
జడ్చర్ల: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ఇళ్లను ఇవ్వబోమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్న ఓ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4వ వార్డు పరిధిలోని బోయలకుంటలో ప్రచార సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నికలు కాబట్టి ఎవరెవరో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎవరొచ్చి ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేసినా మనమే చేయాలి. పొరపాటు జరిగి మా అభ్యర్థికి తక్కువ ఓట్లువస్తే ఇళ్లు కూడా ఇవ్వను. బీరుకో, బిర్యానీకో ఆశపడి ఓట్లు వేయొద్దు’ అని అన్నారు. ఈ వీడియోపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేసేలా లక్ష్మారెడ్డి వైఖరి ఉండడం సరికాదన్నారు. అర్హులకు పథకాలు అందించడం ప్రభుత్వాల పని అని, ఎవరూ బెదిరింపులకు భయపడొద్దన్నారు.
చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్
చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య