ములుగు (మెదక్) : రోడ్డు విస్తరణ పనులు ఇద్దరిని బలి తీసుకున్నాయి. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలో ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా... ఓ ఇంటి ముందు భాగం కూలిపోవడంతో ఆ ఇంటి యజమాని, అతని కూతురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఎండీ గౌస్మియా, అతని కూతురు జలాల్ రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న ఇంట్లో కిరాణా షాపు నడుపుకుంటూ అందులోనే నివసిస్తున్నారు.
కాగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ఇంటి ముందు కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉంది. దీంతో ముందు భాగంలో ఉన్న సామాగ్రిని గౌస్మియా, జలాల్ తీస్తున్నారు. ఇంతలోనే జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఇంటికి తగిలించడంతో ఆ ఇల్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. గౌస్మియా, జలాల్పై శిధిలాలు పడిపోవడంతో వారు అక్కడే ప్రాణాలు విడిచారు.
ఇల్లు కూలి తండ్రి, కూతురు దుర్మరణం
Published Tue, Jun 23 2015 5:06 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement