రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
మృతులు కడప వాసులు
మరో తొమ్మిది మందికి గాయాలు
సుమో టైర్ పగలడంతో ఘటన
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స
ఆమె దేశ సరిహద్దులు దాటి వెళ్తోంది..మళ్లీ ఎన్నాళ్లకు వస్తుందో తెలియదు.. దీంతో కుటుంబ సభ్యులంతా వీడ్కోలు చెప్పేందుకు సుమోలో బయలుదేరారు.. పిల్లలు సైతం వారి వెంట సందడి చేస్తూ కదిలారు.. వారి ప్రయాణంలో ఎన్నెన్నో విషయాలు బయటకి వచ్చాయి.. ఒకరికొకరు జాగ్రత్తలూ చెప్పుకున్నారు. అయితే కర్నూలు సమీపానికి రాగానే ఉన్నట్టుండి...పెద్ద శబ్ధంతో టైర్ పేలింది..క్షణాల్లో సమో పల్టీలు కొట్టి బోల్తాపడింది..అప్పటి వరకు సందడి చేస్తూ సాగిన వారి ప్రయాణం రోదనలతో మిన్నంటింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా ఓ యువతి, ఓ చిన్నారి చికిత్స పొందుతూ తనువు చాలించారు.
ఓర్వకల్లు : టాటా సుమో బోల్తా పడి ముగ్గురు మృతిచెందగా పది మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం నన్నూరు గ్రామ సమీపంలోని కర్నూలు-చిత్తూరు 18వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కడప నగరానికి చెందిన ప్రభావతి అనే మహిళ కువైట్‌కు వెళ్తోంది. ఆమెను హైదరాబాద్‌లో విమానం ఎక్కించేందుకు ఆమె భర్త జ్యోతి ప్రతాప్‌తో పాటు సమీప బంధువులు ఏపీ31 టీవీ 2642 నంబర్ గల టాటా సుమో వాహనలో బయల్దేరారు.
ఉదయం 10 గంటలకు కడపలో బయలుదేరిన వారి వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. మరో పది నిమిషాల్లో కర్నూలుకు చేరుకుటుందనగా.. నన్నూరు సమీపాన ఆ వాహనం వెన చక్రం పగిలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన గల కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివప్రసాద్, జ్యోత్స్నల కుమారుడు లక్కీ(6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిరీష(26), లవ్లీ(మూడేళ్ల పాప) మృతి చెం దారు. ప్రభావతి, వరకుమార్, సోనీలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ లక్ష్మీనారాయణ, గంగినిపల్లె చిన్న, జ్యోత్స్న, దేవకుమారి, హర్షిత, రవిచరణ్ అనే వ్యక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి. వీరంతా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీడ్కోలు చెప్పేందుకు వెళ్తూ..
Published Sun, Jun 7 2015 5:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement