది మాట్లాడి వద్దామంటూ.. ఇదిలా ఉండగా, జడ్చర్ల శివారులో మిషన్ భగీరథ పనులు ఉన్నాయని అక్కడ పనిచేసేందుకు మాట్లాడి వద్దామంటూ ఈ నెల 3న శేఖర్ నర్సింహను తోలుకొని బూరెడ్డిపల్లి శివారు వచ్చాడు. సంబంధిత సార్లు లేరని వారు వచ్చే వరకు మద్యం సేవిద్దామంటూ ఓ దగ్గర సిట్టింగ్ చేశారు. నర్సింహకు మద్యం బాగా తాపించిన తరువాత అతని భార్య లక్ష్మిదేవికి ఫోన్ చేసి అక్కడకు రప్పించాడు శేఖర్. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తలపై బీరు సీసాతో కొట్టి, గొంతుపై పగిలిన సీసాతో పొడిచారు. కొనప్రాణంతో ఉండగా నర్సింహ కాళ్లను ప్రియుడు శేఖర్ గట్టిగా పట్టుకోగా ప్రియురాలు లక్ష్మిదేవి ప్లాస్టిక్ కవర్ తలచుట్టూ చుట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో నర్సింహ చనిపోయాడు. -
రేవంత్ అరెస్ట్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, కొడంగల్/జడ్చర్ల: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్‌పై పోలీసు అధికారులు స్పందించారు. దీనిపై వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. కోస్గిలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రేవంత్ అదుపులోకి తీసుకుని మహబూబ్‌నగర్‌కు తరలించామని వెల్లడించారు. కేసీఆర్ సభ ముగిసిన వెంటనే రేవంత్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే రేవంత్‌పై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. డీటీసీ పరిసరాల్లో భారీ బందోబస్తు.. ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన రేవంత్‌ను పోలీసులు జడ్చర్ల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి(డీటీసీ) తరలించారు. అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా బలగాలు మోహరించారు. డీటీసీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు బాధ్యతలను శంషాబాద్ డీసీసీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు జడ్చర్లలో ఆందోళన చేపట్టారు. చదవండి: రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ ‘ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు’ -
‘మెరుపులా వచ్చింది.. మెరుపులానే పోతుంది’
జడ్చర్ల: కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ మెరుపులా వచ్చిందని..ఎన్నికలై పోయిన తర్వాత మెరుపులానే కనపడకుండా పోయిద్దని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన మైనార్టీల సదస్సుకు గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణాలో మా బలం పెరిగిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్టేట్మెంట్తో తెలంగాణ రాలేదని, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణాను తామే ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మా రెడ్డి వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు. -
సబ్‌రిజిస్ట్రార్‌పై టీఅర్ఎస్ నేత వీరంగం
-
రైతును రాజుగా చూడాలి..
రాజాపూర్(జడ్చర్ల) : రైతును రాజుగా చూడాలన్న లక్ష్యంతో దేశంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దొన్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కంపేట గ్రామంలో రైతు బంధు పథకం చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తున్నది. రాజాపూర్ మండలం రైతులకు రూ.8కోట్ల పెట్టుబడి సాయం అందుతోందని తెలిపారు. రైతులు, వ్యవసాయాన్ని గత పాలకులు పట్టిం చుకోకపోగా.. తాము అధికారంలోకి వచ్చిన మొ దటి సంవత్సరంలోనే కోతలు లేని విద్యుత్, వ్యవసాయానికి పగలే నాణ్యమైన కరెంట ఇస్తున్నా మని తెలిపారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లా రైతాంగం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తే పనిలేని ప్రతిపక్ష నాయకులు కోర్టుల్లో కేసు లు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గిరిధర్‌రెడ్డి పెట్టుబడి సాయంగా అందిన రూ.2లక్షల చెక్కును మంత్రి చేతుల మీదుగా ప్రభుత్వానికి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ నర్సింగరావు, ఎంపీటీ సీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ గిరిధర్‌రెడ్డి, డీఎస్ఓ శారదా ప్రియదర్శిని, జేడి నిర్మల, ఏఓ నరేందర్, జడ్చర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్‌తో పాటు వాల్యానాయక్, లక్ష్మణ్ నాయ క్, అభిమన్యురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయపడిన రైతుకు ఇంటి వద్దే పంపిణీ బాలానగర్(జడ్చర్ల) : రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగి చికిత్స పొందుతూ నడవలేని స్థితిలో ఉన్న గుండేడ్ గ్రామ రైతు జంగయ్యకు ఇంటి వద్దే మంత్రి లక్ష్మారెడ్డి పెట్టుబడి సాయం చెక్కు అందజేశారు. జంగయ్య కాలిలో రాడ్లు వేయడంతో లేవలేని స్థితిలోనే ఉన్నాడని తెలుసుకున్న మంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చెక్కు ఇచ్చి పరామర్శించారు. టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్య నాయక్, మార్కెట్ డైరెక్టర్ర వెంకట్ నాయక్, వైస్ ఎంపీపీ లింగునాయక్‌తో పాటు చెన్నారెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా కందుల అమ్మకాలు
జడ్చర్ల : రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వ మద్దతు ధరకు సంబంధిత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఓ కమీషన్ ఏజెంట్‌ను మార్కెట్ యార్డు చైర్పర్సన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జడ్చర్ల మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది. చైర్పర్సన్ శోభ కథనం ప్రకారం.. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం హాకా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధరను రూ.5,450గా నిర్ణయించింది. అయితే బయట మార్కెట్లో రైతులకు ఆ ధరలు దక్కడం లేదు. క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ధరలు దక్కుతున్నాయి. అయితే కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తదితర చిల్లర వ్యాపారులు సైతం రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను తిరిగి వారి పేరున హాకా కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ శోభ, పాలక మండల సభ్యులు సదరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి కందుల కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని, మధ్య దళారీల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. రైతు పేరున విక్రయం.. ఈ నేపథ్యంలో విక్రయాలపై దృష్టిసారించి నిత్యం పర్యవేక్షణ పెంచగా శుక్రవారం ఉదయం మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ద్వారా బాదేపల్లి యార్డు కమీషన్ ఏజెంట్ వాసవీ ట్రేడర్స్ సతీష్ 17 బస్తాల కందులను హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. సదరు రైతు ఆంజనేయులుకు సంబంధించిన ఫోన్‌ను కూడా స్వాధీనపరుచుకుని అందులో కాల్‌డేటాను పరిశీలించగా రైతు, కమీషన్ ఏజెంట్ మాట్లాడుకున్న సమాచారం ఉందన్నారు. అంతేకాక బైరంపల్లి గ్రామ పరిధిలో ఆంజనేయులు సాగు చేసిన కందిపంటకు వచ్చిన దిగుబడికి ఎక్కడా పొంతన లేదన్నారు. దీంతో కమీషన్ ఏజెంట్ సతీష్ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను మద్దతు ధరకు హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు రుజువయ్యిందన్నారు. వెంటనే ధాన్యాన్ని స్వాధీనపరుచుకుని తహసీల్దార్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక కమీషన్ ఏజెంట్ లైసెన్ రద్దుపరిచి చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ శ్రీశైలం, డైరెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మొగులయ్య, యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ అంగన్వాడీ
జడ్చర్ల టౌన్: ఈ చిత్రాలు చూస్తుంటే ఏ పార్కులోని గది అనుకుంటారేమో.. కాదండి జడ్చర్ల మండలం తంగెళ్లపల్లిలో ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం అంటే విస్మయం కలుగుతుంది కదూ.. వాస్తవమే అంగన్వాడీ కేంద్రం అంటే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గదులు, పెంకుటిల్లు, స్కూల్ బిల్డింగ్‌లో అని ఊహించుకుంటాం. అందుకు విరుద్ధంగా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టార. గతంలో బేస్మెంట్ వరకు నిర్మించి వదిలేసిన భవనాన్ని పూర్తి చేసేందుకు జెడ్పీ నిధులు రూ.3లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.3.5లక్షలతో పనులు ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ పేరుతో కేంద్రానికి చిన్నారులను ఆకట్టుకునేందుకు పెయింటింగ్ వేయించారు. చోటాభీం చిత్రాలతోపాటు అక్షరమాల, శరీరంలోని భాగాలు, పండ్లు, పూల చిత్రాలు వాటి పేర్లు రాయించారు. మండలంలోని మాచారం, కిష్టారంలోనూ ఇలాంటి కేంద్రాలు త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. గ్రామానికి వచ్చిన వారంతా అంగన్వాడీ కేంద్రాన్ని చూసి తమ ఊళ్లలోనూ ఇలా నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి చైల్డ్ ఫ్రెండ్లీ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. చిన్నారులను ఆటాపాటలతో కేంద్రానికి వచ్చేలా చూడటానికే ఇలాంటి చైల్డ్ ఫ్రెండ్లీ కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో సీడీపీఓ మెహరున్నీసా, సర్పంచ్ రుకియాభాను, ఎంపీటీసీ చెన్నమ్మ, సూపర్వైజర్ రమణ, అంగన్వాడీ టీచర్ అనంతమ్మ, పీఆర్ డీఈ హీర్యానాయక్, ఏఈ అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. -
వడి..వడిగా
దేవరకొండ : 2014లో ప్రతిపాదనలు.. 2016లో సాంక్షన్ అప్రూవల్.. 2017సెప్టెంబర్‌లో పనులు ప్రారంభం... 2019 మే నాటికి పూర్తి... క్లుప్తంగా చెప్పాలంటే జడ్చర్ల – కోదాడ హైవే నిర్మాణ పనుల పరిస్థితి ఇది... కానీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎన్ని ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తారో, భూ సేకరణ ఎలా ఉండబోతుంది... దానికి నష్టపరిహారం ఎంత చెల్లిస్తారు... ఎన్ని కమర్షియల్ దుకాణాలు తొలగించాల్సి ఉంది.. అనే విషయాలపై హైవేలో ఉన్న కమర్షియల్ దుకాణదారుల్లో గుబులుగా ఉంది.. ఇప్పటికే జడ్చర్ల నుంచి కోదాడ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి పనులు ఆరు భాగాలుగా విభజించి టెండర్లను పిలవగా జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు చేపట్టే పనులు ప్రారంభమయ్యాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న జడ్చర్ల – కోదాడ హైవే విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులను ఆరు భాగాలుగా విభజించగా సుమారు 250 కి.మీ. మేర జడ్చర్ల నుంచి కోదాడ వరకు రోడ్డు విస్తరణ జరగనుంది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి, కల్వకుర్తి నుంచి చారగొండ, చారగొండ నుంచి మల్లేపల్లి, మల్లేపల్లి నుంచి హాలియా, హాలియా నుంచి మిర్యాలగూడ, మిర్యాలగూడ నుంచి కోదాడ వరకు ఆరు పనులుగా విభజించారు. ఈ పనుల్లో ఇప్పటికే జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు విభజించిన మూడు పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వరకు నిర్మించే రోడ్డు పనులను అనూష ప్రాజెక్టు రూ.200 కోట్లకు దక్కించుకోగా, కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు ఎస్.ఆర్.కె. కంపెనీ రూ. 171కోట్లకు చేజిక్కించుకుంది. నాలుగు రోడ్లు.. వంద ఫీట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) మొదట 150 ఫీట్ల మేర రోడ్డును విస్తరించాలని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేవలం 100 ఫీట్లు విస్తరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకే పనులకు మంజూరు అనుమతి వచ్చింది. మొత్తం 240 కి.మీ. మేర సాగే ఈ రోడ్డు పనులు మొత్తం 100 ఫీట్లు మాత్రమే విస్తరిస్తారు. కాగా పట్టణాల్లో మాత్రం రోడ్డుకు ఇరువైపులా కలిపి 80 ఫీట్లు రోడ్డును, రెండు వైపులా డ్రెయినేజీలు 10 ఫీట్లు, రెండు వైపులా ఫుట్‌పాత్‌లు కలిపి 10 ఫీట్ల చొప్పున విస్తరణ చేపడతారు. ఈ పనులను పూర్తి చేసే కాంట్రాక్టర్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు రోడ్డు పనులు విస్తరించిన పిదప ట్రాఫిక్, ఇతరత్రా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రోడ్లను విస్తరించే అవకాశాలుంటాయి. ఇప్పటి వరకు ఈ పనులకు సంబంధించి భూ సేకరణ , ఔటర్లు కానీ ఎక్కడ చేపట్టే అవకాశాలు లేవు. కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 800 చెట్ల తొలగింపు ఇప్పటికే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు వైడనింగ్ పనులు జరుగుతుండగా కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 800 భారీ చెట్లను సంబంధిత కాంట్రాక్టర్లు తొలగించారు. ఆ చెట్లు వందల సంవత్సరాల నాటివి. ఇందులో వేప, రావి, మర్రి లాంటి పెద్ద వృక్షాలున్నాయి. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం తొలగించిన చెట్లకు బదులు, ఐదింతల రెట్లు మొక్కలను నాటి కొంతకాలం పాటు వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే రోడ్లపై వంద ఫీట్ల మేర నిర్మించే పనుల్లో భాగంగా కమర్షియల్ దుకాణాలు తమ సెల్లార్లను ముందుకు నిర్మించిన వాటికి ఎలాంటి నష్టపరిహారం లేకుండానే వాటిని తొలగించి రోడ్డు నిర్మాణం చేపడుతారు. కేవలం ఒక్క దేవరకొండ పట్టణంలోనే వంద ఫీట్ల మేరకు నిబంధనలు అతిక్రమించి వందకుపైగా కమర్షియల్ దుకా>ణాలకు ఆర్అండ్బీ అధికారులు తొలగించాలని నోటీసులు ఇచ్చారు. అయితే రోడ్డు అలైన్మెంట్ అంతా పూర్తయ్యాక రోడ్డు మూలమలుపులు ఉన్న చోట సరిచేసే అవసరం వస్తే అందుకు సంబంధించి రైతుల భూములను ఎన్హెచ్ఏఐ కొనుగోలు చేస్తుంది. వాటికి నష్టపరిహారం కూడా అందిస్తారు. కాగా భూ సేకరణను ఎన్హెచ్ఏఐ అధికారులు, ఆర్టీఓ సమక్షంలో పూర్తి చేస్తారు. 2019 మే నాటికి పూర్తి 2019 సంవత్సరం మే నాటికి జడ్చర్ల నుంచి కోదాడ వరకు పూర్తిగా రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు చేపట్టబోయే పనులకు త్వరలోనే టెండర్లు పూర్తవనున్నాయి. ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రయాణికులకు, ట్రాన్స్‌పోర్టేషన్ భారంతోపాటు దూర భారం తగ్గుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే హైదరాబాద్ వరకు 200 కి.మీ. ప్రయాణించి శంషాబాద్ మీదుగా జడ్చర్లకు చేరుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వంద కి.మీ. మేర ప్రయాణ భారం పెరుగుతుండగా కోదాడ నుంచి జడ్చర్ల హైవే పూర్తయితే ఈ దూర భారం తగ్గనుంది. -
ఆది మందిరం!
► రాష్ట్రంలో 1,300 ఏళ్ల నాటి అద్భుత జైన కట్టడం ► 65 అడుగుల ఎత్తులో, ఇటుకలతో నిర్మితం ► జడ్చర్ల సమీపంలో ఉందీ అద్భుతాలయం ► గొప్ప పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ► శిథిలావస్థకు చేరి కునారిల్లుతున్న వైనం ► ప్రభుత్వం పట్టించుకోకుంటే కనుమరుగే ► ఏఎస్ఐకి ఇవ్వాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగే ► ఇలాంటి మందిరాన్ని యూపీలో పునర్నిర్మించిన ఏఎస్ఐ ► దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న వైనం ఇదీ ఇటుకలతో నిర్మితమైన మందిరమే. అతి పురాతనమైనదే. క్రీస్తుశకం 8వ శతాబ్ది చివర్లో రాష్ట్రకూటుల కాలంలో నిర్మితమైన జైన మందిరమిది. అంటే 1,300 ఏళ్ల నాటిది. 65 అడుగుల ఎత్తుతో నేటికీ ఇలా నిలిచిన ఈ మందిరం జడ్చర్లకు 9 కి.మీ. దూరంలో గంగాపురం శివారులో ఉంది. స్థానికులు దీన్ని గొల్లత్తగుడిగా పిలుచుకుంటారు. ఈ రెండు ఆలయాలూ దాదాపు ఒకేలా ఉన్నాయి కదూ. దేశంలో ప్రస్తుతం మిగిలి ఉన్న అతి పురాతన ఇటుక మందిరాలు ఈ రెండేనన్నది పురావస్తు శాఖ మాట. నిర్మాణ నేర్పు రెండు మందిరాల్లోనూ ఒకేలా ఉంది. ఏ మిశ్రమంతో జోడించారో గానీ... సూది మొన మోపేంతైనా సందు లేకుండా నేర్పుగా పేర్చిన భారీ ఇటుకల దొంతరలు వెయ్యేళ్లు దాటినా ఇంకా పటిష్టంగానే నిలిచి ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: 13 శతాబ్దాలుగా ఎన్నో ప్రాకృతిక విపత్తులకు ఎదురొడ్డి నిలిచిన ఈ ఇటుకల అద్భుతం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని దుస్థితిలో ఉందిప్పుడు. తెలంగాణవ్యాప్తంగా కాకతీయుల కాలంలో అద్భుతమైన రాతి గుళ్లు వెలిశాయి. కానీ అంతకుపూర్వం నిర్మితమైన ఆలయాల జాడ మన రాష్ట్రంలో అతి స్వల్పం. అందులోనూ ఇటుకలతో నిర్మితమైన మందిరాలు లేవు. నాలుగో శతాబ్దంలో నేలకొండపల్లి, ఫణిగిరి, నాగార్జునసాగర్, కీసరగుట్ట వంటి ప్రాంతాల్లో నిర్మితమైన బౌద్ధ స్తూపాలే ఇందుకు మినహాయింపు. కానీ గంగాపూరం శివారులో ఉన్న ఈ ఆలయ పరిరక్షణకు మాత్రం ప్రభుత్వపరంగా ఇప్పటిదాకా ఎలాంటి కసరత్తూ జరగలేదు. నిర్మాణ పటుత్వం వల్ల ఇప్పటికీ ఇలా నిలిచి ఉంది గానీ లేదంటే ఈ పాటికి ఆనవాళ్లు కూడా లేకుండా పోయేదే. మ్యూజియంలోకి విగ్రహాలు... 1950 వరకు ఈ మందిరంలో రెండు జైన తీర్థంకరుల విగ్రహాలుండేవి. ఐదడుగుల ఎత్తున్న ఆ విగ్రహాలను దొంగల భయంతో ఒకదాన్ని హైదరాబాద్ స్టేట్ మ్యూజియానికి, మరోదాన్ని మహబూబ్‌నగర్ మ్యూజియానికి తరలించారు. ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహాలను అందులోకి తరలిస్తే పర్యాటకులు బారులు తీరడం ఖాయం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జైన భక్తులు వెతుక్కుంటూ వస్తారు. ఏఎస్ఐకి ఇవ్వరెందుకు? భీతర్గావ్ తరహాలో దీన్ని కూడా పునరుద్ధరించటం ఏఎస్ఐకి కష్టమేమీ కాదు. మందిరం వెనక భాగంలో నగిషీల జాడలు నేటికీ స్పష్టంగా ఉన్నాయి. నిజాం కాలంలో తీసిన కొన్ని చిత్రాలూ అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆలయ నగిషీలను మళ్లీ టెర్రకోటతో రూపొందించొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే ఇది సాధ్యం. ఇందుకు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు మూడుసార్లు ప్రయత్నించారు. ఇంతటి ఇటుకల నిర్మాణాన్ని పునరుద్ధరించే పరిజ్ఞానం తమవద్ద లేదంటూ ఆర్కిటెక్ట్ సంస్థలు చేతులెత్తేయడంతో ఏఎస్ఐ జోక్యం చేసుకోవాల్సిందేనని 2015లో కేంద్ర పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పురావస్తుశాఖ పరిరక్షణలో ఉన్న ఈ మందిరంతోపాటు కొలనుపాక జైన దేవాలయం, ఓరుగల్లు శంభుని గుడి, బీచ్పల్లి కోటలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏఎస్ఐ కూడా మిన్నకుండిపోయింది. 1 ఇటుకలతో నిర్మితమైన ఈ మందిరం 1,600 ఏళ్ల నాటిది. టెర్రకోట అలంకారాలతో అత్యద్భుతంగా ఉంటుంది. గుప్త వంశ రాజు కుమారగుప్తుని హయాంలో క్రీస్తుశకం ఐదో శతాబ్దిలో నిర్మితమైంది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ సమీపంలో భీతర్గావ్ శివార్లలో ఉన్న ఈ ఆలయం దేశంలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఈ తరహా కట్టడాల్లో అతి పురాతనమైనది. దీని ఎత్తు దాదాపు 58 అడుగులు. 2 భీతర్గావ్ మందిర ప్రస్తుత రూపమిది. అందమైన నగిషీలు, మధ్యలో చిన్నచిన్న శిల్పాలు, ఎల్తైన గోపురం, చూడచక్కటి ప్రవేశ ద్వారంతో అద్భుతంగా అలరారుతోంది కదూ! పురాతన మందిరాన్ని భావి తరాలకు అందించేందుకు యూపీ సర్కారు పడిన తపనకు నిదర్శనమిది. శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో ఉన్న ఈ ఆలయాన్ని కాపాడే ఉద్దేశంతో కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు బాధ్యత అప్పగించింది. ఏఎస్ఐ దాన్ని దశలవారీగా మరమ్మతు చేసి ఇలా ముస్తాబు చేసింది. ఇప్పుడీ మందిరానికి దేశ, విదేశీ పర్యాటకులు వేలల్లో పోటెత్తుతున్నారు! -
మహనీయుల ఆశయసాధనకు జాతర కమిటీలు
జడ్చర్ల టౌన్: బహుజనుల హక్కుల సాధనకు పాటుపడిన సాహు మహరాజ్, జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ లాంటి మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబేద్కర్ జాతర కమిటీలు వేయనున్నామని మహబూబ్‌నగర్ అంబేద్కర్ జాతర కమిటీ సీనియర్ నాయకులు సుధాకర్ అన్నారు. ఆదివారం జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహంలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అంబేద్కర్ జాతర కమిటీ ఏర్పాటు చేసి 18 ఏళ్లవుతుందని, ఇకపై తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటే మహనీయుల గూర్చి వివరిస్తూ వారి ఆశయాలు, లక్ష్యాలు గ్రామ గ్రామానికి చేరవేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన రోజు కావడంతో ఆ రోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు పూర్తిచేస్తామన్నారు. తర్వాత హైదరాబాద్ నిజాం గ్రౌండ్లో భారీ జాతర నిర్వహిస్తామని, ఇందుకోసం చేయాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. జాతర కమిటీల అధ్యక్షులు శంకర్, రామచందర్, రహ్మన్, బలరాం, నాయకులు విజయ్‌కుమార్, ఆనంద్, చంద్రమోహన్, శేఖర్ పాల్గొన్నారు. -
పంటలు పండక.. అప్పులు తీర్చలేక
► అప్పులపై బెంగతో రైతు బలవన్మరణం ► పొలంలో పురుగుల మందుతాగి అఘాయిత్యం జడ్చర్ల : ఎంతో ఆశతో విత్తనాలు వేశాడు.. ఈ సారైనా కాలం కలిసి వస్తుందని ఆశపడ్డాడు. కానీ కరువు రైతును కాటేసింది. పంటలు ఎండిపోయి అప్పులు మీదపడ్డాయి. పాతవి, కొత్తవి కలిసి తడిసి మోపెడు కావడంతో అప్పులిచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలని రోజు బెంగపడేవాడు. చివరికి పొలంలోనే పురుగులమందుతాగి తనువుచాలించాడు. ఈ విషాదకరమైన సంఘటన మండల పరిధిలోని గంగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలిలా..మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన సాకలి దేవయ్య(50)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ సారి 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటల దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చి తీవ్రంగా నష్టపోయాడు. గత ఏడాది చేసిన అప్పును ఈ పంటలతో తీరుద్దామనుకుంటే ఈ ఏడాది కూడా నష్టం రావడంతో సుమారుగా రూ.4లక్షల వరకు అప్పులయ్యాయి. కుమిలిపోయి ఆత్మహత్య: అప్పులు ఎలా తీర్చాలని రోజు దేవయ్య కుమిలిపోయేవాడు. చేతిలో చిల్లిగవ్వలేదు.. కూతురు పెళ్లి ఎలా చేయాలని భార్య చిట్టెమ్మతో చెప్పుకుని బెంగపడేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానంటూ బయటకు వెళ్లి సాయంత్రం దాకా తిరిగి రాలేదు. బుధవారం గంగాపూర్ గ్రామం శివారులోగల ఓ వ్యవసాయ పొలంలో విగతజీవిగా పడి కనిపించాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతని దగ్గర లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కనే ఖాళీ పరుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానించి పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య చిట్టెమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్‌రావు తెలిపారు అనంతపురంలో యువ రైతు, గద్వాల క్రైం : మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన క్రాంతి(23) అనేరైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం పంటకోసం రూ.2లక్షల అప్పుగా తీసుకున్నాడు. సరైయిన దిగుబడి రాకపోవడంతో పంటకు తీసుకవచ్చిన డబ్బులు తీర్చలేక మానోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమం దు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన క్రాంతి తల్లిదండ్రులు చిక్సిత నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్‌కు తరలిస్తుండగ చనిపోయా డు. తల్లిదండ్రులు కమలమ్మ, దేవరాజు ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
జడ్చర్ల: మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాలు.. కేరళ రాష్ట్రం మలక్‌పురా జిల్లా పెరుంతల్ మన్నాకు చెందిన ఆల్శిఫా ఫార్మా కాలేజీకి చెందిన 28మంది విద్యార్థులు, ముగ్గురు ట్యూటర్లు విజ్ఞాన యాత్రకు సోమవారం సాయంత్రం టూరిస్టు బస్సులో బయలుదేరారు. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని తప్పించబోయి ఆగి ఉన్న పైపుల కంటైనర్‌ను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోకి పైపులు చొచ్చుకురావడంతో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలు బస్సులో ఇరుక్కుపోయాయి. గాయపడిన విద్యార్థులను ఎస్వీఎస్, మరికొందరిని బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. వారంతా క్షేమంగా ఉన్నారు. జడ్చర్ల పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి క్రేన్ సాయంతో బస్సును, కంటైనర్‌ను వేరు చేసి మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సీఎంవి పగటి కలలు: మల్లు రవి
జడ్చర్ల: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు ఏడెనిమిది సీట్లు వస్తాయంటూ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఏం వెలగబెట్టారని టీఆర్ఎస్ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు. -
వెక్కిరించిన విధి
కామెర్ల వ్యాధితో తమ్ముడి మృత్యువాత అంత్యక్రియలకు వెళ్తూ రైలుకిందపడి అన్న దుర్మరణం అభంగపట్నంలో తీవ్ర విషాదఛాయలు ఇద్దరు కొడుకుల మతితో తల్లడిల్లిన తల్లిదండ్రులు జడ్చర్ల/కోయిల్‌కొండ: తీవ్ర అనారోగ్యంతో తమ్ముడు మృతిచెందగా.. తమ్ముడిని కడసారి చూసేందుకు రైల్లో వస్తున్న అన్న ప్రమాదవశాత్తు జడ్చర్లరైల్వేస్టేష న్లో రైలుకింద పడి దుర్మరణం పాల య్యాడు. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములను విధి చివరిసారిగా చూ సుకోకుండా చేసింది. కొన్నిగంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కోయిల్‌కొండ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన సిర్ర కృష్ణ య్య, వీరమణి దంపతులకు ఓ కూతురుతో పాటు కొడుకులు పరశురామ్, రమేష్ ఉన్నారు. ఇటీవల చిన్నకొడుకు రమేశ్(18) కామెర్ల వ్యాధి బారినపడ్డాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరి స్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. దీంతో సోమవారం మతదేహాన్ని సొం తూరు అభంగపట్నం తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారి పెద్దకొడుకు పరశురామ్(23)కు తమ్ముడి మరణవార్త తెలియడంతో అంత్యక్రియల కోసం వచ్చేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని బుద్వేలు రైల్వేస్టేçÙన్లో రైలు ఎక్కి సొంతూరుకు పయనమయ్యాడు. జడ్చర్ల రైల్వేస్టేçÙన్ సమీపంలోకి వచ్చే సరికి ఏం జరిగిందో తెలియదు కానీ అతడు రైలుకింద పడి దుర్మరణం పాల య్యాడు. రైల్వే పోలీసులు గమనించి వివరాలు ఆరాతీయగా అభంగపట్నం గ్రామానికి చెందిన పరశురామ్‌గా గుర్తిం చారు. మతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అభంగపట్నంలో విషాదఛాయలు సిర్ర కష్ణయ్య, వీరమణి దంపతులు నిరుపేదలు.. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి. వారి పెద్దకొడుకు పరశురాం హైదరాబాద్‌లో తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. రమేష్ గార్లపహాడ్ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే రమేష్ రెండురోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించుకున్నా నయం కాలేదు. అయితే ఒకేరోజు కొడుకులిద్దరూ చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు దిక్కెవరని విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేహెడ్‌కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. -
నేడు గిరిజనుల మహాదీక్ష
జడ్చర్ల టౌన్ : ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని ఎర్రసత్యం స్మారక బస్టాండ్ సమీపంలో మహాదీక్ష నిర్వహిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయక్ తెలిపారు. సదస్సుకు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్రాంనాయక్తోపాటు ఆయా పార్టీల నాయకులు హాజరవుతారని తెలిపారు. సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలి రావాలని కోరారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
జడ్చర్ల టౌన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్ అలీ పిలుపునిచ్చారు. శుక్రవారం బాదేపల్లి నగరపంచాయతీ ప్రాంగణంలో వర్కర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కార్మికులు, పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సవరిస్తూ మరింత అన్యాయం చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక కార్మిక సంఘాలు కలసి చేపట్టిన సార్వత్రిక సమ్మె అన్నిరంగాల కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దీప్లానాయక్, నగరపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ నాయకులు వెంకటేశ్, కార్మికులు యాదమ్మ, శివలీల, లక్ష్మి, మొగులయ్య, భారతి, చంద్రయ్య, కష్ణ, బాల్‌వెంకట్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
సినీ హీరో బాలయ్య సందడి
జడ్చర్ల(మహబూబ్ నగర్) : జడ్చర్లలో గురువారం ఉదయం ప్రముఖ సినీ హీరో ఏపీలోని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. హైదరాబాద్ నుంచి సోమశిల కృష్ణాపుష్కరాలలో పాల్గొనేందుకు వచ్చిన బాలకృష్ణ జాతీయరహదారిపై జడ్చర్ల వద్ద యగ్నేష్ హోటల్లో టీకోసం కొద్ది సేపు ఆగారు. దీంతో హోటల్యజమాని రామ్మోహన్ తదితర కుటుంబ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించి అతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరి కొందరు ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. -
మొక్కల పరిరక్షణకు తోడ్పాటును అందించాలి
జడ్చర్ల : బాదేపల్లి నగర పంచాయతీలో హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించేందుకు పట్టణ వాసులు, ప్రముఖులు తోడ్పాటునందించాలని నగర పంచాయతీ కమిషనర్ గంగారాం పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు బాదేపల్లి రంజిత్‌బాబు హరితహారం కార్యక్రమానికి తన వంతుగా రూ.10వేల నగదును కమిషనర్‌కు అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగారాం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని వివిధ కాలనీలు, రహదారులు తదితర ప్రాంతాల్లోదాదాపు 50 వేల మొక్కలకు పైగా నాటామని తెలిపారు. ట్రీగార్డుల ఏర్పాటుకు వ్యాపారులు, ప్రముఖులు తదితరులు మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయం చేయాలని కోరారు. -
బాకీ తీర్చు.. లేకుంటే మా పాపను పెంచు!
ఆటోలో రెండు నెలల పసికందును వదిలిపెట్టిన దంపతులు జడ్చర్ల టౌన్: బాకీ తీర్చడం కోసం ఓ దంపతులు వింత షరతు పెట్టారు. బాకీ తీర్చాలని, లేకుంటే తమ పాప (2నెలలు)ను నువ్వే పెంచుకోవాలని పసికందును అక్కడే వదిలిపెట్టి పోయారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన సిద్దూ జడ్చర్లలో ఆటో నడుపుతుంటాడు. ఇతనికి అక్క వరసయ్యే అదే తండాకు చెందిన సువర్ణ ఆమె భర్త ప్రేమ్‌కుమార్‌లకు రూ.8 వేలు బాకీ ఉన్నాడు. ఈ క్రమంలో బాదేపల్లి పట్టణానికి వచ్చిన సువర్ణ, ప్రేమ్కుమార్లు ఆదివారం సాయంత్రం సిద్దూ ఆటో ఎక్కారు. నేతాజీ చౌరస్తానుంచి స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాసవి కమాన్ వద్దకు చేరుకోగానే అప్పుకట్టాలని సిద్దూపై ఒత్తిడి తెచ్చారు. త్వరలోనే తీరుస్తానని చెప్పినప్పటికీ వారు వినకుండా అప్పు తీర్చే వరకు మా పాపను నువ్వే పెంచుకో అంటూ ఆటోలో పసికందును వదిలిపెట్టి పరుగు లంఘించారు. అవాక్కయిన సిద్దూ.. వెంటాడగా ప్రేమ్‌కుమార్ చిక్కాడు. సువర్ణ తప్పించుకుంది. స్థానికులు ప్రేమ్‌కుమార్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రేమ్‌కుమార్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి పాపను అప్పగించారు. -
తల్లికి బదులు కూతురు పరీక్ష
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో పట్టుబడిన వైనం జడ్చర్ల టౌన్: ఓపెన్ టెన్త్ పరీక్షల్లో తల్లికి బదులు కూతురు, మరో ఇద్దరి స్థానంలో వేరే ఇద్దరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని అక్షర స్కూల్ కేంద్రంలో సోమవారం ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తల్లికి బదులుగా కూతురు పరీక్షకు హాజరు కావడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి పట్టుకున్నారు. అదేవిధంగా మరో ఇద్దరు విద్యార్థులకు బదులుగా మరో ఇద్దరు బయటి వారు పరీక్షలకు హాజరైనట్లు గుర్తించారు. అదే సమయంలో తనిఖీకి వచ్చిన రాష్ట్ర పరిశీలకులు రాజేశ్వర్‌రావు గమనించారు. ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించాలని ఎంఈఓ మంజులాదేవికి సూచిం చారు. ఎస్ఐ జములప్ప వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంతపూచికత్తుపై వదిలిపెట్టారు.