సూర్యపేటలో తెలుగు టైటాన్స్‌ ప్లేయర్ల సందడి | Telugu Titans Players Attend Mellacheruvu Jatara In Suryapet District | Sakshi
Sakshi News home page

Telugu Titans: సూర్యపేటలో తెలుగు టైటాన్స్‌ ప్లేయర్ల సందడి

Feb 22 2023 7:44 AM | Updated on Feb 22 2023 7:55 AM

Telugu Titans Players Attend Mellacheruvu Jatara In Suryapet District - Sakshi

సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువులో తెలుగు టైటాన్స్‌ కబడ్డీ క్రీడాకారులు సందడి చేశారు. మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక ఫ్రెండ్స్‌ యూత్‌ «ఆధ్వర్యంలో మేళ్లచెరువులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. కాగా ఈ పోటీల్లో ప్రో కబడ్డీ జట్టు సభ్యులు తెలుగు టైటన్స్‌ కెప్టెన్‌ సిద్ధార్ద్‌ దేశ్‌రాయ్, మోనుగోయత్, మల్లికార్జున్, ఆశీష్‌సింగ్‌ పాల్గొని సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement