జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు.
సైదాపురం, న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు.
మాజీ సర్పంచ్ మృతి
సైదాపురం మండలంలో మర్లపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బీ రమణమ్మ(65) బుధవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. బుధవారం ఎండ తీవ్రరూపం దాల్చడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రమణమ్మ వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది.
వెంకటాచలంలో..
వెంకటాచలం: వెంకటాచలం మసీదు సెంటర్‌లో బుధవారం వడ దెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. బాధితుల కథనం మేరకు... షేక్ నూర్జహాన్ (65) కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఎండ తీవ్రతకు కుప్పకూలి మృతి చెందింది.
ఈ విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యయాదవ్, పి.ఖయ్యూమ్‌ఖాన్, నజీర్‌బాషా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
గూడూరులో..
గూడూరు: పట్టణంలోని గమళ్లపాళేనికి చెందిన సరోజనమ్మ(58) వడదెబ్బకు గురై మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు... మంగళవారం మైకా కంపెనీలో కూలీ పనికి వెళ్లిన సరోజనమ్మ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి చేరారు. అర్ధరాత్రి మృతి చెందింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.