
బెంగళూరు: ఆదమరచి నిద్రిస్తున్నవారిపై సొంత ఇల్లే కక్ష గట్టిందా అన్నట్లు విరుచుకుపడడంతో నాలుగు నిండుప్రాణాలు గాలిలో కలిశాయి. అందరికీ పక్కా ఇళ్లని ప్రభుత్వాలు ఊదరగొట్టడమే కానీ కట్టించడం లేదనే పాపాన్ని ఈ ఘోరం ఎండగట్టింది. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా రామజోగిహళ్లి గ్రామంలో ఘోర విషాదం సంభవించింది. రాత్రి నిద్రించినవారు నిద్రలోనే కన్నుమూశారు. మట్టి మిద్దె పైకప్పు కూలి తల్లి, ముగ్గురు పిల్లలు మరణించారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగింది. మృతురాలు నాగరత్నమ్మ(30), ఆమె కుమార్తెలు కోమల(2), యశస్విని (5), కుమారుడు తీర్థవర్ధన్ (6)
ఘటన స్థలంలోనే మృతి చెందారు. భర్త చంద్రశేఖర్, అతని చెల్లెలి కుమార్తె దేవికకు తీవ్ర గాయాలై ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ వ్యవసాయ కూలి. రాత్రి అందరూ భోజనం చేసి ఇంట్లోనే నిద్రించారు. ఇల్లు పాతది కావడం, మట్టి బరువు తట్టుకోలేక పైకప్పు తడికలు, కలప తీర్లు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. పెద్ద శబ్ధానికి చుట్టు పక్కల వారు వచ్చి మట్టిని చేతులతోనే పక్కకు తీసి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. తల్లి, బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యా రు.మృతి చెందిన చిన్నారులను గ్రామస్తులు చూసి విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment