house collapsed
-
మరీ.. ఇంత దారుణమా.. రాత్రికి రాత్రే కూల్చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘అర్ధరాత్రి మిడతల దండులా మా ఇళ్ల మీద పడ్డారు. ఇంట్లోవాళ్లని బయటకు లాగి, సామాన్లను బయటపడేసి ఇండ్లు కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలాగే ఉన్నాయి. ఇంటిలోపల ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఇళ్లు మొత్తం నేలమట్టం చేసి రోడ్డునపడేశారు. మేము ఎక్కడకు వెళ్లాలి.. మా ఉసురు తగులుతుంది’.. అని ఎర్రమంజిల్ వాసులు అధికారులపై దుమ్మెత్తిపోశారు. ఎర్రమంజిల్ రవీంద్రనికేతన్ పాఠశాల సమీపంలో ఉన్న సుమారు 30 ఇళ్లను మంగళవారం అర్ధరాత్రి వందలకొద్ది రెవెన్యూ, జీహెచ్ఎంపీ, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు వచ్చి కూల్చివేశారు. 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. ప్రభుత్వం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు కూడా ఇచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ప్రత్యామ్యాయం ఏమీ చూపకుండా ఎలా కూల్చేవేస్తారని అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం బాధితులంతా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నంండి సంబంధిత అధికారులందరికీ నోటీసులు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు వచ్చి అరగంటలో ఇండ్లు ఖాళీ చేయాలని కూల్చివేస్తామని వారికి చెప్పడంతో సమాచారం అందుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి అక్కడకు వచ్చి వారికి మద్దతుగా అక్కడే బైఠాయించించారు. సాయంత్రం వరకు అక్కడే ఆమె ఉన్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారి వందల కొద్ది పోలీసులు నలుగురు తహశీల్దార్లు, ఆర్డీవో, పెద్దెత్తున రెవెన్యూ అధికారులు అక్కడకు వచ్చి ప్రతీ ఇంట్లోకి వెళ్లడం అక్కడ కరెంట్ తీసేయ్యడం, ఇంట్లో ఉన్నవారిని బయటకు లాగి, చేతికి దొరికిన సామాన్లు బయటపడేసి రెండు జేసీబీలతో ఇండ్లు మొత్తం కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలానే ఇంట్లోనే కూరుకుపోయాయి. చాలా ఇండ్లల్లో పెట్టుకున్న ద్విచక్రవాహనాలు కూడా మట్టిలోనే కూరుకుపోయాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో అక్కడకు వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించించారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు, కొంతమంది బాధితులు, విజయారెడ్డి అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరీ.. ఇంత దారుణమా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మేము గాఢ నిద్రలో ఉన్నాము. తలుపులు తట్టగా బయటకు వచ్చేసరికి 40 మంది ఉన్నారు. బయటకు రావాలి.. ఇళ్లుకూల్చేస్తున్నామని ఒకరు మాట్లాడుతుంటేనే మరొకరు కరెంట్ కట్‌చేశారు. మరొకరు టార్చ్‌లైట్ తీసుకుని నన్ను బయటకు ఈడ్చేశారు. మా బాబు ఉన్నాడు అని చెబితే మరొకరు వెళ్లి ఐదునెలల తన బాబును తీసుకువచ్చి నా చేతిలో ఉంచి ఇల్లు కూల్చేశారు.మరీ ఇంత దారుణమా. – శిరీష కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు ఇంట్లో పెద్దవారి మందులు ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉన్నాయి వాటిని తీసుకుంటామన్నా వినలేదు. మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్యాయం చూపకుండా బయటకు గెంటేస్తే ఎలా జీవో 58 ప్రకారం మాకు పట్టా కూడా ఇచ్చారు. – మల్లీశ్వరి రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా కార్పొరేటర్ ఎర్రమంజిల్ కాలనీ రామకృష్ణానగర్‌లో ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పి.విజయారెడ్డిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరెస్టుచేసి స్టేషన్‌కు ఎస్ఆర్ నగర్ స్టేషన్‌తీసుకెళ్లారు. ఆమెను బుధవారం ఉదయం 10 గంటల తరువాత వదిలి పెట్టారు. మహిళ అని చూడకుండా తనను రాత్రంతా స్టేషన్లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు పరామర్శించారు. -
బాత్రూంలోనే నివాసం
పూడూరు: వారంపాటు కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఒక కుటుంబం స్నానాల గదినే నివాసంగా మార్చుకుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన కూలీలు గోనె కుమార్, కనకమ్మ దంపతులు కూతురితో కలిసి పురాతన ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు ఆ ఇల్లు కూలిపోయింది. దాని పునర్నిర్మాణానికి డబ్బుల్లేక బాత్రూంనే వారు నివాసంగా మార్చుకున్నారు. ఆరుబయట వంట చేసుకుంటున్నారు. వర్షం వస్తే పొరుగు వారిని ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. ఇల్లు కూలిన వెంటనే ఆధికారులు వచ్చి చూశారే తప్ప ఎలాంటి సహాయం అందించలేదని వాపోయారు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ కూతురు స్నేహ ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా రాత్రి గుడిసేలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భార్యభర్తలతో సహా నలుగురు పిల్లలు చనిపోయారు. కూతురు స్నేహకు తీవ్రగాయాలు కావటంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చదవండి: (ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు) -
కళ్ళముందే ఉంటున్న ఇల్లు కూలిపోతే?
-
విషాదం: వనపర్తిలో ఐదుగురు మృతి
సాక్షి, వనపర్తి: పండగ పూట జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా ఇంచార్జ్ , నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏసీపీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్సై రామన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి యజమాని ఆయిన్ కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించడంతో తద్దినానికి శనివారం నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమల్లు,మనుమరాళ్లు తమ ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి కుంటుంబ సభ్యులు మొత్తం పది మంది ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటి మిద్దె కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఒకే కుంటుంబానికి చెందిన చెవ్వా మనెమ్మ (68), చెవ్వా సుప్రజ(38), వైష్ణవి(21), రింకి(18) ,చెవ్వా ఉమాదేవి(38)గా పోలీసులు గుర్తించారు. -
మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి
-
పగిడ్యాలలో విషాద ఘటన
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న శరణమ్మతో పాటు ఆమె కూతుళ్లు వైశాలి (14), భవాని (12) మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంఘటన స్దలాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ పరిశీలించారు. అధికారులు విచారణ చేపట్టారు. భర్త మల్లప్ప ఆరుబయట పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ట్రంకు పెట్టెల్లో అవినీతి ‘ఖజానా’) -
కూలిన ఇల్లు,ఇద్దరు మృతి
-
రైల్వే కోడూరులో తప్పిన ప్రమాదం
-
నలుగురిని బలిగొన్న పాత మిద్దె
బెంగళూరు: ఆదమరచి నిద్రిస్తున్నవారిపై సొంత ఇల్లే కక్ష గట్టిందా అన్నట్లు విరుచుకుపడడంతో నాలుగు నిండుప్రాణాలు గాలిలో కలిశాయి. అందరికీ పక్కా ఇళ్లని ప్రభుత్వాలు ఊదరగొట్టడమే కానీ కట్టించడం లేదనే పాపాన్ని ఈ ఘోరం ఎండగట్టింది. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా రామజోగిహళ్లి గ్రామంలో ఘోర విషాదం సంభవించింది. రాత్రి నిద్రించినవారు నిద్రలోనే కన్నుమూశారు. మట్టి మిద్దె పైకప్పు కూలి తల్లి, ముగ్గురు పిల్లలు మరణించారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగింది. మృతురాలు నాగరత్నమ్మ(30), ఆమె కుమార్తెలు కోమల(2), యశస్విని (5), కుమారుడు తీర్థవర్ధన్ (6) ఘటన స్థలంలోనే మృతి చెందారు. భర్త చంద్రశేఖర్, అతని చెల్లెలి కుమార్తె దేవికకు తీవ్ర గాయాలై ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ వ్యవసాయ కూలి. రాత్రి అందరూ భోజనం చేసి ఇంట్లోనే నిద్రించారు. ఇల్లు పాతది కావడం, మట్టి బరువు తట్టుకోలేక పైకప్పు తడికలు, కలప తీర్లు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. పెద్ద శబ్ధానికి చుట్టు పక్కల వారు వచ్చి మట్టిని చేతులతోనే పక్కకు తీసి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. తల్లి, బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యా రు.మృతి చెందిన చిన్నారులను గ్రామస్తులు చూసి విలపించారు. -
వర్షానికి కూలిన ఇళ్లు
కుల్కచర్ల : మండల పరిధిలోని అంతారం పంచాయతీ పరిధిలోని బింద్యంగడ్డ తండాలో వారం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి మూడు ఇళ్లు కూలిపోయాయి. బింద్యం గడ్డ తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్, నీల్యనాయక్, శంకర్‌నాయక్‌ల మూడు ఇళ్లు కూలిపోయాయి, ఇళ్లు కూలడంతో ఉండటానికి ఇళ్లు లేకుండా అయిందని ప్రభుత్వం ఆదుకోని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. -
భర్త ఇచ్చిన ఇంటినే... ఎమ్మెల్యే కూల్చేయడమా?
శ్రీకాకుళం రూరల్: హిందూ సంప్రదాయం తెలిస్తే గ్రహణం రోజున కొన్ని కుటుంబాలను రోడ్డున నిలబెట్టేందుకు ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెగిస్తారా? అని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చిన ఇంటినే ఇప్పుడు కూల్చేయడానికి ఆమె అధికారులను పురమాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకు ళం నగరం శివారు చాపరం పంచాయతీ పరిధిలోని విశాఖ–బి కాలనీలో వైఎస్సార్సీపీ నాయకుడికి చెందిన భవంతిని కూల్చేయడానికి పంచాయతీ సిబ్బంది వెళ్లారు. అందులో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలంటూ హడావుడి చేశారు. గ్రహణం పూట వచ్చి ఇలా రోడ్డుపైకి వెళ్లమంటే ఎలాగంటూ ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ధర్మాన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, తహసీల్దారు మురళీకృష్ణతో మాట్లాడారు. ఇది ఎమ్మెల్యేకు తగునా? శ్రీకాకుళం నగరంలో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ధర్మాన తప్పుపట్టారు. పట్టా తీసుకొని కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవంతిని ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పక్షపాత చర్యలకు పాల్పడితే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 1996లో తంగి ఈశ్వరరావుకు అప్పటి ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన భార్య మాత్రం ఇప్పుడా విషయం తెలియకుండా కేవలం కక్ష సాధింపు కోసం భవనాలను కూల్చివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కళ్లెదుట బడ్జెట్ హోటల్ పక్కన భారీ కన్వెన్షన్ హాల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మిస్తున్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా? అని ప్రశ్నించారు. దేవాదాయ భూముల్లోనే అక్రమాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తాము వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు కన్వెన్షన్ హాల్ నిర్మాణాన్ని కూల్చి వేయండని సవాల్ విసిరారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు : డ్రైవర్ మృతి
తిరువొత్తియూరు: బస్సు ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలోడ్రైవర్ మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తిరుచ్చి జిల్లా తువరంకురిచ్చి సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నై నుంచి సెంగోట్టైకు సోమవారం రాత్రి ప్రభుత్వ బస్సు 12 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున తిరుచ్చి జిల్లా తువరంకురిచ్చి సమీపం సెవందంపట్టి నాలుగు రోడ్డు కూడలిలో వెళుతుండగా ఆ సమయంలో ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గణపతి అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటేశన్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న సుందరం, అతని భార్య సుందరి, వినోద్‌కుమార్‌లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన ముగ్గురిని తువరం కురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గణపతి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊరికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. -
జరిమానా చెల్లించలేదట...ఇల్లు ధ్వంసం చేశారు
కారేపల్లి: అతడికి పెద్ద మనుషులు జరిమానా విధించారు. అది చెల్లించలేదన్న ఆగ్రహంతో అతడి ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలో బుధవారం సాయంత్రం ఇది జరిగింది. ఈ కాలనీకి చెందిన కేసగాని బాలకృష్ణ, 20 ఏళ్ల క్రితం తన బంధువైన కొత్తగూడెం రామవరంలోని సింగరేణి ఉద్యోగి నుంచి రూ.30వేలకు కొంత భూమిని కొన్నాడు. రూ.20వేలు చెల్లించాడు. ఇంకా రూ.10వేలు బాకీ ఉన్నాడు. ఆ భూమిలో సిమెంట్ రేకుల ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాడు. బాలకృష్ణకు భూమిని అమ్మిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత వచ్చాడు. అంబేద్కర్ నగర్ కాలనీలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. బాలకృష్ణది తప్పుగా పెద్ద మనుషులు తేల్చారు. అప్పుటి బాకీ రూ.10వేలకుగాను మొత్తం లక్ష రూపాయలు జరిమానాగా చెల్లించాలని పెద్ద మనుషులు తీర్పునిచ్చారు. ఇది అన్యాయమని, తాను ఉంటున్నది వాస్తవానికి ప్రభుత్వ భూమి అని బాలకృష్ణ వాదించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టును ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. ‘‘జరిమానా చెల్లించకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తావా..?’’, తీవ్ర ఆగ్రహంతో గడ్డ పలుగులతో బాలకృష్ణ ఇంటిపై కొందరు దౌర్జన్యం చేశారు. ఇంటిని.. సామాన్లను ధ్వంసం చేశారు. బాలకృష్ణ, అతడి కుటుంబీకులు భయంతో కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తారు. ధ్వంసమైన ఇంటిని పోలీసులు పరిశీలించారు. -
పెంకుటిళ్లు కూలి భార్యాభర్తలు మృతి
-
కుప్పకూలిన భవనం; 9మంది మృతి
లక్నో: శిథిలావస్థకు చేరిన ఓ భవనం కుప్పకూలిపోయిన ఘటనలో 9 మంది మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాకు 200 కిలోమీటర్ల దూరంలో గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 12మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే భవనం శిథిలావస్థకు చేరిందంటూ తాము స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్య తీసుకోలేదంటూ అక్కడి స్థానికులు ఆరోపించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ఇల్లు కూలి తండ్రి, కూతురు దుర్మరణం
ములుగు (మెదక్) : రోడ్డు విస్తరణ పనులు ఇద్దరిని బలి తీసుకున్నాయి. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలో ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా... ఓ ఇంటి ముందు భాగం కూలిపోవడంతో ఆ ఇంటి యజమాని, అతని కూతురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఎండీ గౌస్‌మియా, అతని కూతురు జలాల్ రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న ఇంట్లో కిరాణా షాపు నడుపుకుంటూ అందులోనే నివసిస్తున్నారు. కాగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ఇంటి ముందు కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉంది. దీంతో ముందు భాగంలో ఉన్న సామాగ్రిని గౌస్‌మియా, జలాల్ తీస్తున్నారు. ఇంతలోనే జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఇంటికి తగిలించడంతో ఆ ఇల్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. గౌస్‌మియా, జలాల్పై శిధిలాలు పడిపోవడంతో వారు అక్కడే ప్రాణాలు విడిచారు. -
ఈదురుగాలులకు ఇల్లు కూలి రైతు దుర్మరణం
లింగాలఘణపురం(వరంగల్): బలమైన ఈదురు గాలులకు పొలంలో ఉన్న ఇల్లు కూలి ఓ రైతు మృతి చెందాడు. మరో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వరంగల్ జిల్లా లింగాల ఘణపురం మండలం పటేల్‌గూడెంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానిక రైతుల కథనం ప్రకారం... అనుముల మల్లయ్య(65) లింగాలఘణపురం మండలానికి చెందిన ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని వంగ తోట సాగు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పొలంలో ఉండగా ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు, వర్షం వచ్చాయి. దీంతో ఆయన సమీపంలోని నకిరెడ్డి యాదయ్య కొట్టం వద్దకు వచ్చాడు. ఇద్దరూ ఆ కొట్టంలోనే తలదాచుకున్నారు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడంతో కొట్టం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. రేకులు వేసిన సిమెంట్ స్తంభాలతో పాటు కొట్టంలోని కణి (రాతి స్తంభం) విరిగి మల్లయ్య తలపై పడింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడే మృతి చెందాడు. యాదయ్య స్వల్పంగా గాయపడ్డాడు. -
మిద్దె కూలి 30 మందికి గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండలో మిద్దె కూలీ 30 మంది గాయపడగా , పదిమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామంలో జరిగే జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటాన్ని చూసేందుకు అంగిడి శేఖర్ అనే వ్యక్తి ఇంటిపైకి గ్రామస్తులు ఎక్కారు. దీంతో మిద్దె కూలీ 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. (కోడుమూరు) -
గోడకూలి 16 ఏళ్ల బాలిక మృతి