ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కుంభమేళాకు తరలివచ్చిన నాగ సాధువుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరు చేసే సాధన వివరాలు తెలుసుకోవాలని పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో వందలాది మంది మహిళా సాధకులు నాగ సన్యాసత్వాన్ని స్వీకరించారు. వీరు నాగ సన్యాసం తీసుకునే ముందు గంగా నదిలో స్నానం చేసి, తమ కుటుంబ సభ్యులతో పాటు తమకు తాము పిండప్రదానం చేసుకున్నారు. ఆ తరువాత వారికి విజయ సంస్కారం నిర్వహించారు.
ఈ సంప్రదాయాలన్నీ పూర్తయ్యాక నాగ సన్యాసినులుగా మారబోయే ఈ స్త్రీలకు జునా అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద్ మహారాజ్ గురు దీక్ష ఇచ్చారు. దీంతో వారంతా నాగ సన్యాసినులుగా మారారు.
జునా అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ లాంవీ విశ్వరి మాత ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ సంస్కారం తర్వాత, సన్యాసం స్వీకరించే స్త్రీలు గంగానదిలో స్నానం చేసి, గురువు ముందు దీక్ష తీసుకున్నారని, సన్యాసం స్వీకరించిన వీరంతా కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించి, ధర్మ మార్గాన్ని అనుసరిస్తారని విశ్వరి మాత తెలిపారు.
దీక్ష తీసుకున్న నాగ సన్యాసినులు అన్ని అనుబంధాలను త్యజించాలి. కాగా విదేశీయులతో సహా వందలాది మంది మహిళలు నాగ సన్యాసం తీసుకున్నారని అవధేశానంద్ మహారాజ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు
Comments
Please login to add a commentAdd a comment