
పూడూరు: వారంపాటు కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఒక కుటుంబం స్నానాల గదినే నివాసంగా మార్చుకుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన కూలీలు గోనె కుమార్, కనకమ్మ దంపతులు కూతురితో కలిసి పురాతన ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు ఆ ఇల్లు కూలిపోయింది.
దాని పునర్నిర్మాణానికి డబ్బుల్లేక బాత్రూంనే వారు నివాసంగా మార్చుకున్నారు. ఆరుబయట వంట చేసుకుంటున్నారు. వర్షం వస్తే పొరుగు వారిని ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. ఇల్లు కూలిన వెంటనే ఆధికారులు వచ్చి చూశారే తప్ప ఎలాంటి సహాయం అందించలేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment