
షిల్లాంగ్: త్వరలో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం 8 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించగా వారిలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. త్వరలో వీరు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ)లో చేరనున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలుండగా రాజీనామాలతో ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లయింది.