సెల్ఫీ అడిగిన యువకుడితో ఘర్షణ
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో అఘోరీ హల్‌చల్ చేసింది. శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి నుంచి వేములవాడకు వెళ్తూ మార్గమధ్యంలో ఉండ్రుగొండ గ్రామ శివారులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆర్చి వద్ద భోజనం చేసేందుకు ఆగింది. పలువురు ఆమెను ఫొటోలు తీస్తుండటంతో తనను ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వారిపై దాడికి ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను కొట్టారు.
ఆమె తన కారులో ఉన్న తల్వార్ తీసి గొడవ చేసింది. గ్రామస్తులు సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెకు నచ్చజెప్పి గ్రామం నుంచి తీసుకువచ్చారు. రాత్రి ఖాసీంపేట గ్రామ శివారులో తన కారులోనే నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున టిఫిన్ చేయడానికి వెళ్లడంతో ఓ యువకుడు ఆమెను సెల్ఫీ అడగడంతో అతడిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహేశ్వర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment