పేదల కళ్లలో ఆనందమే సీఎం జగన్‌ లక్ష్యం | Amjad Basha Said CM Jagan Aim For Happiness In Eyes Of Poor | Sakshi
Sakshi News home page

పేదల కళ్లలో ఆనందమే సీఎం జగన్‌ లక్ష్యం

Published Sat, Mar 7 2020 11:08 AM | Last Updated on Sat, Mar 7 2020 2:56 PM

Amjad Basha Said CM Jagan Aim For Happiness In Eyes Of Poor - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: పేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. వైఎస్సార్‌ జిల్లా కడప నగర శివారులోని ఉక్కాయపల్లి లేఅవుట్‌ను శనివారం ఆయన మాజీ మేయర్‌ సురేష్‌బాబు,అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు పంపిణీ చేయడానికి స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. (దాదాపు 30 లక్షల మందికి.. గృహ యోగం!)

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి కడపలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 22 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. రూరల్‌ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కూడా 1.5 సెంటును అందజేసేందుకు కేబినెట్‌లో చర్చించామని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement