![BJP Political Suspense continues over Manipur CM](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Manipur.jpg.webp?itok=HzEUGxtz)
ఇంపాల్: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపించకపోడం గమనార్హం.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తదుపరి నియామకం జరిగే వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించాలని బీరేన్‌ను కోరారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ పంపిన నివేదికలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరినట్టు తెలిసింది.
ఇక, సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు.. కానీ మణిపూర్ అసెంబ్లీ సందర్భంలో ఈ రాజ్యాంగ కాలపరిమితి నేటితో (బుధవారం) ముగుస్తుంది.
అయితే, రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గరిష్టంగా 6 నెలల అంతరానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు 6 నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదని కూడా వర్గాలు పేర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను అన్వేషించే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.
BJP in talks to pick next chief minister of Manipur, deadline ends today
President's rule looms large in #Manipur as #BJP remains undecided on next CM @priyanktripathi brings in latets updates | @NivedhanaPrabhu pic.twitter.com/6qY4NogVZc— Mirror Now (@MirrorNow) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment