లారీని ఢీకొట్టిన ఆటో
ఫిరంగిపురం/ విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :ముందు వె ళుతున్న వాహనాన్ని దాటేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వచ్చిన లారీని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండలంలోని వేములూరిపాడు-ఫిరంగిపురం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం... ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామానికి చెందిన పానగంటి సుబ్బారావు, సుబ్బలక్ష్మమ్మ(40) దంపతులు తమ కుమార్తె లావణ్యని తీసుకుని వినుకొండకు చెందిన చిరుమామిళ్ల శ్రీని వాసరావు(30) ఆటోని బాడుగకు మాట్లాడుకుని గుంటూరు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
లావణ్యకు ఆరోగ్య పరీక్షలు ముగించుకొని తిరుగుప్రయాణమయ్యారు. ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు ఏటీ అగ్రహారంలో ఉం టున్న తన మేనల్లుడు మొగిలి రోహిత్‌కుమార్ (7)ను వేసవి సెలవులు కావడంతో వినుకొండ తీసుకువెళ్లేందుకు ఆటోలో ఎక్కించుకున్నాడు. వీరు ప్రయాణిస్తున్న ఆటో వేములూరిపాడు- ఫిరంగిపురం మధ్యలో ఉన్న బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు యత్నించాడు. అదే సమయంలో నరసరావుపేట వైపు నుంచి మిర్చిలోడుతో వస్తున్న ఐషర్ లారీని ఆటో ఢీకొట్టింది.
పమాదలో ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు, అతని పక్కన కూర్చున్న సుబ్బలక్ష్మమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో వెనుక కూర్చున్న సుబ్బలక్ష్మమ్మ భర్త సుబ్బారావు, కుమార్తె లావణ్యలకు తీవ్రగాయాలయ్యాయి. ఆటోడ్రైవర్‌కు మరోపక్క కూర్చున్న రోహిత్‌కుమార్ ప్రమాదాన్ని గమనించి ఆటోలో నుంచి దూకేక్రమంలో రోడ్డుపై పడడంతో తల కు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తహశీల్దార్ బి.అనంతలక్ష్మి, ఎస్‌ఐ పి.ఉదయబాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 సిబ్బంది గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న రోహిత్‌కుమార్ మృతిచెందాడు. ఆటోలో చిక్కుకున్న ఇద్దరి మృతదే హాల ను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బంధువుల రోదనలు..
గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ కుమార్తె లావణ్య అనారోగ్యానికి గురైంది. దీంతో లావణ్యకు వైద్య పరీక్షల నిమిత్తం నెలవారీ గుంటూరు తీసుకువస్తుంటారు. సోమవారం గుం టూరు ఆస్పత్రిలో చూపేందుకు తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ మృతిచెందడం, ఆమె భర్త సుబ్బారావు, కుమార్తె లావణ్యలు తీవ్రం గా గాయపడ్డారు. సంఘటనాస్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నం టాయి. ఇదే ప్రమాదంలో మృతిచెందిన ఆటోడ్రైవర్ శ్రీనివాసరావుది పిడుగురాళ్ళ కాగా.. వినుకొండ వచ్చి ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు మేనల్లుడు రోహిత్ వేసవి సెలవులు సరదాగా గడుపుదామని మేనమామ ఆటో ఎక్కి మృత్యువాత పడడం గమనార్హం! ఇద్దరూ మృతిచెందడంతో ఆ కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.