Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు | Mahakumbh 2025 Story of 9 Year old Boy who Became a Naga Sanyasi | Sakshi
Sakshi News home page

Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు

Published Thu, Jan 9 2025 12:29 PM | Last Updated on Thu, Jan 9 2025 1:32 PM

Mahakumbh 2025 Story of 9 Year old Boy who Became a Naga Sanyasi

మహాకుంభమేళా ఈ నెల(జనవరి) 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు ఇప్పటికే పలువురు సాధువులు ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. వారిలో ఒకరే తొమ్మిదేళ్ల నాగసన్యాసి గోపాల్‌ గిరి మహారాజ్‌.

ఈయన హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని చంపా నుండి వచ్చారు. మహాకుంభ్‌లో అతి పిన్న వయస్కుడైన నాగ సన్యాసిగా గోపాల్‌ గిరి నిలిచారు. ప్రస్తుత శీతాకాలంలో గడ్డకట్టే చలి మధ్య గోపాల్‌ గిరి మహారాజ్‌ శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండా, కవలం బూడిద పూసుకుని తపస్సు కొనసాగిస్తుంటారు. గోపాల్‌ గిరికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు బాలుడిని ఒక గురుపుకు అప్పగించారు. నాటి నుంచి గోపాల్‌ గిరి సాధన ప్రారంభించారు.

గోపాల్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ మహా కుంభమేళా(Kumbh Mela) తర్వాత తన చదువును తిరిగి కొనసాగిస్తానని అన్నారు. తనకు మొదట్లో తనకు ఇంటికి దూరమయ్యాననే బాధ ఉండేదని, అయితే తన గురువు అందించిన జ్ఞానం, మార్గదర్శకత్వం తనను ప్రాపంచిక అనుబంధాల నుండి దూరంగా ఉంచాయని అన్నారు. కాగా గోపాల్ గిరి మహారాజ్ దినచర్య చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని, తన దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తారు. తరువాత గురువు సమక్షంలో వేదాలను నేర్చుకుంటారు. మహా కుంభమేళాలో గోపాల్ గిరి మహారాజ్ కత్తి కళను ప్రదర్శిస్తున్నారు. ఈ కళతో పాటు గోపాల్‌ గిరి చేసే అతీంద్రియ తపస్సు అతనికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

ఇది కూడా చదవండి: గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement