kabaddi players
-
సూర్యపేటలో తెలుగు టైటాన్స్ ప్లేయర్ల సందడి
సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువులో తెలుగు టైటాన్స్ కబడ్డీ క్రీడాకారులు సందడి చేశారు. మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక ఫ్రెండ్స్ యూత్ «ఆధ్వర్యంలో మేళ్లచెరువులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. కాగా ఈ పోటీల్లో ప్రో కబడ్డీ జట్టు సభ్యులు తెలుగు టైటన్స్ కెప్టెన్ సిద్ధార్ద్ దేశ్రాయ్, మోనుగోయత్, మల్లికార్జున్, ఆశీష్సింగ్ పాల్గొని సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం
లక్నో: కబడ్డీ ఆటగాళ్ల కోసం మరుగుదొడ్డిలో ఆహారాన్ని భద్రపర్చడం, గత్యంతరం లేని స్థితిలో అక్కడే వాళ్లు వడ్డించుకోవడం లాంటి ఘోర పరిస్థితులతో ఉన్న వీడియో వైరల్ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అధికారులు సైతం స్పందించారు. ఉత్తర ప్రదేశ్ షాహారన్‌పూర్‌లో ఈమధ్య అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. అయితే.. టాయిలెట్ గదుల్లో భద్రపర్చిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 16వ తేదీన కొందరు అమ్మాయిలే ఈ వీడియోను రిలీజ్ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. టాయ్లెట్లో ఓ పక్కన ఉన్న పాత్రల నుంచి అన్నం, కూరలతో పాటు అక్కడి నేలపై ఓ పేపర్ ముక్కపై నుంచి పూరీలను అమ్మాయిలు వడ్డించుకుంటున్నారు. ఆ భోజనాన్ని తీసుకుని బయట ఆహారం వండిన స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లి వాళ్లు తింటున్నారు. నిమిషం నిడివి ఉన్న వీడియోలో అక్కడి పరిస్థితులు ఘోరంగా కనిపించాయి. In UP's Saharanpur, video of players attending the state level girl's U-16 Kabaddi tournament being served food kept on the floor of toilet at the sports stadium has surfaced. Video by @sachingupta787 pic.twitter.com/12dYRlMofH — Piyush Rai (@Benarasiyaa) September 20, 2022 ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో షాహారన్‌పూర్ క్రీడాఅధికారి అనిమేష్ సక్సేనా స్పందించారు. స్టేడియం వద్ద నిర్మాణ పనులు సాగుతున్నాయి. పైగా ఆ సమయంలో వర్షం పడింది. అందుకే స్విమ్మింగ్ పూల్ వద్ద వంటలు చేయించాం. అయితే ఆహారాన్ని భద్రపరిచింది బట్టలు మార్చుకునే రూంలో అని ఆయన వెల్లడించారు. పాయిఖానాలో ఆహారాన్ని ఉంచిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే.. వీడియో ఆధారంగా ఏర్పాట్లపై మండిపడుతున్నారు చాలామంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. అధికారులపై వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కానిస్టేబుల్ సుధా హత్యకేసులో కీలక మలుపు -
రోజా కూతకు రాగానే మారుమోగిపోయిన స్టేడియం
-
చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్
-
చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్
చెన్నై : తెలంగాణకు చెందిన కబడ్డీ ఆటగాళ్లను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కబడ్డీ మ్యాచ్ ఆడేందుకు పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ ఆటగాళ్లు తిరుగు ప్రయాణంలో భాగంగా చెన్నైకి చేరుకున్నారు. అక్కడ కోచ్‌తో కలిసి కొందరు ఆటగాళ్లు అన్నా సలై నుంచి ఎగ్మోర్ వెళ్లేందుకు 29ఏ నెంబర్ బస్సు ఎక్కారు. అయితే టికెట్ తీసుకునే సమయంలో బస్సు కండక్టర్‌తో కబడ్డీ కోచ్ లక్ష్మణ్‌కు మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఎగ్మోర్‌లో కబడ్డీ ఆటగాళ్లు బస్సు దిగిన సమయంలో వారిపై కండక్టర్ దాడికి యత్నించాడు. కండక్టర్‌కు మద్ధతుగా స్థానికులు కూడా కోచ్ లక్ష్మణ్‌తోపాటు ఆటగాళ్లపై దాడి చేశారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కోచ్‌తో పాటు కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీశారు. కబడ్డీ కోచ్ అనుచిత ప్రవర్తనతో ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తొలుత లక్ష్మణ్ కండక్టర్‌పై దాడికి పాల్పడినట్టుగా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో తమ తప్పేమిలేదని తెలంగాణ ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్కోసారి ఆటలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి. చిన్న గొడవలు కాస్తా చినికి చినికి గాలివానలా మారుతాయి. చివరికి నిండు ప్రాణాన్ని తీస్తాయి. దేశ రాజధానిలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో స్కోర్ విషయంలో ఇరు జట్ల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఢిల్లీలోని దక్షిణ్‌పురి ప్రాంతంలో ఆదివారం రాత్రి కబడ్డీ మ్యాచ్ జరుగుతుండగా.. ఇరు జట్ల మధ్య స్కోర్ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అవినాష్ (18) అనే యువకుడిపై ప్రత్యర్థి జట్టుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అవినాష్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే బాధితుడిని సమీపంలోని బాత్ర ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి
రూర్కెలా: ఒడిశాలో సుందర్‌గఢ్ జిల్లా లాహునిపరా - బహర్పోసి రహదారిపై ఆదివారం విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆటగాళ్లలో వెళ్తున్న మినీ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ఆటగాళ్లు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయప్డడారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా... మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. దుడిగాంలో వీరంతా టోర్నమెంట్లో పాల్గొని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఈ నేపథ్యంలో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం రూర్కెలా తరలిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారిని గుర్తించినట్లు చెప్పారు. మరో రెండు మృతదేహాలను గుర్తించవలసి ఉందన్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.