
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. పనసకాయల లోడ్ లారీ సర్వీస్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న బంగారయ్య(23), మల్లయ్య (28)తో పాటు రఫీయొద్దీన్(50) అనే వ్యక్తిపై లారీ పడి దుర్మరణం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment