కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా కారును నడపడంతో రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నీటిలో చిక్కుకున్న కారును బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.