NPP
-
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలో జరిగిన ఈ వేడుకలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ)కి చెందిన 54 ఏళ్ల హరిణితో చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్పీపీకి చెందిన మరో ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు విజితా హెరాత్, లక్ష్మణ్ నిపునరాచ్చిని కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంకలో దిసనాయకే, హరిణితోసహా మొత్తం నలుగురి సభ్యులతో శ్రీలంక మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధానితోపాటు ఆమెకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు. కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా హరిణి నిలిచారు.హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ లెక్చరర్‌గా పనిచేసిన అమరసూర్య శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే కాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై ఎన్పీపీ దృష్టిని నొక్కి చెబుతుంది. ఇక శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్ర సృష్టించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారునాయకే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడుసార్లు(1960–65, 1970–77, 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం చెప్పడంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. -
ప్రాంతీయ పార్టీలన్నీ ఒకేజట్టుగా ప్రభుత్వం!
షిల్లాంగ్: మేఘాలయాలో సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రాంతీయ పార్టీల సభ్యులంతా.. ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. దీంతో ఎన్పీపీ కూటమి బలం 32 నుంచి 45కి చేరగా, తాజా మాజీ సీఎం కొన్రాడ్ కే సంగ్మా రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మేఘాలయా రాజకీయాలు ఆదివారం వరకు ఉత్కంఠగానే సాగాయి. 26 మంది సొంత పార్టీ సభ్యులు, ఇద్దరు బీజేపీ, మరో ఇద్దరు హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ) ఎమ్మెల్యేలు.. మొత్తంగా 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ శుక్రవారం గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి లేఖ సమర్పించారు కొన్రాడ్ సంగ్మా. అయితే.. ఆ మద్దతును ఉపసంహరించుకున్నట్లు వెంటనే హెస్‌ఎస్‌పీడీపీ చీఫ్ ప్రకటించడం, వివిధ పార్టీలను కూడగలుపుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రకటించడం ఆసక్తిని రెకెత్తించింది. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ అయిన టీఎంసీ(ఐదు సీట్లు దక్కించుకుంది)తో కలిసి ఏకతాటి పైకి వచ్చేందుకు మొగ్గు చూపించకపోవడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. చివరకు.. మేఘాలయా ప్రధాన ప్రాంతీయ పార్టీలైన యూడీపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) సభ్యులు సైతం ఎన్పీపీ కూటమికే మద్దతు ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. సంగ్మాను కలిసి తమ మద్దతును బలపరుస్తూ లేఖను అందించారు. ఎన్పీపీ 26, యూడీపీ 11, పీడీఎఫ్ 2, హెస్‌ఎస్‌పీడీపీ 2, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతోపాటు బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో మేఘాలయా డెమొక్రటిక్ అలయన్స్(MDA) ప్రభుత్వం కొలువు దీరనుంది. సోమవారం(ఇవాళ) మేఘాలయా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. వారంలోపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన 60 స్థానాలున్న మేఘాలయా అసెంబ్లీలో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేసింది ఎన్నికల సంఘం. -
మేఘాలయా: మారిన సీన్.. ఎన్పీపీ-బీజేపీకి షాక్!
షిల్లాంగ్: నేషనల్ పీపుల్స్ పార్టీతో(ఎన్పీపీ)తో జత ద్వారా మరోసారి అధికార పీఠం ఎక్కాలనుకున్న బీజేపీకి షాక్ తగలనుందా?. మొత్తం 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనుకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిశారు ఎన్పీపీ చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా. అయితే ఆపై కొన్ని గంటలకే అక్కడ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. 26 మంది సొంత పార్టీ సభ్యులతో పాటు బీజేపీ(ఇద్దరు), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ నుంచి ఇద్దరు), మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు తమకే ఉందని, మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం కల్పించాలని గవర్నర్ ఫగు చౌహాన్‌కు లేఖ సమర్పించారు కాన్రాడ్ సంగ్మా. తదనంతరం.. మార్చి 7వ తేదీన ప్రమాణస్వీకరానికి ముహూర్తం ఖరారు చేసినట్లు, ప్రధాని మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారాయన. అయితే.. ఇది జరిగిన కొద్దిగంటలకే హెచ్ఎస్పీడీపీ షాక్ ఇచ్చింది. తొలుత హెచ్ఎస్పీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఎన్పీపీకి బహిరంగంగా ప్రకటించారు. అయితే.. ఎన్పీపీ-బీజేపీలకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ చీఫ్ స్వయంగా ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ. మరోవైపు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) అధ్యక్షుడు మెట్బా లింగ్డో.. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి ఆసక్తిని రేకెత్తించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని తెలిపారాయన. యూడీపీతో పాటు టీఎంసీ, కాంగ్రెస్, పీడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకు ఉందని ప్రకటించారాయన. ఈ మేరకు ఆయా పార్టీల సమావేశం జరగ్గా.. కూటమిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టీఎంసీ నేత.. మాజీ సీఎం ముకుల్ సంగ్మా మీడియాకు వెల్లడించారు. బీజేపీ, ఎన్పీపీ తప్ప అన్ని పార్టీలు ఇవాళ ఇక్కడ హాజరయ్యాం. అంకెల గారడీ ఎవరైనా చేస్తారు. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చూశాం. కానీ, ఇక్కడ అలా కాదు. మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటు అంత ఈజీ కాదు. త్వరలోనే మా కూటమిపై ఓ స్పష్టత ఇస్తాం అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. యూడీపీ 11 సీట్లు, టీఎంసీ ఐదు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ రెండు సీట్లు దక్కించుకుంది. మొత్తం 60 స్థానాలకుగానూ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి అక్కడ(ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేశారు). గురువారం త్రిపుర, నాగాలాండ్‌తో పాటు ఫలితాలు వెల్లడించగా, మేఘాలయాలోనే ఇలా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. -
మేఘాలయ సీఎంగా మరోసారి సంగ్మా.. ఈనెల 7న ప్రమాణస్వీకారం!
షిల్లాంగ్: మేఘాలయాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గురువారం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 60 స్థానాలకు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని ఆయన పార్టీ అందులేకపోయింది. కానీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 32 సభ్యుల బలముందని సంగ్మా తెలిపారు. ఎవరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్పీపీకి బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. కాగా.. కాన్రాడ్ సంగ్మా మేఘాయల గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎన్పీపీ ఈసారి విడిపోయి ఒంటరిగా పోటి చేశాయి. బీజేపీ తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో సంగ్మా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 కంటే ఏడు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్‌కు చెరో ఐదు సీట్లు వచ్చాయి. ఎన్పీపీ మాజీ మిత్రపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. మేఘాలయలో కూడా ఎన్‌పీపీకే ఆ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభుత్వంలో కూడా భాగం కానుంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
చిన్న పార్టీల చుట్టూ...
మేఘాలయలో ప్రాంతీయ పార్టీలే జోరు మీదున్నాయి. ప్రస్తుతమున్న పార్టీలతో పాటుగా మరో రెండు పార్టీలు కొత్తగా బరిలోకొచ్చాయి. వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ (వీపీపీ) , కేఏఎం మేఘాలయ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీపీపీ 18 సీట్లలోనూ కేఎంఎం 3 సీట్లలో మాత్రేమే పోటీ పడుతున్నప్పటికీ వాటి ప్రభావం బాగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇతర పార్టీల్లా కాకుండా ఈ రెండు పార్టీలు స్వచ్ఛమైన రాజకీయాలు, అవినీతి రహిత ప్రభుత్వాలు అనే అంశాలపై దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ సారి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ముకుల్ సంగ్మా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 21 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 19 సీట్లలో నెగ్గిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), రెండే స్థానాలు గెలిచిన బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలైన యూడీఎఫ్, పీడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ), మరికొందరు స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ, ఎంపీపీ మధ్య విభేదాలు ముదిరాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఆర్. మారక్ గారో హిల్స్‌లో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మారక్ ఇరువురు తుర పట్టణానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య సయోధ్య లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సారి ఎన్నికల్లో మారక్‌కు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. మారక్‌పై ఉన్న సానుభూతితో గారో హిల్స్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. సంగ్మా సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలని బీజేపీ స్థానిక నాయకులు ఒత్తిడి తెచి్చనప్పటికీ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుపొంది ఇప్పుడు కనీసం డబుల్ డిజిట్‌పై దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారే పోటీ పడుతున్నట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార వ్యతిరేకత ఎన్పీపీపైనే ఉంటుందని ఇతర పార్టీలు ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఎన్పీపీ కూడా బీజేపీ హిందుత్వ విధానాలు తమ పార్టీకి ఎదురు దెబ్బగా మారుతుందన్న ఆందోళనతోనే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని పార్టీలకు సవాల్ విసిరినా ఈసారి అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీలో ప్రధానంగా ఉన్న ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న టీఎంసీ ఈ సారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. మొత్తమ్మీద ఈ ముక్కోణపు పోటీలో మేఘాలయ ఎన్నికల చిత్రం ఎలా మారుతుందో చూడాలి. నాగాలాండ్‌లో మొత్తం 60 నియోజకవర్గాల్లో ఎవరూ అభ్యర్థుల్ని నిలబెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీల ఉనికి నామ మాత్రంగానే ఉంది. నాగాలాండ్‌లో ప్రస్తుతం నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) బీజేపీ కూటమి అధికారంలో ఉంది.ఎన్డీపీపీ 40 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే, బీజేపీ 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ ఎక్కువ ప్రభావం చూపించనుంది. ముఖ్యమంత్రి నిపుయో రియోకు సామాన్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అవతరించినప్పటికీ , బీజేపీతో ఎప్పట్నుంచో సంబంధాలున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్డీపీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ నాగా శాంతి చర్చలకు అత్యంత ప్రాధాన్యం ఇచి్చంది. ఈ సారి కూడా బీజేపీ ఎన్డీపీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే బీజేపీ 20 స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్‌ను పరిశీలిస్తామన్న హామీతో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చునన్న ఆశతో ఉంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. బీజేపీ అందరితోనూ రాజీపడుతూ నాగాలాండ్‌లో పట్టు బిగించాలని చూస్తోంది. క్రిస్టియన్ల ఓటు బ్యాంకుపైనే గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ 23 సీట్లలో మాత్రమే పోటీకి దిగింది. గత రెండు సార్లు ఎన్నికల్ని పరిశీలిస్తే స్థానిక అంశాలపై అంతగా వ్యతిరేకత కనిపించడం లేదు. 2018లో పోటీకి దిగిన అధికార ఎమ్మెల్యేలలో 70 శాతం మంది మళ్లీ నెగ్గడం విశేషం. -
మేఘాలయలో ముక్కోణం
ఈశాన్య భారత్‌లో గిరిజన ప్రాబల్యం కలిగిన మేఘాలయాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పాత ప్రత్యర్థులైన కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మళ్లీ హోరాహోరీగా తలపడుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి, 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కిందటిసారి పోటీలో లేని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతుండడం విశేషం. 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికార పీఠానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఎన్పీపీకి కాన్రాడ్ సంగ్మా, తృణమూల్ కాంగ్రెస్‌కు ముకుల్ సంగ్మా, కాంగ్రెస్‌కు విన్సెంట్ పాలా, బీజేపీకి ఎర్నెస్ట్ మారీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్పీపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. అంతర్గత లుకలుకలతో అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎండీఏలో అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మరోసారి కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మేఘాలయలో 2013 తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీగా ఎన్పీపీ రికార్డుకెక్కుంది. 18 మంది రాజీనామా 2018లో కేవలం 20 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ.. యూడీపీ(6 సీట్లు), హెచ్ఎస్పీడీపీ(2 సీట్లు), పీడీఎఫ్(4 సీట్లు), బీజేపీ(2 సీట్ల)తోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎమ్మెల్యేల గోడదూకుళ్లు తదితరాలతో బలాబలాలు మారుతూ వచ్చాయి. 2021 నవంబర్‌లో ముకుల్ సంగ్మా నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండాపోయారు. ఇటీవలే 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, సొంత పార్టీలకు రాజీనామా చేశారు. టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ వీరిలో ఉన్నారు. గిరిజన రాష్ట్రమైన మేఘాలయకు ప్రత్యేక హోదా ఉంది. దాంతో రాష్ట్రంలో ఖర్చు చేసే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంటాయి. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి రాజకీయాలను చాలావరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చిన్నాచితక పార్టీలు ఏదో ఒక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయడం, ఒకటో రెండో స్థానాలు గెలుచుకొని, ఫలితాల అనంతరం నెంబర్ గేమ్‌లో వీలైనంత మేరకు లబ్ధి పొందడం పరిపాటిగా మారింది. మళ్లీ మాదే అధికారం: ఎన్పీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించిందని, అందుకే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదని, తాము మళ్లీ నెగ్గడం ఖాయమని ఎన్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ.ఖార్లుఖీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభావితం చేసే అంశాలేమిటి? ప్రభుత్వ వ్యతిరేకత: కాన్రాడ్ సంగ్మా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుండడం, నిధుల లేమితో ఆరోగ్య రంగం కునారిల్లుతుండడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. సరిహద్దు రగడ: మేఘాలయ–అస్సాం నడుమ సరిహద్దు వివాదం రగులుతోంది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న పలు తెగల మధ్య హింసాకాండ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం: అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమై, పార్టీలు సొంతంగా పోటీ చేస్తుండడం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మణిపూర్‌లో మళ్లీ వికసించిన కమలం.. ఎన్ని సీట్లు గెలిచాయంటే..
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సత్తా చాటింది. ఒక్క పంజాబ్‌లో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కమలం వికసించింది. ఇక మణిపూర్‌లోనూ బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలను గెలుచుకొని మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్పీపీ ఏడు స్థానాల్లో.. ఎన్పీఎఫ్ కూడా అయిదు స్థానాల్లో విజయం సాధించింది. ఇక జేడీయూ ఆరు చోట్ల గెలుపొందింది. ఇతరులు అయిదు స్థానంలో గెలిచారు మణిపూర్ సీఎం విజయం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విజయం సాధించారు. హింగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగేజం శరత్చంద్ర సింగ్‌పై 17 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆ సందర్భంగా బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. సీఎం ఇంటి వద్ద సంబరాలు మరోవైపు మణిపూర్‌లో బీజేపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇంఫాల్‌లోని బీజేపీ కార్యాలయం ముందు బాంబులు పేల్చారు. సీఎం బీరెన్ సింగ్ ఇంటి వద్ద మహిళలందరూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని.. సంప్రదాయ నృత్యాలలతో అలరించారు. #WATCH | Celebrations at the residence of Manipur CM N Biren Singh in Imphal as BJP leads in the state as per official EC trends. CM N Biren Singh leading in Heingang by 18,271 votes. pic.twitter.com/4AUbchWfAm — ANI (@ANI) March 10, 2022 #WATCH | Firecrackers being burst at BJP office in Imphal, celebrating the party's performance in #ManipurElections pic.twitter.com/xHAeseqOv9 — ANI (@ANI) March 10, 2022 అప్పుడు- ఇప్పుడు 2017 మణిపూర్ ఎన్నికల్లో 60 స్థానాల్లో. 28 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది. కానీ ప్రభుత్వం ఏర్పాటులో అక్కడే అంచనాలు తారుమరయ్యాయి. 21 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు చెందిన నలుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్పీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి మద్దతు లభించడంతో మ్యాజిక్ ఫిగర్ 31కు చేరుకుంది. బీరెన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. పార్టీ 2017 2022 బీజేపీ 21 32 కాంగ్రెస్ 28 5 ఎన్పీపీ 4 7 ఎన్పీఎఫ్ 4 5 జేడీయూ 0 6 ఇతరులు 3 5 -
అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీని వీడిన కీలక నేతలు
-
బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ
ఈటా నగర్: భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మరో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహుల సెగ తగిలింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాకలంలో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టికెట్లు ఆశించి భంగపడిన ఇద్దరు బీజేపి మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసారు. తమకు టికెట్ నిరాకరించడంతో ఏకంగా ఇద్దరు మంత్రులు , 12 మంది శాసన సభ్యులు సహా మొత్తం 18 మంది ప్రముఖులు బీజేపీకి రాజీనామా చేసి...నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరారు. హోంమంత్రి కుమార్ వైయి, పర్యాటక శాఖ మంత్రి జర్కర్, మాజీ బీజేపీ ప్రధాన కార్యదర్శి జర్పుమ్ గాంలిన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఇటానగర్‌లో మేఘాలయ ముఖ్యమంత్రి కొండ్రా సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. తప్పుడు సిద్ధాంతాలు, అబద్దాలతో పూర్వ వైభవాన్ని బీజేపీ కోల్పోయిందని, ముఖ్యంగా మైనారిటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి కుమార్‌వాలి మండిపడ్డారు. ఇది ప్రజల్లో తీవ్ర ఆందోళనకుదారి తీసిందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడమేకాదు.. ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్ని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అటు ఈ పరిణామంపై ఎన్పీపీ సంతోషం వ్యక్తం చేసింది. ఎన్పీపీ ప్రధాన కార్యదర్శి, అరుణాచల ప్రదేశ్ ఇన్చార్జ్ థామస్ సంగ్మా మాట్లాడుతూ 60మంది సభ్యుల అసెంబ్లీలో కనీసం 30-40 సీట్లను గెల్చుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంటామన్నారు. -
‘సరైన సమయంలో ఎన్డీయేను వీడుతాం’
షిల్లాంగ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈశాన్య భారతంలో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ బిల్లు-2016ను ఈశాన్య ప్రాంతంలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న పార్టీలు బిల్లుకు నిరసనగా బయటకు రావాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్డీయేతో సంబంధాలు తెంచుకునేందుకు తగిన సమయంకోసం ఎదురుచుస్తున్నామని సంగ్మా అన్నారు. పౌరసత్వ బిల్లుకు రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన స్పష్టంచేశారు. మేఘాలయ అసెంబ్లీలో ఇద్దరు శాసన సభ్యులున్న బీజేపీ, ఇతర పార్టీల మద్దతుతో గత ఏడాది సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయతో పాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్పీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. మణిపూర్, అరుణాచల్ ప్రద్‌శ్‌లో బీజేపీకి సంగ్మా మద్దతు ప్రకటించడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి నుంచి ఎన్పీపీ బయటకు వచ్చినట్లుయితే ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. బీజేపీ నుంచి విడిపోతే మేఘలయ తమకు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఉందని సంగ్మా ఇదివరకు ప్రకటించారు. మరికొన్ని పార్టీలు కూడా బీజేపీని వీడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈశాన్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును త్వరలోనే రాజ్యసభ ప్రవేశపెట్టనున్నారు. -
మేఘాలయ నెక్ట్స్ సీఎం ఈయనే!
షిల్లాంగ్ : మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కోన్రాడ్ సంగ్మా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ నెల 6న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని ఈశాన్య ప్రజాస్వామిక కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ తెలిపారు. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం పదవి ఉండబోదని వెల్లడించారు. ఈ మేరకు కోన్రాడ్ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ కూటమి నేతలు గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో 34 మంది సభ్యులు కోనార్డ్ సంగ్మాకు మద్దతుగా నిలువడంతో ఆయన మెజారిటీ సాధించినట్టు అయింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరినప్పటికీ.. వారికి మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ తిరస్కరించారు. 60 స్థానాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాలు గెలిచి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... మెజారిటీ సంఖ్యాబలానికి (31) 10 సభ్యుల దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ చక్రం తిప్పి.. 19 స్థానాలు గెలుపొందిన ఎన్పీపీ నేతృత్వంలో ప్రాంతీయ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం ఎన్పీపీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ అధికార కూటమికి 34మంది సభ్యుల మద్దతు ఉంది. ఎన్పీపీ నుంచి 19మంది, బీజేపీ నుంచి ఇద్దరు, యూడీపీ నుంచి ఆరుగురు, హెచ్‌స్‌పీడీపీ నుంచి ఇద్దరు, పీడీఎఫ్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర సభ్యుడు ఈ కూటమిలో ఉన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేఘాలయలో అధికారాన్ని నిలబెట్టుకోకపోవడం కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేస్తోంది. సరైన సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పార్టీ పరిశీలకులను ప్రభుత్వ ఏర్పాటుకోసం మేఘాలయకు పంపించారని, ఇది ఆయనలో రాజకీయ పరిణతి లేకపోవడాన్ని చాటుతోందని హేమంత బిస్వా శర్మ విమర్శించారు. -
కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా జరిగిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మేఘాలయలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం చేజారుతున్నట్టే కనిపిస్తోంది. త్రిపురలో పాతికేళ్లుగా పెట్టనికోటగా ఉన్న కమ్యూనిస్టు కంచుకోటను కూల్చి.. నాగాలాండ్‌లోని బలమైన ఉనికితో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న బీజేపీ.. మేఘాలయ కూడా కాంగ్రెస్‌కు చిక్కకుండా మంత్రాంగం నడుపుతోంది. హంగ్ ఫలితాలు వెలువడ్డ మేఘాలయలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఆ పార్టీ ఇంకా పది స్థానాల దూరంలో నిలిచింది. 60 స్థానాలు ఉన్న మేఘాలయాలో కాంగ్రెస్ 21 స్థానాలు గెలుపొందగా, ఎన్పీపీ 19 స్థానాలు సాధించింది. ఈ క్రమంలో కేవలం రెండు స్థానాలు గెలిచి.. తొలిసారి మేఘాలయ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న బీజేపీ.. ఇక్కడ తన పాచిక విసిరి.. కాంగ్రెస్ అధికారం దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతోంది. 19 స్థానాలు గెలిచిన ఎన్పీపీ నేతృత్వంలో ఇతర పార్టీలనకు ఒకచోటకు చేర్చి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాలు గెలిచిన యూడీపీ-హెచ్ఎస్డీపీ బీజేపీ ఏర్పాటుచేస్తున్న కూటమిలో చేరేందుకు ముందుకొచ్చింది. కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆదివారం యూడీపీ చీఫ్ డాక్టర్ దొంకుపర్ రాయ్‌తో భేటీ అయి ఈమేరకు మంతనాలు సాగించారు. ఎన్పీపీ-యూడీపీ చేతులు కలుపడంతో బీజేపీ ఆకాంక్ష మేరకు మేఘాలయలో కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఎన్పీపీ కి చెందిన కోనార్డ్ సంగ్మా తదుపరి మేఘాలయ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నట్టు సమాచారం. గోవా, మణిపూర్ తరహాలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినప్పటికీ మరోసారి మేఘాలయాలో ఆ పార్టీకి అధికారపీఠం దూరం కానుండటం షాక్‌కు గురిచేస్తోంది. -
మేఘాలయాలో కాంగ్రెస్‌కు షాక్
సాక్షి, షిల్లాంగ్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో పాలక కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరారు. గురువారం షిల్లాంగ్‌లో జరిగిన ఎన్పీపీ ర్యాలీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. వీరితో పాటు గిరిజన ప్రతిపత్తి జిల్లా మండళ్లకు చెందిన పదిమంది సభ్యులూ పార్టీలో చేరారని ఎన్పీపీ ప్రతినిధి జేమ్స్ కే సంగ్మా వెల్లడించారు. ఎన్పీపీలో చేరిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ డిప్యూటీ సీఎం రోవెల్ లింగ్డో, షెబ్లాండ్ దార్, యెంబన్, ప్రెస్టోన్ త్యాన్సాంగ్, నాత్లాంగ్ ధార్ ఉన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను స్వాగతిస్తున్నామని, తమ తండ్రి పీఏ సంగ్మా ఆశయ సాధన దిశగా పయనిస్తామని ఎన్పీపీ అధ్యక్షుడు సీకే సంగ్మా పేర్కొన్నారు. మేఘాలయాలో మార్పు దిశగా ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. -
మేఘాలయ కాంగ్రెస్‌కు షాక్
షిల్లాంగ్: త్వరలో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం 8 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించగా వారిలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. త్వరలో వీరు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరనున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలుండగా రాజీనామాలతో ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లయింది. -
భారీగా ధరలు తగ్గిన మందులివే!
-
భారీగా ధరలు తగ్గిన మందులివే!
న్యూఢిల్లీ: కేంద్ర ఔషధ నియంత్రక మండలి కొన్ని నిత్యావసర మందుల ధరలను భారీగా తగ్గించింది. క్యాన్సర్ మందులు, యాంటీ రిట్రోవైరల్, మలేరియా నివారణకుపయోగించే దాదాపు 22 రకాల మందులపై 45శాతం దాకా ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధకంలో, మలేరియా నివారణలోవాడే కొన్ని సాధారణ మందులను సామాన్యుడికి అందుబాటులో తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 10-45 శాతంవరకు గరిష్ట చిల్లర ధర లేదా ఎంఆర్పీ ధరలను తగ్గించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రకటించింది. 22 సమ్మేళనాల కలిగిన దాదాపు 220 మెడిసిన్ బ్రాండ్ల ధరలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం సగటున కనీసం 25 శాతం ధరల కోత ఉంటుందని ఒక అధికారి తెలిపారు. బ్లడ్, రొమ్ము, కడుపు, ఊపిరితిత్తులు, అండాశయము మరియు మూత్రపిండాల లాంటి వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన ధరలు ప్రభావితం కానున్నాయి. -
'త్వరలోనే తెలంగాణలో రాజకీయ శూన్యత'
హైదరాబాద్: 'నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోతున్నది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైపోయింది. బలపడే అవకాశాలున్నా బీజేపీ వేళ్లూనుకోలేకపోతున్నది. ఇక అధికార టీఆర్ఎస్ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయపార్టీలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి.. త్వరలోనే రాజకీయ శూన్యతకు దారితీస్తుంది' అని లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సగ్మా జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన పీఏ సంగ్మా.. హెచ్ సీయూలో విద్యార్థి వేముల రోహిత్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. శరద్ పవార్(ఎన్సీపీ) నుంచి విడిపోయిన తర్వాత తాను స్థాపించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ) ఇంకా గుర్తింపు పొందనప్పటికీ జాతీయ పార్టీగా ఎదుగిందన్న సగ్మా.. తెలంగాణకు చెందిన పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని, ఇక్కడి రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తునే ఉన్నానని చెప్పారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి మౌళిక అంశాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టడంలేదని, ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో 1500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని సగ్మా అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుకాబోయే నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక.. అట్టడుగు వర్గాలకు మేలు చేసేలా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని సంగ్మా భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్, గాదె ఇన్నయ్య, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.