![NPP Back With BJP Day After Biren Singhs Resignation](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Manipur%20cm.jpg.webp?itok=VqayWr1Y)
ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్(Biren Singh) ఇలా రాజీనామా చేశారో లేదో.. ఎన్పీపీ(National Peoples Party ) బీజేపీతో జత కట్టడానికి సై అంటోంది. మూడు నెలలుగా అక్కడ అధికార బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఎన్పీపీ.. బీరెన్ సింగ్ రాజీనామాతో మళ్లీ తమ పొత్తును కొనసాగిస్తామంటోంది. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న హింసాకాండలో భాగంగా బీజేపీకి దూరంగా ఉంటోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్పీపీ. మణిపూర్‌లో చెలరేగిన హింస అరికట్టడంలో బీరెన్ సింగ్ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
దాంతోనే బీరెన్ సింగ్‌కు తమ మద్దతును ఉపసంహరించుకుంది ఎన్పీపీ. బీరెన్ నాయకత్వంలో మణిపూర్ అల్లర్లు చెలరేగినట్లు ఎన్పీపీ భావించింది. ఈ నేపథ్యంలో బీరెన్‌కు మద్దతును బహిరంగంగానే ఉపసంహరించుకుంది ఎన్పీపీ. మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమైనందున బీరెన్ రాజీనామా నిన్న( ఆదివారం) చేయక తప్పలేదు.
#WATCH | Imphal | On N Biren Singh's resignation as Manipur CM, Working President of National Peoples' Party, Sheikh Noorul Hassan says, "NPP has withdrawn support from N Biren Singh govt. We do not believe in his leadership because of his failure to restore normalcy and peace in… pic.twitter.com/XKWWqwZGPR
— ANI (@ANI) February 10, 2025
ఈరోజు(సోమవారం) బీజేపీ(BJP)తో జత కట్టేందుకు ఎన్పీపీ రెడీ అయ్యింది. తాము ఎన్డీఏలో భాగమేనని,కేవలం ీబీరెన్ సింగ్ నాయకత్వాన్నే వ్యతిరేకించామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్పీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ నూరల్ హసన్ ఓ ప్రకటన విడుదల చేశారు.మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొనడానికి ‘బీరెన్ సింగ్ రాజీనామా అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. మేము ఎప్పుడూ ఎన్డీఏలో భాగమే. బీజేపీతో కలిసి పనిచేస్తాం. మళ్లీమణిపూర్‌ను గాడిలో పెడతాం’ అని అన్నారు.
మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే వై కేమచంద్ర సింగ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరు అనే దానిపై హైకమాండ్ ినిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ సభ్యులంతా తప్పకుండా బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ప్రధానంగా మణిపూర్‌లో రెండు తెగల మధ్య చోటు చేసుకున్న వైరం కాస్తా పెద్దదై అల్లర్లు చెలరేగాయన్నారు. మొయితీ తెగ, కుకీ తెగల మధ్య వైరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందన్నారు.
కుకీలు ఉగ్రవాదులంటూ..
2022లొ మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో సీఎంగా బీరెన్ సింగ్‌నే బీజేపీ అధిష్టానం తిరిగి నియమించిన సంగతి తెలిసిందే. అయితే 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరెన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు.
కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు.
ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్‌లో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అయినా అల్లర్లు అనేవి ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు ఎన్పీపీ కూడా పట్టుబట్టుకుని కూర్చోని ఉండటంతో బీరెన్ రాజీనామా చేయకతప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment