houses for poor
-
అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటి రూపంలో పేద అక్కచెల్లెమ్మల చేతిలో ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తిని పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామన్నారు. వివిధ దశల్లో 22 లక్షల గృహాలు నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల మేర ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఆర్డీయేలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సోమవారం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను సీఎం జగన్ అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సంతోషంగా స్వీకరిస్తున్నాం.. సీఆర్డీఏలో 50,793 మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలిచ్చాం. ఈ రోజు గృహ నిర్మాణాలను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అత్యధికంగా ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా మన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తోంది. సీఆర్డీఏ ప్రాంతంలో గజం స్థలం కనీసం రూ.15 వేలు ఉంది. ఈ లెక్కన పేద మహిళలకు ఇచ్చిన స్థలం విలువే రూ.7.50 లక్షలు ఉంటుంది. మరో రూ.2.70 లక్షలు వెచ్చించి ఇళ్లను నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటి మీద మరో రూ.లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఈ ఆస్తి విలువ కనీసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది. అన్ని సదుపాయాలతో.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లేఅవుట్లను అభివృద్ధి చేసి 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లను నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి లేఅవుట్ వద్దకు అక్కచెల్లెమ్మలను తీసుకుని వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి ఆ ఇంటి స్థలంలో ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశాం. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం. దీనికోసం ఇప్పటికే రూ.56 కోట్లు ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్లలో నీటి సరఫరా కోసం రూ.32 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. విద్యుత్ కనెక్షన్ కోసం రూ. 326 కోట్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి మరో రూ.8 కోట్లతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్లు నిర్మించే కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్, పార్కులు వస్తాయి. మిమ్మల్నందరినీ ఆయా సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో మ్యాపింగ్ చేశారు. కౌంటర్లలో మీ ఇంటికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెడతారు. ఇందుకోసం 25 కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఏ ప్రభుత్వమూ చేయనంతగా గత నాలుగేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని మీ బిడ్డ చేసి చూపించాడు. పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, వివక్షకు తావులేకుండా సేవలు, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు దన్నుగా నిలిచాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్.. ఇలా వైద్య ఆరోగ్య సేవలలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను తీసుకొస్తున్నాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఆరోగ్య ఆసరాను అమలు చేస్తున్నాం. వైద్య ఆరోగ్యసేవల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం, సామాజిక వర్గాల సంక్షేమం, ప్రాంతాల సంక్షేమం, డీసెంట్రలైజేషన్, పోర్టులు.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని చేశాం. భావోద్వేగంతో కంటతడి ఇళ్లు నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్న పలువురు మహిళలు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. వాస్తవానికి 2020 డిసెంబర్లోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అయితే ప్రతిపక్షాల కుట్రలతో సీఆర్డీఏలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయ్యాక మూడేళ్ల అనంతరం తమకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందచేయడంతో ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి ఆశీస్సులు సీఆర్డీఏలో సీఎం జగన్ చేతుల మీదుగా పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మహిళా లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కృష్ణాయపాలెం లేఅవుట్లో భూమి పూజ అనంతరం వెంకటపాలెంలోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్న కొద్ది సేపటికే వర్షం ప్రారంభం అయింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు లబ్దిదారులు సభాప్రాంగణం వెలుపల నిల్చుని సీఎం ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. సుమారు అరగంట పాటు కొనసాగిన సీఎం జగన్ ప్రసంగాన్ని మహిళలు ఆసక్తిగా విన్నారు. ‘‘అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం పెత్తందారులపై పేద వర్గాల విజయానికి తార్కాణం. పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన ద్వారా సామాజిక అమరావతికి పునాది రాయి వేశాం...’ అని సీఎం జగన్ పేర్కొన్నప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జై జగన్ నినాదాలు హోరెత్తాయి. ‘రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించారు. ఇలాంటి పెత్తందారులు, దుర్మార్గమైన మనుషులను, పార్టీలను గతంలో ఎప్పుడైనా మనం చూశామా..?’ అని సీఎం ప్రశ్నించడంతో.. చూడలేదని మహిళలు బిగ్గరగా సమాధానమిచ్చారు. -
అమరావతిలో పేదల ఇళ్ల పండుగ.. బొట్టు పెట్టి ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి, మంగళగిరి: పేదల ఇళ్ల పండుగకు అమరావతి ముస్తాబవుతోంది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఆర్డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వతేదీన పేదల ఇళ్ల నిర్మాణానికి కృష్ణాయపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వలంటీర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఈ కార్యక్రమానికి రావాలని సాదరంగా కోరుతున్నారు. వన మహోత్సవం సందర్భంగా అదే రోజు అమరావతిలో 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో మోడల్ హౌస్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్లో లబ్ధిదారురాలు ఈపూరి జీవరత్నం ఇంటిని మోడల్ హౌస్‌గా నిర్మించారు. షీర్ వాల్ పద్ధతిలో మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీలైనన్ని ఇళ్లను షీర్ వాల్ పద్ధతిలో నిర్మించి వేగంగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు సులభంగా అర్థం అయ్యేలా మోడల్ హౌస్‌ను నిర్మించారు. అత్యధికంగా ఆప్షన్–3 ఇళ్లు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ప్రభుత్వం సీఆర్డీఏలో 1,366.48 ఎకరాల్లో 25 లేఅవుట్లలో ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. 47,017 మంది లబ్ధిదారుల (ఎన్టీఆర్ జిల్లా 23,821, గుంటూరు జిల్లా 23,196) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. వీరిలో 45,100 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. 24,200 ఇళ్లను షీర్వాల్ పద్ధతిలో, మిగిలినవి సాధారణ పద్ధతిలో నిర్మించేందుకు 36 లేబర్ ఏజెన్సీలను గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రూ.365.91 కోట్లతో విద్యుత్, నీటి సదుపాయంతో పాటు అప్రోచ్ రోడ్లను వేస్తున్నారు. ఈ లేఅవుట్లలో రూ. 72.06 కోట్లతో మౌలిక వసతులతో పాటు స్కూళ్లు, హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు లాంటి సదుపాయాలను కల్పించనున్నారు. పేదలకు 30 లక్షలకుపైగా ఇళ్లు రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల కోసం 30 లక్షలకు పైగా గృహ నిర్మాణం లక్ష్యంగా నవరత్నాలు పథకం ద్వారా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. 30.65 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాల కింద పేదలకు అందించిన స్థలాల మార్కెట్ విలువ రూ.75 వేల కోట్ల మేరకు ఉంటుంది. కేవలం స్థలాలిచ్చి సరిపుచ్చకుండా రెండు దశల్లో 21.25 లక్షల (టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు, సాధారణ ఇళ్లు 18.63 లక్షలు) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకూ అనుమతులు ఇచ్చారు. సీఆర్డీఏలో నిర్మించే ఇళ్లు వీటికి అదనం. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 4.40 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రూ.లక్షల విలువ చేసే స్థలాలను ఉచితంగా సమకూర్చడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయాన్ని అందచేస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక, సబ్సిడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24న తొలుత కృష్ణాయపాలెం చేరుకుని ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. వెంకటాయపాలెం బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శాంక్షన్ లెటర్ అందచేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలితో పాటు సీఎం ప్రసంగ వేదికను శుక్రవారం పరిశీలించారు. నవులూరు లే ఔట్ వద్ద సీఎం 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, ఎండీ లక్ష్మీ షా తదితరులు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తోబుట్టువులా తోడుగా.. వలంటీర్‌గా పనిచేస్తున్నా. నా భర్త వ్యవసాయ కూలీ. పెళ్లై 13 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఒక్కసారి దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. కృష్ణాయపాలెం లేఅవుట్లో నాకిచ్చిన స్థలంలో నా ఇంటినే మోడల్ హౌస్‌గా నిర్మించారు. సీఆర్డీఏలో పూర్తయిన మొదటి ఇల్లు నాదే. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. పిల్లల చదువుకు అమ్మ ఒడి కింద సాయం చేశారు. పొదుపు సంఘంలో ఉన్న నాకు నాలుగు విడతల్లో రూ.10 వేల చొప్పున రుణమాఫీ అందించారు. తోబుట్టువులా సీఎం జగన్ అండగా ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇళ్లు ఇస్తుంటే కొందరు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఆ వార్తలు విన్నప్పుడు ఎక్కడ ఇల్లు రాకుండా పోతుందోనని భయంగా ఉంటుంది. – ఈపూరి జీవరత్నం, ఇళ్ల లబ్ధిదారురాలు, కృష్ణాయపాలెం, గుంటూరు జిల్లా -
సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాలలో నిరుపేదలు ఉండరాదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల రాజధాని స్వరూపం మారిపోతుందా? అక్కడ డబ్బులు ఉన్న మా రాజుల సోకులకు ఇబ్బంది వస్తుందా? గత ప్రభుత్వ హయాంలో దళితుల అస్సైన్డ్ మెంట్ భూములను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవడంలో ఈ లక్ష్యం కూడా ఉందా? రాజధాని అంశం గత తొమ్మిదేళ్లుగా ఏదో రూపంలో నలుగుతూనే ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం ఈ వ్యవహారాలలో ఒక కీలక మలుపు అని చెప్పాలి. అదే 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా ఉన్నట్లయితే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కావేమో! ఆ తర్వాత విజయవాడ పరిసరాలలో రాజధాని అని ప్రకటించి భారీ స్పెక్యులేషన్ కు అవకాశం ఇచ్చారు. తన పార్టీ వారికి ,తన వారికి మంచి అవకాశం వచ్చేలా చేసి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా లబ్ది చేకూర్చారన్న ఆరోపణను చంద్రబాబు ఎదుర్కున్నారు. రైతులకు ఇష్టం ఉన్నా,లేకున్నా ముప్పై మూడు వేల ఎకరాలను సమీకరించారు. భూములు ఇవ్వని రైతుల పంటలను కూడా దగ్దం చేయించారన్న విమర్శలు ఎదుర్కున్నారు. కొత్త రాజధాని నిర్మాణం పేరిట దేశదేశాలు తిరిగి వందల కోట్లు వ్యయం చేశారు. అసలు ఇన్నివేల ఎకరాలు ఎందుకు? వెయ్యి లేదా రెండువేల ఎకరాలు సేకరించి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పినవారిపై ఆయన హుంకరించేవారు. అసలు ఎపి భవిష్యత్తు అంతా ఆ అమరావతిలోనే ఉందని ప్రచారం చేసేవారు. అందుకోసం ప్రజలు కూడా విరాళాలు ఇవ్వాలని అనేవారు. కేంద్రం లక్షల కోట్ల ఆర్దిక సాయం చేయాలని కోరేవారు. తొలిదశకే లక్షా తొమ్మిది వేల కోట్లు కావాలని కేంద్రానికి ఆయన ఉత్తరం రాశారు. వందల కోట్ల వ్యయం చేసి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం నిర్మించారు. అవి కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో కట్టారు. ఆయన తన పాలన టైమ్ లో సరైన రోడ్డును కూడా నిర్మించలేకపోయారు. ఒక ప్రధాన రోడ్డు వేయడానికి ప్రయత్నించినా, దానిని పూర్తి చేయలేకపోయారు. అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటివారు సైతం అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన రాజధాని అని విమర్శించేవారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజలంతా అభివృద్ది అంతా ఒక్క గుంటూరు జిల్లా ప్రాంతంలోనేనా అని వాపోయేవారు. కృష్ణా, గుంటూరు జిల్లా లోని ప్రజలు కేవలం ఒక సామాజికవర్గ ప్రయోజనానికే రాజధాని నిర్మాణం చేస్తున్నారని, మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారని భావించేవారు.వీటన్నిటి ఫలితం తెలుగుదేశం ఘోరమైన పరాజయం. ఇంకో సంగతి చెప్పాలి. ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే చంద్రబాబు వర్గం వారు కొందరు ఆయన నడిచిన ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన పరిస్థితి అంతటిని అధ్యయనం చేసి, కొందరు ప్రముఖులతో కలిసి కమిటీలను వేశారు. వారిచ్చిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు. కాని దీనిని వ్యతిరేకించిన చంద్రబాబు, టిడిపి నేతలు రకరకాల ఎత్తుగడలతో అది ముందుకువళ్లకుండా చేస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఎపి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలను పొందుతోంది. రాజధానిలో చట్టం ప్రకారం ఐదు శాతం భూములలో పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలి. చట్టంలో అలా ఉన్నా, ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. పైగా దళితుల అస్సైన్డ్ భూములన్నిటీని మోతుబరులు స్వాధీనం చేసుకునేందుకు సహకరించింది. అంటే అక్కడ పేదలు ఉంటే వారి విలాసవంతమైన భవనాలకు విలువ ఉండదని అనుకుని ఉండాలి. నిజమే.పొలాలు ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. కాని అదే సమయంలో పేదలకు కూడా అక్కడ అవకాశం ఉండాలి కదా! జగన్ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించగానే మళ్లీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దానిపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తే, ఆ ధర్మాసనం ఆ తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసి నిలుపుదల చేసింది. దాంతో జగన్ ప్రభుత్వం ఏభై నాలుగువేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మించాలని ప్రతిపాదించి చురుకుగా కృషి చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుప్రింకోర్టుకు వెళ్లారు. ఆర్.జోన్ 5 లో పేదలకు స్థలాలు ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం కూడా ఒకే చేసింది. కాకపోతే హైకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుకు లోబడి ఉండాలని ఒక మాట అంది. స్థూలంగా అది పేదలకు, ప్రభుత్వానికి విజయంగా భావించవచ్చు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అక్కడ వారికి అవసరమైన సదుపాయలు కూడా కల్పిస్తోంది. అయినా రైతుల పేరుతో కోట్ల రూపాయల వ్యయం చేసి కొందరు కోర్టులకు వెళ్లారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చకుండా ఉంటే ఈ రైతులు కాని, వారి ముసుగులో ఉన్న టిడిపి నేతలు కాని ఈ స్థలాలను అడ్డుకునే యత్నం చేయగలిగేవారా? చిత్రం ఏమిటంటే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్న నినాదంతో ఎన్.టి.రామారావు టిడిపిని స్థాపించారు. కాని ఇప్పుడు పేదవాడికి ఇల్లు నిర్మించడానికి వీలులేదన్నట్లుగా తెలుగుదేశం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి పేదల పక్షాన నిలవవలసిన వామపక్షాలు సైతం చంద్రబాబుకే బాకా ఊదడం దురదృష్టకరం. విజయవాడ కాల్వల వెంట ఉన్న గుడిసెలను తొలగించి, వేరే చోట భూములు ఇవ్వడానికి గతంలో ప్రభుత్వం ప్రయత్నిస్తే వామపక్షాలు అడ్డుకునే యత్నం చేసేవి. పేదలకు అన్యాయం అని వ్యాఖ్యానించేవి. కాని రాజధాని అమరావతిలో వారికి భూములు ఇస్తుంటే ప్రత్యేకించి సిపిఐ హర్షించకపోగా, భూస్వాములకు, టీడీపీకి మద్దతు ఇస్తోంది. దేశంలో ఏ రాజధానిలోనూ పేదల ఇళ్లు, చిన్న కాలనీలు లేవా? అన్నదాని గురించి ఆలోచిస్తే, అమరావతిలో మాత్రమే అలా ఉండరాదని చెబుతున్నట్లుగా ఉంది. ఢిల్లీలో అనేక లొకాలిటీలలో పేదల ఇళ్లు ఉన్నాయి. ముంబైలో ధారవి ఒక పెద్ద ఉదాహరణ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మొత్తం అన్ని ప్రభుత్వ భవనాలు కలిపి 235 ఎకరాలలో ఉన్నాయి. హైదరాబాద్ లో సచివాలయం చెంతనే పేదలు, దిగువ మధ్య తరగతికి చెందినవారి కాలనీలు ఎన్నో ఉన్నాయి. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! హైదరాబాద్‌లో ధనిక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన బంజారాహిల్స్, జూబ్లి హిల్స్ వంటి చోట్ల బలహీనవర్గాల కాలనీలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలాంటి అవకాశం ఇవ్వకపోతే, పేదలు ఎక్కడ కాస్త జాగా దొరికితే అక్కడ గుడిసెలు వేసుకుంటున్నారు. దానికన్నా ప్రభుత్వం వారికి కాస్త జాగా స్థలం ఇస్తే సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు కదా! ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి జగన్ అదే పని చేస్తున్నారు. కాని టీడీపీ వారేమో అలా పేదల కాలనీలవల్ల తమ భూముల రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోతుందని అంటున్నారు. హైదరాబాద్ లో పేదల కాలనీలవల్ల అలా ధరలు పడిపోయిన దాఖలాలు లేవు. ఆ సంగతిని విస్మరించి అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారి మాటలు నమ్మి తమకు తామే నష్టం చేసుకుంటున్నారు. మరో వైపు జగన్ పట్టుదలతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వెళుతున్నారు. శరవేగంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఒక కొలిక్కి రాబోతోంది. అప్పుడు కులాల అసమౌతుల్యత వస్తుందని అనేవారికి ఇది ఒక గుణపాఠం అవుతుంది. మనుషులంతా ఒక్కటే అన్న సూత్రాన్ని జగన్ అమలు చేయబోతున్నారన్నమాట. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేకొద్దీ కరెంట్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఎవరైనా తొలుత వీటినే కోరుకుంటారని, అందువల్ల ఈ మూడింటిని తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. నిర్ణీత దశకు రాగానే కరెంట్ కనెక్షన్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిడ్కో ఇళ్లు కాకుండా రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టాం. గృహ నిర్మాణాలు పూర్తవుతున్నకొద్దీ కనీస సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల లబ్ధిదారులతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిర్మాణం నిర్ణీత దశకు చేరుకోగానే ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్టుగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రత్యామ్నాయ స్థలాలు.. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటైన కాలనీల్లో లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తున్నాం. కొన్ని చోట్ల న్యాయ వివాదాల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటిపై దృష్టి సారించాలి. కోర్టు వివాదాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయిన చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించి ఆ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలి. గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఔట్ల సందర్శన.. 4 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో ఇళ్లు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల కోసం ఇప్పటివరకు రూ. 6,435 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా లేఔట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దఫాలు లేఔట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని లేఔట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబ్‌లను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు అజయ్‌జైన్, సాయిప్రసాద్, విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ షా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రజిని
చిలకలూరిపేట: పేదలందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన 2,272 గృహాలను మంత్రి శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో ఫేజ్–1 కింద నిర్మించిన 4,512 టిడ్కో గృహాల్లో తొలి విడతగా 2,272 గృహాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మిగిలిన గృహాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మరో 1,008 గృహాల పనులు త్వరగా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, దుష్టచతుష్టయం ఓర్వలేక విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, టిడ్కో ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ జి.ప్రసాదరావు, మెప్మా పీడీ వెంకటనారాయణ, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. -
TIDCO Houses: వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని సారిపల్లిలో నిర్మించిన 800 యూనిట్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందచేసింది. ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం మున్సిపాలిటీలోని పాత్రునివలస–1లో మరో 800 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. తాగునీరు, రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు, ఎస్టీపీలు లాంటి మౌలిక వసతులు కల్పిస్తూ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో సిద్ధమైన 29,572 యూనిట్లను వరుసగా పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నాడు ఎన్నికలకు ముందు అరకొరగా... రాష్ట్రవ్యాప్తంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 36,064 ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్ ప్రభుత్వం ఒక్క రూపాయికే అందిస్తోంది. 365 చ.అ విస్తీర్ణంలోవి 13,968 ఇళ్లు, 430 చ.అడుగుల్లోవి మరో 21,040 యూనిట్లు ఉన్నాయి. వీటిని 50 శాతం రాయితీతో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులపై భారం మోపుతూ ఎన్నికల ముందు అరకొరగా టిడ్కో ఇళ్లను చేపట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి మౌలిక సదుపాయాలతో వీటిని సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్లు, పార్కులతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ, మరీ ముఖ్యంగా ప్రతి నిర్మాణానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మించిన తర్వాతే లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఈమేరకు సర్వ హంగులతో టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి. పేదలపై రిజిస్ట్రేషన్ల భారం పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 98 పట్టణ స్థానిక సంస్థల్లో మూడు విభాగాల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నాటికి 1.32 లక్షలకుపైగా యూనిట్లను లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో చురుగ్గా పనులు సాగుతున్నాయి. మిగిలిన ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అన్ని సదుపాయాలతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్నారు. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతోపాటు రిజిస్ట్రేషన్లను సైతం ఉచితంగా చేసి ప్రభుత్వం అందిస్తోంది. ఒక్క రిజిస్ట్రేషన్ల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకుపైగా భారాన్ని భరిస్తుండటం గమనార్హం. -
పేదలకు ఇళ్ల కల్పనలో ఏపీ టాప్: కేంద్రమంత్రి
-
పేదలకు ఇళ్ల కల్పనలో ఏపీ టాప్.. కేంద్రమంత్రి ప్రశంస
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రశంసించారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. ఆదివారం విశాఖలో పీఎంఏవై, ఉజ్వల పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించగా.. అంచనాలకు మించి ఇప్పటివరకు కోటి 22 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. చదవండి: ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! ఇందులో ఏపీకి 20 లక్షల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీకి మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరముందని మంత్రి జోగి రమేష్ తన దృష్టికి తీసుకొచ్చారని.. త్వరలో వాటిని కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా.. అంచనాకు మించి ఇప్పటివరకు 9 కోట్ల కనెక్షన్లు ఇచ్చామన్నారు. ముఖాముఖిలో లబ్ధిదారుల మనోభావాలు తనకెంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు కేంద్రమంత్రి అందజేశారు. అలాగే రూ.203.56 కోట్లను 42,343 మంది పీఎంఏవై లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని వివరించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ గతంలో ప్రభుత్వమిచ్చిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రూ.లక్షలు చెల్లించేవారని.. కానీ సీఎం వైఎస్ జగన్ కేవలం ఒక్క రూపాయికే నా పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు. మా కుటుంబం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతింట్లో ఉంటున్నాం. – తులసి త్రివేణి, లబ్ధిదారు -
ప్రతి ‘ఇంటి’కీ ఆర్థిక దన్ను
జగనన్న గృహనిర్మాణ పథకంలో భాగంగా నాగజ్యోతికి స్థలం మంజూరైంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాతే అధికారులు దశలవారీగా సొమ్ము చెల్లిస్తారు. ఇంటి పనులు ప్రారంభించడానికి కనీస సొమ్ము కూడా ఆమె చేతిలో లేదు. దీంతో స్థలం ఖాళీగానే ఉండిపోయింది. ఇదే పథకంలో ఇల్లు మంజూరైన స్వర్ణకుమారి సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపనతో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించింది. పునాదులు వేసి, కిటికీల దశకు వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అధికారుల పరిశీలనలో ఇలాంటి పరిస్థితులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సంకల్పించింది. వారికి ముందస్తు చెల్లింపులతో అండగా నిలవాలని నిర్ణయించింది. తద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వేగవంతంగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏలూరు(మెట్రో): పేదలందరికీ సొంతిల్లు అందించడమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పిస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటికే స్థలాలు కేటాయించి గృహ నిర్మాణాలు చేస్తోంది. జిల్లాలో 1,23,296 గృహాలకు ఇప్పటికే మంజూరు పత్రాలను అందించిన జిల్లా అధికారులు ఆ మేరకు గృహ నిర్మాణాలను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ గృహ నిర్మాణాల ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే వారం వారం గృహ నిర్మాణాలకు బిల్లులు చెల్లిస్తూ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చెల్లింపులకూ రెడీ... ఎప్పటికప్పుడు గృహ నిర్మాణ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. లబ్ధిదారులు పనులు వేగవంతం చేసేందుకు తాజాగా ముందస్తు చెల్లింపులు సైతం చేసేందుకు నిర్ణయించింది. లబ్ధిదారులు గృహ నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచుకుని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే వారికి రూ.15 వేలు చొప్పున మిగులు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. గృహ నిర్మాణాల నిమిత్తం చెల్లించే మిగులులోనే వీటిని మినహాయించుకుని లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందస్తు సహాయం చేయనుంది. లబ్ధిదారుల ఆసక్తి మేరకు ఈ నిధులు చెల్లించనున్నారు. జిల్లాలో ఇందుకు అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే అంశంపై గృహనిర్మాణ శాఖ అధికారులు ఆయా డివిజన్లు, మండలాల వారీగా పరిశీలన చేస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకూ సాయం... పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులకు సైతం సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా లబ్ధిదారులకు రూ.5 వేలు చొప్పున ముందస్తు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ సహాయాన్ని జిల్లాలో పలువురు లబ్ధిదారులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా రూ.15 వేలు, రూ.5 వేలు ముందస్తు ఆర్థిక సహాయానికి 93,688 మందిని గుర్తించగా, ఇప్పటికే రూ.15 వేలు చొప్పున 1816 మందికి, రూ.5 వేలు చొప్పున 1067 మందికి చెల్లింపులు చేశారు. ఈ విధంగా గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఆర్థికంగా సైతం లబ్ధిదారులకు దన్నుగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికీ సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా వెసులుబాటు జిల్లాలో ఇప్పటివరకు గృహనిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు ప్రోత్సాహక సహాయంగా రూ.5 వేలు చొప్పున ముందస్తు సాయంగా అందిస్తున్నాం. గృహనిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు ఆర్థిక కారణాలతో మధ్యలోనే నిలిపివేయకుండా వారికి చేయూత అందించి పనులు చేయించడమే లక్ష్యంగా రూ.15 వేలు చొప్పున సహాయం ముందుగానే అందజేస్తున్నాం. ఈ విధంగా గృహనిర్మాణాలు వేగవంతం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. గృహనిర్మాణాలు వేగంగా పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. – సూరజ్ ధనుంజయ్ గనోరి, జేసీ (గృహ నిర్మాణం) -
ఉచితంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి పేదలపై ఎలాంటి భారం లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేసి ఈ నెల చివరి వారంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధంగా ఉన్న 45 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్‌కు దాదాపు రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని పూర్తిగా భరించి లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 1.18 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వీటిలో జనవరి చివరి వారంలో 45 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించేందుకు టిడ్కో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. -
‘పేదలందరికీ ఇళ్ల నిర్మాణం’పై ప్రభుత్వం అప్పీల్
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ మంగళవారం విచారణకు రానుంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రిట్ పిటిషన్లో సింగిల్ జడ్జిగా జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు కాబట్టి తన తీర్పుపై తానే విచారణ జరిపే అవకాశం ఉండదు. అందువల్ల ఆయన ఈ అప్పీల్‌ను మరో ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉంది. ప్రభుత్వ అప్పీల్ విచారణ కోసం ప్రస్తుతం వెకేషన్ జడ్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ రఘునందన్‌రావులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవేళ జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అప్పీల్‌పై విచారణ అంత అత్యవసరం కాదని భావిస్తే విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉంది. 30 లక్షల మంది లబ్ధిదారుల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాన్ని హైకోర్టు అత్యవసరం కాదని భావిస్తుందా? అనేదానిపై మంగళవారం స్పష్టత రానుంది. వాస్తవానికి ప్రభుత్వం.. తీర్పు వచ్చిన మరుసటి రోజే అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపేందుకు సీజే అరూప్‌కుమార్ గోస్వామి సానుకూలంగా స్పందించారు. అయితే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వ అప్పీల్‌ను పక్కన పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. సోమవారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అత్యవసరాన్ని, ఆవశ్యకతను ప్రభుత్వం అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ద్వారా రిజిస్ట్రీకి వివరించింది. -
ఆకర్షణీయంగా పేదల కాలనీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వైఎస్సార్– జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అన్ని వసతులతో పేదల కాలనీలను ఆదర్శంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపడుతున్న విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేయనుంది. మౌలిక వసతుల కల్పన పనులకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన 10 వేల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేయనుంది. విశాలమైన రోడ్లు.. ఇంటర్నెట్ సదుపాయం.. ► కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తారు. ► 1,500 లోపు ఇళ్లు ఉన్న కాలనీలో సీసీ డ్రైన్లు, ఆపైన ఇళ్లు ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. ► కాలనీలో 550 ఇళ్ల లోపు ఉన్న చోట ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్, 550 ఇళ్లు పైబడి ఉంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సన్నాహాలు చేస్తున్నాం. డీపీఆర్‌లు పూర్తయ్యాయి. డీపీఆర్‌లు సమర్పించడం, నిధుల సమీకరణ, ఇతర పనులు చేపడుతున్నాం. నాణ్యతపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. – ఎం.శివప్రసాద్, మౌలిక వసతుల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ వచ్చే ఏడాది డిసెంబర్లో పనులు పూర్తి ఇళ్ల నిర్మాణ అవసరాలకు వీలుగా బోర్లు, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు, నీటి నిల్వ వసతులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1200 కోట్లు ఖర్చు పెట్టింది. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిధుల సమీకరణ, టెండర్లు పిలవడం, ఇతర సాంకేతిక పరమైన పనులు పూర్తి చేస్తాం. 2022 డిసెంబర్ నెలాఖరుకు తొలి లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా పంటల సాగుకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడానికి రైతులకు అందుబాటులో ఆర్బీకేల్లో కియోస్క్‌లను పెట్టాం. అందులో రైతులు ఆర్డర్ చేస్తే నిర్దేశిత సమయంలోగా వారి గ్రామాల్లోనే వారి ఇంటి వద్దకే వారికి కావాల్సినవి అందుతాయి. ఈ వ్యవస్థ అంతా బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం కావాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు 35 వేల రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని, వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి (3 శాతం) రుణాలు ఇస్తే, మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటికి బ్యాంకులు సహకారం అందించడంపై మార్గనిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, జియో ట్యాగింగ్ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామని తెలిపారు. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. సిమెంట్, స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని, చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కౌలు రైతులకు రుణాలు అందాలి ► కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ (సీసీఆర్‌సీలను) ఇచ్చాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాపింగ్‌కు అనుసంధానం చేశాం. ► ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులు. సీసీఆర్సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారిస్తున్నాం. వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్ ద్వారా ధృవీకరిస్తున్నాం. అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. ► వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంట రుణాలు కచ్చితంగా రుణాలు అందాలి. విత్తనం నుంచి విక్రయం వరకు.. ► రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్ చేసి మరీ ఇ– క్రాపింగ్ చేస్తున్నాం. ► పంటను సాగు చేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది. ► ఇ– క్రాపింగ్ అనేది సీసీఆర్సీ కార్డులకే కాదు, వడ్డీ లేని పంట రుణాలకు, ఇన్పుట్ సబ్సిడీకి, ఇన్సూరెన్స్‌కు.. ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది. అన్ని ఆర్బీకేల్లోనూ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలకు గాను బ్యాంకర్లు ఇప్పటికే 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను నియమించడం ప్రశంసనీయం. మిగిలిన 4240 చోట్ల కూడా వీలైనంత త్వరగా వారిని నియమించాలని కోరుతున్నాను. ► ప్రతి ఆర్బీకేలో ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండాలి. ఇతని సేవలను ఆర్బీకే వినియోగించుకోవాలి. ఇ– క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి. ఇది అంతిమంగా డిజిటలైజేషన్ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది. ► బ్యాంకింగ్ విషయంలో వైఎస్సార్ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామని చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్ కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్/ఆన్లైన్ సదుపాయం కల్పించడం అని చెప్పారు. ఇది మంచిదే. కానీ సేవల పరంగా ఇంకా ముందుకెళ్లాలి. ► అంతిమంగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికీ రుణాలు అందాలి. ఆర్బీకేలు, అందులో కియోస్క్‌లు లాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలు మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలి ► జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టి సారించాలి. ► ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తోంది. వీరికి తగిన తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. ► ఈ సమావేశంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్‌గా ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్ కుమార్ గార్గ్‌లు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు సహకరించాలి ► వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారైన మహిళ సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రమం తప్పకుండా నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున మొత్తంగా రూ.75 వేలు అందుతాయి. ► వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ మొత్తం అందుతుంది. తద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారిని రిలయన్స్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ యూనిలీవర్, అమూల్ లాంటి కంపెనీలతో టై అప్ చేశాం. ► ఈ మహిళలకు సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారు. చేయూత కింద ఇప్పటికే రెండుసార్లు నగదు అందించాం. మరో రెండుసార్లు అందిస్తాం. బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యే శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. ► మహిళ చేతిలో పెట్టే డబ్బు, బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని కోరుతున్నాను. ఇప్పటికే 1.17 లక్షల పాలిచ్చే పశువులను పంపిణీ చేశాం. 72,179 మేకలు, గొర్రెల యూనిట్లను కూడా అందించాం. ఫేజ్ –2లో భాగంగా కిరాణా దుకాణాల కోసం 22 వేల మంది, మరో 35,898 మంది పాలిచ్చే పశువులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కోరుతున్నాం. కష్టకాలంలో మీ సేవలు భేష్ ► కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధి మార్గాలు దెబ్బ తిన్నాయి. కోవిడ్ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతింది. ► గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది. ► దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 24.43 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. ► 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో క్షీణత 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను. ► గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయ రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం. ఏపీ కార్యక్రమాల పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో ఆసక్తి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తున్నాం. రాష్ట్రంలో చేయూత మహిళలకు స్వయం ఉపాధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన సమావేశాల్లో పలు ఉత్తరాది రాష్ట్రాలు ఏపీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లను కోరారు. పెద్ద సంస్థలతో కలిసి రిటైల్ దుకాణాలను మహిళలు నడుపుతున్న తీరు పట్ల బిహార్, యూపీ ఎంపీలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏపీ తరహాలోనూ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జగనన్న తోడులో భాగంగా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల్లో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ డిజిటలైజేషన్‌తో సులువుగా సేవలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సంపూర్ణ డిజటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సులువుగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. – సుధీర్‌కుమార్ జన్నావర్, చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న కార్యక్రమాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి దోహదపడ్డాయి. ఆర్బీకేలు కూడా వినూత్న వ్యవస్థ. వీటివల్ల రైతులకు చాలా ప్రయోజనం ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అమ్మకం, కియోస్క్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఇప్పటి డిజిటల్ ఏజ్‌లో ముందడుగుగా భావిస్తున్నాం. – దినేష్‌కుమార్ గార్గ్, యూబీఐ ఈడీ, ముంబయి -
టిడ్కో గృహాల పంపిణీలో అలసత్వం వద్దు
సాక్షి, అమరావతి: టిడ్కో గృహాల లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్ల పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు విషయంలో అలసత్వం వహించొద్దని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తులకు, మంజూరైన రుణాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా రుణాలు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టిడ్కో చైర్మన్ జె.ప్రసన్న కుమార్, ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఉన్నతాధికారులతో పాటు జిల్లాల్లోని బ్యాంకుల సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
వందేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వందేళ్లు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేలా.. అత్యంత నాణ్యంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.1,08,553 కోట్లతో 28,30,227 మంది పేదలకు 2,023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తొలి దశలో ఇప్పటికే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల కాలనీల్లో రూ.1,200 కోట్లతో తాగునీటి వసతి కల్పించడంతో పాటు రూ.32,909 కోట్లతో రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించినట్టు చెప్పారు. ప్రతి లేఅవుట్‌కు ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించినట్టు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణాన్ని రూ.1.80 లక్షలతో చేపట్టామని, లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోందన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపి సిమెంట్, ఇనుము, మెటల్ తదితర మెటీరియల్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆగస్టు 7 లోగా నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి.. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. -
పేదల ఇళ్ల కోసం 30 వేల ఎకరాలు: శ్రీరంగనాథరాజు
సాక్షి, అమరావతి: పేదల కోసం సీఎం రూ.12 వేల కోట్లతో ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ళ నిర్మాణంపై విప్‌లు, ఎమ్మెల్యేలతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, 30 వేల ఎకరాలు పేదల ఇళ్ల కోసం సేకరించామని పేర్కొన్నారు. ప్రస్తుతం లే అవుట్లుగా అభివృద్ధి చేసి మొత్తం సదుపాయాలు కల్పిస్తున్నామని, పేదలకు మంచి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. సిమెంట్, ఐరన్, మెటల్‌ను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. లక్షా 80 వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నాం. ఎమ్మెల్యేలతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నాం. వాటన్నింటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని’’ శ్రీరంగనాథరాజు తెలిపారు. మొదటగా లే అవుట్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. లబ్దిదారులకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గతలో 240 చదరపు అడుగులు ఇచ్చేవారు.. ఇప్పుడు 340 చ.అడుగులు ఇస్తున్నామని వివరించారు. లబ్దిదారుల ప్రాధాన్యత ఆధారంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో శాశ్వత డ్రైనేజీ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని, కొత్తగా 17,005 కొత్త కాలనీలు నిర్మిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. -
వచ్చేనెలలో టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చేనెలలో లబ్ధిదారులకు అందచేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇంటి వసతి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించి పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన పనుల పురోగతి, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాలపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చే పక్షం రోజుల్లో (శ్రావణ మాసంలో) లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. టిడ్కో కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లు/ఫ్లాట్లను పూర్తి ఉచితంగా అందచేయనున్నామన్నారు. మిగిలిన అన్ని కాలనీల్లో నిర్మాణ పనులతో పాటు మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. అగ్రిమెంటు కుదుర్చుకున్న ఈ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా అధికారులు, బ్యాంకుల అధికారులు సమన్వయంతో చురుగ్గా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై ప్రతి వారం టిడ్కో, మెప్మా అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులుంటే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని ఆయన నిర్దేశించారు. -
‘తూర్పు’న జగనన్న ఇచ్చిన పొదరిల్లు
రంగంపేట: మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన గీతం గుర్తొస్తుంది ఈ దంపతుల ఆనందం చూస్తుంటే. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరానికి చెందిన ఈ భార్యాభర్తల పేర్లు ఇళ్లపు సత్తిబాబు, దుర్గాభవాని. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. కుమారులిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. సొంతిల్లు లేక ఈ కుటుంబం నానా అవస్థలు పడేది. పోరంబోకు స్థలంలో పూరిగుడిసెలో తలదాచుకునేవారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పెదరాయవరంలో 195 మందికి ప్రభుత్వం ఇంటిపట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో దుర్గాభవాని పేరిట కూడా పట్టా, ఇల్లు మంజూరయ్యాయి. ఈ కాలనీలో 71 మంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్తిబాబు, దుర్గాభవాని దంపతులు ఎంతో ఉత్సాహంతో సొంతింటి కలను సాకారం చేసుకోడానికి వెంటనే నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు చేదోడువాదోడుగా నిలిచారు. ఇప్పటివరకు రూ.1.01 లక్షలు, డ్వాక్రా ద్వారా మరో రూ.50 వేలు మంజూరయ్యాయి. 50 బస్తాల సిమెంట్, ఇసుక ఉచితంగా అందజేశారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. అంతేకాదు.. శనివారం (ఈ నెల 3న) గృహప్రవేశం చేయనున్నారు. జిల్లాలోని జగనన్న కాలనీల్లో మొదటగా జరుగుతున్న వీరి గృహప్రవేశానికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జిల్లా జాయింటు కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ్ హాజరుకానున్నారు. ఇళ్ల లబ్ధిదారులంతా ఈ దంపతుల మాదిరిగా త్వరితగతిన ఇళ్లు నిర్మించుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశించిన కొత్త ఊళ్లు త్వరలోనే సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు సత్తిబాబు, భవానీ ఉన్న ఇల్లు జగనన్న దయతో.. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లులేక ఇబ్బందులు పడుతున్నాం. ఇద్దరు పిల్లలతో రోడ్డు పక్కన పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న తరుణంలో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నాం. సెంటు భూమి కూడా ఇవ్వలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మాట నెరవేర్చి మాలాంటి వాళ్ల బతుకుల్లో ఆనందం నింపారు. – సత్తిబాబు, దుర్గాభవాని, పెదరాయవరం సౌకర్యాల నిలయాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాడు అలా ► టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్ నిర్మించారు. ► ఒక బెడ్ రూం, వంటగదితో కూడిన లివింగ్ రూమ్ నిర్మించారు. ► 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ► మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నేడు ఇలా ► ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్. ► 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. ► ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా. ► ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్‌లు, సింటెక్స్ ట్యాంక్. ► కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన -
ఏపీ: వడివడిగా పేదల ఇళ్ల నిర్మాణం..
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద ‘వైఎస్సార్ – జగనన్న’ కాలనీల్లో వడివడిగా ఇళ్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. ‘అందరికీ ఇళ్లు పథకం’ కింద ప్రభుత్వం రికార్డుస్థాయిలో దాదాపు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. వీటిలో మొదటి దశలో 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని లే అవుట్లలో ఈ నెల 31 నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము, ఇతర ముడిసరుకు సరఫరా చేసేవారికి సకాలంలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతివారం లబ్ధిదారులు, సరఫరాదారులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని జమ చేస్తారు. దీంతో అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. 15లోగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్.. మొదటి దశలో మంజూరైన 15,10,227 ఇళ్లకు సంబంధించి 12,61,928 ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తి చేశారు. దాదాపు 84% ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తయ్యింది. మిగిలింది ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. ఇక 7,81,430 ఇళ్ల స్థలాలకు అంటే దాదాపు 52% జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మిగతాదీ గడువులోగా పూర్తి చేయనున్నారు. -
ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో హల్చల్
జడ్చర్ల: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ఇళ్లను ఇవ్వబోమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్న ఓ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4వ వార్డు పరిధిలోని బోయలకుంటలో ప్రచార సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నికలు కాబట్టి ఎవరెవరో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎవరొచ్చి ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేసినా మనమే చేయాలి. పొరపాటు జరిగి మా అభ్యర్థికి తక్కువ ఓట్లువస్తే ఇళ్లు కూడా ఇవ్వను. బీరుకో, బిర్యానీకో ఆశపడి ఓట్లు వేయొద్దు’ అని అన్నారు. ఈ వీడియోపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేసేలా లక్ష్మారెడ్డి వైఖరి ఉండడం సరికాదన్నారు. అర్హులకు పథకాలు అందించడం ప్రభుత్వాల పని అని, ఎవరూ బెదిరింపులకు భయపడొద్దన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య -
రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం.. 300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. చదవండి: ఎన్నికల ఘట్టం.. వైఎస్ కుటుంబానికే పట్టం.. -
ఇళ్ల నిర్మాణాలకు పక్కా ప్రణాళిక
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణాల్లో పాలుపంచుకునే క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి డివిజనల్ స్థాయి అధికారుల వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో మొదటి విడత 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్లు, సంక్షేమ/విద్య అసిస్టెంట్/వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ / వార్డు సౌకర్య (ఎమినిటీస్) కార్యదర్శుల పాత్ర, బాధ్యతలు, విధులపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. లబ్ధిదారుని వివరాల నమోదుతో పాటు ఇండెంట్, మెటీరియల్ సరఫరా, ఎం బుక్ రికార్డింగ్, చెల్లింపులు, సిఫార్సు వంటి కీలక బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు. క్యూఆర్ కోడ్‌తో లబ్ధిదారుల వివరాలు ♦క్యూఆర్ కోడ్‌తో లబ్ధిదారుల వివరాలు తెలిసేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో లబ్ధిదారుని ఇంటి పట్టా, లే అవుట్ పేరు, గ్రామ సర్వే నంబరు, కేటాయించిన ప్లాట్ నంబర్ వివరాలు ఉంటాయి. ♦క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే మంజూరైన స్కీము, ఇంటి విలువ, హౌసింగ్ ఐ.డి.నంబర్, జాబ్ కార్డు నంబర్, లబ్ధిదారుని బ్యాంకు ఖాతాతో పాటు ఎంత బిల్లు చెల్లించారు.. బిల్లు ఆలస్యమైతే అందుకు గల కారణాలు, ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే వివరాలు తెలుసుకోవచ్చు. పాసు పుస్తకంలో సమగ్ర వివరాలు ♦ఇంటి నిర్మాణానికి దశల వారీగా మంజూరు చేసిన మెటీరియల్‌తోపాటు నగదు చెల్లింపు వివరాలను లబ్ధిదారునికి ఇచ్చే పాసు పుస్తకంలో నమోదు చేస్తారు. బేస్మెంట్ లెవల్, రూఫ్ లెవల్, స్లాబ్ లెవల్, ఫినిషింగ్ స్థాయిలో బిల్లులు చెల్లిస్తారు. ♦90 రోజుల పని దినాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే నగదు వివరాలు కూడా పొందుపరుస్తారు. లబ్ధిదారులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా సంబంధిత సిబ్బంది ఫోన్ నంబర్లు కూడా పాసు పుస్తకంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేఎల్ యూనివర్సిటీలో 18, 19న శిక్షణ ♦ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు గృహ నిర్మాణ, సచివాలయ సిబ్బందికి ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. ♦ఇందులో భాగంగా ఈ నెల 9న డివిజన్ స్థాయిలో సిబ్బందికి ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి వంద శాతం సిబ్బంది హాజరయ్యేలా చూసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. -
నూటికి నూరు శాతం ఇవ్వాల్సిందే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. (అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్) పదేపదే గుర్తుంచుకోవాలి.. ‘నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలి. నూటికి నూరు శాతం కచ్చితంగా ఇళ్లపట్టాలు పంపిణీ కావాలన్న విషయాన్ని పదేపదే గుర్తుంచుకోవాలి. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో పర్యటిస్తాను. ఇంటిపట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదని’ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని సీఎం పేర్కొన్నారు. సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తానని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇళ్లపట్టా ఇవ్వాలని సీఎం తెలిపారు. పెన్షన్ కార్డుకు 10 రోజులు, రేషన్ కార్డుకు 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటి పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలన్నారు. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వివక్ష లేకుండా, సంతృప్తస్థాయిలో అందాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. (చంద్రబాబు సన్నిహితులతో నిమ్మగడ్డ భేటీ) ఉపాధి హామీ పనులు ఉపాధిహామీ కింద భారీగా పనులు కల్పించాలని కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్ వాడీ కేంద్రాల మీద పూర్తిగా ధ్యాస పెట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగించంచాలని, వెంటనే పనులు మొదలు పెడతారన్నారు. నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదని.. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ‘55 వేల అంగన్వాడీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. భవనాలు ఉన్నచోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం.సొంతంగా భవనాలు లేనిచోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటికోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్‌కు బదిలీచేయాలని’ సీఎం ఆదేశించారు. పచ్చతోరణం పచ్చదనం పెంపునకు ‘జగనన్న పచ్చతోరణం’ కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యమని సీఎం తెలిపారు. నాడు నేడు కింద, ఖాళీ స్థలాల్లో, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమం, అలాగే ఇళ్లపట్టాలు ఇవ్వనున్న లే అవుట్స్‌లో కూడా బాగా మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఇళ్లపట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కులు ఇవ్వాలని సీఎం సూచించారు. వార్డు క్లినిక్స్ పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట నిర్మాణం చేపట్టాలన్నారు. 2 కి.మీ పరిధిలో, కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లేదూరంలో వార్డు క్లినిక్స్ నిర్మాణం చేయాలని దీనికోసం స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం: ‘ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి ఉంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఈపనులు పూర్తి చేయాలి. ఫర్నిచర్, ఫ్యాన్లు అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తికాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూళ్లు తెరిచేలోగా నాడు – నేడు కింద పనులు పూర్తి కావాలి. కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలి. అర్బన్ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు– నేడుకు నిధుల కొరతలేదు. వెంటనే మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని ఈ స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాల’ని సీఎం ఆదేశించారు. ఇసుక వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వచేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. రోజువారీ అవసరాలను తీరుస్తూనే.. వర్షాకాలంలో అవసరాల కోసం ఈ ఇసుకను నిల్వచేశామని తెలిపారు. నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వచేయాలని సీఎం సూచించారు. ‘వచ్చే రెండు వారాల్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. రీచ్‌లు మునిగే అవకాశాలు ఉంటాయి. కావాల్సిన ఇసుకను ఇప్పటికే నిల్వచేసుకోవాలి. శ్రీకాకుళం 20 వేలు, తూర్పుగోదావరి 60 వేలు, పశ్చిమగోదావరి 35 వేల టన్నులు, కృష్ణా 50 వేల టన్నులు, గుంటూరు 40 వేల టన్నులు ప్రతి రోజూ ఇసుకను ఉత్పత్తి చేయాలని’ సీఎం పేర్కొన్నారు. ఏమీ చేయకపోయినా.. ఏదోరకంగా వేలెత్తిచూపిస్తారన్నారు. వర్షాలు కురిసేలోగా ఇసుకను నిల్వచేయాలని, ఈ ఇసుకే వచ్చే కాలంలో వినియోగపడుతుందన్నారు. థర్డ్ ఆర్డర్ నదుల నుంచి, వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. -
పేదల కళ్లలో ఆనందమే సీఎం జగన్ లక్ష్యం
సాక్షి, వైఎస్సార్ కడప: పేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని ఉక్కాయపల్లి లేఅవుట్‌ను శనివారం ఆయన మాజీ మేయర్ సురేష్‌బాబు,అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు పంపిణీ చేయడానికి స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. (దాదాపు 30 లక్షల మందికి.. గృహ యోగం!) ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి కడపలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 22 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. రూరల్ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కూడా 1.5 సెంటును అందజేసేందుకు కేబినెట్లో చర్చించామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. -
ఆ కథనాలు అవాస్తవం..
సాక్షి, కడప: ఇళ్ల పట్టాలపై కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచురించడం బాధాకరమని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను వెనక్కి తీసేసుకుంటున్నారంటూ వచ్చిన కథనాలపై కలెక్టర్ స్పందించారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కథనాలు నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికి ఇళ్లు, ఉగాది నాటికి ఇంటి స్థలాలు ఇస్తామని ఆయన తెలిపారు. 2500 ఎకరాలు భూమిని గుర్తించాం.. ఇంటి స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా 2500 ఎకరాలు భూమిని గుర్తించామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఉన్న చోట పట్టా భూములు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. 300 ఎకరాల పట్టా భూమిని సేకరించామని.. ఈ పథకం ద్వారా భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు.