
ఇంటిని ఢీకొన్న బస్సు
తిరువొత్తియూరు: బస్సు ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలోడ్రైవర్ మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తిరుచ్చి జిల్లా తువరంకురిచ్చి సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నై నుంచి సెంగోట్టైకు సోమవారం రాత్రి ప్రభుత్వ బస్సు 12 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున తిరుచ్చి జిల్లా తువరంకురిచ్చి సమీపం సెవందంపట్టి నాలుగు రోడ్డు కూడలిలో వెళుతుండగా ఆ సమయంలో ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది.
ఈ ఘటనలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గణపతి అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటేశన్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న సుందరం, అతని భార్య సుందరి, వినోద్‌కుమార్‌లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన ముగ్గురిని తువరం కురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గణపతి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊరికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment