ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి | Truck overturns in Odisha, 9 kabaddi players dead | Sakshi
Sakshi News home page

ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి

Published Sun, Sep 20 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి

ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి

రూర్కెలా: ఒడిశాలో సుందర్గఢ్ జిల్లా లాహునిపరా - బహర్పోసి రహదారిపై ఆదివారం విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆటగాళ్లలో వెళ్తున్న మినీ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ఆటగాళ్లు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయప్డడారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా... మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. దుడిగాంలో వీరంతా టోర్నమెంట్లో పాల్గొని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఈ నేపథ్యంలో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం రూర్కెలా తరలిస్తున్నట్లు చెప్పారు.

మరణించిన వారిని గుర్తించినట్లు చెప్పారు. మరో రెండు మృతదేహాలను గుర్తించవలసి ఉందన్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement