naga sadhus
-
నాగా సాధువులు కుంభమేళాలోనే ఎందుకు కనిపిస్తారు? కారణమిదే..
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే కుంభమేళా 2025, జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానుంది. కుంభమేళా సమయంలో నాగా సాధువులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇంతకీ నాగా సాధువుల ప్రత్యేకత ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? కుంభమేళాకు ఎందుకు తరలివస్తారు?నాగా సాధువులు హిందూ ధర్మంలోని సాధువుల తరగతికి చెందినవారు. వీరిని తపోధనులని కూడా అంటారు. వీరు నగ్నంగా జీవనం సాగిస్తారు. వీరు యుద్ధ కళలో ప్రవీణులుగా గుర్తింపు పొందారు. కఠినమైన తపస్సు, పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనలతో వీరు నిత్య జీవనం సాగిస్తుంటారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు వీరు తరలివస్తుంటారు. వీరిని చూసేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు. సమాజానికి దూరంగా ఉంటామని ప్రమాణంనాగా సాధువులు నిత్యం ధాన్యంలో ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటామని భగవంతుని ముందు ప్రమాణం చేస్తారు. అందుకే వారు జనావాసాలకు దూరంగా ఏకాంతంగా జీవిస్తుంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వారు బయటకు వస్తుంటారు. ఈ సందర్భంగా నాగా సాధువులు వారిలో వారు కలుసుంటారు. తమ అనుభవాలను, ఆలోచనలను పరిస్పరం పంచుకుంటారు. దీనికి వారు కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. కుంభమేళా సందర్భంగా నాగా సాధువులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాగే వారు భక్తులకు జ్ఞానబోధ చేస్తారు. తమ తపఃశక్తులను ప్రదర్శిస్తుంటారు.ఆకాశమే తమ దుస్తులుగా భావిస్తూ..నాగా సాధువులు నగ్నంగా ఉంటారు. ఆకాశామే తమ దుస్తులుగా భావిస్తారు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నాగా సాధువులకు బాగా తెలుసు. చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. నిరాహారులుగా ఉంటూ కఠినమైన తపస్సు ఆచరిస్తారు. శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారికి జునా అఖారా, నిరంజని అఖారా మొదలైన అఖారాలతో సంబంధం ఉంటుంది. కుంభమేళా తర్వాత వీరు తిరిగి తమ నివాసస్థానాలైన అడవులు, కొండలకు చేరుకుంటారు.మహాకుంభమేళాకు పురాతన చరిత్రకుంభమేళా సందర్భంగా గంగా, యమున సరస్వతి సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం సుదూర తీరాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. మహాకుంభమేళా పురాణకాలం నాటిదని చెబుతారు. అమృత కలశం కోసం దేవతలు- రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు, నాలుగు అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా అంటారు.మహాకుంభమేళా జరిగే పుణ్యదినాలుమొదటి పుణ్య స్నానం- జనవరి 13(పుష్య పూర్ణిమ)రెండవది- జనవరి 14 (మకర సంక్రాంతి మూడవది- జనవరి 29(మౌని అమావాస్య) నాల్గవది- ఫిబ్రవరి 3(వసంత పంచమి) ఐదవది-ఫిబ్రవరి 12 ( మాఘ పూర్ణిమ) చివరిది- ఫిబ్రవరి 26(మహాశివరాత్రి)ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
శ్రీకాళహస్తి ఆలయం వద్ద అఘోరీ హల్ చల్
-
కుంభమేళాలో కరోనా: రెండుగా చీలిన సాధువులు
సాక్షి, న్యూఢిల్లీ: దేవభూమి ఉత్తరాఖండ్ ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంటోంది. హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్‌మేళాలో షాహీ స్నానాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేసినప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కుంభ్ మేళా కాస్తా కరోనా మేళాగా రూపాంతరం చెందుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ సంఖ్య ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో 15,333 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్ కల్లా కరోనా పాజిటివ్ కేసుల వృద్ధిరేటు 8814% గా నమోదైంది. మహా కుంభ్‌మేళాలో పాల్గొన్న సాధువుల్లో అధికారిక గణాంకాల ప్రకారం 49 మంది సాధువులకు కరోనా సోకగా అందులో రెండవ అతిపెద్ద అఖాడాకు చెందిన ప్రధాన సాధువు మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ (65) చనిపోయారు. ఇది అధికారిక సంఖ్య మాత్రమే. కానీ వైరస్ సోకిన సాధువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. వివిధ అఖాడాల్లో సాధువుల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి అఖాడాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగవంతం చేయనున్నారు. మరోవైపు షాహీ స్నానాల అనంతరం మహాకుంభ్ మేళా సూపర్ స్ప్రెడర్గా మారిపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాలో కుంభమేళా సమయంలో 2,483 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. నేటితో కుంభ్‌మేళా పూర్తి: నిరంజని, ఆనంద్ అఖాడాలు కుంభ్‌మేళాకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. గత రెండు వారాలుగా, రాష్ట్రంలో ప్రతి ఒకటిన్నర నిమిషానికి ఒకరు కరోనా బారిన పడుతున్నారు. అయితే కుంభ్‌మేళాను నేటితో ముగించనున్నట్లు నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడాలు ప్రకటించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తమ దృష్టిలో నేటితో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి మహంత్ రవీంద్ర పూరి తెలిపారు. అయితే కుంభమేళా ముగిసిందని ప్రకటించిన ఆయనకు కరోనా సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అఖాడాల్లోని ఇతర సాధువులలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు మరో 16 మంది సాధువులను కూడా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అదే సమయంలో అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరికి ఏప్రిల్ 11న కరోనా పాజిటివ్‌గా తేలింది. ముగింపుపై సాధువుల ఆగ్రహం.. కరోనా సంక్రమణను పరిగణనలోకి తీసుకుని మహా కుంభ్‌మేళాను నేటితో మూసివేస్తున్నట్లు నిరంజన్, ఆనంద్ అఖాడాలు ప్రకటించిన తరువాత, సాధువులలో ప్రతిష్టంభన ఏర్పడింది. కుంభ్ రద్దు ప్రకటనపై ఒకవైపు బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద నిర్ణీతకాలం వరకు కుంభ్ కొనసాగుతుందని ప్రకటించారు. కుంభ్‌మేళా ఏ ఒక్క సంస్థ లేదా అఖాడాలకు చెందినది కాదని స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిరంజని అఖాడా కుంభ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించడంపై బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంజని, ఆనంద్ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పాలని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్ అఖాడాలు డిమాండ్ చేశాయి. కుంభ్‌మేళాను ముగించే హక్కు ముఖ్యమంత్రికి, మేళా అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే ఉందని వారు ప్రకటించారు. కుంభ్ ముగిసిందని ప్రకటించిన సాధువు క్షమాపణ చెప్పకపోతే, అతను అఖాడా కౌన్సిల్లో కొనసాగలేడని తేల్చిచెప్పారు. ఏదేమైనా కుంభ్‌మేళా కొనసాగుతుందని, ఏప్రిల్ 27న బైరాగి సాధువులందరూ షాహీ స్నానాలు చేస్తారని తెలిపారు. -
దిగంబరత్వం.. బూడిద..పరమేశ్వరుని అంశ
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళాకు పేరుంది. యునెస్కో గుర్తింపు కూడా పొందింది. మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడ్డాయట. అవి ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. ఈ నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు. ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళా, 144 ఏళ్లకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధ కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం మార్చి 4 (మహా శివరాత్రి) తో ముగుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 12 కోట్ల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే కుంభమేళ అనగానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు నాగసాధువులు. ఒళ్లంతా బుడిద పూసుకుని, దిగంబరంగా లేదా అర్థ నగ్నంగా తిరుగుతూ.. మరేదో లోకం నుంచి వచ్చిన వారిలా కనిపించే నాగసాధువులను కుంభమేళా ఉత్సవాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చిన ఆత్మలుగా భావిస్తారు. దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే సైన్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ నాగ సాధువులను తయారు చేశారనే ప్రతీతి. అఖరాలలో నివసించే వీరు కుంభమేళా కోసం తరలి వస్తారు. ఈ కుంభమేళా ఉత్సవాల్లో బందీప్ సింగ్ అనే వ్యక్తి నాగసాధులకు సంబంధించిన అరుదైన ఫోటోలతో పాటు ఆసక్తికర సమాచారాన్ని కూడా అందించారు. దిగంబరత్వం.. బూడిద నాగ సాధువులు శ్మశాన బూడిదను మాత్రమే ఒంటికి పట్టించుకుంటారు. ఇలా బూడిదను రాసుకోవడం అంటే అన్ని బంధాల నుంచి విముక్తి అయ్యానని తెలపడం. ఐహిక వాంఛల నుంచి విముక్తి అయ్యాము... వైరాగ్య పంథాలో పయనిస్తున్నామని ప్రకటించడం. సాధరణ మానవునికి ఉన్న వాంఛలను తాము జయించామని తెలపడం కోసం ఇలా దిగంబరంగా తిరుగుతారు. వ్యవసాయదారుడైన సురేశ్వర్ గిరి(60) కుటుంబంతో పాటు వృత్తిని వదిలి సన్యాస దీక్ష తీసుకుని నాగ సాధువుగా మారారు. తలకు, ఒంటికి పట్టిన బూడిదను వదిలించు కోవడం కోసం తన జటాలను విదిలిస్తుండగా తీసిన ఫోటో శ్మశాన నివాసి అయిన పరమేశ్వరుని అంశను చూపిస్తున్నట్లుగా గోచరిస్తుంది. రుద్రాక్ష ధారణ పరమేశ్వరుని మూడో కన్నుగా రుద్రాక్షను పరిగణిస్తారు. చాలామంది నాగ సాధువులు కేజీల కొద్ది రుద్రాక్షలను ధరిస్తారు. నాగబాబా శక్తి గిరి (54) రుద్రాక్షలనే వస్త్రాలుగా ధరించాడు. సుమారు 70 కిలోల బరువున్న 1,25,000 రుద్రాక్షలను ఒంటిపై ధరించాడు. మరో నాగబాబా రాజ్ పూరి 21 కిలోల బరువున్న శివలింగాన్ని తల మీద ధరించాడు. చబి సంప్రదాయం ఐహిక వాంఛల్ని ముఖ్యంగా లైంగిక కోరికల్ని వదిలేసి పూర్తి బ్రహ్మచర్యంతో, దేహంలోని ప్రతి అవయవాన్ని బలోపేతం చేసుకునేందుకు కఠిన శిక్షణలు పొందుతారు నాగ సాధువులు. లైంగిక వాంఛల్ని వదిలేసుకున్నామనే దానికి నిదర్శనంగా ఈ చబి సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనిలో భాగంగా మర్మాంగాలతో సాహసోపేతమైన పనులను చేస్తారు. ఈ ఫోటోలో నాగబాబా కమల్ పూరి ప్రదర్శిస్తున్నది చబి ఆచారాన్నే. మర్మాంగాన్ని రాడ్‌కు చుట్టి దాని మీద మరో వ్యక్తిని నిల్చోబెట్టాడు. కొందరు రాడ్ బదులు కత్తిని కూడా ఉపయోగిస్తారు. ఊర్ధ్వబాహు హఠ యోగ దీన్ని సాధన చేసేవారు.. ఏళ్ల పాటు ఒక చేతిని గాల్లోకి లేపే ఉంచాలి. కిందకు దించకూడదు. శరీరం మీద మెదడు పూర్తి పట్టు సాధించడం కోసం ఇలాంటి కఠిన సాధనలు చేస్తారు. ఉజ్జయినికి చెందిన నాగబాబా రాధే పూరి గత పన్నేండేళ్లుగా దీన్ని సాధన చేస్తున్నాడు. మరిజునా.. ఏకాగ్రతతో, తదేక దీక్షగా సాధనను కొనసాగించడం కోసం మరిజునాను పీలుస్తామని వెల్లడించాడు నాగబాబా రాజు పూరి. ఎరుపెక్కిన కళ్లతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనికునిలా.... చిల్లం నుంచి పొగ పీల్చడంతో అతని కళ్లు ఎర్రబడ్డాయి. సంప్రదాయాన్ని కాపాడే యోధులుగానే ప్రజలు తమను గుర్తించాలనుకుంటారు వీరు. -
గోమూత్రం, గోమయంతో నాగా సాధువుల హోలీ
హోలీని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకొంటున్నారు. ఉజ్జయినిలోని అఖాడాలకు చెందిన నాగా సాధువులు గోమూత్రం, గోమయాలతో ఈ పండుగను జరుపుకొన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శైవ, వైష్ణవ సాధువులు గో మూత్రాన్ని, గోమయాన్ని కలిపి వాటిని ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక నినాదాలు చేసుకున్నట్లు ఆలిండియా అఖాడా పరిషత్ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి సింహస్త ఉత్సవం ప్రారంభం కానుంది. దాంతో ఇప్పటికే భారీ సంఖ్యలో సాధువులు ఉజ్జయినికి చేరుకున్నారు. ఆవుపేడ అత్యంత పవిత్రమైనదని, అది కృష్ణుడికి కూడా ఇష్టమని అఖిల భారతీయ అఖాడా పరిషత్ (ఏబీఏపీ) అద్యక్షుడు మహంత్ నరేంద్రగిరి చెప్పారు. సాధువులు వివిధ కార్యక్రమాలలో గోమూత్రం, గోమయాలను ఉపయోగిస్తూనే ఉన్నారన్నారు. దేశంలోని 13 అఖాడాలతో కూడిన అఖాడా పరిషత్‌కు నిరంజనీ అఖాడాకు చెందిన మహంత్ నరేంద్రగిరి అధ్యక్షత వహిస్తున్నారు. కుంభమేళా సమయంలో కూడా సాధువులు గోమయాన్ని, మూత్రాన్ని ఉపయోగించి గణేశుడి ఆశీస్సులు తీసుకుంటారని జూనా అఖాడాకు చెందిన మహంత్ హరిగిరి చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ దేవుడి విగ్రహాలను ఉపయోగించలేమని, అందువల్ల కొన్నిసార్లు గోమయాన్ని గణేశుడికి ప్రతిరూపంగా భావిస్తారని ఆయన తెలిపారు. ఇక గోమయంతో కలిసిన గోమూత్రం మంచి మందు అని, ఇది యాంటీసెప్టిక్‌గాను, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుందని మహంత్ రాజేంద్ర దాస్ జీ అన్నారు.