దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రానురాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు.
ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలిగొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మేజిస్ట్రేట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్‌లలో నమోదయ్యిందన్నారు.
During the last 72 hours, 99 alleged sun stroke death cases have been reported by the Collectors. Out of 99 alleged cases, 20 cases have been confirmed by the Collectors. During this summer, total 141 alleged sun stroke death cases have been reported by the Collectors out of… pic.twitter.com/bWXsiaFA3F
— ANI (@ANI) June 3, 2024
Comments
Please login to add a commentAdd a comment