three people died
-
నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం!
‘దేవుడా..! నాకెందుకు ఈ శాపం.. నేనేమి చేశాను పాపం.. నన్ను కూడా తీసుకెళ్లితే బావుండు.. నేను ఎవరి కోసం బతకాలి.. నేనెందుకు బతకాలి..’ అంటూ ఆ ఇల్లాలు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను చూసి తల్లడిల్లిపోయింది. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయే వరకు ఏడ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు దూరమవడాన్ని తట్టుకోలేకపోయింది. వారి తల నిమురుతూ.. పదేపదే ముద్దాడుతూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన రాపూరు మండలం గుండవోలులో ఆదివారం విషాదాన్ని నింపింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: మండలంలోని వెలుగోను జంక్షన్ నుంచి ఏపూరు వెళ్లే జాతీయ రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అంతవరకు తనతో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న ఆ ఇల్లాలు షాక్‌కు గురై కుప్పకూలిపోయింది. మోటారు బైక్‌పై గంగోటి ప్రతాప్ తన కుమార్తె వైష్ణవి, కుమారుడు సిద్ధార్ధతో కలిసి గుండవోలుకు బయల్దేరారు. ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో ప్రతాప్, వైష్ణవి, అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన సిద్ధార్ధను వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సిద్ధార్ధ (8) ఆదివారం మృతి చెందాడు. కుప్పకూలిన ప్రభావతి భర్త, పిల్లలు ఒకేసారి మృత్యువాత పడడంతో ప్రభావతి కుప్పకూలింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రతాప్ (38) ముంపు గ్రామానికి చెందినవాడు కావడం త్వరలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న కుటుంబానికి నిరాశే మిగిలింది. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలోని ముగ్గురూ మృత్యువాత పడడంతో వృద్ధ తల్లిదండ్రులతోపాటు గ్రామం అంతా విషాదంలో మునిగింది. ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాప్, వైష్ణవి, సిద్ధార్ధకు ఆదివారం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు రోదనలతో గ్రా>మం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఎంత పనిచేశావు తల్లీ..
వైఎస్సార్ జిల్లా : తాను ఈ లోకాన్ని వీడిపోతే నా బిడ్డలకు ఎవరు దిక్కు.? కట్టుకున్నోడికి పెళ్లాం, బిడ్డలు కనిపించడం లేదు. రోజూ పూటుగా తాగడం మత్తులో తూలడమే ఆయన ప్రపంచం. పర స్త్రీ వ్యామోహంలో వేధింపులకు గురి చేసేవాడు. వీటిని భరించలేకపోయింది. చివరికి తనువు చాలించాలని నిర్ణయించుకుంది.తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లాలనుకుంది ఆ తల్లి. ముక్కుపచ్చలారని కుమారై, కుమారుడితో సహా నాపరాయి గనిలోని నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన ఎర్రగుంట్లలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లక్ష్మీదేవి(36) అక్షయ(9), రేవంత్(7) మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు..దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన పిట్టల శ్రీనివాసులుకు , సి రాజుపాలెంకు చెందిన లక్ష్మీదేవికి పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి అక్షయ, రేవంత్ అనే పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం ఎర్రగుంట్లకు వచ్చిన వీరు మహేశ్వర్‌నగర్ కాలనీలో స్థిరపడ్డారు. పిట్టల శ్రీనివాసులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మీదేవి రజక వృతిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుండేది. పిట్టల శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు.తరచూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఇలా చేస్తే కుటుంబం గడిచేది ఎలా.. పిల్లలను ఎలా పోషించుకుంటామని లక్ష్మీదేవి భర్తను అడుగుతుండేది. ఇటీవల కాలంలో శ్రీనివాసులు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై భార్య ప్రశ్నించడంతో ఆమెను వేధింపులకు గురి చేస్తుండేవాడు. అదివారం రాత్రి కూడా ఇద్దరు ఈ విషయంపై గొడవ పడ్డారు. శ్రీనివాసులు సోమవారం ఉదయం ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. లక్ష్మీదేవి తన పిల్లలు అక్షయ, రేవంత్‌లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. వేంపల్లె రోడ్డులో ఉన్న నాపరాయి గని వద్దకు వెళ్లింది. ముందుగా అక్షయ, రేవంత్‌లను గనిలోని నీటిలో వేసి తర్వాత ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది. నీటిలో మునుగుతున్న సమయంలో పిల్లలు కేకలు వేశారు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ మంజునాథ్‌రెడ్డి, తహసీల్దార్ ఎ నాగేశ్వరరావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. మొదట నీటి అడుగున పడి ఉన్న అక్షయ, రేవంత్‌ల మృతదేహాలను, కొంత సేపటికి లక్ష్మీదేవి మృతదేహాన్ని బయటకు తీశారు.తల్లీబిడ్దల మృతదేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గని వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతురాలి అన్నయ్య ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. -
శుక్రవారమని ఆపావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు
సాక్షి, భద్రాచలం: శుభకార్యానికి వచ్చి ఆనందంగా గడిపిన వారిలో ముగ్గురు మృత్యువాత పడడంతో పెను విషాదం నెలకొంది. గోదావరి తీరం రోదనలతో మిన్నంటింది. స్నానానికి వచ్చిన వారిని నీలో కలుపుంటావా గోదారమ్మా..ఏందమ్మా ఇది! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. భద్రాచలం అయ్యప్ప కాలనీకి చెందిన మచ్చా శ్రీనివాసరావు కూతురు ఓణీల శుభకార్యానికి తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన వెలిదండి శ్రీను 20మందితో బుధవారం వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు. శుక్రవారం అయ్యప్ప నగర్ కరకట్ట వద్ద గోదావరి వద్దకు తొమ్మిది మంది వెళ్లి బట్టలు ఉతికాక, స్నానం చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం భగవాన్ దాస్ కాలనీకు చెందిన సొంతమూరి రాంచరణ్(08) మునిగిపోతుండటంతో అతడిని కాపాడేందుకు శ్రీను భార్య వెలిదండి వరలక్ష్మి(28), మేనకోడలు కొడవలి సురేఖ(14), రాంచరణ్ తల్లి సొంతమూరి భవాని, మండపేటకే చెందిన బంధువు వెలిదండి వీరవెంకటరమణలు వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయి మునిగిపోయారు. ఒడ్డున ఉన్న వారి కేకలతో స్థానికులు, గజఈతగాళ్లు నీటిలోకి దిగి సురేఖ, భవాని, వీరవెంకట రమణలను రక్షించారు. వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ సురేఖ మృతి చెందింది. అనంతరం వరలక్ష్మి, రాంచరణ్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సొంతమూరి భవాని పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెలిదండి శ్రీను గతంలో భద్రాచలంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. కొంతకాలం కిందట కుటుంబంతో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు వలస వెళ్లాడు. శుభకార్యానికి రాగా..ఇలా విషాదం నెలకొందని బోరున ఏడుస్తున్నాడు. మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ టి.స్వామి ఆధ్వర్యంలో పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. శుక్రవారమని ఆపావు..ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు ‘ఇంటికి వెళ్దామంటే శుక్రవారమని ఆపావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావా వరలక్ష్మీ..’ అంటూ మృతురాలి భర్త శ్రీను రోదించిన తీరు కలిచివేసింది. మరో మృతురాలు సురేఖకు మూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోతే ఆమెను, తమ్ముడిని మేనమామ, మేనత్తలు శ్రీను, వరలక్ష్మి దంపతులే పెంచుతున్నారు. ఇంకో మృతుడు రాంచరణ్‌కు మూడు నెలల క్రితమే గుండెకు సంబంధించి ఆపరేషన్ జరిగిందని, ఇంతలోనే మళ్లీ దేవుడు అన్యాయం చేశాడని సంఘటనా స్థలంలో ఉన్న సోదరి విలపించింది. కలెక్టర్ విచారం భద్రాచలం వద్ద గోదావరిలో మునిగి ముగ్గురు మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని కలెక్టర్ ఎంవీ.రెడ్డి ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సురక్షిత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అప్రమత్తం చేయాలని ఆదేశించారు. -
ప్రాణాలు తీసిన జొన్నరొట్టె
సాక్షి, సంగారెడ్డి: జోగిపేట/వట్పల్లి(అందోల్): తల్లి మృతితో అప్పటికే కడుపు నిండా బాధతో ఉన్నారు.. కాస్త కడుపు నింపుకొందామనుకుని తిన్న ఆహారం కాస్తా యమపాశంగా మారింది. తిన్న జొన్న రొట్టెలే ప్రాణాలు హరించాయి. తల్లి 10 రోజుల కింద జొన్న రొట్టె తిని అస్వస్థతకు గురై మరణించింది. ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఇద్దరు కుమారులు, ఒక కోడలు సైతం జొన్న రొట్టెలు తిని విగతజీవులయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 10 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుం బంలో నలుగురు మృతి చెందడం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుం బసభ్యులు తెలిపిన ప్రకారం.. పల్వట్లకి చెందిన మఠం శంకరమ్మ (80) ఈనెల 13న విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమె దశదినకర్మ ముగిసిన అనంతరం, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టె లు చేసుకుని శంకరమ్మ కుమారులు చంద్రమౌళి (55), శ్రీశైలం (48), కోడళ్లు సుశీల (60), అనసూజ, సరిత తిన్నారు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న మనవలు, మనవరాళ్లు శిరీష, సంధ్య, సాయి వరుణ్ రొట్టెలు వద్దనడంతో వారికి అన్నం వండి పెట్టారు. రొట్టెలను తిన్న వారికి కొద్ది సేపటికే మత్తు రావడంతో కొద్దిసేపు పడుకున్నా రు. గంట తర్వాత విరేచనాలు, వాంతులు కావడంతో మనవలు, మనవరాళ్లు ఇంటి పక్క వారి సాయంతో 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే చంద్రమౌళి, సుశీ ల మృతి చెందారు. శ్రీశైలం, సరితను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా కు, అనసూజను బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలిం చారు. ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం రాత్రి శ్రీశైలం కూడా మరణించాడు. సరిత, అనసూజ పరిస్థి తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తల్లి శంకరమ్మ దహన సంస్కారాలు నిర్వహించిన ఆమె చిన్న కుమారుడు సంతోష్ తన భార్యతో కలసి నారాయణఖేడ్ వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విష పదార్థాలు కలిసుండొచ్చు జొన్నపిండిలో ఏమైనా విషపదార్థాలు ఉన్నాయా.. లేదా అన్నదానిపై మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. పిండి, రొట్టెలను స్వాధీనం చేసుకొని నాచారం వద్ద పరీక్ష కేంద్రానికి పంపించాం. పిండిలో క్రిమి సంహారక మందులు కలిస్తే తప్ప ఇంత ప్రమాదం జరగదు. క్రిమిసంహారక మందు వంటిది ఉంటేనే గంటలోపు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శిరీష అనే అమ్మాయి కొంత భాగమే తినడంతో ప్రమాదం నుంచి బయటపడింది. –మోజీ రాం రాథోడ్, డీఎంహెచ్‌వో, సంగారెడ్డి జొన్నలు విషపూరితం కావు.. జొన్నలను మరాడించాక 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకుమించి నిల్వ ఉంటే పురుగు పడుతుంది. విషపూరితం మాత్రం కాదు. పురుగులు పట్టిన పిండిని రొట్టె చేసుకొని తింటే స్వల్ప ఆరోగ్య సమస్యలే వస్తాయి. జొన్నలను మర ఆడించేటప్పుడు (గిర్ని) లేదా ఇంట్లో రొట్టెలు చేసుకునే సమయంలో ఇతర పిండి కలిసినట్లయితే కొద్ది గా విషతుల్యం కావచ్చు. జొన్న పిండిని నానబెట్టి కొద్దిగా వాడినట్లయితే కూడా ఫంగస్ వచ్చి విషమమ్యే అవకాశం ఉంది. బల్లి, పాములు, ఇతర విషపూరిత క్రిమికీటకాలు పిండిలో ఎక్కువసేపు ఉన్నా విషపూరితం కావచ్చు – నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి -
ప్రాణాలు తీసిన అతివేగం
గజ్వేల్ రూరల్: రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామ సర్పంచ్ అంజిబాబుకు చెందిన కారు హైదరాబాద్‌లో ఉండటంతో దానిని తీసుకొచ్చేందుకు, అదే గ్రామానికి చెందిన సాయిప్రసాద్, భానుప్రసాద్‌తో కలసి గణేష్‌కు చెందిన నిస్సాన్ మిక్రా (టీఎస్20 0006) కారులో బుధవారం రాత్రి బయలుదేరారు. గణేష్ డ్రైవింగ్ చేస్తుండగా.. అతని పక్కన సర్పంచ్ అంజిబాబు, వెనుక సీట్లో సాయిప్రసాద్, భానుప్రసాద్ కూర్చున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు గురువారం తెల్లవారుజామున ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో రాజీవ్ రహదారిపై నిలిపి ఉన్న సిమెంట్ లారీని వెనుక భాగంలో ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో సర్పంచ్ అంజిబాబు, డ్రైవర్ గణేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన సాయిప్రసాద్‌ను 108లో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. భానుప్రసాద్‌కు సైతం ఛాతిపై, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ సీఐ ఆంజనేయులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రివేళ రోడ్డుపై వాహనాలు ఆపొద్దు: సీపీ ప్రమాద స్థలిని గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో లారీలను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
పగిడ్యాలలో విషాద ఘటన
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న శరణమ్మతో పాటు ఆమె కూతుళ్లు వైశాలి (14), భవాని (12) మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంఘటన స్దలాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ పరిశీలించారు. అధికారులు విచారణ చేపట్టారు. భర్త మల్లప్ప ఆరుబయట పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ట్రంకు పెట్టెల్లో అవినీతి ‘ఖజానా’) -
రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి నాకాతండా వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బీహార్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. మృతులు కేరళలోని కోజికోడ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
జడ్చర్ల వద్ద లారీ బీభత్సం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. పనసకాయల లోడ్ లారీ సర్వీస్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న బంగారయ్య(23), మల్లయ్య (28)తో పాటు రఫీయొద్దీన్(50) అనే వ్యక్తిపై లారీ పడి దుర్మరణం చెందారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి జలసమాధి
పెద్దఅడిశర్లపల్లి: ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూ సుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ము గ్గురు జల సమాధి అయ్యారు. ఈ ఘటన గు రువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల శివారులో గల ఏఎమ్మార్పీ లింక్ కెనాల్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డెరిగూడేనికి చెంది న ఓర్సు రంగయ్య తన కుటుంబంతో కలసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని సాహెబ్‌నగర్‌లో ఉంటున్నాడు. అక్కడే జేసీబీలు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజు ల క్రితం హైదరాబాద్ నుంచి వడ్డెరిగూడంలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు కుటుంబంతో కలసి కారులో వచ్చాడు. గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఏఎమ్మార్పీ లింక్ కెనాల్ వెంట ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తుండగా 5.8 కిలోమీటరు వద్దకు రాగానే కా రు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నీట మునిగిన కారు కారు కొట్టుకొని పోతుండటం చూసిన స్థానికులు రాంబాబు, విజయ్‌లు వారిని రక్షించేందుకు కాలువలోకి దూకారు. కారు వెనుక డిక్కీ డోరు తీసి రంగయ్య కుమారుడు కార్తీక్‌ను కా పాడి ఒడ్డుకు చేర్చారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే కారు మొత్తం కాలువలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న రంగయ్య (40), భార్య అలి వేలు (38), కుమార్తె కీర్తన (19) మృతి చెం దారు. గుడిపల్లి ఎస్ఐ గోపాల్‌రావు స్థానికుల సహాయంతో మృతదేహాలను, కారును వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల ను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వడ్డెరిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కళ్లెదుటే తల్లిదండ్రులు మృతి చెందడంతో కార్తీక్ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
విషాదం : ముగ్గుర్ని మింగిన వాగు..
సాక్షి, హుస్నాబాద్ : వాగులో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు అందులో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండ లం వరుకోలులో జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వాగులో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ఇసుక గుంతలో మునిగి మృత్యువాత పడ్డారు. వరుకోలుకు చెందిన ఏడుగురు స్నేహితులు పెందోట వరప్రసాద్ (21), కంటే నిఖిల్ (18), కూన ప్రశాంత్ (22)లు వారి స్నేహితులు శ్యామకూర రామకృష్ణ, అజయ్, దూడం రంజిత్, శనిగరం పవన్ కల్యాణ్‌లతో కలసి స్నానం చేసేందుకు వాగులోకి దిగారు. వీరిలో రామకృష్ణ ఒక్కడికే ఈత వస్తుంది. ముందుగా నిఖిల్ వాగులోకి దిగగా అప్పటికే ఇసుక కోసం తీసిన గుంతలోకి వెళ్లి కాపాడండంటూ అరిచాడు. ఒడ్డున ఉన్న మిగతా స్నేహితులు ఈత రాదనే విషయాన్ని మర్చిపోయి నిఖిల్‌ను కాపాడేందుకు వాగులోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు ఆ ఇసుక గుంతలో మునిగిపోయారు. గమనించిన రామకృష్ణ నీటిలో మునిగిన అజయ్ ఒక్కడినే ఒడ్డుకు చేర్చాడు. మిగతా ముగ్గురు నీటిలో మునిగిపోయారు. వారసులు లేకుండా పోయారంటూ.. నీటిలో మునిగిన 20 నిమిషాల తర్వాత వరప్రసాద్, నిఖిల్, ప్రశాంత్ మృతదేహాలు నీటిలో తెలియాడుతూ కనిపించాయి. చుట్టుపక్కలవారు యువకుల మృతదేహాలను వాగులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ముగ్గురూ వారి కుటుంబాల్లో ఒక్కొక్క మగ సంతానమే కావడంతో వారసుడు లేకుండా పోయాడని వారి తల్లిదండ్రులు రోదించిన తీరు కలిచివేసింది. వరప్రసాద్, బీఫార్మసీ, నిఖిల్ ఇంటర్మీడియట్, ప్రశాంత్ డిగ్రీ చదువుతున్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకోగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో భార్య కాపురానికి రావడం లేదని ఒకరు, కురవి మండలంలో అవమానం భరించలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కౌంసల్యదేవిపల్లి గ్రామంలో భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో బుధవారం ఎర్పుల నరేష్(36)అనే వ్యక్తి ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సంతోష్‌రావు కథనం ప్రకారం.. కౌంసల్యదేవిపల్లికి చెందిన నరేష్ గత 12 సంవత్సరాల క్రితం కరవి మండలానికి చెందిన సావిత్రతో వివాహం జరిగింది. వీరికి ఇద్దకు కుమారులున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో మనస్తాపానికి బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో రైతు.. తరిగొప్పుల: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానిక ఎస్సై రాజేష్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలకేంద్రానికి చెందిన సాయబోయిన మహేందర్(30) తన తండ్రి పేరు మీదున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం, ఇటు హమాలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో తన ఇద్దరు అక్కల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పు, పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ. 3 లక్షలు ఎక్కువగా కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందనట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.దొంగతనం మోపారని విద్యార్థి..కురవి(డోర్నకల్): ఊరి పెద్దలు దొంగతనం మోపడంతో అవమానం భరించలేక మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి శివారు దీరావత్ తండాలో జరిగింది. మృతుడి తల్లి లక్ష్మి కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ వంశీ(17) మరిపెడ బంగ్లాలోని ఓ ప్రైవేటు కాలేజిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. లక్ష్మి భర్త లక్పతి కొన్నేళ్ల క్రితం చనిపోగా ధీరావత్తండాలోని తన తల్లిగారింటికి వచ్చింది. అక్కడే ఉంటూ కుమారుడిని టెన్త్ వరకు చింతపల్లి హైస్కూల్లో చదివించింది. 15 రోజుల క్రితం చింతపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వంశీతోపాటు మరో నలుగురు జేసీబీలో బ్యాటరీ, డీజిల్ దొంగతనం చేశాడని సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీని పట్టుకెళ్లిన పోలీసులు దొంగతనంపై విచారణ చేపట్టగా మృతుడి తల్లి లక్ష్మి తండాలోని పెద్దల సహకారంతో స్టేషన్‌కు వెళ్లి కుమారుడిని విడిపించింది. 10 రోజుల క్రితం చోరీ విషయంలో పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి రూ.35 వేల జరిమానా విధించారు. వంశీతోపాటు మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున చెల్లించాలని తీర్మానించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే మరిపెడకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. చోరీ కేసులో ఇరికించి జరిమానా తీసుకున్న భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నపై మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. మాకే సంబంధం లేదు.. వంశీ మృతికి తమకు ఏమి సంబంధం లేదని భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నలు తెలిపారు. గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జేసీబీలోని డీజిల్, బ్యాటరీలు ఎత్తుకెళ్లినట్లు జేసీబీ డ్రైవర్ రవి జూన్ 29న సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఆ కేసులో కొందరిని పోలీసులు విచారణ చేశారన్నారు. తమపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఇద్దరిపై కేసు.. మాలోత్ వంశీ తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు చింతపల్లికి చెందిన భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నలపై కేసు నమోదు చేసినట్లు మరిపెడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించినట్లు చెప్పారు. -
జ్వరంతో ముగ్గురి మృతి
ముగ్గురిని జ్వరాలు బలిగొన్నాయి. దమ్మపేట మండలంలో ఒకరు, ఇల్లెందు మండలంలో ఇంకొకరు, మణుగూరులో మరొకరు మృతిచెందారు.దమ్మపేట: మండలలోని ముష్టిబండకు చెందిన రైతు పరిటాల వెంకటేశ్వరరావు(55), జ్వరంతో శనివారం మృతిచెందాడు. ప్లేట్లెట్స్ తగ్గడంతో కుటుంబీకులు సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మణుగూరులో బాలుడు... మణుగూరుటౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో డెంగీ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. స్థానిక ప్రయివేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కాకర్ల ఆదర్శ్(15), గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ప్రయివేటు వైద్యశాలలో కుటుంబీకులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మృతిచెందాడు. ముకుందాపురంలో యువకుడు... ఇల్లెందు: మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన కోయడ రాజు(35), కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రమవడంతో రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలలో కుటుంబీకులు చేర్పించారు. అతడు అక్కడే ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాలో వేర్వేరు ఘటనల్లో గురువారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని నారబోయినగూడెంలో రైతు, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో యువతి, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లిలో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. పాలకుర్తి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక మండలంలోని నారబోయినగూడెం గ్రామంలో చిక్కుడు సుధాకర్(28) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కుడు సుధాకర్‌కు భార్య లావణ్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆ కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అవి తీర్చలేక మానసికాందోళనకు గురై గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడు తండ్రి రాంచంద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. కురవిలో యువతి.. కురవి : జీవితంపై విరక్తి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కురవి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగభూషణం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని 747 కాలనీలో 21 సంవత్సరాల దివ్యాంగ యువతి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. మూడు నెలల క్రితం ఆమెపై లైంగిక దాడి జరిగింది. దీంతో బుధవారం రాత్రి సదరు యువతి ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. యువతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా మండల కార్యదర్శి గంధసిరి పద్మ, నాయకులు నాగమ్మ, వీరలక్ష్మి, హచ్చాలి, యాదమ్మ డిమాండ్ చేశారు. లక్నెపల్లిలో ఆటోడ్రైవర్.. నర్సంపేట రూరల్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన కుడికందుల రాము (34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్యలత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు మతిస్థిమితం సరిగా లేదు. ఇటీవల డిజిల్ ధరలు పెరిగి, కిరాయిలు తగ్గడంతో కుటుంబ పోషణ భారమైంది. ఆటో కిస్తీలు, ఇతర ఫైనాన్స్‌లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు కళ్లెపల్లి సురేష్, టీఆర్ఎస్ మండల నాయకుడు కోడారి రవి, గ్రామ అధ్యక్షుడు గోడిశాల శ్రీను, మాజీ ఉపసర్పంచ్ భగ్గి నర్సింహారాములు కోరారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట, రాయపర్తి మండలం కాట్రపల్లి, జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వనపర్తి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. సంగెం: భార్య చనిపోయిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎల్గూర్‌రంగంపేట గ్రామానికి చెందినబోనాల రాజు (35), రజిత దంపతులు స్రవంతి, మానస కుమార్తెలతో జీవనం సాగిస్తున్నారు. రాజు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగాయి. మనస్తాపం చెందిన రజిత ఈ ఏడాది ఏప్రిల్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రాజు నెల రోజుల క్రితం పురుగుల మందుతాగి చికిత్స పొందాడు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ పురుగుల మందు తాగి పడిపోయాడు. తండ్రి పోశయ్య అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి హుటాహుటిన 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఆగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సంపత్‌రావు తెలిపారు. అనాథలైన కుమార్తెలు.. తల్లిదండ్రుల ఆత్మహత్యతో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె స్రవంతి 9వ తరగతి, చిన్న కుమార్తె మానస 6వ తరగతి చదువుతున్నారు. వీరిని చూసుకోవడానికి మంచాన పడిన తాత పోశయ్య, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రలను కోల్పోయిన బాలికలను చూసిన వారంత గుండలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులను ప్రభుత్వం చేయూతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు. కాట్రపల్లిలో వృద్ధుడు.. రాయపర్తి: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాయపర్తి ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎండీ.వలీపాషా(60)కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిల్లు చేసి అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆతహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రాజ్‌మహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. వనపర్తిలో రైతు.. లింగాలఘణపురం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చుంచు రాజు (30) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పత్తి చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. రాత్రి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లిన సమీప రైతులు గమనించి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతుడు రాజుకు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు, 18 నెలల కొడుకు ఉన్నాడు. కొడుకు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. అయినప్పటికీ ఆరోగ్యం బాగుపడకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కర్నూలులో భారీ పేలుడు.. ముగ్గురి మృతి
సాక్షి, కర్నూలు: జిల్లా శివారులోని డంప్ యార్డ్ వద్ద భారీ బాంబు పేలుడు సంభవించటంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏంజరిగిందో అర్థం కాక ప్రజలు, అధికారులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వివరాలు.. డంప్ యార్డు పరిసర ప్రాంతాల్లో రెవెన్కూ, పోలీసు అధికారులు భూసర్వే చేస్తుండగా ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏఎస్ఐ జంపాల శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలస్తోంది. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ప్రజలు, అధికారులు క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు. పేలుడుకు గల కారణాలను పోలీసుల పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
రహదారులు రక్త సిక్తం..
- వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం హొసూరు : క్రిష్ణగిరిలో సోమవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. క్రిష్ణగిరి సమీపంలోని తెన్నంకొటాయ్ గ్రామానికి చెందిన అరుణ్‌పాండ్యన్(25) ద్విచక్రవాహనంపై క్రిష్ణగిరిలోని పౌరసరఫరాల గిడ్డంగి వద్దకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్‌పాండ్యన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కందికుప్పం సమీపంలోని వేటయ్యన్కొటాయ్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాసన్(35) ద్విచక్రవాహనంపై క్రిష్ణగిరి– చెన్నై జాతీయ రహదారిలో వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కందికుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదే విధంగా డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని నాగిరెడ్డిపాళ్యం గ్రామానికి చెందిన రుద్రప్ప(70) తళి సమీపంలోని కురుంగలతూరు గ్రామంలో నివాసముంటున్న కొడుకును చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం మనవుడు శశికుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నాగిరెడ్డిపాళ్యానికి వస్తుండగా అగళకోట వద్ద వెనుక నుంచి వస్తున్న టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుద్రప్ప, శశికుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రుద్రప్ప మృతి చెందాడు. ఘటనపై తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
రక్తమోడిన రహదారి
కారును ఢీకొన్న లారీ.. షిర్డీ వెళ్తూ ముగ్గురి మృతి కొండాపూర్: స్నేహితులందరూ కలిసి షిరిడీ దైవదర్శనం కోసం బయలుదేరి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డారు. కారులో తెల్లవారు జామున 3 గంటలకు బయలుదేరి గంటపాటు ప్రయాణించిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీ మత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి కొండాపూర్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రామచంద్రాపురం మండలంలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన శేఖర్ (35), వెంకటేశంచారి (33), కుమార్(33), చంద్రశేఖర్‌చారి (35), వెంకట్‌చారి (35)లు స్నేహితులు. శేఖర్ ఎలక్ర్టిషియన్‌గా పని చేస్తున్నాడు. కుమార్ బీహెచ్ఈఎల్లో కేబుల్ ఆపరేటర్, వెంకటేశంచారి కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మిగతా ఇద్దరితో కలిసి షిరిడీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 3 గంటలకు కారు(ఏపీ09బీఎక్స్7117)లో బయలుదేరి కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి దగ్గరకు చేరుకోగానే ఉదయం 4 గంటల ప్రాంతంలో బీదర్ నుంచి ఎదురుగా వస్తున్న జీడీ12వై7654 నంబర్‌గల లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే కుమార్, వెంకటేశంచారి, శేఖర్లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన చంద్రశేఖర్, వెంకట్చారిలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడు కుమార్ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
శుభలేఖలు పంచడానికి వెళుతూ..
మరో రెండు రోజులు గడిస్తే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మొగనున్నాయి. వివాహ వేడకను వైభ వంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. వేడకకు బంధువులందరినీ ఆహ్వా నించేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై బయలుదేరారు.. కాసేపటికే పిడుగులాంటి వార్త.. ఇంటి వద్ద నుంచి వెళ్లిన యువకులు మృత్యుకోరలకు చిక్కుకుపోయారన్న చేదు నిజం తండా వాసులను కలచివేసింది. పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. తుర్కపల్లి : తుర్కపల్లి మండలం పెద్దతండా పరిధి జాలుబావి తండాకు చెందిన హస్లీ, బిచ్చాల కూతురు వివాహం ఈ నెల 3 తేదీన రాజపేట మండలం పుట్టగూడేనికి చెందిన వ్యక్తితో జరగనుంది. దీంతో పత్రికలు పంచడానికి పెళ్లి కూ తురు సోదరుడు (చిన్నమ్మ కొడుకు) ధనావత్ గణేశ్(17), అతడి మిత్రుడు భానోత్ మల్లేశ్ (18) రాజపేట మండలం పుట్టగూడేనికి చెంది న మాలోత్ సాయికుమారు(19) గురువారం బైక్‌పై తండా నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో ముల్కలపల్లి గ్రామశివారులోని మూ ల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్క డే మృతిచెందారు. మృతదేహాలు చెల్లాచెదురు గా రోడ్డుపై పడి పోయాయి. మిన్నంటిన రోదనలు ప్రమాద విషయం తెలుసుకుని మృతుల కుటు ంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో పాటే ఉన్న యు వకులు మృత్యువాత పడడంతో కుటుంబ స భ్యుల రోదనలు మిన్నంటాయి. గణేశ్, మ ల్లేశ్ ఇద్దరూ భువనగిరి ప్రభుత్వ కళశాలల్లో ఇం ట ర్మీడియట్ చదువుతుండగా, సాయికుమారు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్‌కు ఇద్దరు చెల్లెలు అమ్మనాన్న ఉన్నారు. మల్లేశ్‌కు ముగ్గురు అక్కలు, ఓచెల్లె అమ్మనాన్న ఉ న్నారు. వీరిని ఢీ కొట్టిన లారీ జాడ తెలియరాలే దు. సంఘటన స్ధలానికి డీఎస్పీ మోహన్‌రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐ మదుసుధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబలాను అదుకోవాలి బాధిత కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాలను పరిమర్శించి మృతి చెందిన గణేశ్, మల్లేశ్ కుటుంబాలకు రూ. 5వేల చొప్పున అందజేశారు. -
మత్తు కల్లు దొరక్క ముగ్గురు మృతి
ధారూరు/బషీరాబాద్/తాండూరు రూరల్: రంగారెడ్డి జిల్లాలో మత్తు కల్లు దొరక్క ముగ్గురు మృతి చెందగా, ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. ధారూరుకు చెం దిన బుడగజంగం దస్తయ్య(35), అతడి కుటుంబీకులు మత్తు కల్లు లభించకపోవడంతో అస్వస్థతకు గురై ఈ నెల 15న తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. మం గళవారం వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి విషమించడం తో అదేరోజు రాత్రి దస్తయ్య మృతి చెందగా.. అతని తల్లి రత్నమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇదే మండలం గట్టెపల్లికి చెందిన కల్తీ కల్లు బాధితురాలు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె యాలాల మండలం బానాపూర్ అడవిలో చనిపోవడంతో కుటుం బీకులు బుధవారం మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే, బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పోచమొళ్ల చిన్న నర్సప్ప(45) మంగళవారం రాత్రి ఆయన గ్రామంలోని ఓ దుకాణంలో కల్లు తాగాడు. కల్లులో మత్తు మోతాదు మించడంతో ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో నర్సప్ప కిందపడి చనిపోయాడు. మరో ఘటనలో తాండూరు ఇంద్రానగర్‌కు చెందిన దాసరి సాయికుమార్(30) మత్తు కల్లు లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి విం తగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున అతను ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
వీడ్కోలు చెప్పేందుకు వెళ్తూ..
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి మృతులు కడప వాసులు మరో తొమ్మిది మందికి గాయాలు సుమో టైర్ పగలడంతో ఘటన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స ఆమె దేశ సరిహద్దులు దాటి వెళ్తోంది..మళ్లీ ఎన్నాళ్లకు వస్తుందో తెలియదు.. దీంతో కుటుంబ సభ్యులంతా వీడ్కోలు చెప్పేందుకు సుమోలో బయలుదేరారు.. పిల్లలు సైతం వారి వెంట సందడి చేస్తూ కదిలారు.. వారి ప్రయాణంలో ఎన్నెన్నో విషయాలు బయటకి వచ్చాయి.. ఒకరికొకరు జాగ్రత్తలూ చెప్పుకున్నారు. అయితే కర్నూలు సమీపానికి రాగానే ఉన్నట్టుండి...పెద్ద శబ్ధంతో టైర్ పేలింది..క్షణాల్లో సమో పల్టీలు కొట్టి బోల్తాపడింది..అప్పటి వరకు సందడి చేస్తూ సాగిన వారి ప్రయాణం రోదనలతో మిన్నంటింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా ఓ యువతి, ఓ చిన్నారి చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఓర్వకల్లు : టాటా సుమో బోల్తా పడి ముగ్గురు మృతిచెందగా పది మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం నన్నూరు గ్రామ సమీపంలోని కర్నూలు-చిత్తూరు 18వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కడప నగరానికి చెందిన ప్రభావతి అనే మహిళ కువైట్‌కు వెళ్తోంది. ఆమెను హైదరాబాద్‌లో విమానం ఎక్కించేందుకు ఆమె భర్త జ్యోతి ప్రతాప్‌తో పాటు సమీప బంధువులు ఏపీ31 టీవీ 2642 నంబర్ గల టాటా సుమో వాహనలో బయల్దేరారు. ఉదయం 10 గంటలకు కడపలో బయలుదేరిన వారి వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. మరో పది నిమిషాల్లో కర్నూలుకు చేరుకుటుందనగా.. నన్నూరు సమీపాన ఆ వాహనం వెన చక్రం పగిలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన గల కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివప్రసాద్, జ్యోత్స్నల కుమారుడు లక్కీ(6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిరీష(26), లవ్లీ(మూడేళ్ల పాప) మృతి చెం దారు. ప్రభావతి, వరకుమార్, సోనీలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ లక్ష్మీనారాయణ, గంగినిపల్లె చిన్న, జ్యోత్స్న, దేవకుమారి, హర్షిత, రవిచరణ్ అనే వ్యక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి. వీరంతా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ప్రాణాలు తీసిన బైక్ రేస్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముగ్గురు యువకుల బైక్‌రేస్ వ్యామోహం మరో ముగ్గురి జీవితాలను చిదిమేసింది. నిండు వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు బైక్ చక్రాల కింద నలిగిపోయారు. మరో వ్యక్తికి అతను పడుకున్న మంచాన్నే యమపాశంగా మార్చేశారు. చె న్నైలో బైక్రేసులకు అడ్డూ అదుపులేదనేందుకు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరకలే తార్కాణం. చెన్నై ప్యారిస్‌లోని పాత తిరువళ్లూర్ బస్‌స్టేషన్ పరిసరాల్లో పగటివేళ వ్యాపారాలు చేసుకుని, రాత్రి వేళ ఫుట్‌పాత్‌లే పట్టెమంచంగా భావించి నిద్రబోయే అభాగ్యులు ఎందరో ఉన్నారు. రోడ్లపై తోపుడుబళ్లు, పూల బడ్డీలు పెట్టుకుని వ్యాపారం ముగించుకున్న తరువాత రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లపై పడుకోవడం అలవాటు. ఎప్పటిలానే ఫ్లాట్‌ఫారాలపై కొందరు పడుకోగా, మంగళవారం రాత్రి వర్షం పడడంతో బర్మాబజార్ ఫ్లాట్‌ఫారంపై మరికొందరు నిద్రించారు. తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై అతివేగంగా ముత్తుస్వామి ఫ్లైవోవర్ బ్రిడ్జి మీదుగా హార్బర్ వద్దకు వస్తుండగా ప్యారిస్ కూడలి వద్ద పోలీసు తనిఖీలను గమనించారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో అదేవేగంతో బైక్‌ను పక్కసందులోకి దారిమళ్లించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పగా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లింది. బైక్ ఢీకొట్టిన వేగానికి ఇనుపమంచం వేసుకుని నిద్రిస్తున్న అప్పు గాల్లోకి ఎగిరాడు. మంచం ముక్కలుచెక్కలై నిలబడగా అప్పు అదే మంచంపై పడడంతో అందులోని ఇనుక కమ్మీ కడుపులోకి గుచ్చుకోగా విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అప్పు హిజ్రా అని తెలుస్తోంది. అయినా వేగం తగ్గించని యువకులు ఫ్టాట్ఫారంపైనే నిద్రిస్తున్న చిన్నపొన్ను, రుక్మిణి, మణిలపైకి ఎక్కింది. మంచి నిద్రలో ఉన్నవారు బిగ్గరగా కేకలు పెట్టారు. అప్పటికీ వెనక్కుతగ్గని యువకులు బైక్‌ను అదేవేగంతో మరింత ముందుకు పోనివ్వగా శకుంతల (70) అనే మహిళ తలఛిద్రమై ప్రాణాలు విడిచింది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోగా పక్క ఫ్లాట్‌ఫారాలపై నిద్రిస్తున్న జనం మేల్కొని బైక్‌లతో వీరంగం సృష్టించిన ముగ్గురు యువకుల వెంటపడ్డారు. వీరికి దొరక్కుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ముగ్గురు యువకుల రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ఆ పరిసరాల్లో ఫ్లాట్‌ఫారాలపై నిద్రిస్తున్న జనం ముగ్గురు యువకులను ఒడిసి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనేక బైక్‌లలో వస్తున్న మరికొందరు యువకులు ఈ దారుణాన్ని దూరం నుంచి గమనించి వెనక్కు పారిపోయారు. ఇంతలో సమాచారం అందుకున్న ఫ్లవర్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో శకుంతల (70), చిన్నపొన్ను (60) అనే ఇద్దరు మహిళలు, అప్పు అనే హిజ్రా (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు ఐస్హౌస్కు చెందిన సాదిక్ (18), ట్రిప్లికేన్కు చెందిన మన్సూర్ (19), రసూద్ (18)లుగా గుర్తించారు. సెల్‌ఫోన్ షాపులో పనిచేసే ఈ ముగ్గురు మంగళవారం రాత్రి రాయపేట దర్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఈ వికృత క్రీడకు పాల్పడినట్లు సమాచారం. బైక్రేసుల వ్యామోహంతో ముగ్గురు ప్రాణాలను తీయడమేగాక వారు వారు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ముగ్గురిలో సాధిక్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, తీవ్రగాయాలకు గుైరె న కారణంతో స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించారు. బైక్ రేసులు షరామామూలే: చెన్నైలో రాత్రివేళ గుట్టుగా సాగుతున్న బైక్రేసు లపై ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా అదుపుచేసే నాథుడే కరువయ్యాడు. మౌంట్‌రోడ్డు, ఉత్తరకోట ప్రాంతాల్లో ఎక్కువగా బైక్రేసులు జరుగుతున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం రాజాఅన్నామలై మన్రం వద్ద పూలవ్యాపారం చేసుకుంటున్న మహిళ ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తుండగా వాహనం కింద నలిగి చనిపోయింది. మరో సంఘటనలో మన్నాడీ తండిశెట్టి వీధిలో ఒక చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. చెన్నైలో బైక్రేసుల చరిత్రలో మరోపేజీ బుధవారం రక్తసిక్తమైంది. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
ఆలేరు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ము గ్గురు మృతిచెందారు. జిల్లాలోని ఆలేరు, చివ్వెంల మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. వరంగ ల్ జిల్లా కొడకొండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి(25), కరీంనగర్ జిల్లా సైదాపేట మండలం ఆకుకుంట్ల గ్రామానికి చెందిన కోళ్ల సుమన్‌రెడ్డి(24)లు తెల్లవారుజామున బైక్‌పై హైదరాబాద్ నుంచి ఆలేరు మీ దుగా వరంగల్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో స్థానిక ఇండియన్ పెట్రోల్ బం క్ ఎదుట వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. అయితే పెట్రోల్ బంక్ నుంచి సుమారు 200మీటర్ల దూరానికి వీరి బైక్‌ను ఢీకొట్టిన వాహనం ఈడ్చుకెళ్లింది. బైక్ పూర్తిగా గుర్తుపట్టరాని విధంగా దగ్ధమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. ప్రాణం తీసిన నిద్రమత్తు ఐలాపురం(చివ్వెంల): వరంగల్ జిల్లా మల్లంపల్లి నుంచి దామరచర్ల మండలంలోని ఇండెన్ సిమెంట్‌కు మట్టిలోడుతో ఆదివారం తెల్లవారుజామున వెళ్తోంది. లారీ చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామస్టేజీ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో గుర్రంపోడు మండలం చింతగూడెం ఆవాసం శాఖాజీపురం గ్రామానికి చెందిన లారీక్లీనర్ గొడ్డెటి సత్యనారయణ(23) తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ అమరబోయిన ఏడుకొండలుకు తీవ్రగాయలయ్యాయి. పోస్తుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడు అవివాహితుడు. మృతుడి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అతి వేగం బలిగొంది!
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి మరొకరికి గాయాలు మండ్య : అతి వేగం ముగ్గురిని బలిగొంది. గురువారం ఉదయం మండ్య జిల్లా బూదనూరు సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు మరో యువకుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే... మైసూరు జిల్లా పంచాయతీలో ఆహారశాఖ అధికారిగా పనిచేస్తున్న రఘునందన్(53) అక్కడి రామానుజ రోడ్డులోని పదవ క్రాస్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం తన భార్య మైథిలి(45), ఆమె సోదరి సుమిత్రాదేవి(53) కలిసి బెంగళూరులో బంధువుల గృహ ప్రవేశానికి అద్దెకు ఇండికా కారు మాట్లాడుకుని బయలుదేరారు. మండ్య తాలూకాలోని బూదనూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఎదురుగా బెంగళూరు నుంచి వస్తున్న ఫియెట్ లీనా కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని అదే వేగంతో గాలిలోకి ఎగిరి రోడ్డుకు ఇటువైపు ఉన్న ఇండికాకారును బలంగా ఢీకొంది. ఘటనలో ఇండికా కారు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న రఘునందన్, సుమిత్రాదేవితో పాటు ఇండికా కారు డ్రైవర్ ప్రకాష్(23) అక్కడికక్కడే మరణించారు. రఘునందన్ భార్య మైథిలి తీవ్రంగా గాయపడ్డారు. ఫియెట్ కారులో ఉన్న ముగ్గురు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ భూషన్ జి.భోరసే, డీవైఎస్పీ ఉదేష్, సీఐ శివకుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. గాయపడిన మైథిలి మండ్యలోని విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మండ్య పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కొత్త సంవత్సరం పూట..విషాదం
కొత్త సంవత్సరం పూట మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గురువారం జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. కిరాణా సరుకులు కొనేందుకు వెళుతూ ఒకరు.. మోటారు సైకిల్ ఢీకొని ఒకరు.. స్నేహితుడితో కలసి వెళుతూ ఇంకొకరు మృతి చెందగా వారి కుటుంబాలు రోదిస్తున్న తీరు చూసేవారిని కలచివేసింది. మందస, పలాస: కొత్త సంవత్సరం పూట ఓ గిరిజన కుటుంబానికి విషాదం మిగిలింది. కిరాణా సరుకులు తీసుకువస్తానని చెప్పి వెళ్లిన ఆ ఇంటి యజమాని అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మందసలోని సాబకోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని గజపతి జిల్లా డింబిరిగాం గ్రామానికి చెందిన సవర అర్జున (35) తన ఇంటి వద్ద ఉన్న కిరాణా దుకాణంలోకి సరుకులు తీసుకురావడానికి మోటారు సైకిల్‌పై మందస బయలుదేరాడు. మార్గమధ్యలో చినరంగమటియా గ్రామానికి చెందిన సవర మంగొళ, చొంపాపురం గ్రామానికి చెందిన సవర రాజేశ్వరరావు ద్విచక్రవాహనం ఎక్కారు. ముగ్గురూ వస్తూ సాబకోట గ్రామానికి కూతవేటు దూరంలో మందస నుంచి సింగుపురం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొన్నారు. అక్కడ ఉన్న దుక్కను తప్పించబోయి మోటారు సైకిల్ మ్యాజిక్ వాహనాన్ని ఢీకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో సవర అర్జునకు తలపై తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మంగొళ , రాజేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. అర్జున, మంగొళలను 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అర్జున మృతి చెందినట్టు వైద్య సిబ్బంది గుర్తించారు. మృతుడికి భార్య సంతోషి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజేశ్వరరావును బుడంబో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అతనికి నుదిటిపై ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. -
ముగ్గురి జలసమాధి
రావులపెంట (వేములపల్లి) :నాగార్జునసాగర్ ఎడమ ప్రధానకాల్వలో టాటాఏస్ (ట్రాలీఆటో) బోల్తాకొట్టడంతో మగ్గురు జలసమాధి అయ్యారు. మండలంలోని రావులపెంట గ్రామ శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుల బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాములపహడ్ గ్రామానికి చెందిన చింతకాయల నాగయ్య (38), చింతకాయల లింగ య్య (35) ఇద్దరు వరుసకు సోదరులు. వీరు గొర్రెలు, మేకల కొనుగోలు, అమ్మకం వ్యా పారం నిర్వహిస్తుంటారు. శనివారం తెల్లవారుజామున నేరేడుచర్ల మండలం రాంపురం గ్రా మంలో కొనుగోలు చేసిన గొర్రెలను తీసుకొచ్చేందుకు పాములపహడ్ నుంచి ద్విచక్ర వాహనంపై రావులపెంటకు వచ్చారు. గ్రామం లో ట్రాలీఆటోను అద్దెకు మాట్లాడుకుని ద్విచక్రవాహనాన్ని అక్కడే పెట్టి డ్రైవర్ గోలి నాగరాజు(23)తో పాటు లింగయ్య, నాగయ్యలు ఆటోలో ఉదయం నాలుగున్నర గంటలకు బయలుదేరారు. గ్రామానికి కిలోమీటరు దూర ంలో ఉన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ వం తెన మలుపువద్దకు రాగానే కాలువ వంతెన వద్ద రక్షణ లేకపోవడంతో ఆటోకాల్వలో పడిపోయింది. తెల్లవారుజామున కావడంతో ప్రమాదం గురించి ఎవరికీ తెలియలేదు. వెలుగులోకి ఇలా.. లింగయ్య, నాగయ్య ఫోన్లు శనివారం రాత్రి వరకు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆది వారం ఉదయం మృతుల కుటుంబ సభ్యు లు, బంధువులు సాగర్ ఎడమకాల్వకట్ట వెంట గాలింపు జరిపారు. ఈక్రమంలో ఆటోకు సంబంధించిన కొన్ని పరికరాలు బ్రిడ్జి వద్ద కాల్వకట్టపై కనిపించాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి మిర్యాలగూడ రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐలు సర్ధార్‌నాయక్, సతీష్‌కుమార్‌లు చేరుకున్నారు. వారి పర్యవేక్షణలో కాల్వలో గాలించి ఆటోను గుర్తించారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి తాళ్లసహాయంతో ట్రాలీ ఆటోను వెలికితీశారు. మిన్నంటిన బంధువుల రోదనలు.. సాగర్ కాలువలో నుంచి మధ్యాహ్నం మూడు మృతదేహాలను వెలికి తీశారు. తమ వారు ఇక లేరు అని తెలియడంతో, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాలువలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రావులపెంటతో పాటు సమీప గ్రామాలైన పాములపహాడ్, కామేపల్లి గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఘటనస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యే పరామర్శ.. విషయం తెలుసుకుని సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు మృతుల బంధువులను పరామర్శించారు. ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు కరుణాకర్‌రెడ్డి, అరుణమమ్మ, సైదులు, తమ్మడబోయిన అర్జున్, దొం తిరెడ్డి వెంకట్‌రెడ్డి, మోసిన్‌అలీ, శ్రీనివాస్, ఎలియాస్, ఇంద్రారెడ్డి మృ తుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. క్యాబిన్‌లోనే మృతదేహాలు.. టాటాఏస్ కాల్వలో పడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి మృతదేహాలు కూడా ఆటో క్యాబిన్‌లోనే ఉన్నాయి. ఉద యం చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా అద్దాలు పెట్టుకుని డోర్లు లాక్ చేసుకున్నారు.కాలువలో పడిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మృ తుడు నాగయ్యకు కుమారుడు,కూతురు, భార్య ఉన్నారు. లింగయ్యకు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు, భార్య, ఆటోడ్రైవర్ నాగరాజుకు వివాహం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కరెంటు తీగే.. కాలసర్పమై..!
నాన్నా.. నేను గొర్రెల మందకు ఎల్తాను.. ఇద్దరన్నలను ఏరే పనికి ఎల్లమనండి. సాయంకాలం ఆరు గంటల దాకా అక్కడే ఉంటాను. ఆ తర్వాత అన్నను పంపండి..అని చెప్పి వెళ్లిన కొడుకు సాయంత్రం ఏడు గంటలైనా ఇంటికి రాలేదు. చిన్నోడు ఎటెల్లాడు.. ఇంకా రాలేదని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలో దిక్కుకూ వెళ్లి వెతుకులాట ప్రారంభించారు.అర్ధరాత్రి అయ్యింది.. ఊరవతల ఉన్న చెవిటి బంద(చెరువు) వైపు వెళ్లిన చిన్నోడి సోదరులకు బందలో విగత జీవిగా పడి ఉన్న తమ్ముడు కనిపించాడు. తమ్ముడిని కాపాడుకోవాలన్న ఆతృతలో చెరువులోకి దిగిన వారిని సైతం మృత్యువు కాటేసింది. అంతే అర్ధరాత్రి వేళ చెవిటి బంద, ఎస్పీఆర్పురం రోదనలతో దద్దరిల్లాయి. జి. సిగడాం: చిన్నోడు.. అతన్ని కాపాడే ప్రయత్నంలో అన్నలిద్దరి మృతికి కారణం తెగిపడిన ఓ విద్యుత్ తీగ. మృత్యుపాశాన్ని గమనించకపోవడం వల్లే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు ఒడి చేరడం జి.సిగడాం మండలం ఎస్పీఆర్పురం గ్రామస్తులను కలచి వేసింది. అంతులేని విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఏలిస లక్ష్ముం కుమారుడు చంద్రరావు(15) శుక్రవారం ఉదయం తండ్రికి చెప్పి మేత కోసం గొర్రెల మందను తీసుకొని గ్రామ సమీపంలో ఉన్న చెవిటి బంద ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం ఆరుగంటలకే ఇంటికి తిరిగి రావాల్సిన అతను రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు నాలుగువైపులా వెతకడం ప్రారంభించారు. అర్థరాత్రి అయినా చంద్రరావు జాడ కనిపించలేదు. అదే సమయంలో చెవిటి బంద వైపు వెళ్లిన చంద్రరావు సోదరులు ఏలిస దాలెప్పడు(25), డొప్ప రమణ(28)తో పాటు సీతయ్య, చిన్నోడు అనే వ్యక్తులకు బంద సమీపంలో చంద్రరావు వాడే గడకర్ర కనిపించింది. దాంతో అనుమానంతో చెరువులో చూడగా చంద్రరావు కనిపించాడు. అతన్ని కాపాడుకోవాలన్న ఆతృతతో దాలెప్పడు, రమణలు ముందూవెనకా చూడకుండా చెరువులోకి దిగి తమ్ముడిలాగే కుప్పకూలిపోయారు. దాంతో కంగారుపడిన సీతయ్య, చిన్నోడు పరీక్షగా చూస్తే చెరువు ఒడ్డున తెగిన విద్యుత్ తీగ కనిపించింది. దాని షాక్‌తోనే వారు ముగ్గురు చనిపోయారని వారికి అర్థమైంది. ఆందోళన చెందుతూ ఇద్దరూ పరుగున గ్రామంలోకి వెళ్లి విషయం తెలియజేశారు. దాంతో రాత్రి ఒంటిగంట సమయంలో కుటుం బ సభ్యులతో సహా గ్రామస్తులందరూ బంద వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు అక్కడే కుప్పకూలిపోయారు. అనాథ అయిన కుటుంబం తన ఇద్దరు కుమారులతోపాటు మరదలి కొడుకైన రమణ కూడా మరణించడంతో లక్ష్ముం కన్నీరుమున్నీరవుతున్నాడు. చిన్నవాడైన చంద్రరావుకు పెళ్లి కాలేదు. దాలెప్పడుకు భార్య భారతి, పిల్లలు కార్తీక్, తేజేస్వరి ఉన్నారు. రమణకు భార్య వరలక్ష్మి, పిల్లలు యశ్వంత్‌కుమార్, సుజాత ఉన్నారు. పిల్లలందరూ రెండు మూడేళ్ల వయసువారే. చేతికి అందివచ్చిన కొడుకులు ముగ్గురు ఒకేసారి పోవడంతో కుటుంబాన్ని ఎలా సాకాలంటూ లక్ష్ముం భోరున విలపించగా.. మగదిక్కు కోల్పోయామని, ఇంక మాకు దిక్కెవరంటూ మృతులిద్దరి భార్యలు గుండెలవిసేలా అక్కడే కూలబడి రోదించడం గ్రామస్తులను కలచివేసింది. చిన్న పిల్లలు అనాథలయ్యారంటూ పలువురు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. రాత్రంతా రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది. జిల్లా అధికారుల సందర్శన సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం శనివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. సీఐ సీతారాం ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కాగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్డీవో దయానిధి, ఏఎస్పీ తిరుమలరావు, తహశీల్దారు డి.వి.బ్రహ్మాజీరావు, ఎంపీడీవో కె.హేమసుందరరావు, సంతకవిటి, రాజాం, జి.సిగడాం పోలీసులు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, తనుబుద్ది దాలినాయుడు గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కలెక్టర్ ఆరా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం తరఫున రూ.5వేలు చొప్పున కలెక్టర్ అందజేశారు. మృతి చెందిన వారంతా పేదవారునని, వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గానీ, అపద్బంధు పథకం కింద గానీ ఆర్థిక సాయం అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. స్థానిక అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ అన్నారు. అనంతరం ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించింది, వైర్లు తె గిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులను పరామర్శించారు. -
మృత్యు తాండవం
సాక్షి, చెన్నై :రాజధాని నగరం చెన్నై రోడ్లపై మృత్యువు తాండవం చేసింది. బుధవారం వేకువ జామున నగర రోడ్లపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు విగత జీవులయ్యారు. ఇందులో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. చేట్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఐటీ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వేకువ జామున విధుల్ని ముగించుకుని తమకు కేటాయించిన క్యాబ్‌లో తమ ప్రాంతాలకు బయలు దేరారు. తాంబరం వైపుగా బయలుదేరిన క్యాబ్‌లో మీనంబాక్కం, పల్లావరం, క్రోంపేట, సేలయూరుల్లో దిగాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయలుదేరారు. ఈ వాహనాన్ని డ్రైవర్ రాజ్‌కుమార్ నడిపాడు. ఇద్దరు ఇంజనీర్లు మీనంబాక్కం వద్ద దిగేశారు. మిగిలిన నలుగురితో వాహనం తాంబరం వైపుగా కదిలింది. అతి వేగం, డ్రైవర్ నిద్ర మత్తు, రోడ్డుపై చిమ్మచీకటి వెరసి ఆ వాహనం పల్లావరం వద్ద అదుపు తప్పింది తొలుత డివైడర్‌ను, వెను వెంటనే రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. రక్తపు మడుగులో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు గంటల సమయంలో అటు వైపుగా వెళ్తోన్న వాహనదారులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో డ్రైవర్ రాజ్ కుమార్, బీహార్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిత్యులాల్ ఉన్నారు. ఈ ఇద్దరు సీట్ బెల్ట్ ధరించి ఉండడంతో గాయాలతో బయటపడ్డారు. ఇక, సేలంకు చెందిన సురేష్, తిరుచ్చికి చెందిన అన్భురాజ్, నాగర్ కోవిల్‌కు చెందిన అర్జునన్‌లు మృతి చెందినట్లు గుర్తించారు. వీరంతా క్రోం పేట, సేలయూరు పరిసరాల్లో గదుల్ని అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ, ప్రతి రోజు చేట్పేట్కు క్యాబ్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని మృత్యువు కబళించడంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. మరో ఘటనలో..: క్రోంపేట లక్ష్మీపురానికి చెందిన షణ్ముగం తిరునీర్ మలై వైపు తన మోటార్ సైకిల్‌పై వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే షణ్ముగం మరణించాడు. తాంబరం తదుపరి ముడిచ్చూర్ వద్ద ఉదయాన్నే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు ఢీ కొనడంతో అదే ప్రాంతానికి చెందిన మోటారు సైకిలిస్టు నాగరాజ్ విగత జీవి అయ్యాడు. తాంబరం మార్గంలో వరుస ప్రమాదాలు పోలీసుల్నే కాదు, వాహన చోదకుల్ని కలవరంలో పడేశాయి.విధులకు వెళ్తూ: తాంబరం మార్గంలో ఐదుగురిని వేర్వేరు ప్రమాదాలు మింగేస్తే, రాధాకృష్ణన్ రోడ్డులో మరో ఇంజనీరు ప్రమాదంలో బలయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టుకోట్టైకు చెందిన వీరమణి బీఈ పట్టభద్రుడు. మైలాపూర్‌లోని ఓ ప్రైవేటు సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. టీ నగర్లో బస చేస్తున్న వీరమణి తన మిత్రుడు రాజ్‌కుమార్‌తో కలిసి ఉదయాన్నే మైలాపూర్‌కు బయలు దేరారు. మోటార్ సైకిల్‌పై అతి వేగంగా వీరు దూసుకొచ్చారు. రాధాకృష్ణన్ సాలైలోని కెథడ్రల్ రోడ్డు వద్ద వీరి వాహనం అదుపు తప్పింది. గాల్లోకి ఎగిరిన మోటార్ వాహనం కూత వేటు దూరంలో పడింది. సమీపంలోని విద్యుత్ స్తంభం మీద పడ్డ వీరమణి తల ఛిద్రమైంది. సంఘటనా స్థలంలోని వీరమణి మరణించాడు. తీవ్ర గాయాలతో కొట్టు మిట్టాడుతున్న రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనల సమాచారం ఉదయాన్నే టీవీల్లో ప్రత్యక్షం కావడం నగర వాసుల్ని తీవ్ర విషాదంలో పడేసింది. నగరంలో ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు బలి కావడం చర్చనీయాంశంగా మారింది. అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం కావడంతో ఇక తనిఖీల్లో మునగాల్సిన వంతు పోలీసులకు ఏర్పడటం కొసమెరుపు. -
కరెంట్ తీగలు తెగిపడి ముగ్గురి సజీవదహనం
-
హైటెన్షన్ తీగలు తెగిపడి ముగ్గురి సజీవదహనం
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొల్లాపురం మండలం రావులాపురంలో విద్యుత్ తీగలు తెగి.. లారీపై పడ్డాయి. బోర్ వెల్స్ పైపులతో వెళ్తున్న లారీ మీద హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో వెంటనే షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవంగా దహనమయ్యారు. తమిళనాడుకు చెందిన లారీ శనివారమే బొల్లాపురం వచ్చింది. అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పొలంలో బోర్ వెల్ వేసే క్రమంలో ఇనుప రాడ్లు పైకి లేపడం, అప్పటికే హైటెన్షన్ తీగలు కొంతవరకు తెగి ఉండటంతో ఆ తీగలు ఇనుప రాడ్లకు తగిలాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంజన్‌లోంచి మంటలు వచ్చాయి. కేబిన్ లోంచి బయటకు రాలేక ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మిగిలినవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండకు వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులెవరూ సమీపంలోకి కూడా రాలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజలే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
ముగ్గుర్ని బలిగొన్న అతివేగం
దెందులూరు/ఏలూరు (వన్ టౌన్) : జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన సమీపంలో శనివారం ఉదయం ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయూలయ్యూయి. దెందులూరు ఎస్సై కట్టా వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు తీర్థయూత్ర చేసేందుకు కారులో బయలుదేరారు. శనివారం ఉదయం దెందులూరు సమీపంలో జాతీయ రహదారిపై లారీని ఆపి జారిపోరుున బరకాన్ని డ్రైవర్, క్లీనర్ కడుతుండగా, వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఆ కారు ఢీకొట్టి నుజ్జు నుజ్జయ్యింది. ఇండోర్ జిల్లా చెనోరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మురళీలాల్(46), మధుసింగ్ (54) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న నలుగురితోపాటు లారీపై బరకం కడుతున్న వ్యక్తి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ ఐదుగుర్ని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏలూరులో చికిత్స పొందుతూ రామేశ్వర్ మీనర్ అనే వ్యక్తి మృతి చెందాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కడుపు కోత
చింతలమోరి (మలికిపురం) :పాఠశాలకు సెలవైనా మాస్టారు పెట్టిన ట్యూషన్‌కు ఠంఛనుగా హాజరయ్యారు. అది పూర్తయ్యాక కాస్తంత ఆటవిడుపుగా ఉంటుందని బీచ్‌కు వెళ్లారు. మృత్యువు హస్తాలు చాచినట్టుగా ముందుకొస్తున్న సముద్రం కెరటాలను పట్టించుకోని ఆ చిన్నారులు స్నానానికి దిగి.. ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. నలుగురు క్షేమంగా తిరిగిరాగా.. ముగ్గురు మాత్రం వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.చింతలమోరి బీచ్ వద్ద శనివారం సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మరణించిన సంఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. సముద్ర స్నానానికి మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్లగా, వీరిలో ముగ్గురు మరణించారు. అందరూ చింతలమోరికి చెందిన వారే. స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాలకు రెండో శనివారం సెలవు కావడంతో ఉదయం పది గంటలకు పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన ట్యూషన్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 12 తర్వాత వీరంతా కలిసి బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో స్నానానికి వెళ్లిన వీరు కత్తి రోడ్ల (కెరటాల ఉధృతికి ఏర్పడిన కోత ప్రదేశం)లో పడ్డారు. అక్కడే పార్టీ చేసుకుంటున్న కొందరు వ్యక్తులు వీరిని గమనించారు. ముగ్గురిని కాపడగా, మరో ముగ్గురు సముద్రంలో గల్లంతై చనిపోయారు. మరొకరు ఈదుకుంటూ తీరానికి చేరుకున్నాడు. మరణించిన వారిలో చెవ్వాకుల ప్రసన్న కుమార్(14), చెవ్వాకులు ప్రభునతానియేల్(14), రాపాక వంశీ (14) ఉన్నారు. తొమ్మిదో తగరతి విద్యార్థులు రాపాక అనిల్, రాపాక భాను, గోనమండ సురేంద్ర, ఏడో తరగతి విద్యార్థి రాపాక అనిల్ ప్రాణాలతో బయటపడ్డారు. అన్నదమ్ముల బిడ్డలు ప్రమాదంలో మరణించిన ప్రసన్నకుమార్, నతానియేల్ ఒకే అన్నదమ్ముల కుమారులు. ప్రసన్న కుమార్ తల్లిదండ్రులు ప్రసాద బాబు, మెర్సీ, నతానియేల్ తల్లిదండ్రులు ప్రభుకుమార్ సుజాత ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశంలో ఉంటున్నారు. గ్రామంలోని తాత ప్రభుదాసు వద్దే ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు. ప్రసాద్‌బాబుకు ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు ప్రసన్న కుమార్ మరణించాడు. ప్రభుకుమార్ ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు నతానియేల్ చనిపోయాడు. మనవల మృతితో తల్లడిల్లిన తాతయ్య తన మనవలు ప్రసన్నకుమార్, నతానియేల్ మరణించడంతో తాత ప్రభుదాసు విలవిల్లాడాడు. ఈ సంఘటనను జీర్ణించుకోలేక రోదిస్తున్న ప్రభుదాసును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. సముద్రం వద్ద మనవల మృతదేహాలను ఒళ్లో పెట్టుకుని ప్రభుదాసు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. తల్లిదండ్రులకు సమాచారం ఇజ్రాయిల్‌లో ఉంటున్న ప్రసన్నకుమార్, నతానియేల్ తల్లిదండ్రులకు బంధువుల సమాచారం అందించారు. వారు స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. మృతదేహాలను ఫ్రీజింగ్ బాక్సుల్లో ఉంచుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చింతమోరికి చెందిన రాపాక ఉత్తమ్‌కుమార్, కుమారి అందరితోమంచిగా ఉంటూ తమ కుమార్తెతో పాటు ఏకైక కుమారుడు వంశీని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తండ్రి దింపు తీస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భోజనం చేసి వెళ్లిన వంశీ.. శవమై రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. రాజోలు సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో ఎస్సై సాదిక్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రముఖుల పరామర్శ రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, ఎంపీటీసీ రాపాక యోహాన్ లక్ష్మీ కుమారి, గెడ్డం తులసీ భాస్కరరావు తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాజోలు కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
నాడు శిక్ష తప్పినా.. నేడు కక్ష కాటేసింది
ప్రత్తిపాడు : వారిద్దరూ బంధువులు. అంతేకాదు.. 24 ఏళ్ల కిందట ఒక హత్య కేసులో నిందితులు కూడా. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. చివరకు సుప్రీం కోర్టులో కేసు వీగిపోవడంతో బయటపడ్డారు. వారే మూడేళ్లుగా శత్రువులుగా మారారు. ఇంటి దారి విషయంపై వివాదం పగను రగిల్చింది.దాని ఫలితమే మంగళవారం గజ్జనపూడిలో చోటుచేసుకున్న దారుణ ఘటన. ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో బొబ్బిలి సత్యనారాయణ, అతడి ఇద్దరు కుమారులను గారా తాతాబ్బాయి వర్గీయులు పాశవికంగా చంపిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సత్యనారాయణ, తాతాబ్బాయిలు బంధువులే. వీరిద్దరు 1990లో ఒక హత్య కేసులో నిందితులు కాగా న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడంతో కేసు నుంచి బయట పడ్డారు.ఇంటిదారి విషయంలో మూడేళ్లుగా జరగుతున్న గొడవ ఈ ఘాతుకానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాతబ్బాయితో పాటు 12 మంది పథకం ప్రకారం కత్తులతో దాడిచేసి సత్యనారాయణ, అతడి ఇద్దరు కొడుకులు లక్ష్మీనారాయణ, అర్జుబాబులను హత్య చేశారు. మృతదేహాలకు బుధవారం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శవపరీక్ష నిర్వహించారు. హతుడు లక్ష్మీనారాయణ భార్య గంగాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు పోస్టుమార్టం కోసం బుధవారం సత్యనారాయణ, అతని ఇద్దరు కొడుకుల మృతదేహాలను గజ్జనపూడి నుంచి ప్రత్తిపాడు సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. మృతుల బంధువులు, భార్యాపిల్లలు అక్కడకు చేరుకున్నారు. సత్యనారాయణకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణకు భార్య గంగాభవాని, కుమార్తెలు శివదుర్గ, లోవలక్ష్మి (8వ తరగతి), కుమారుడు అయ్యప్పస్వామి (5వ తరగతి) ఉన్నారు. మూడో కుమారుడు అర్జుబాబుకు భార్య సత్యవతి, కుమార్తె సింధు (3), ఏడాది వయసున్న కనకారావు సంతానం. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాం పథకం ప్రకారం తన తండ్రి, సోదరులను హత్య చేశారని సత్యనారాయణ మిగిలిన ఇద్దరు కుమారులు వీరబాబు, త్రిమూర్తులు విలపించారు. కాలు దెబ్బతిన్న గేదెకు కట్టుకట్టే ప్రయత్నంలో ఉన్న తన తండ్రి, సోదరులను కత్తులతో నరికి హత్య చేశారని తెలిపారు. ఆ సమయంలో తాము సమీప పొలంలో గొర్రెలను మేపుతున్నామని, సంఘటన విషయం తెలిసిన వెంటనే తాము పారిపోయామన్నారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ వద్ద పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యుడు బుగతా బంగార్రాజు, రేచుకట్ల సింహాచలం, మానుకొండ లచ్చబాబు, టీడీపీ నాయకులు పర్వత సురేష్, పల్లా గోపి, కొమ్ముల కన్నబాబు, గజ్జనపూడి సర్పంచ్ శింగిడి వెంకటేష్, గొనగాల వెంకటరమణ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. రెండు దశాబ్దాల కిందట.. రెండు దశాబ్దాల క్రితం అంటే 1990లో... ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో భూముల స్వాధీన ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ సమయంలో బుగత బంగార్రాజు, పల్లా నూకరాజు తదితరులపై పోలీసులు టాడా కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. ఈ కేసులకు కారకుడుగా భావించి, గారా తాతబ్బాయి (నిందితుడు), బొబ్బిలి సత్యనారాయణ (హతుడు) తదితరులు గజ్జనపూడిలో మొల్లి అప్పారావు అనే వ్యక్తిని కత్తులు, బళ్లేలతో దాడి చేసి, హత్య చేశారు. ఆ సమయంలో పౌరహక్కుల నేత దివంగత కె.బాలగోపాల్ గజ్జనపూడి సందర్శించారు. ఈ కేసులో సత్యనారాయణ, తాతబ్బాయిలకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని హైకోర్టు కూడా ఖరారు చేసింది.సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుని, కేసు నుంచి బయటపడ్డారు. వారిద్దరి తరఫున ఈ కేసును పౌర హక్కుల ఉద్యమ నేత కేజీ కన్నాభిరాన్ వాదించారు. ఈ కేసులో తాతబ్బాయి, సత్యనారాయణ నాలుగేళ్ల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. పోస్టుమార్టం పూర్తి ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామంలో హత్యకు గురైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం పూర్తయ్యింది. గజ్జనపూడిలో మంగళవారం సాయంత్రం బొబ్బిలి సత్యనారాయణ, అతడి కొడుకులు లక్ష్మినారాయణ, అర్జుబాబులను గారా తాతబ్బాయి వర్గీయులు కత్తులతో దాడి చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోలీసులు బుధవారం ఉదయం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వాటికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు సూర్యనారాయణ, సుంకర మురళీమోహన్, ఎస్సై వై.రవికుమార్‌లు పోస్టుమార్టం పూర్తయ్యేవరకు సీహెచ్‌సీలోనే ఉన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్ సీహెచ్‌సీకి చేరుకుని, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చీకటిలో తెల్లారిన బతుకులు
పీఎన్‌కాలనీ, న్యూస్‌లైన్: అప్పటి వరకూ సంతోషంగా గడిపిన ఆ మిత్రులను రోడ్డు ప్రమాదం బలిగొంది. మూడు పదుల్లోనే నూరేళ్లు నిండి పోయాయి. వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాద వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం పట్టణంలో బలగ జంక్షన్లో బుర్ర రమేష్ (30), ఫ్రెండ్స్ ఫోటోస్టూడియా నిర్వహిస్తున్నాడు. బద్రి జగదీష్ (30), ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా, శ్రీను (28) పట్టణంలో ఎస్వీఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ యాజమాన్య ప్రతినిధిగా ఉన్నారు. మంగళవారం వారు ముగ్గురితో పాటు ఆమదాలవలస మండలం తోటాడకు చెందిన నూక శ్రీను కొత్తరోడ్డు సమీపంలోని దాబాకు వెళ్లారు. భోజనాలు ముగించుకుని రాత్రి 2 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రెల్లవీధికి చెందిన రమేష్, జగదీష్, శ్రీను అక్కడిక క్కడే మృతి చెందగా నూకశ్రీను గాయాల పాలయ్యాడు. బాధితుడి 108కి సమాచారం ఇవ్వడంతో, 108 అంబులెన్సలో వారిని రిమ్స్‌కు తరలించారు. రమేష్‌కు భార్య లలిత, కుమార్తె జ్ఞానేశ్వరి ఉన్నారు. జగదీష్‌కు భార్య దేవి, కుమారుడు చరణ్ ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదన ఓరి దేవుడా మా బిడ్డలు ఏం చేశారు.. నీకు దయలేదా.. అప్పుడే వీరికి నూరేళ్లు నిండిపోయాయా.. కొరివిపెట్టాల్సిన వారిని అర్ధంతరంగా తీసుకుపోయావా అంటూ మృతుల తల్లిదండ్రులు గట్టిగా విలపించారు. జగదీష్ మృతదేహాన్ని చూసిన భార్య దేవి కన్నీరుమున్నీరుగా విలపించింది. జీవితాంతం తోడుంటానని బాసచేసి వెళ్లిపోయావా, నాకు, నా బిడ్డకు ఇక దిక్కెవరు.. అంటూ రోదిస్తుంటే పలువురు కంట తడిపెట్టారు. తండ్రి మృతదేహం వద్ద ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్న మూడేళ్ల కుమారుడు చరణ్‌ను చూసి పలువురు కన్నీరు కార్చారు. రెల్లవీధిలో విషాదం పట్టణంలోని రెల్లవీధికి చెందిన ముగ్గురు యువకులు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పుడే తెలవారుతుండగా జగదీష్, శ్రీను, రమేష్‌లు మృతి చెందారన్న విషయం తెలియడంతో వీధి ఒక్కసారిగా గొల్లుమంది. ప్రమాదం ఎలా జరిగిందని ఒకరికొకరు ఆరా తీసుకుంటూ రిమ్స్ ఆసుపత్రికి కుటుంబాలు పరుగులు పెట్టాయి. అయితే నమ్మశక్యం కానీ రీతిలో తమ వీధికి చెందిన యువకుల మృతదేహాలు చూసి గొల్లుమన్నారు. లారీని గుర్తిస్తాం : డీఎస్పీ ప్రమాదానికి కారణమైన లారీని త్వరలో గుర్తిస్తామని అందుకు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మృతదేహాలను పరిశీలించారు. జాతీయ రహదారిపై లారీలు సరైన మార్గంలో వెళ్లేలా చూస్తామన్నారు. టోల్గేట్ల వద్దతనిఖీలను చేయిస్తున్నామని చెప్పారు. రాత్రింబగళ్లు దాబాలు తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృత్యువులోనూ వీడని స్నేహం మృతులు ముగ్గురితో పాటు గాయపడిన శ్రీను స్నేహితులు. చిన్ననాటి స్నేహితులైన వీరు ఏ విషయమైనా అందరూ చర్చించుకుని నిర్ణయించుకునేవారని బంధువులు చెబుతున్నారు. గొడవలు, తగవులు పడిన సందర్భం లేదని చెప్పారు. వివాహమైన తర్వాత ఆర్థికంగా ఎదిగేందుకు ఆలోచించేవారని చెప్పారు. వారి కలలను లారీ కాలరాచిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
విధి విడదీసింది...
వారిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకరిది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, మరొకరిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి. రాజకీయ నేతల స్వార్థం రాష్ట్రాల్ని విడదీసినా వారి స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. వేసవి సెలవుల్లో రెండు కుటుంబాలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాయి. కానీ... తిరుగు ప్రయాణంలో విధి వారిద్దరినీ విడదీసింది. ప్రత్తిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రత్తిపాడు, న్యూస్‌లైన్: ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద కాటూరి వైద్య కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైన జగ్గయ్యపేటకు చెందిన కుందేలు రవికిరణ్, సత్తుపల్లికి చెందిన దూదిపాళ్ల ప్రభు వేసవి సెలవుల్లో సకుటుంబసమేతంగా తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. ఈనెల 23వ తేదీ శుక్రవారం కుందేలు రవికిరణ్ తన కుటుంబసభ్యులైన తల్లి రాజ్యం, భార్య శ్రీదేవి, కుమార్తె గాయత్రి, కుమారుడు హవీష్, ప్రాణ స్నేహితుడు దూదిపాళ్ల ప్రభు, అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు యోజిత, చేతనలతో కలిసి మొత్తం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిదిమంది కారులో తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి బుధవారం సాయంత్రం జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాలకు సమీపంలో నిర్మించిన వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికిరణ్ (38)తో అతని తల్లి రాజ్యం (63), స్నేహితుడు ప్రభు కుమార్తె యోజిత (8) మృత్యువాత పడ్డారు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఒక కుటుంబం తల్లీ కొడుకును కోల్పోగా, మరో కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్నకూతురిని కోల్పోయింది. రవి ఎలా ఉన్నాడు... తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దూదిపాళ్ల ప్రభు భరించలేని గాయాల దెబ్బలను సైతం పంటిబిగువున భరిస్తూ, తన స్నేహితుడి యోగక్షేమాలను ఆరా తీయడం అందరిని కలిచివేసింది. స్ట్రెచర్‌పై చికిత్స పొందుతూనే తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులతో రవి ఎలా ఉన్నాడు.. వాడికేం ఇబ్బందిలేదుగా.. అంటూ అడిగాడు. తీవ్ర గాయాలతో బాధపడుతూ కూడా తన స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసిన వారు వారి స్నేహ బంధాన్ని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. అమ్మా.. ఒక్కసారి లేమ్మా.. కుందేలు రవికిరణ్, అతిని తల్లి రాజ్యం మృతిచెందారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు, బంధువులు ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని కాటూరి వైద్యశాల వద్దకు చేరుకున్నారు. మృతుల రక్తసంబంధీకురాలు (ఒకరికి కుమార్తె, ఒకరికి చెల్లి) భోరున విలపించారు. విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలపై పడి అమ్మా లేవే.. ఒక్కసారి నాతో మాట్లాడవే.. ఏమిటే ముఖంపై ఇన్ని దెబ్బలు నీకు.. ఎలా ఓర్చుకున్నావమ్మా.. అన్నా లే అన్నా.. ఒక్కసారి లే అన్నా.. అంటూ పెద్దపెద్దగా ఏడవడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా బంధువుల రోదనలతో మార్మోగింది. నొప్పులతో ఎగిరెగిరి పడుతూ.. ప్రమాదం బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలకు, కాళ్లకు, చెవులకు, చేతులతో పాటు పలు భాగాల వద్ద తీవ్ర గాయాలవడంతో నొప్పులు భరించలేక ఆ చిన్నారులు అల్లాడిపోయారు. వైద్య సిబ్బంది వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చిన్నారులు నొప్పులతో ఎగిరెగిరిపడుతూ ఎక్కిళ్లు పెట్టి ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది దేవుడా అంటూ విలపించారు, -
లారీని ఢీకొట్టిన ఆటో
ఫిరంగిపురం/ విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :ముందు వె ళుతున్న వాహనాన్ని దాటేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వచ్చిన లారీని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండలంలోని వేములూరిపాడు-ఫిరంగిపురం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం... ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామానికి చెందిన పానగంటి సుబ్బారావు, సుబ్బలక్ష్మమ్మ(40) దంపతులు తమ కుమార్తె లావణ్యని తీసుకుని వినుకొండకు చెందిన చిరుమామిళ్ల శ్రీని వాసరావు(30) ఆటోని బాడుగకు మాట్లాడుకుని గుంటూరు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. లావణ్యకు ఆరోగ్య పరీక్షలు ముగించుకొని తిరుగుప్రయాణమయ్యారు. ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు ఏటీ అగ్రహారంలో ఉం టున్న తన మేనల్లుడు మొగిలి రోహిత్‌కుమార్ (7)ను వేసవి సెలవులు కావడంతో వినుకొండ తీసుకువెళ్లేందుకు ఆటోలో ఎక్కించుకున్నాడు. వీరు ప్రయాణిస్తున్న ఆటో వేములూరిపాడు- ఫిరంగిపురం మధ్యలో ఉన్న బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు యత్నించాడు. అదే సమయంలో నరసరావుపేట వైపు నుంచి మిర్చిలోడుతో వస్తున్న ఐషర్ లారీని ఆటో ఢీకొట్టింది. పమాదలో ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు, అతని పక్కన కూర్చున్న సుబ్బలక్ష్మమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో వెనుక కూర్చున్న సుబ్బలక్ష్మమ్మ భర్త సుబ్బారావు, కుమార్తె లావణ్యలకు తీవ్రగాయాలయ్యాయి. ఆటోడ్రైవర్‌కు మరోపక్క కూర్చున్న రోహిత్‌కుమార్ ప్రమాదాన్ని గమనించి ఆటోలో నుంచి దూకేక్రమంలో రోడ్డుపై పడడంతో తల కు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తహశీల్దార్ బి.అనంతలక్ష్మి, ఎస్ఐ పి.ఉదయబాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 సిబ్బంది గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న రోహిత్‌కుమార్ మృతిచెందాడు. ఆటోలో చిక్కుకున్న ఇద్దరి మృతదే హాల ను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బంధువుల రోదనలు.. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ కుమార్తె లావణ్య అనారోగ్యానికి గురైంది. దీంతో లావణ్యకు వైద్య పరీక్షల నిమిత్తం నెలవారీ గుంటూరు తీసుకువస్తుంటారు. సోమవారం గుం టూరు ఆస్పత్రిలో చూపేందుకు తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ మృతిచెందడం, ఆమె భర్త సుబ్బారావు, కుమార్తె లావణ్యలు తీవ్రం గా గాయపడ్డారు. సంఘటనాస్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నం టాయి. ఇదే ప్రమాదంలో మృతిచెందిన ఆటోడ్రైవర్ శ్రీనివాసరావుది పిడుగురాళ్ళ కాగా.. వినుకొండ వచ్చి ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు మేనల్లుడు రోహిత్ వేసవి సెలవులు సరదాగా గడుపుదామని మేనమామ ఆటో ఎక్కి మృత్యువాత పడడం గమనార్హం! ఇద్దరూ మృతిచెందడంతో ఆ కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది. -
వడదెబ్బతో ముగ్గురి మృతి
సైదాపురం, న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు. మాజీ సర్పంచ్ మృతి సైదాపురం మండలంలో మర్లపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బీ రమణమ్మ(65) బుధవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. బుధవారం ఎండ తీవ్రరూపం దాల్చడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రమణమ్మ వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. వెంకటాచలంలో.. వెంకటాచలం: వెంకటాచలం మసీదు సెంటర్లో బుధవారం వడ దెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. బాధితుల కథనం మేరకు... షేక్ నూర్జహాన్ (65) కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఎండ తీవ్రతకు కుప్పకూలి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యయాదవ్, పి.ఖయ్యూమ్‌ఖాన్, నజీర్‌బాషా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. గూడూరులో.. గూడూరు: పట్టణంలోని గమళ్లపాళేనికి చెందిన సరోజనమ్మ(58) వడదెబ్బకు గురై మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు... మంగళవారం మైకా కంపెనీలో కూలీ పనికి వెళ్లిన సరోజనమ్మ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి చేరారు. అర్ధరాత్రి మృతి చెందింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా కారును నడపడంతో రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నీటిలో చిక్కుకున్న కారును బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కబళించిన మృత్యువు
ఆలమూరు, న్యూస్లూన్ :రహదారులపై నెత్తుటి మరకలు పడ్డాయి. ఆలమూరు మండలంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో తం డ్రీకొడుకులు ఉండడంతో వారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడికి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు నం ద్యాల ధనకృష్ణ(47), దుర్గాప్రసాద్ కలిసి మోటార్ బైక్‌పై వ్యక్తిగత పని కోసం బడుగువానిలంకకు వచ్చారు. తిరుగు ప్రయాణం లో చెముడులంక డివైడర్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి బైక్‌ను విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న కారు ఢీకొంది. ధనకృష్ణ అక్కడికక్కడే మరణించగా, దుర్గా ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు లు అతడిని ప్రైవేటు వాహనంపై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మడికిలో విషాదఛాయలు తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మడికిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ధనకృష్ణకు ముగ్గురు కుమారులుండగా, దుర్గాప్రసాద్ పెద్దవాడు. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, దుర్గాప్రసాద్ రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ కొత్తపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి సందర్శించారు. హైవేలోని చెముడులంక డివైడర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.నిర్మలతో ఆయన మాట్లాడారు. రెండు రోజుల్లో డివైడర్‌ను పరిశీలిస్తామని పీడీ నిర్మల హామీ ఇచ్చారు. ఆటో ఢీకొని మరొకరు.. ఆలమూరు-మండపేట రోడ్డులో సోమవారం ఆటో ఢీకొని ఓ వ్యక్తి మరణించారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన నోచర్ల కిట్టయ్య (30) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పని కోసం వెళ్లాడు. పని పూర్తయ్యాక మోటార్ బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలోకి వచ్చేసరికి అతడి బైక్‌ను ఆటో ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మండపేట సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో ఏఎస్సై ఈ.నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తం చిందిన రోడ్లు
జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భామిని మండలం బొడ్డగూడ వద్ద ట్రాక్టర్ బోల్తా ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందగా, ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తూ పలాస ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తులసికోటకు ఢీకొని ఓ యువకుడు తనువు చాలించాడు. భవన నిర్మాణ పని ముగించుకుని ఇంటికి వస్తున్న ఓ మహిళను లారీ రూపంలో మృత్యువు కబళించింది. బొడ్డగూడ(భామిని). న్యూస్‌లైన్: పెళ్లి పందిరికి అవసరమైన కర్రలు తెచ్చేందుకు కొండకు వెళ్లిన మండలంలోని బురజోల గ్రామానికి చెందిన గిరిజనుడు దుర్మరణం చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. భామిని మండలం బొడ్డగూడ ఘాటీ రోడ్డులో ట్రాక్టర్ బ్రేకులు పట్టకపోవడంతో బోల్తా పడింది. దీంతో కర్రలలోడుతో ఉన్న తొట్టెకింద ఉండిపోయిన బురజోలకు చెందిన గిరిజనుడు మిలగాం కృష్ణమూర్తి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ మిలగాం సుదర్శన్, ముచ్చర్ల కృష్ణమూర్తి, కోడూరు నూకయ్య, కలిశెట్టి మధుసూదన్, బిడ్డిక చంటి, అల్లు లోకేష్, కలిశెట్టి కేశవరావు, పత్తిక నూకయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కోడూరు నూకయ్య, ముచ్చర్ల కృష్ణమూర్తిలను శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. పత్తిక నూకయ్య, కేశవరావును పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బత్తిలి ఎస్ఐ సీహెచ్ రామారావు కృష్ణమూర్తి మృతదేహానికి శవపంచనామా జరిపి పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాద స్థలానికి భామిని, బురుజోల, అనంతగిరి తదితర గ్రామాలనుంచి మృతుడు, క్షతగాత్రుల బంధువులు చేరుకుని బోరున విలపించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బురజోల మాజీ సర్పంచ్ ప్రకాశరావు, పత్తిక సింహాచలం, సర్పంచ్ ప్రతినిధి సాకేటి రామారావు, బోగాపురపు అప్పలనాయుడులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులకు సహకరించారు. కొత్తూరులో ఆటో బోల్తా... కొత్తూరు: మండలంలోని కురిగాం మలుపు వద్ద ఆటో బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని పాటపాడులో నీలగిరి తోటలు కొట్టేందుకు మదనాపురానికి చెందిన కూలీలు వెళ్లారు. అక్కడ పనిలేకపోవడంతో తిరిగి వస్తుండగా కురిగాం మలుపు వద్ద ఆటో ఆదుపు తప్పి బోల్తాపడడంతో గురాన వెంకటరావు, కలవల గోపాలు, కూరాకుల చిన్నయ్య, బిడ్డిక నాగరాజులు గాయపడ్డారు. వీరిని 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ తలే రామారావు కేసునమోదు చేశారు. క్షతగాత్రులను కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులతోనిండిన కొత్తూరు ఆస్పత్రి.... కొత్తూరు, భామిని మండలాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో కొత్తూరు ప్రభుత్వాస్పత్రి నిండిపోయింది. క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటాయి. -
కుక్కలదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
తిరుపతి: కుక్కలదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఒకటి బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. -
బావిలో పడిన బస్సు: ముగ్గురు మృతి
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయూయి. ఈ దారుణ సంఘటన విరుదునగర్ జిల్లా రాజుపాళయంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరు నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆమ్నీ బస్సు తెల్లవారుజామున 5 గంటలకు రాజపాళయం చేరిం ది. అక్కడ 17 మంది ప్రయాణికులు దిగా రు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత మలుపును వేగంగా దాటబోయింది. మలుపులో రోడ్డుపక్కన కాలకృత్యాలు తీర్చుకుంటున్న ఆంటోని (55)ని ఢీకొట్టింది. దీంతోపాటు రాజపాళయం వైపు వెళుతున్న టౌన్ బస్సును ఢీకొట్టి సమీపంలో ఉన్న 50 అడుగుల లోతు బావిలో నిలువుగా పడిపోయింది. చిమ్మచీకట్లు కమ్ముకుని ఉండగా బస్సులోని ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. అకస్మాత్తుగా పెద్దశబ్దం కావడం తో అందరూ కళ్లు తెరిచి చూసి భయభ్రాం తులకు గురయ్యూరు. ప్రయాణికులంతా భయంతో హాహాకారాలు చేయగా స్థానికు లు వెంటనే పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. బావిలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ముగ్గురిని వెలుపలికి తీశారు. తీవ్రంగా గాయపడ్డ 9 మం దిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు బావి లో రెండు అడుగుల నీరుమాత్రమే ఉండటంతో మరింత ప్రాణనష్టం జరగలేదు. బస్సు డ్రైవర్ చిన్నసామి (35), ప్రయాణికుల్లో కోయంబత్తూరుకు చెందిన సుధన్ (34), తెన్కాశీకి చెందిన గణేశన్ (35) మృతి చెందారు. ఎందరినో మింగిన బావి భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలుండే ఈ మార్గంలో పంట పొలాలతోపాటూ పక్కనే ఈ పురాతన బావి ఉంది. 35 అడుగుల చుట్టుకొలత, 50 అడుగుల లోతు కలిగి ఉన్న ఈ బావికి రక్షణ గోడ లేదు. రోడ్డుపై ద్విచక్రవాహనాల్లో వెళ్లే వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదృష్టం బాగుం డి ఎవరైనా గమనించినా, పగటిపూట ప్రమాదం జరిగితే ఎవరోఒకరు రక్షిస్తుం టారు. లేనట్లయితే బావిలో పడిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న అధికారులుగానీ, స్థానికులు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చెరువులో పడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువకులు, మరో చిన్నారి ఉన్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి పంచాయతీ జయరాంతండాకు చెందిన ఓడిత్యావత్ రాజు(22) ఇస్లావత్ తులసీరాం(23) తండాలో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాన్ని తమ మిత్రులతో కలిసి ఆదివారం నిమజ్జనానికి తీసుకెళ్లారు. తండా సమీపంలోని దొంతుబావికుంటలో గణనాథున్ని నిమజ్జనం చేసే క్రమంలో చెరువులో పడ్డారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. ఎంతసేపటికీ బయటిరాలేదు. నిమజ్జనానికి తరలి వెళ్లిన తోటి మిత్రులు రాజు, తులసీరాం మృతిచెందారనే సమాచారాన్ని స్థానికులకు తెలియజేశారు. తండావాసులు గంటపాటు శ్రమించి మృతదేహాలను బయటకుతీశారు. రాజు హైదరాబాద్‌లోని ఓ క్యాంటిన్లో పనిచేస్తుండగా, తులసీరాం షాద్‌నగర్ పట్టణంలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ ఘటనతో జయరాంతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. చెరువులో పడి మరో బాలుడు దౌల్తాబాద్ : మండల కేంద్రంలోని అర్వకంత వీధిలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో శనివారం మధ్యాహ్నం నిమజ్జనం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి గ్రామానికి తలారిమల్లప్ప, మొగులమ్మల కొడుకు కృష్ణ(8) మిత్రులతో కలిసి వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తరువాత అందరు ఇళ్లకు చేరుకున్నారు. కృష్ణ మాత్రం రాత్రి 7 గం టలు దాటినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కలతచెందిన కుటుంబసభ్యులు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఆ బాలుడు చెరువులో మృతదేహమై కనిపించాడు. ఉదయం చేపల వేటకు వెళ్లిన కొందరు కృష్ణను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే మృతుని తల్లిదండ్రులు బతుకుదెరువుకు ముంబాయిలో ఉంటుండగా, కృష్ణమాత్రం అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ ఘటనతో దౌల్తాబాద్‌తో విషాదఛాయలు అలుముకున్నాయి.