
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న శరణమ్మతో పాటు ఆమె కూతుళ్లు వైశాలి (14), భవాని (12) మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంఘటన స్దలాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ పరిశీలించారు. అధికారులు విచారణ చేపట్టారు. భర్త మల్లప్ప ఆరుబయట పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ట్రంకు పెట్టెల్లో అవినీతి ‘ఖజానా’)
Comments
Please login to add a commentAdd a comment