ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి.. 28 మందికి గాయాలు
కామారెడ్డిలో ఘటన
ఆదిలాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 28 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరింది.
మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి సమీపంలోకి రాగానే క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆదిలాబాద్‌లోని అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన అఫ్సర్‌ఖాన్ (25) మృతి చెందగా, మరో 28 మందికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ షేక్ రఫీక్‌తోపాటు మరో ప్రయాణికుడు మోబీన్‌కు తీవ్ర గాయాలుకాగా వైద్యులు నిజామాబాద్‌కు రిఫర్ చేశారు. గాయాలపాలైన వారంతా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన వారే. అఫ్సర్‌ఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment