ఈదురుగాలులకు ఇల్లు కూలి రైతు దుర్మరణం | house collapsed by heavy winds, farmer died | Sakshi
Sakshi News home page

ఈదురుగాలులకు ఇల్లు కూలి రైతు దుర్మరణం

Published Sat, May 2 2015 10:07 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

house collapsed by heavy winds, farmer died

లింగాలఘణపురం(వరంగల్): బలమైన ఈదురు గాలులకు పొలంలో ఉన్న ఇల్లు కూలి ఓ రైతు మృతి చెందాడు. మరో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వరంగల్ జిల్లా లింగాల ఘణపురం మండలం పటేల్‌గూడెంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానిక రైతుల కథనం ప్రకారం... అనుముల మల్లయ్య(65) లింగాలఘణపురం మండలానికి చెందిన ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని వంగ తోట సాగు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పొలంలో ఉండగా ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు, వర్షం వచ్చాయి.

 

దీంతో ఆయన సమీపంలోని నకిరెడ్డి యాదయ్య కొట్టం వద్దకు వచ్చాడు. ఇద్దరూ ఆ కొట్టంలోనే తలదాచుకున్నారు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడంతో కొట్టం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. రేకులు వేసిన సిమెంట్ స్తంభాలతో పాటు కొట్టంలోని కణి (రాతి స్తంభం) విరిగి మల్లయ్య తలపై పడింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడే మృతి చెందాడు. యాదయ్య స్వల్పంగా గాయపడ్డాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement